హైదరాబాద్: ఇసుజు మోటార్ ఇండియా కంపెనీ అంతర్జాతీయ శ్రేణి పికప్ ట్రక్, డి-మాక్స్‌ను హైదరాబాద్ మార్కెట్లో అవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పికప్ ట్రక్‌లు అత్యధికంగా విక్రయమవుతున్నాయని కంపెనీ ఎండీ టకాషి కికుచి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డి-మాక్స్ ట్రక్‌లు మూడు మోడల్స్‌లో, రెండు క్యాబిన్ ఆప్షన్లతో లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ డి-మాక్స్ సింగిల్ క్యాబ్ ప్రవేశ ధర రూ. 5,99,000, డి-మాక్స్ స్పేస్ క్యాబ్ ధర రూ.6,19,000(ఫ్లాట్ వేరియంట్), ఆర్చ్‌డ్ డెక్ రకం ధర రూ.7,09,000 (అన్ని ఎక్స్ షోరూమ్ ధరలు, హైదరాబాద్) అని వివరించారు.
కొనుగోలుదారుల ప్రాధాన్యం చిన్న వాణిజ్య వాహనాల నుంచి పికప్ ట్రక్‌ల వైపు మళ్లుతోందని గుర్తించామని పేర్కొన్నారు. 2023 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద పికప్ ట్రక్‌ల మార్కెట్ కానున్నదని వివరించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ముమ్మర ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి కారణంగా తమ పికప్ వాహనాలు మంచి అమ్మకాలు సాధిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఇసుజు పికప్ ట్రక్‌లు
Published Thu, May 22 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement