toronto
-
రన్‌వేపై విమానం బోల్తా
టొరంటో: కెనడాలో టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం రన్‌వేపై దిగుతూ ఒక్కసారిగా బోల్తా పడింది! మంచు తుపాను, బలమైన గాలుల ధాటికి ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 80 మంది అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే 18 మంది గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం బోల్తా పడ్డ తీరు, అందులోంచి ప్రయాణికులు సురక్షితంగా బయట కొస్తున్న వీడియోలు, అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు సిబ్బంది నురగ స్ప్రే చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రమాదంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం...వాతావరణ ఇబ్బందులతో పియర్సన్ విమానాశ్రయంలో కొన్ని రోజులుగా విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. బుధ, ఆదివారాల్లో రెండు తుపాన్లు నగరాన్ని 50 సెంటీమీటర్ల మంచుతో కప్పేశాయి. వారాంతంలోనైతే విమానాశ్రయంలో 22 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసింది. ప్రమాద సమయంలోనూ తేలికపాటి మంచు కురిసినట్లు సమాచారం.ప్రాణాలతో ఎలా బయటపడ్డరంటే?విమానం పరిమాణం, సీట్ బెల్ట్, ఇంజనీరింగ్ నైపుణ్యం తదితరాలే టొరంటో ప్రమాదంలో ప్రయాణికులను కాపాడినట్టు నిపుణులు చెబుతున్నారు. విమానాలు తలకిందులవడం చాలా అరుదు. అలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొనేలా డెల్టా విమానాన్ని రూపొందించారు. విమానంలోని సీట్లు గురుత్వాకర్షణ శక్తికి పదహారు రెట్లు ఎక్కువ శక్తిని కూడా తట్టుకునేలా ఉంటాయి. విమానం బోల్తా పడ్డా ప్రయాణికులు మాత్రం స్థిరంగా ఉండేలా, వారిని కట్టిపడేసేలా సీట్లను రూపొందిస్తారు.అందుకే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విధిగా సీటు బెల్టులు ధరించేలా చూస్తారు. విమానం తలకిందులయితే రెక్కలు, తోకభాగం మాత్రమే విచ్ఛిన్నమయ్యేలా నిర్మాణం ఉంటుంది. ఇలాంటప్పుడు విమాన సిబ్బంది పాత్ర చాలా కీలకం. ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు వీలుగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా వారికి శిక్షణ ఇస్తారు. సాధారణ సమయాల్లో ఫ్లైట్ అటెండెంట్లు మాత్రమే అయినా ఇలాంటప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. విమానం కూలగానే ప్రయాణికులను సిబ్బంది హుటాహుటిన ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు దీనికి నిదర్శనం. అత్యవసర సిబ్బంది కూడా క్షణాలపై స్పందించారు. ఆలస్యం చేయకుండా మంటలను ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు.సైజూ కలిసొచ్చింది...ప్రమాదానికి గురైన బొంబార్డియర్ సీఆర్జే 900 విమానం చిన్నగా ఉంటుంది. ప్రయాణికులు ప్రా ణాలతో బయట పడేందుకు ఇది కూడా కారణమే. కేబిన్ ఎత్తు కేవలం ఆరడుగులే. దాంతో బోల్తా పడ్డా ప్రయాణికులు ఎక్కువ దూరం పడిపోరు. -
తలకిందులైన విమానం..15 మందికి గాయాలు
టొరంటో: కెనడాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి 17) టొరంటోలోని పియర్సన్ ఎయిర్‌పోర్ట్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం క్రాష్ లాండ్ అయింది. బలమైన గాలుల కారణంగా విమానం ల్యాండింగ్‌లో సమస్యలు తలెత్తి ఏకంగా తలకిందులైంది. ఈ ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినపుడు విమానంలో 80 మంది ఉన్నారు. మిన్నియాపోలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్ ఎయిర్‌పోర్టు ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో ధృవీకరించింది. విమానం తిరగబడి ఎయిర్‌పోర్టులో పడి ఉన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.BREAKING: A Delta Airlines CRJ 900 crashed and settled upside down at Toronto Pearson Airport.Thankfully, ALL passengers survived and are accounted for. That is great news! pic.twitter.com/dXXUNkPTHU— Errol Webber (@ErrolWebber) February 17, 2025 -
టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం
టొరంటో: కెనడాలో సోమవారం ఓ విమానం అదుపుతప్పింది. టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వే పైనుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేశారు. -
‘ఎయిర్ కెనడా’ విమానానికి తప్పిన ముప్పు
టొరంటో: ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ఆఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో చిన్న పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా విమానం రెక్కల వద్ద మంటలు లేచాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు గాల్లోకి లేచిన 30 నిమిసాల్లోనే విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. పేలుడు జరిగి మంటలంటుకున్న సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది దాకా ఉన్నారు. ఘటన జరిగినపుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విమానాన్ని సురక్షితంగా వెనక్కు మళ్లించి ల్యాండ్ చేసిన పైలట్లను అందరూ అభినందిస్తున్నారు. Superb work by the pilots and their air traffic controllers, dealing with a backfiring engine on takeoff. Heavy plane full of fuel, low cloud thunderstorms, repeated compressor stalls. Calm, competent, professional - well done!Details: https://t.co/VaJeEdpzcn @AirCanada pic.twitter.com/7aOHyFsR29— Chris Hadfield (@Cmdr_Hadfield) June 7, 2024 -
Candidates Chess 2024: విదిత్ గుజరాతీ విజయం
టొరంటోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడెట్స్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు విదిత్ గుజరాతీ మరో కీలక విజయాన్ని నమోదు చేశాడు. 9వ రౌండ్లో హికారు నకమురా (అమెరికా)ను విదిత్ ఓడించాడు. ఈ గెలుపుతో ఓవరాల్‌గా 4.5 పాయింట్లతో విదిత్...నకమురా, కరువానాలతో కలిసి నాలుగో స్థానంలో నిలిచారు. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు డి.గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ ‘డ్రా’గా ముగిసింది. తాజా ఫలితం తర్వాత గుకేశ్, నెపొమినియాచి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 4 పాయింట్లతో ప్రజ్ఞానంద తర్వాతి స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 9వ రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. హోరాహోరీ పోరు తర్వాత హంపి, రష్యాకు చెందిన కటెరినా లాగ్నో తమ గేమ్‌ను సమంగా ముగించారు. హంపికి మధ్యలో విజయావకాశాలు వచి్చనా కటెరినా తెలివిగా ఆడి తప్పించుకోలిగింది. అయితే మరో భారత ప్లేయర్ ఆర్.వైశాలి...చైనాకు చెందిన జోంగి తన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం హంపి 4 పాయింట్లతో ముజిచుక్ (ఉక్రెయిన్)తో కలిసి ఐదో స్థానంలో కొనసాగుతోంది. -
వర్షం కురిస్తే ట్యాక్స్ కట్టాల్సిందే..!
