pickup truck
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికార్పూర్-బులంద్‌షహర్ రోడ్డులో పికప్ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారు. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు బులంద్‌షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్‌కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం!
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. 21 మంది గాయపడినట్లు సమాచారం. షాపురా పోలీస్ స్టేషన్- బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలోని బద్జార్ ఘాట్‌లో ఒక పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడినవారంతా షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితులంతా డియోరి గ్రామానికి చెందిన వారని చెబుతున్నారు. ఈ ఘటనపై ఎంపీ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సీఎం కోరుతున్నారు. కాగా మృతుల్లో 9 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 21 మందిలో తొమ్మిది మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు బాధితులను జబల్పూర్కు ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరు మార్గంమధ్యలోనే మృతి చెందారు. मुख्यमंत्री डॉ. मोहन यादव ने डिंडोरी जिले में हुई वाहन दुर्घटना में कई अनमोल जिंदगियों के असामयिक निधन पर गहन शोक व्यक्त किया है। उन्होंने ईश्वर से दिवंगत आत्माओं की शांति व परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने की प्रार्थना की है। मुख्यमंत्री जी ने कहा कि घटना में… — Chief Minister, MP (@CMMadhyaPradesh) February 29, 2024 -
కెనడాలో రోడ్డు ప్రమాదం.. హరియాణా విద్యార్థి మృతి
టొరంటో: కెనడా రాజధాని టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరియాణా విద్యార్థి ఒకరు దుర్మరణం చెందారు. శుక్రవారం మధ్యాహ్నం సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్కు ఢీకొట్టి, అతడిని లాక్కెళ్లింది. ఎమర్జెన్సీ సిబ్బంది ట్రక్కు నుంచి అతికష్టమ్మీద అతడిని వేరు చేశారు. అప్పటికే అతడు చనిపోయాడు. మృతుడిని హరియాణాలోని కర్నాల్‌కు చెందిన కార్తీక్ సైని(20)గా గుర్తించారు. టొరంటోలోని షెరిడాన్ కాలేజీలో జాయినయ్యేందుకు 2021 ఆగస్ట్‌లో అతడు కెనడా వెళ్లినట్లు అతడి సోదరుడు పర్వీన్ సైని చెప్పారు. -
వాటివల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి! కారణమేంటీ?
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెల్లడైంది. అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రోడ్డు ప్రమాదాలకు ఇటువంటి కారణాలు కూడా ఉంటాయా అనేట్టుగా నిజాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన ఇన్సురెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైవే సేఫ్టీ (ఐఐహెచ్ఎస్) సంస్థ ఇటీవల రోడ్డు ప్రమాదాలు, అందులో చనిపోతున్న వ్యక్తులకు సంబంధించిన డేటాను విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలో ఎక్కువగా మరణాలకు కారణం అవుతున్న వాహనాల్లో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూఈ), పికప్ వెహికల్స్ ఉన్నట్టుగా తేలింది. దీంతో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్, పికప్ వెహికల్స్‌పై మరోసారి పరిశీలన చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఎస్యూవీ, పికప్ వెహికల్స్‌లో ముందు వైపు ఇరుపక్కలా పెద్దగా ఉండే పిల్లర్స్ కారణంగా డ్రైవర్‌కి బ్లైండ్ స్పాట్స్ ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మూల మలుపులు తీసుకునే సమయంలో ఈ బ్లైండ్స్పాట్స్ డ్రైవర్ దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్టుగా గుర్తించారు. ఎస్యూవీ, పికప్ వెహికల్ డ్రైవర్లకు ఏర్పడుతున్న బ్లైండ్స్పాట్ల వల్ల రోడ్డు కదులుతున్న లేదా నిలబడి ఉన్న వ్యక్తులను గుర్తించడంలో పొరపాట్లు జరుగుతున్నట్టుగా తేలింది. సాధారణ ప్యాసింజర్ వెహికల్స్‌లో ఈ సమస్య కొద్ది మొత్తంలోనే ఉండగా ఎస్యూవీ, పికప్ వెహికల్స్‌లో ఎక్కువగా ఉన్నట్టు ఐఐహెచ్ఎస్ పరిశీలనలో వెల్లడైంది. 2020లో రోడ్డు ప్రమాదాల కారణంగా అమెరికాలో 6,519 మంది చనిపోయారు. అంతుకు ముందు ఏడాదితో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం. ఇక 2009 నుంచి 2019 రోడ్డు ప్రమాదాల గణాంకాలను పోల్చితే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 59 రెట్లు పెరిగింది. గత కొంత కాలంగా అమెరికాలో ఎస్యూవీ అమ్మకాలు పెరిగిపోయాయి. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ఒక్క ఎస్యూవీ, పికప్ వెహికల్స్‌నే బాధ్యులను చేయలేం, అదే సమయంలో ప్రమాదాల్లో ఎక్కువగా ఉన్న ఈ వాహనాల సంఖ్యను విస్మరించలేం. మరింత అధ్యయనం చేసి తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఐఐహెచ్ఎస్ అంటోంది. -
కళ్లు చెదిరే లుక్స్‌తో టయోటా నుంచి సరికొత్త కార్..! ధర ఎంతంటే..!
