
టొరంటో: కెనడా రాజధాని టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరియాణా విద్యార్థి ఒకరు దుర్మరణం చెందారు. శుక్రవారం మధ్యాహ్నం సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్కు ఢీకొట్టి, అతడిని లాక్కెళ్లింది. ఎమర్జెన్సీ సిబ్బంది ట్రక్కు నుంచి అతికష్టమ్మీద అతడిని వేరు చేశారు.
అప్పటికే అతడు చనిపోయాడు. మృతుడిని హరియాణాలోని కర్నాల్‌కు చెందిన కార్తీక్ సైని(20)గా గుర్తించారు. టొరంటోలోని షెరిడాన్ కాలేజీలో జాయినయ్యేందుకు 2021 ఆగస్ట్‌లో అతడు కెనడా వెళ్లినట్లు అతడి సోదరుడు పర్వీన్ సైని చెప్పారు.