బ్రిటిష్ పాలనలో చాలా రకాల పన్నులు వేసేవారు. ఇప్పటికీ వారి పాలనలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను, ఇంటిపన్ను, టోల్ వంటి అనేక ట్యాక్స్‌లు సామాన్యుల భారంగా మారుతున్నాయి. మనిషి తయారుచేసిన ఉత్పత్తులు, వాటికి అందించే సేవలపై ట్యాక్స్లుండడం సహజం. అయితే విచిత్రంగా ప్రకృతి ప్రసాదించే వర్షానికి సైతం పన్ను చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బహుశా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదు. మొట్టమొదటిసారిగా కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అసలు కెనడా ప్రభుత్వం ప్రకృతి సహజంగా ప్రసాదించే వర్షంపై ప్రజలపై ఎందుకు ట్యాక్స్ విధిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. మీడియా కథనాల ప్రకారం..టొరంటో నగరంతోపాటు దాదాపు కెనడా మొత్తం తుపాను నీటి నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. కెనడాలో మార్చి నుంచి మే నెల వరకు వర్షంతో పాటు మంచు కురుస్తుంది. భూఉపరితలం, చెట్లు, మొక్కల ద్వారా గ్రహించబడని వర్షపునీరు బయట రోడ్లపై ప్రవహిస్తుంటుంది. అయితే ఆదేశంలో నేల కనిపించకుండా ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు.. అలా దాదాపు అంతా కాంక్రీటుమయం కావడంతో నీటి నిర్వహణ సవాలుగా మారుతోంది. కెనడాలో తుపాన్లు ఎక్కువగా వస్తూంటాయి. అది సమస్యను మరింత పెంచుతోంది. దాంతో ప్రజల రోజువారీ కార్యకలాపాలు చాలా దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితుల్లో స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. నీటి వినియోగదారులు, ఆసక్తిగల పార్టీల సహకారం, ఎన్జీఓలతో తుపాను నీటి నిర్వహణను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘స్మార్ట్ వాటర్ ఛార్జ్, వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. అందుకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని ప్రజలే భరించాలనే ఉద్దేశంతో రెయిన్ట్యాక్స్ను విధించనున్నట్లు తెలిసింది. కెనడాలో అధికభాగం రాతినేలలే. దాంతో వర్షపునీరు నేలలో ఇంకేందుకు చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా డ్రెయిన్ వాటర్‌తో నాలాలు పొంగిపోర్లుతుంటాయి. ఈ సమస్యను ‘రన్ఆఫ్’ అంటారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్ వాటర్ ఛార్జ్‌ను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీస్తారు. దానికి అయ్యే ఖర్చులను రెయిన్‌ట్యాక్స్ ద్వారా భర్తీ చేస్తారు. వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట ఎక్కువ రన్ఆఫ్ ఉంటుంది. అందువల్ల అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువ విధిస్తారు. ఈ పన్ను కేటగిరీలో ఇళ్లు, పార్కింగ్ స్థలాలు, కాంక్రీటుతో చేసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. కెనడాలో విధించే వ్యక్తిగత పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను విధించే దేశాల విభాగంలో కెనడా ఉంటుంది. తాజాగా వర్షపు పన్ను ప్రజలపై మరింత భారంమోపేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే అద్దె ఇళ్లలో నివసించే వారిపై ఈ పన్ను విధిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే.. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. టొరంటో ప్రజలు ఇప్పటికే నీటిపై పన్ను చెల్లిస్తున్నారు. ఇందులో తుపాను నీటి నిర్వహణ ఖర్చు కూడా ఉందని కొందరు చెబుతున్నారు. నీటి పన్నుతోపాటు ప్రత్యేకంగా రెయిన్‌ట్యాక్స్ విధించడంపట్ల ప్రజల నుంచి విమర్శలు వస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. -
Toronto: న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్‌లో మంటలు
టొరంటో: కెనడాలోని టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 74 మంది ప్రయాణికులున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విండ్‌షీల్డ్ వద్ద మిరుగులు వచ్చాయి. దీంతో పాటు కాక్‌పిట్‌లో వైరు కాలిన వాసనను పైలట్ గమనించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేశాడు. వారు ఓకే అనడంతో పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్ చేశాడు. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
కెనడా హిందీ సినిమా హాళ్లలో కలకలం
టొరంటో: కెనడాలోని గ్రేటర్ టొరంటో ప్రాంతంలో హిందీ సినిమాలను ప్రదర్శించే మూడు వేర్వేరు సినిమా హాళ్లలో కలకలం రేగింది. మాస్క్ ధరించిన వ్యక్తులు గుర్తు తెలియని రసాయనాన్ని స్ప్రే చేయడంతో ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారు. యార్క్‌లోని వౌఘన్ సినిమా కాంప్లెక్స్‌లో మంగళవారం రాత్రి 9.20 గంటల సమయంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ సమయంలో థియేటర్లో 200 మంది ఉన్నారు. స్ప్రే కారణంగా ప్రేక్షకుల్లో కొందరు దగ్గడం ప్రారంభించారు. శ్వాసలో ఇబ్బందికి గురయ్యారు. పోలీసులొచ్చేసరికే అనుమానితులు పరారయ్యారు. కొందరు బాధితులకు పోలీసులు చికిత్స చేయించారు. ఈ వారంలోనే ఇలాంటి ఘటనలే జరిగినట్లు పీల్, టొరంటోల్లోనూ జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. స్కార్బరో టౌన్ సెంటర్లోని థియేటర్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దుర్వాసన వెదజల్లే బాంబును అమర్చినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. విద్వేషపూరిత నేరం సహా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. -
కెనడాలో జయహో జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయాలు వేడేక్కుతున్న వేళ.. కెనడా టొరొంటో నగరంలోని మిస్సిసాగా పట్టణంలో YSRCP కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కెనడాలోని ప్రవాసాంధ్రులు, డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరియు సీయం జగన్‌ను అభిమానించే తెలుగు వారు హాజరయ్యారు. ఒక్క వేదికపైకి ప్రముఖులు, ప్రవాసాంధ్రులు YSRCP కెనడా అడ్వైజర్ డా.గరిశ జగన్మోహన్ రెడ్డి, కన్వీనర్ వేణు చుక్కలూరు మరియు వైఎస్సార్సీపీ గ్లోబల్ కన్వీనర్ వెంకట్ ఎస్. మేడపాటి సమన్వయ సహకారాలతో, కెనడా కార్య వర్గ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ NRIల ఆత్మీయ సమావేశం ఒక పండుగలా జరిగింది. ఈ సమావేశానికి అమెరికా నుంచి YSRCP కన్వీనర్లు అయిన కె.వి రెడ్డి, కోరసపాటి శ్రీధర్ రెడ్డి (నాటా ప్రెసిడెంట్), వాసుదేవ రెడ్డి, వల్లూరు రమేష్ రెడ్డి మొదలైన ప్రముఖులందరూ స్వయంగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు తదితరులు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో ప్రసంగించారు. ఇది సంక్షేమ ప్రభుత్వం అమెరికా నుంచి వచ్చిన అతిధులను కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వేదిక మీదికి ఆహ్వానించి సభ ప్రారంభించారు. అలాగే మళ్లీ సీఎం జగన్ నేతృత్వంలోని YSRCP ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు రావాలో వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. "కోవిడ్ మహమ్మారి బారినపడి చిన్నాచితక వ్యాపారాలు దెబ్బతిని అనేకమంది పేదరికంలోకి చేరారు. అలాంటి పేదవారిని కోవిడ్ సమయంలోనే కాక, ఇప్పటికీ ఆదుకుంటున్న సంక్షేమ, సాధికారిక ప్రభుత్వం YSRCP" అని తెలిపారు. "మ్యానిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, నవరత్నాలను 99% అమలు చేసి పేదరికాన్ని పారద్రోలి 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందజేసిందని" తెలిపారు. (కెనడా YSRCP కార్యక్రమం ఫోటోగ్యాలరీ) అభివృద్ధికి ఇదే నిదర్శనం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. "ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఇన్ఫోసిస్ లాంటి మెగా సంస్థలు వైజాగ్ లో కార్యాలయాలు మొదలుపెట్టడం ప్రభుత్వ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని., NRIలు కూడా ఏపీ లో కొత్త సంస్థలు ప్రారంభించాలని, అలాగే ఉన్న సంస్థలను విస్తరించాలని కోరారు. నిజం చాటండి శాప్ అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఉంటున్నవారు తమ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తూ, తమ సొంత గ్రామాలకు, మాతృ రాష్టానికి సాయం చేయాలనే ప్రవాసాంధ్రుల తపనను అభినందించారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోన్న పచ్చ మీడియాను ఎదుర్కొని.. వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిపాలని కోరారు. మళ్లీ జగనన్న ప్రభుత్వమే "ప్రతి రంగంలోనూ అభివృద్ధికి బాట వేస్తూ, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వం మనది. 