
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. 21 మంది గాయపడినట్లు సమాచారం. షాపురా పోలీస్ స్టేషన్- బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలోని బద్జార్ ఘాట్‌లో ఒక పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో గాయపడినవారంతా షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితులంతా డియోరి గ్రామానికి చెందిన వారని చెబుతున్నారు.
ఈ ఘటనపై ఎంపీ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సీఎం కోరుతున్నారు. కాగా మృతుల్లో 9 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 21 మందిలో తొమ్మిది మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు బాధితులను జబల్‌పూర్‌కు ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరు మార్గంమధ్యలోనే మృతి చెందారు.
मुख्यमंत्री डॉ. मोहन यादव ने डिंडोरी जिले में हुई वाहन दुर्घटना में कई अनमोल जिंदगियों के असामयिक निधन पर गहन शोक व्यक्त किया है।
— Chief Minister, MP (@CMMadhyaPradesh) February 29, 2024
उन्होंने ईश्वर से दिवंगत आत्माओं की शांति व परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने की प्रार्थना की है।
मुख्यमंत्री जी ने कहा कि घटना में…