పికప్ ట్రక్ వాహనాల్లో జపనీస్ కంపెనీ ఇసుజుకు సాటిలేదు. ఇసుజు డీ మ్యాక్స్ వీ క్రాస్ వాహనాలకు పోటీగా ప్రత్యర్థి జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా భారత మార్కెట్లలోకి సరికొత్త పికప్ ట్రక్‌ను లాంచ్ చేయనుంది. అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో అత్యంత ప్రజాదరణను పొందిన ‘హిలక్స్’ పికప్ వాహనాన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో లాంచే చేసేందుకు టయోటా ఇండియా సన్నహాలు చేస్తోంది. ఇసుజుకు హిలక్స్ దీటైన పోటీ ఇవ్వనుంది. టయోటా భారత్‌లో ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవాలకు భారీ ఆదరణను సంపాదించింది. అదే నిర్మాణంతో టయోటా హిలక్స్ కూడా ఉండనుంది.టయోటా హిలక్స్ 3000ఎంఎం వీల్‌బేస్‌తో రానుంది. టూ డోర్, ఫోర్ డోర్ కాన్ఫిగరేషన్స్‌తో లభించనుంది. ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, లాంగ్ స్లిట్ హెడ్‌ల్యాంప్స్ అమర్చారు. వీటితో పాటుగా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే వంటి ఇంటీరియర్స్ ను కల్గి ఉంది. టయోటా ఫార్చూనర్ కంటే తక్కువగా రూ 25-35 లక్షల మధ్య హిలక్స్ ఉండనుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! కంపెనీ ఇంజిన్‌కు సంబంధించిన విషయాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఇండియా-స్పెక్ టయోటా హిలక్స్ డీజిల్ యూనిట్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది., ఇది టయోటా ఫార్చ్యూనర్ మాదిరి 2.8-లీటర్ యూనిట్ 4x4 టాప్-స్పెక్ వేరియంట్‌గా ఉండనుంది. ఇంజన్ 201bhp సామర్థ్యంతో 500Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చదవండి: కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన కంపెనీలు..! -
ట్రక్కు, పికప్ వాహనం ఢీ..ముగ్గురి మృతి
ఉత్తర్ ప్రదేశ్ : ఉన్నావో జిల్లాలో చకాలవాన్షి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమత్తం ఉన్నావో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. -
టాటా మోటార్స్ నుంచి కొత్త పికప్ ట్రక్ ‘జెనాన్ యోధ’
ప్రారంభ ధర రూ.6.05 లక్షలు న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన కొత్త పికప్ వెహికల్ ‘టాటా జెనాన్ యోధ’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.6.05 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న ఈ వాహనం 4 .2, 4 .4 వేరియంట్లలో సింగిల్, డబుల్ క్యాబ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. బీఎస్–3, బీఎస్–4 నిబంధనలకు అనువుగా తయారైన ఈ వాహనాల్లో 3 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చామని కంపెనీ పేర్కొంది. సింగిల్ క్యాబ్‌లో బీఎస్–3 వెర్షన్ వేరియంట్ ధర రూ.6.05 లక్షల నుంచి, బీఎస్–4 వెర్షన్ వేరియంట్ ధర రూ.6.19 లక్షల నుంచి ప్రారంభమౌతుందని తెలిపింది. -
మహీంద్రా పిక్అప్ ట్రక్ ‘ఇంపీరియో’
♦ ప్రారంభ ధర రూ.6.25 లక్షలు ముంబై: భారతదేశపు అతిపెద్ద ఎస్యూవీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ప్రీమియం పిక్అప్ ట్రక్ ‘ఇంపీరియో’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకట్టుకునే స్పోర్ట్స్ ఎస్యూవీ లుక్‌తో పాటు అత్యుత్తమ పనితీరు దీని సొంతమని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. ‘ఇంపీరియో’ ప్రారంభ ధర రూ.6.25 లక్షలు. అది కూడా థానేలో ఎక్స్ షోరూమ్. ఇంపీరియోలో రాడికల్ టైర్స్, నెక్ట్స్ జనరేషన్ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ కార్గో బాక్స్, 2.5 లీటర్ ఇంజిన్, 1,240 కిలోగ్రాముల పేలోడ్ సామర్థ్యం, లీటర్‌కు 13.55 కిలోమీటర్ల మైలేజ్, కారును పోలి ఉండే ఇంటీరియర్స్, సీట్స్, ఏసీ క్యాబిన్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇంపీరియో వాహనం సింగిల్ క్యాబిన్, డబుల్ క్యాబిన్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన ఈ కొత్త వాహనం ద్వారా పిక్ అప్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించాలని భావిస్తోంది. ఇంపీరియో వాహన బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఇసుజు పికప్ ట్రక్లు
హైదరాబాద్: ఇసుజు మోటార్ ఇండియా కంపెనీ అంతర్జాతీయ శ్రేణి పికప్ ట్రక్, డి-మాక్స్‌ను హైదరాబాద్ మార్కెట్లో అవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పికప్ ట్రక్లు అత్యధికంగా విక్రయమవుతున్నాయని కంపెనీ ఎండీ టకాషి కికుచి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డి-మాక్స్ ట్రక్లు మూడు మోడల్స్‌లో, రెండు క్యాబిన్ ఆప్షన్లతో లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ డి-మాక్స్ సింగిల్ క్యాబ్ ప్రవేశ ధర రూ. 5,99,000, డి-మాక్స్ స్పేస్ క్యాబ్ ధర రూ.6,19,000(ఫ్లాట్ వేరియంట్), ఆర్చ్డ్ డెక్ రకం ధర రూ.7,09,000 (అన్ని ఎక్స్ షోరూమ్ ధరలు, హైదరాబాద్) అని వివరించారు. కొనుగోలుదారుల ప్రాధాన్యం చిన్న వాణిజ్య వాహనాల నుంచి పికప్ ట్రక్ల వైపు మళ్లుతోందని గుర్తించామని పేర్కొన్నారు. 2023 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద పికప్ ట్రక్ల మార్కెట్ కానున్నదని వివరించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ముమ్మర ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి కారణంగా తమ పికప్ వాహనాలు మంచి అమ్మకాలు సాధిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.