2019లో అందరం కష్టపడి పార్టీని గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాము. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తెలియజేసి మరిన్ని ఎక్కువ సీట్లతో, మెజారిటీతో YSRCP ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరం కృషి చేయాలని" ఎన్నారై గ్లోబల్ అడ్వైజర్ వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. విష ప్రచారం తిప్పిగొట్టాల్సిన వేళ ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పార్టీ కన్వీనర్ కడప రత్నాకర్ మాట్లాడుతూ.. "ప్రజల కోసం ప్రభుత్వం పడుతున్న తపన గురించి వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఐదేళ్ల కిందికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. విద్య, వైద్యం విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందని, ముఖ్యంగా వెనుకబడిన బీసీ వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని" కొనియాడారు. ఇప్పుడు ప్రవాసాంధ్రులు తమ సత్తా చాటాల్సిన సమయం వచ్చిందని, ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా దాడి చేస్తోన్న పచ్చమీడియాను, అధికారయావతో పొత్తులు పెట్టుకున్న విపక్షాలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ప్రతీ ప్రవాసాంధ్రుడు తన వంతుగా.. తనకు తెలిసిన వారికి కొందరికైనా ఫోన్ చేసి వాస్తవాలను వివరించాలని కోరారు. ప్రతీ ఎన్నారై నినదించాల్సిన వేళ US కన్వీనర్ KV రెడ్డి మాట్లాడుతూ.. "ప్రభుత్వం 4.69 లక్షల కోట్ల రుపాయలను సంక్షేమం ద్వారా పేద ప్రజలకు అందించిందని, ఇలాంటి సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే “మళ్లీ రావాలి మన జగన్ “ అనే నినాదం తో ఆడిటోరియంను హోరెత్తించారు. మరో యూఎస్ కన్వీనర్ దోసపాటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం మనబడి - నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం మనందరికీ తెలుసన్నారు. ప్రతి NRI తమ సొంత గ్రామాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యానికి సీఎం జగన్ పెద్దపీట ఎన్నారై మెడికల్ అఫైర్స్ అడ్వైజర్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ "జగనన్న ప్రభుత్వంలో ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు, 10వేల వైయస్సార్ క్లినిక్ లు, ప్రతి మండలానికి రెండు పీ.హెచ్.సి లు కోసం 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని" తెలిపారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం గురించి వివరించారు. గుండెపోటు వచ్చిన ఒక గంటలో వేయవలసిన 40 వేల రూపాయల ఇంజక్షన్ పేదలందరికీ ఉచితంగా ఇస్తోన్న ఘనత జగనన్న ప్రభుత్వానిదేనన్నారు. ఇది అప్రమత్తంగా ఉండ్సాలిన వేళ ఇంకో యూఎస్ కన్వీనర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ "ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం నాలుగేళ్లలో 2.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎన్నికలొస్తున్న ప్రస్తుత తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ ప్రభుత్వంపై శత్రు మూకలన్నీ అసత్య ప్రచారాలతో దాడి చేస్తున్న వేళ.. నిజం నిర్భయంగా ప్రజలకు చేరాలని, సత్యం చాటి చెప్పే బాధ్యత YSRCP సైనికులదని, ఆ దిశగా పడిన అడిగే కెనడా YSRCP సమావేశమంటూ జయహో జగన్" అని నినదించారు. వై నాట్ 175 ఇంకో 6 నెలల్లో రాబోతున్న ప్రభుత్వ ఎన్నికల్లో “వై నాట్ 175” అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి YSRCP ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. పోయిన సంవత్సరం ఆక్సిడెంట్ లో మృతి చెందిన APNRT సభ్యుడు రామ్ పిరకాలకు నివాళి అర్పించి సభలో ఒక నిమిషం మౌనం పాటించారు. తర్వాత తన్వి ,శాన్వి ,అవని ,జనని , కీర్తి , మేధ మొదలైన చిన్నారులు తమ నృత్య ప్రదర్శన ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ఆట పాటలతో, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో, కమ్మని విందు బోజనముతో ఈ కార్యక్రమము ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఈ కార్యక్రమము విజయవంతం అవడానికి కృషి చేసిన కార్యవర్గ సభ్యులు మరియు వాలంటీర్ లను నిర్వాహకులు అభినందించారు. -
పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..
టొరంటో: టిక్ టాక్ ఛాలెంజ్ పేరుతో కెనడాకు చెందిన ఒకమ్మాయి రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంది. 12 రోజుల పాటు ఇలా రోజుకు 4 కంటే ఎక్కువ లీటర్లు తగ్గటంతో చివరి రోజున ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించి డాక్టరును సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి శరీరంలో సోడియం స్థాయిలు బాగాతగ్గిపోయాయని తెలిపారు. మరి కొంచెముంటే ప్రాణాపాయమేనని తెలిపారు. అదోరకం వెర్రి.. సొషల్ మీడియాలో క్రేజ్ కోసం జనం ఎంతగా వెంపర్లాడుతూ ఉంటారంటే తొందరగా స్టార్లు అయిపోయి చేతికందినంత సంపాదించుకోవాలి. ఎక్కడికెళ్లినా కూడా జనం వారిని గుర్తించాలి. ఇదొక్కటే వారికున్న లక్ష్యం. ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా కెనడాలో వైరల్ గా మారిన ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకమ్మాయిని దాదాపుగా చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళింది. 75 హార్డ్ ఛాలెంజ్.. కెనాడకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే టిక్‌టాక్ స్టార్ ఆండీ ఫ్రైసెల్లా అనే ఓ యూట్యూబర్ 2019లో ప్రారంభించిన 75హార్డ్ అనే ఫిట్నెస్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఆమె రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కనీసం 45 నిముషాల పాటు రోజుకు రెండు సార్లు వర్కౌట్లు కూడా చేయాలి. రోజుకు 10 పేజీలు చదవాలి. ఇవన్నీ చేస్తునట్టుగా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి. అయినా బుద్ధి మారలేదు.. పాపం ఫెయిర్‌బర్న్ ఈ ఛాలెంజ్ చివరి రోజు వరకు బాగానే చేసింది. 12వ రోజున మాత్రం కొంత అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే డాక్టరును సంప్రదించింది. డాక్టర్ రోజుకు కేవలం అరలీటరు నీళ్లు మాత్రమే తాగాలని సూచంచారట. ఈ విషయాన్ని స్వయంగా ఫెయిర్‌బర్న్ చెబుతూ.. నేను ఎలాగైనా ఈ ఛాలెంజ్ పూర్తి చేసి తీరతాను. మొదటిసారి కావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎక్కువ నీళ్లు తాగడంతో రాత్రి పూత ఎక్కువగా మూత్రానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అరలీటరు నెల మాత్రమేతాగా మంటున్నారు కష్టమే కానీ ప్రయత్నిస్తానంది. ఇది కూడా చదవండి: ఫాతిమాగా మారిన అంజు... ఇల్లు కట్టుకోవడానికి స్థలం, డబ్బు.. -
ఫ్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. బాత్రూం డోర్ పగులగొట్టి..
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానంలో సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విమానం టాయిలెట్ తలుపునూ పగులగొట్టాడు. టొరంటో నుంచి ఢిల్లీ వస్తోన్న విమానంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రయాణికునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేపాల్‌కు చెందిన మహేశ్ సింగ్ పండిత్ అనే ప్రయాణికుడు కెనడా నుంచి ఇండియాకు ఎయిరిండియా విమానంలో బయలుదేరాడు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే తనకు కేటాయించిన సీటులో కాకుండా పక్క సీటులో కూర్చున్నాడు. ఆ తర్వాత టాయిలెట్లో ధూమపానం చేయడంతోపాటు ఆ తలుపును పగలగొట్టాడు. అడ్డుపడిన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులపై ఎదురుదాడి చేశాడని విమానంలోని సిబ్బంది తెలిపారు. చాలా గొడవ చేసిన తర్వాత ఎట్టకేలకు ప్రయాణికులతో కలిసి నిందితున్ని సీట్లో కూర్చోబెట్టామని విమాన సిబ్బంది తెలిపారు. విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ తోటివారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ముంబయిలోనూ విమానంలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో వైరల్.. -
టొరెంటోలో ఘనంగా ప్రారంభమైన తెలుగు చిత్రం
6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో సూర్య బెజవాడ నిర్మాతగా తెరకెక్కుతున్న ఓ సినిమా రీసెంట్గా టొరెంటో తెలుగు ప్రేక్షకల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్థవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతొంది. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్‌లో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో కనిపంచనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ కొరుకొండ మాట్లాడుతూ.. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను, టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేస్తామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ పేర్కొన్నారు. -
కెనడాలో రోడ్డు ప్రమాదం.. హరియాణా విద్యార్థి మృతి
టొరంటో: కెనడా రాజధాని టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరియాణా విద్యార్థి ఒకరు దుర్మరణం చెందారు. శుక్రవారం మధ్యాహ్నం సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్కు ఢీకొట్టి, అతడిని లాక్కెళ్లింది. ఎమర్జెన్సీ సిబ్బంది ట్రక్కు నుంచి అతికష్టమ్మీద అతడిని వేరు చేశారు. అప్పటికే అతడు చనిపోయాడు. మృతుడిని హరియాణాలోని కర్నాల్‌కు చెందిన కార్తీక్ సైని(20)గా గుర్తించారు. టొరంటోలోని షెరిడాన్ కాలేజీలో జాయినయ్యేందుకు 2021 ఆగస్ట్‌లో అతడు కెనడా వెళ్లినట్లు అతడి సోదరుడు పర్వీన్ సైని చెప్పారు. -
నమ్మి మోసపోయిన షర్మిణి.. ఇంతకీ ఆమెను చంపింది ఎవరు? ఆ దుర్మార్గుడేనా!
మోసం ఎప్పుడూ అవకాశం కోసమే ఎదురు చూస్తుంది. అవసరం ఎప్పుడూ గుడ్డినమ్మకంతో దూసుకుపోతుంది. ఈ విషాదగాథలో అదే జరిగింది. ఎందరికో కనువిప్పు కలిగించే పాఠంగా మిగిలింది. అది 1999, కెనడాలోని టొరంటో పట్టణం. 15 ఏళ్ల షర్మిణి ఆనందవేల్.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని.. రాబోయే మిడిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు కావాల్సిన డ్రెస్, షూస్ తనే కొనుక్కోవాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గ డబ్బు సంపాదించాలని ఆశపడింది. ఏదైనా చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. షర్మిణి తండ్రి ఏలూర్నాయగం.. 1994తో శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో ఆ దేశాన్ని వదిలి భార్యపిల్లలతో సహా కెనడాకు వలస వచ్చాడు. అప్పటికి షర్మిణికి పదేళ్లు. తనకి అన్న దినేష్, తమ్ముడు కాథీస్ ఉన్నారు. టొరంటోలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. ఉదయాన్నే పేపర్స్ వేయడం, పిజ్జా ఆర్డర్స్ సప్లయ్ చేయడం.. ఇలా డబ్బు కోసం పిల్లలు కూడా కష్టపడ్డారు. వుడ్బైన్ జూనియర్ హైస్కూల్లో మెరిట్ స్టూడెంట్‌గా షర్మిణి మంచి గుర్తింపే తెచ్చుకుంది. 1999 జూన్ నెలలో డబ్బు కోసం షర్మిణి చేసిన ప్రయత్నాలకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ‘నాకు జాబ్ వచ్చింది. దగ్గరలోనే ఆఫీస్.. కేవలం అక్కడ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడటమే నా పని’ అంటూ ఇంట్లో వాళ్లకి శుభవార్త చెప్పింది. అదే నెల జూన్ 12న ఉదయాన్నే 9 గంటలకు షర్మిణి మొదటిసారి ఆఫీస్‌కి బయలుదేరింది. అక్కకి బై చెప్పడానికి కాథీస్ ఎలివేటర్ వరకూ వచ్చాడు. షర్మిణి ఎలివేటర్ బటన్ నొక్కింది. తలుపులు తెరుచుకున్నాయి. ఆమె లోపలికి అడుగుపెట్టి, కాథీస్కి బై చెప్పి, కిందకు వెళ్లేందుకు బటన్ నొక్కింది. తలుపులు మూసుకున్నాయి. ఆమె ప్రాణాలతో కనిపించడం అదే చివరిసారి. ఉదయమనగా వెళ్లిన షర్మిణి.. రాత్రి అయినా తిరిగి రాకపోయేసరికి.. ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు.. షర్మిణి బెడ్రూమ్లో జాబ్ అప్లికేషన్‌ను చూసి.. అది స్కామ్ అయ్యి ఉంటుందని భావించారు. ‘షర్మిణి వెళ్లేటప్పుడు ఆ ఆఫీస్ వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగాం.. మరిచిపోయి వెళ్లిపోయింది’ అంటూ ఏలూర్నాయగం దంపతులు కంటతడిపెట్టుకున్నారు. అయితే షర్మిణి కావాలనే వివరాలు ఇవ్వలేదని తర్వాత అర్థమైంది. విచారణలో భాగంగా పోలీసులు.. షర్మిణి స్నేహితుల్ని కూడా ప్రశ్నించారు. అప్పుడే ఓ షాకింగ్ విషయం బయటపడింది. ‘షర్మిణి.. తనకి అండర్‌కవర్ డ్రగ్స్ ఆపరేటర్‌గా జాబ్ వచ్చిందని మాతో చెప్పింది’ అంటూ షర్మిణి స్నేహితులు నోరువిప్పడంతో ఒక్కసారిగా ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. అంటే ఎవరో షర్మిణిని తప్పుదారి పట్టించి, జాబ్ వివరాలు ఇంట్లో కూడా చెప్పొద్దని నమ్మించి.. కిడ్నాప్ చేసి ఉంటారని డిటెక్టివ్స్ అంచనా వేశారు. అనుమానితుడిగా స్టాన్లీ జేమ్స్ టిప్పెట్ అనే కెనడియన్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడి కారుని స్వాధీనం చేసుకున్నారు. కారు డిక్కీలో డక్ట్ టేప్, తాడు, జాక్‌నైఫ్, కత్తెరలు, కొలిచే టేప్, సుత్తి, పొడవైన ప్లాస్టిక్ తాడు దొరికాయి. దాంతో కేసు బిగుసుకుంది. ఆగస్ట్ 20న ఫించ్ అవెన్యూ సమీపంలో డాన్ నది వెంబడి నడుస్తున్న హైకర్లు మానవ శరీరం అవశేషాలను కనుగొన్నారు. శరీరం కుళ్లి, సగానికి పైగా జంతువులు తినేయడంతో.. కేవలం డెంటల్(పళ్లు) రికార్డుల ఫోరెన్సిక్ పరిశోధనలో ఆ అవశేషాలు షర్మిణివేనని తేలింది. దాంతో కేసు టిప్పెట్ మెడకే చుట్టుకుంది. దానికి ప్రధాన కారణం.. కారులో ఆయుధాలు దొరకడంతో పాటు.. టిప్పెట్పై అప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. టిప్పెట్ ఎప్పుడూ కథలు బాగా చెప్పేవాడు. నిజాన్ని అబద్ధంగా.. అబద్ధాన్ని నిజంగా మార్చి చెప్పడంలో అతడు దిట్ట్ట అని అక్కడ అందరికీ తెలుసు. నిజానికి ఫ్లీ మార్కెట్లో కొన్న పోలీస్ జాకెట్ వేసుకుని తిరుగుతూ అక్కడుండే పిల్లల్ని మాజీ పోలీస్ అధికారిని అంటూ నమ్మించేవాడు. విచారణ కోసం బైక్ కావాలంటూ అవసరానికి కొందరి దగ్గర బైక్స్ తీసుకుని వెళ్తుండేవాడు. అలాగే చాలామంది మహిళలను వెంబడించి.. లైంగిక దాడికి తెగబడేవాడు. ఒకసారి వాల్–మార్ట్ ఫెయిర్‌లో ఒక మహిళకు ఉద్యోగం ఇస్తానని నమ్మించి.. ఆమెకు చాలా బహుమతులు ఇవ్వడానికి పదే పదే ఆమె ఇంటికి వెళ్లి.. ఇబ్బందుల్లో పడ్డాడు. ఒకసారి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. స్థానికులకు అడ్డంగా దొరికేశాడు. మరోసారి నకిలీ తుపాకీని చూపించి.. బస్ స్టాప్‌లో ఒక మహిళను కిడ్నాప్ చేస్తే.. ఆమె తనకు హెచ్ఐవీ ఉందని అబద్ధం చెప్పి వాడి నుంచి తప్పించుకుంది. మరోవైపు షర్మిణి అదృశ్యమైన రోజు ఆ అపార్ట్మెంట్ సమీపంలో టిప్పెట్‌ని చూశామంటూ చాలామంది సాక్ష్యం చెప్పారు. కిడ్నాప్, లైంగిక వేధింపులతో సహా ఏడు నేరారోపణలలో టిప్పెట్ను డిసెంబర్ 2009లో కోర్టు దోషిగా నిర్ధారించింది. 2011లో టిప్పెట్‌ని అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడిగా గుర్తించడంతో.. ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నాడు. అయితే షర్మిణిని హత్య చేసినట్లు మాత్రం టిప్పెట్ ఒప్పుకోకపోవడంతో.. షర్మిణి ఎలా, ఎందుకు చనిపోయిందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. షర్మిణి గాథ.. అపరిచితుల్ని నమ్మకూడదు అనేందుకు ఒక పాఠం. -సంహిత నిమ్మన చదవండి: Venkampalli: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ -
కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్: కెనడాలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి ఒకరు మృతి చెందారు. టొరంటో నగరంలోని సబ్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద గురువారం సాయంత్రం దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన కార్తీక్ వాసుదేవ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు, ప్రత్యక్ష సాక్షులు, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాసుదేవ్ హత్యపై టోరంటోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ‘గురువారం టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తిక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మృతి చెందాడు. అతని మరణం పట్ల మేము దిగ్భ్రాంతి చెందాం. మృతుడి కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. మృతదేహాన్నిస్వదేశానికి తీసుకొచ్చేందుకు సాధ్యమైన సాయాన్ని అందిస్తాము’ అని ట్విట్టర్లో తెలిపింది. Grieved by this tragic incident. Deepest condolences to the family. https://t.co/guG7xMwEMt — Dr. S. Jaishankar (@DrSJaishankar) April 8, 2022 స్పందించిన విదేశాంగ మంత్రి కెనడాలో భారత విద్యార్థి మృతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే వాసుదేవ్ స్థానిక సెనెకా కాలేజ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడని, సబ్వేలో ఉద్యోగానికి వెళ్తుండగా హత్య జరిగినట్లు అతని సోదరుడు తెలిపారు. కాగా వాసుదేవ్ ఈ జనవరిలోనే కెనడా వెళ్లాడు. -
వైరల్ వీడియో: మంటకలిసిన మంచు
మానవ మెదడుకు పదును పెడితే ఎలాంటి సమస్యకైనా సులువుగా పరిష్కారాన్ని కనిపెట్టవచ్చిని ఓ వ్యక్తి నిరూపించాడు. కష్టతరమైన పనిని మనిషి మేధస్సుతో సునాయాసంగా అధిగమించి ప్రశంసలు పొందుతున్నాడు. చలికాలం వచ్చిందంటే చాలు అమెరికాలో విపరీతమైన మంచు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంది. రాత్రి రోడ్డుపై పార్క్ చేసిన కారు కాస్తా.. ఉదయం లేచేసరికి మంచులో మునుగుతుంది. తాజా సీజన్లోనూ హిమపాతం అమెరికన్స్‌ను వణికిస్తోంది. రోడ్లతో పాటు ఇంటి పరిసర ప్రాంతాలు సైతం మంచులో ముగినిపోతున్నాయి. రోజూ గంటల తరబడి మంచును తొలగించడం స్థానికులకు కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదుకు చేరి మంచును తొలగిచేందుకు నానా తిప్పలు పడ్డారు. ఈ క్రమంలోనే టోరంటోకు చెందిన వ్యక్తికి ఓ ఆలోచన తట్టింది. తోటివారి కష్టాలను చూసి చలించి.. మంచును తొలగించేందుకు సునాయాసమైన పద్దతిని కనిపెట్టాలని ఆలోచించసాగాడు. బుర్రకు పదునుపెట్టి అనుకున్నదే తడువుగా ఓ యంత్రాన్ని కనిపెట్టి ఔరా అనిపించాడు. చేతితో పట్టుకునే ఓ గొట్టంతో కూడాని యంత్రాన్ని కనిపెట్టాడు. దానిలో నుంచి వేగంగా వచ్చే మంట మంచును క్షణాల్లో కరిగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి మేదస్సుకు చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేందటూ కామెంట్స్ పెడుతున్నారు. అతని ఆలోచనకు ఫిదా అవుతున్నారు. -
టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
టొరంటో : తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) కెనడా ఆధ్వర్యంలో నిర్వహించిన 2019 బతుకమ్మ సంబరాలు దిగ్విజయంగా ముగిసాయి. టొరంటో నగరంలోని డేవిడ్ సుజుకి స్కూల్ లో టీడీఎఫ్ సాంస్కృతిక విభాగం తంగేడు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. కెనడాలో స్థిరపడిన సుమారు 600 మంది తెలంగాణవాదులు తమ కుటుంబాలతో సహా హాజరై ఆట పాటలతో తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సంబురాలను సంప్రదాయ రీతిలో జరుపుకోవడం వల్ల విదేశాల్లో తెలంగాణ సంస్కృతిని నిలబెట్టడానికి ఎంతగా పాటు పడుతున్నారనే దానికి ఈ వేడుకలను నిదర్శనంగా చెప్పవచ్చు. కాగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగు రంగుల బతుకమ్మలను పేర్చి తమ ఆట పాటలతో అలరించారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. టీడీఎఫ్ కమిటీ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణా అభివృద్ధికి పాటు పడుతూనే, తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కమిటీ చైర్మైన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ గార్లపాటి జితేందర్, అధ్యక్షులు పిణీకేశి అమిత రెడ్డి, ఉపాధ్యక్షులు మూల కవిత, పద్మ గంట, శాంత మేడ , ప్రమోద్ ధర్మపురి, శ్రీదేవి ధర్మపురి, అతిధి పున్నం, వెంకటరమణ రెడ్డి మేడ, పిణీకేశి తిరుపతి రెడ్డి, కీసర మహేందర్ రెడ్డి, ముప్పిడి సుమన్ రెడ్డి, మూలం శ్రీనివాస్ రెడ్డి, కోండం రవీందర్ రెడ్డి, చాడ కృష్ణ రెడ్డి, అర్షద్ ఘోరీ, కోండం పవన్ కుమార్, చింతలపని శశాంక్ తదితరులు పాల్గొన్నారు. -
కెనడాలో కాల్పుల కలకలం
టోరంటో: కెనడాలోని టోరంటోలో ఓ విజయోత్సవ ర్యాలీపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టోరంటోలోని సిటీహల్ స్క్వేర్‌లో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలమంది రాప్టార్ అభిమానులతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. ఇంతకు ముందు దీనిని ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వచ్చేలా ర్యాలీ కోసం ఏర్పాటు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో.. ఇదే అదునుగా భావించిన దుండగులు వారిపైకి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమేనీ జరగలేదు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. మరికొందరు స్వల్పంగా గాయాలపాలైనట్లు పోలీస్ చీఫ్ మార్క్ సాండర్స్ చెప్పారు. ఈ కాల్పుల సమయంలో ఎవరైన ఫోటోలు లేదా వీడియోలు తీసివుంటే వాటిని తమకుని అప్పగించి దర్యాప్తుకు సహకరించాలని సాండర్స్ కోరారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో, టోరంటో మేయర్ జాన్ టోరి, ఎన్బీఏ ఫైనల్స్ ఎంవిపి కవి లియోనార్ఢ్తో పాటు ఇతర ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలేమీ కాలేదని అధికారులు తెలిపారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు చేశారా.. లేక తీవ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
కెనడాలో ఘనంగా వైఎస్సార్సీపీ విజయోత్సవం
టొరంటో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడాన్ని పురస్కరించుకుని కెనడాలోని టొరంటో నగరంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్సీపీ జెండాలు చేతపట్టి వైఎస్ జగన్ జై అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి జగన్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం నాగభూషణ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కృష్ణ అల్లంపాటి, మధుసూదన్, చంద్రహాస్ చల్ల, హరి మున్నంగి, వీరారెడ్డి, మోహన్‌రెడ్డి మల్లడి తదితరులు పాల్గొన్నారు. -
పౌరసత్వ వివాదం: అక్షయ్ షాకింగ్ వీడియో!
బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌కు దేశమంటే ఎనలేని ప్రేమ. ఒకవైపు దేశభక్తి చిత్రాల్లో నటించడమే కాదు.. మరోవైపు జవాన్లకు ఆర్థిక సాయం అందజేయడం.. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేపట్టారు. భారత్ అంటే తనకు ఎంతో ప్రేమ అని చాటారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన చుట్టు పౌరసత్వ వివాదం ముసురుకుంటోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం.. భారత్‌కు బదులు కెనడా దేశ పౌరసత్వం ఆయన కలిగి ఉండటం అందుకు కారణం. ఎట్టకేలకు పౌరసత్వ వివాదంపై అక్షయ్‌కుమార్ స్పందించారు. తనకు కెనడా పాస్‌పోర్టు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన.. అదే సమయంలో మాతృదేశమైన భారత్ అంటే తనకు ఎనలేని మక్కువ అని పేర్కొన్నారు. కెనడా పౌరసత్వం విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, గత ఏడేళ్లలో తాను ఎన్నడూ కెనడా వెళ్లలేదని, ఇక్కడే ఉంటూ.. ఇక్కడే అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ క్రమంలోనే ఆయన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో కెనడా టోరంటోలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌కుమార్.. ‘మీకో విషయం తప్పకుండా చెప్పాలి. టోరంటో నా సొంతూరు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రిటైరయ్యాక నేను ఇక్కడికే వచ్చి స్థిరపడతాను’ అని పేర్కొంటున్న వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. దేశం మీద ప్రేమ ఉందంటూనే.. అక్షయ్‌కుమార్ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారని ఈ వీడియోపై కొందరు విమర్శలు చేస్తుండగా.. గతంలో ఎప్పుడూ అన్న మాటలను వెలుగులోకి తెచ్చి.. అక్షయ్ దేశభక్తిని శంకించడం సరికాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు
టొరంటో : తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరంటో(టీసీఏజీటీ) ఆధ్వర్యంలో మెగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టొరంటోలోని బిషప్ ఆల్లెన్ అకాడమీ క్యాథలిక్ సెకండరీ స్కూల్లో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. టీసీఏజీటీ సెక్రటరీ దేవి చౌదరి ప్రాంభోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. టోరంటో చుట్టు పక్కన ప్రాంతలైన మర్కమ్, బ్రాంప్టన్, మిస్సిసౌగా, ఓక్విల్లే, వాటర్డౌన్, కిట్చెనర్, వాటర్లూ, కేంబ్రిడ్జి, హామిల్టన్, మిల్టన్లతో పాటూ ఇతర ప్రాంతాలనుంచి వందలాది కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. గత ముప్పై ఏళ్లుగా టీసీఏజీటీ అందిస్తున్న సేవలను ప్రెసిడెంట్ కోటేశ్వరరావు పోలవరపు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్టీలు, స్పాన్సర్లు, వాలంటీర్లుకు ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సూర్య బెజవాడ, దేవి చౌదరిలు కృతజ్ఞతలు తెలిపారు. -
దింపినందుకు రూ.35 లక్షల జరిమానా
చండీగఢ్: ఓ మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం దిగిపొమ్మన్నందుకు రెండు విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రూ.35 లక్షలు చెల్లించాల్సిందిగా పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ జెట్ ఎయిర్వేస్, ఎయిర్ కెనడా సంస్థలను ఆదేశించింది. గత ఏడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు, మూడేళ్ల కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరారు. తొలుత ఢిల్లీ వెళ్లేందుకు మొహాలీలోని చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ ఎయిర్వేస్ విమానమెక్కారు. తర్వాత ఢిల్లీలో ఎయిర్ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు తీషా తాళంవేసి ఉన్న వాష్‌రూం వద్ద చాలాసేపు ఆగి చివరకు వాంతి చేసుకుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ కేకలువేస్తూ మినాలీ, ఆమె కుమార్తె, కొడుకును విమానం నుంచి బలవంతంగా విమాన సిబ్బంది దింపేశారు. వారి లగేజీని ఢిల్లీ విమానాశ్రయంలో దించకుండా టొరంటోకు తీసుకెళ్లారు. -
దెబ్బకు ట్రక్కు వంద ముక్కలైంది.. వారు మాత్రం..
కెనడా : అదృష్టం బాగుంటే సింహం బోనులో అడుగుపెట్టి దర్జాగా బయటకు తిరిగిరావచ్చంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే కెనడాలో చోటుచేసుకుంది. రోడ్డుపై రీపేర్ల నిమిత్తం ఆపిన ఓ ట్రక్కును వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఆ వేగానికి ట్రక్కు ముక్కలు ముక్కలు అయినా కూడా దాన్ని రిపేర్ చేస్తున్న వారికి మాత్రం ఏమీ కాలేదు. కేవలం చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని టోరంటో హైవేపై ఓ ట్రక్కు రిపేర్ల కోసం ఆగింది. ఓవ్యక్తి ఆ వాహనాన్ని రిపేర్ చేసే పనిలో బిజిగా ఉన్నాడు. రోడ్డుపై వాహనం ఆగిపోవటం వల్ల ఇతర వాహనాలతో ప్రమాదం జరగకుండా ఉండటానికి అక్కడ ఓ జెండాను ఎగరేశారు. కొద్దిసేపటి తర్వాత ఓ తెల్లకారు వేగంగా ట్రక్కువైపు దూసుకు వచ్చింది. కారు వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు ముక్కలు ముక్కలుగా అయ్యి ఎగిరిపడింది. దాన్ని రిపేర్ చేస్తున్న వ్యక్తి, లోపల ఉన్న మరికొందరు అంతా ఎగిరిపడ్డారు. అయినా వారికి పెద్ద గాయాలేమీ కాలేదు.. చిన్న చిన్న గాయలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు.. పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు. -
టొరంటోలో పాదచారులపై కాల్పులు
టొరంటో: కెనడాలోని టొరంటోలో పాదచారులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి టొరంటోలోని గ్రీక్టౌన్లో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ పాదచారులపై కాల్పులు జరిపాడు. దుండగుడు దాదాపు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరుగుతుండగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిపై కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి పారిపోయిన ఆ దుండగుడు కొద్ది దూరంలో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియదని, ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వివరించారు. -
ఘనం... స్మిత్ పునరాగమనం
టొరంటో: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గ్లోబల్ టి20 లీగ్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండగా... మరోవైపు ఈ లీగ్‌లో బరిలోకి దిగిన అతను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టొరంటో నేషనల్స్ తరఫున ఆడిన స్మిత్ (41 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. అతనితోపాటు ఆంటోన్ డేవ్‌సిచ్ (44 బంతుల్లో 92 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్ ఆరు వికెట్ల తేడాతో వాంకోవర్ నైట్స్‌పై విజయం సాధించింది. మొదట వాంకొవర్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎవిన్ లూయిస్ (55 బంతుల్లో 96; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), రసెల్ (20 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అదరగొట్టారు. అనంతరం టొరంటో నేషనల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి గెలిచింది. -
టీసీఏజీటీ ఆధ్వర్యంలో కూచుపూడి శిక్షణ శిబిరం
టొరంటో : ప్రముఖ నృత్య కళాకారుడు, డ్యాన్స్ మాస్టర్ కళారత్న కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కెనెడాలో కూచుపూడి శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. మార్చి 9 నుంచి 17 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఐదేళ్లు మించి ఆసక్తిగలవారు నమోదు చేసుకోవాలని తెలుగు సాంసృతిక సంఘం గ్రేటర్ టొరంటో (టీసీఏజీటీ) పేర్కొంది. తొలి సెషన్ లో భాగంగా కేవీ సత్యనారాయణతో మార్చి 19న చిన్నారుల పరిచయకార్యక్రమం ఉంటుంది. హిందూ హెరిటేజ్ సెంటర్, 6300 మిస్సిసాగా రోడ్డు, కెనడాలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. మార్చి 10, 11న మథేసన్ బిఎల్వీడీ ఈస్ట్, మిస్సిసాగాలో, మార్చి 12, 15, 16న హిందూ హెరిటేజ్ సెంటర్, 6300 మిస్సిసాగా రోడ్డులో విద్యార్థులకు కూచుపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా మార్చి 17న విద్యార్థులు టీసీఏజీటీ ఉగాది వేడుకల్లో ప్రదర్శనను ఇవ్వనున్నట్టు టీసీఏజీటీ తెలిపింది. -
లేజర్ బిజినెస్ కార్డు..
మీలో చాలా మందికి విజిటింగ్, బిజినెస్ కార్డులు ఉంటాయి. అయితే మీ దగ్గరున్న విజిటింగ్ కార్డులన్నింటికీ భిన్నంగా ప్రస్తుతం ఈ ఫొటోలో ఉన్నది కూడా ఒక బిజినెస్ కార్డేనండి! ఏంటి తెల్ల కాగితం చూపించి బిజినెస్ కార్డు అంటున్నారు అనుకుంటున్నారా? అవును ఇది నిజంగానే బిజినెస్ కార్డు. అన్ని బిజినెస్ కార్డుల్లాగానే ఇందులోనూ వివరాలు ఉన్నాయి. అయితే కనిపించవు. ఆ వివరాలు కనిపించాలంటే మీకు లైట్ కావాలి. ఎందుకంటే కాంతి ఉంటేనే ఆ కార్డులోని వివరాలు కనిపిస్తాయి. ఈ బిజినెస్ కార్డులో మొత్తం మూడు లేయర్ల పేపర్లు ఉన్నాయి. మధ్య లేయర్ లేజర్ కట్‌తో ఉంటుంది. అందువల్ల మీరు లైట్ దగ్గరికి దాన్ని తీసుకొస్తే ఆ వివరాలు కనిపిస్తాయి. ఇంతకీ ఈ వెరైటీ కార్డు గురించి చెప్పి దాన్ని తయారు చేసిన వ్యక్తి గురించి చెప్పకపోతే బాగుండదు కదా! ఆ కార్డును తయారు చేసింది కెనడాలోని టొరెంటోలో ఉన్న 26 ఏళ్ల ఆర్ట్ డైరెక్టర్ డోరి. తనకి కొత్తగా ఆలోచించడం హాబీ. ఆ ఆలోచనలో నుంచే ఈ కార్డు పుట్టుకొచ్చిందని డోరి చెప్పుకొచ్చారు. ఇలాంటి కొత్త రకం కార్డులను తయారుచేయడాన్ని తాను సవాల్‌గా స్వీకరిస్తానని డోరి చెప్పారు. -
అమ్మకానికి హోటల్.. ఒక్కో గది రూ. 5 కోట్లు!
సౌదీ అరేబియా రాకుమారుడు అల్వలీద్ బిన్ తలాల్-అల్-సౌద్ టోరంటోలోని ఫోర్ సీజన్స్ హోటల్‌ను అమ్మకానికి పెట్టారు. ప్రిన్స్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ కింగ్ డమ్ హోల్డింగ్ కార్పొరేషన్ హోటల్ ను ఈ ఏడాది మార్కెట్లో అమ్మకానికి పెట్టనున్నట్లు సమాచారం. ఇంతకీ హోటల్ రేటెంతో తెలుసా.. అందులోని ఒక్కో గది రూ. 5.42 కోట్ల వరకు ధరను నిర్ణయించారట. దీనిపై కింగ్ డమ్ హోల్డింగ్ ప్రతినిధిని ప్రశ్నించగా.. ఫోర్ సీజన్స్ హోటల్లో ఎప్పటిలానే అతిథులను తాము ఆహ్వానిస్తామని అన్నారు. 2007లో ఈ హోటల్‌ను కింగ్ డమ్ హోల్డింగ్స్ 3.8 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. యార్క్ విల్లీలో ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్ రెండు భారీ భవనాలల సముదాయం. ఇందులో ప్రత్యేకంగా హోటల్, లగ్జరీ రూమ్ లను 2012లో ప్రారంభించారు. హోటల్ లో మొత్తం 250 గదులు ఉన్నాయి. -
కెనడాలో తెలుగు యువతి దారుణ హత్య
టొరంటో: స్నేహితులతో కలిసి షాపింగ్ కు వెళ్లిన ఆ యువతి.. శవమై తిరిగొచ్చింది. ఒకరిని టార్గెట్ చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. కెనడా రాజధాని టొరంటోలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో కింతియా జాన్ అనే తెలుగు యువతి దుండగుల తూటాలకు బలైంది. టొరంటో పోలీసులు, 'సాక్షి' సేకరించిన వివరాల ప్రకారం.. టొరంటోలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో పుట్టిన కింతియా జాన్(24) పీజీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం సాయంత్రం నలుగురు స్నేహితులతో షాపింగ్ కు వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చేందుకు నలుగురు స్నేహితులు కారు ఎక్కుతుండగా.. ఒక్కసారిగా వాళ్లవైపు దూసుకొచ్చిన దుండగుడు తుపాకితో కాల్పులు జరిపాడు. కింతియా స్నేహితుడు, కెనడాకే చెందిన జోసెఫ్ ను టార్గెట్ చేసుకుని దుండగుడు కాల్పులు జరపగా.. అప్పటికే సీట్లో కూర్చున్న కింతియాకు కూడా బుల్లెట్లు తగిలాయి. కాల్పుల అనంతరం దుండగుడు మరొకడితో కలిసి సిల్వర్ కలర్ కారులో పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడిఉన్న కింతియా, జోసెఫ్ లను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందేలోపే ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి దుండగుల టార్గెట్ జోసఫే అయిఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కారులో ఉన్న మిగతా ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కింతియా జాన్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీ. ఆమె తండ్రి జాన్ కృపాకరం వృత్తిరీత్యా వైద్యుడు. తల్లి ఆలూరు శోభ ఉపాధ్యాయిని. 16 ఏళ్ల కిందటే వారు టొరంటో(కెనడా)కు వలస వెళ్లి స్థిరపడ్డారు. కింతియాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. కాగా, అంత్యక్రియలు టొరంటోలోనే నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కింతియా హత్యకు గురికావడంతో మహబూబ్ నగర్ లోని ఆమె బంధువుల ఇళ్లల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
పిల్లో ఫైట్ డే సెలబ్రేషన్స్
-
కొట్టుకుంటూ.. పిల్లో ఫైట్ డే సెలబ్రేషన్స్
టొరంటో: దిండ్లతో గ్రూపులు గ్రూపులుగా వచ్చి ఒకరిని ఒకరు చితకొట్టుకున్నారు. ఏడవ అంతర్జాతీయ పిల్లో ఫైట్ డే సందర్భంగా దిండ్లతో ఈ విధంగా కొట్టుకున్నారు. కెనడాలోని టొరంటోలో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఎవరు కనబడితే వారిని ఇష్టమోచ్చినట్టు కొడుతూ ఈ ఫైట్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. అంతర్జాతీయ పిల్లో ఫైట్ డేను లండన్‌లాంటి నగరాలతో పాటూ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో జరుపుకున్నారు. -
టొరంటోలో టూరిజం రోడ్ షో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కెనెడాలోని టొరంటోలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య పాల్గొన్నారు. టొరంటోకు చెందిన సుమారు 100 మందికి పైగా ప్రముఖ టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ రోడ్‌షోకు హాజరయ్యారు. ఉత్తర అమెరికా నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పర్యాటకులను పంపేందుకు ఆపరేటర్లు, ఏజెంట్లు ఆసక్తి చూపారు. టొరంటోలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ అఖిలేశ్ మిశ్రాతో పాటు భారత పర్యాటక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కెనడాలో తెలంగాణ ఉత్సవాలు
-
యువశక్తి మన సొంతం: మోదీ
-
యువశక్తి మన సొంతం: మోదీ
టోర్నటో: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడుపర్యటన కెనడాలో కొనసాగుతుంది. టొరెంటోలో రికో కోలీజియం ప్యాలెస్‌లో భారతీయులనుద్దేశించి ప్రధాని హిందీలో ప్రసంగించారు. సుమారు పదివేలమంది భారతీయులు హాజరైన ఈ సమావేశంలో మోదీ ప్రసంగంతో చప్పట్ల మోత మోగింది. కొత్త ఆకాంక్షలతో, ఆశలతో తాను కెనడా వచ్చానన్నారు. కెనడాతో భారత్ మంచి సంబంధాలను కలిగి ఉందని ఇకముందు కూడా ఈ సంప్రదాయం కొనసాగుతుందంటూ వారికి అభినందనలు తెలిపారు. ''2006లో అమెరికా, బ్రిటన్ నాకు వీసా ఇచ్చేందుకు నిరాకరిస్తే కెనడా మాత్రం నాకు వీసా ఇచ్చింది. 2003 నుంచి గుజరాత్ అభివృద్ధిలో కెనడా సహకరించింది. గతంలో కెనడాలో నేను పర్యటించినప్పుడు నేనెవరో తెలియదు. చాలాకాలంగా కెనడాతో భారత్‌కు సత్సంబంధాలున్నాయి. ఈ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. కెనడా ప్రజలు భారత్‌ను గౌరవిస్తారు.'' ఈ సందర్భంగా మోదీ దేశాన్ని ఏలిన గత ప్రభుత్వాలపై విరుచుకపడ్డారు. స్కిల్ ఇండియాపైనే తమ దృఫ్టి తప్ప స్కామ్ ఇండియాపై కాదన్నారు. వారు మురికి చేసిపోతే తమ ప్రభుత్వం ఆ మురికిని శుభ్రం చేయడానికి పూనుకుందన్నారు. స్వచ్ఛభారత్ ద్వారా భారత్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సంకల్పించామని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని యువసంపద భారతదేశంలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో కీలకమైన 80 కోట్ల మంది యువత కలలు, 160 కోట్ల బలమైన చేతులు దేశానికి అండగా ఉన్నాయి. ఒక దేశ అభివృద్ధికి ఇంతకంటే ఏం కావాలన్నారు. దేశంలోని యువత ఉద్యోగార్థులుగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించేవారుగా తయారు కావాలని కోరుకుంటున్నానన్నారు. 2030 తర్వాత ప్రపంచానికి అవసరమైన కార్మికశక్తి మన వద్ద ఉంటుందన్నారు. -
భారత్-కెనడా సంబంధాలు బలంగా ఉన్నాయి
-
కప్ కేకు.. ధర వింటే షాకు..
ఇది కప్ కేకు. మీరెన్నో తినుండొచ్చు. కానీ దీని ప్రత్యేకత దీనిదే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఎంతంటే.. జస్ట్ రూ.55 వేలు. కెనడాలోని టొరెంటోలో ఉన్న లీడాల్సి బేకరీ దీన్ని తయారుచేసింది. ఓ సంపన్నుడు తన భార్య 40వ పుట్టిన రోజు కోసం దీన్ని తయారుచేయించాడట. ఇందులో అత్యంత ఖరీదైన షాంపేన్తోపాటు బంగారు రేకులు వంటివి వాడారట. పైన.. చక్కెరతో తయారు చేసిన వజ్రాలను జల్లారు. -
బ్లడ్ కేన్సర్ జన్యువు దొరికింది!
టొరాంటో: ల్యుకేమియా (బ్లడ్ కేన్సర్) వ్యాప్తికి కారణమవుతున్న ఓ కీలక జన్యువును కెనడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జన్యువును క్రియారహితం చేయడం ద్వారా బ్లడ్ కేన్సర్‌ను పూర్తిగా అడ్డుకోవచ్చని వారు భావిస్తున్నారు. ల్యుకేమియాకు జన్యుపరమైన చికిత్సపై నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ శాస్త్రవేత్తలు ‘బీఆర్జీ1’ అనే ఈ జన్యువును గుర్తించారు. బ్లడ్ కేన్సర్ మూలకణాలు విభజన చెందుతూ కణతులను ఏర్పర్చేందుకు ఈ జన్యువే తోడ్పడుతోందని కనుగొన్నారు. ప్రయోగశాలలో జంతువులు, మనుషుల బ్లడ్ కేన్సర్ కణాలపై ప్రయోగంలో.. ఈ జన్యువును అడ్డుకోగా వాటి విభజన పూర్తిగా ఆగిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ జన్యువు ఆరోగ్యకరమైన రక్తకణాలపై ఎలాంటి ప్రభావం చూపకుండా కేన్సర్ కణాల విభజనను మాత్రమే ప్రేరేపిస్తుంది కాబట్టి.. దీనిని అడ్డుకున్నా ప్రమాదమేమీ ఉండబోదని అంటున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో బ్లడ్ కేన్సర్ కణతులను తొలగించడం సాధ్యం అవుతున్నా.. ఈ కణతులను ఏర్పర్చే మూలకణాలను మాత్రం పూర్తిగా నిర్మూలించడం వీలు కావడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్జీ1 జన్యువును అణుస్థాయిలోనే అడ్డుకునే ఔషధాన్ని తయారు చేస్తే గనక.. బ్లడ్ కేన్సర్‌కు శాశ్వత చికిత్స అందుబాటులోకి వచ్చినట్లేనని, తాము ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని పరిశోధకులు తెలిపారు. -
కారు తాళాలు ఇవ్వలేదని మహిళపై కత్తితో దాడి
టోరొంటో:కారు తాళాలు ఇవ్వలేదని కారణంతో ఇండో -కెనడా సంతతికి చెందిన మహిళపై ఓ అగంతకుడు పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. కెనాడాలోని విన్ పిగ్ నగరంలో ఈ ఘటన బుధవారం సంభవించింది. పరమ్ జిత్ కౌర్ (30) అనే మహిళ తన తల్లి, కూతురుతో కలిసి బయటకు వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కారు తాళాలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు బాధితురాలు పేర్కొంది. తాను కారులో కూర్చున్న సమయంలో ఎడమ ప్రక్కగా వచ్చిన అతను తాళాలు కోసం డిమాండ్ చేశాడని, దానికి నిరాకరించడంతో అతను తన వద్ద నున్న కత్తితో పొడిచాడని తెలిపింది. కాగా, అతను ఎవరు తనకు తెలియదని తెలిపింది. కారు తాళాలు ఇవ్వమని అడగడం, తనను వెంబడించడానికి కారణాలు తెలియదని కౌర్ తెలిపింది. కారు అవతలి విండో దగ్గర తన తల్లి ఉండగా అతను దాడి చేశాడని పేర్కొంది. -
నకీలీ గర్భంలో డ్రగ్స్ స్మగ్లింగ్