overturned
-
టమాటా ట్రక్కు బోల్తా.. పండుగ చేసుకున్న జనం
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ. 100ను దాటింది. దీంతో సామాన్యులు టమాటాను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్‌లో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని సాగర్ నుండి టమోటాలతో ఢిల్లీ వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటన బంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజువా గ్రామం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టమాటాలతో నిండిన ట్రక్కు బోల్తా పడిందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు టమాటాలను ఏరుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ట్రక్కు నుంచి బయటపడిన టమాటాలు సంచులలోకి ఎత్తి తీసుకువెళ్లగా, మరికొందరు దర్జాగా ట్రక్కు లోనికివెళ్లి, టమోటాలను దక్కించుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గుమిగూడిన జనాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 15 క్వింటాళ్లకు పైగా టమాటను జనం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ట్రక్కులోని టమాటాలను మరో వాహనంలోని ఎక్కించి, అది వెళ్లాల్సిన గమ్యస్థానానికి తరలించేందుకు డ్రైవర్‌కు సహకరించారు. -
Hyderabad: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం
రసూల్‌పురా: మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొంపల్లి ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి రూ.32 లక్షల విలువైన మద్యం కాటన్ బాక్సులతో డీసీఎం కంటైయినర్ బంజారాహిల్స్ వైపు వెళ్తోంది. బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్లో నుంచి మద్యం సీసాల కాటన్ బాక్స్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమీపంలో ఉన్న బస్తీవాసులు, రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. మద్యం సీసాలను తీసుకుని వెళ్తున్న కొందరిని డీసీఎం డ్రైవర్ బసవలింగప్ప, ఇద్దరు హెల్పర్లు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. డీసీఎం బోల్తా పడిన ఘటనతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. -
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం!
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. 21 మంది గాయపడినట్లు సమాచారం. షాపురా పోలీస్ స్టేషన్- బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలోని బద్జార్ ఘాట్‌లో ఒక పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడినవారంతా షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితులంతా డియోరి గ్రామానికి చెందిన వారని చెబుతున్నారు. ఈ ఘటనపై ఎంపీ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సీఎం కోరుతున్నారు. కాగా మృతుల్లో 9 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 21 మందిలో తొమ్మిది మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు బాధితులను జబల్పూర్కు ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరు మార్గంమధ్యలోనే మృతి చెందారు. मुख्यमंत्री डॉ. मोहन यादव ने डिंडोरी जिले में हुई वाहन दुर्घटना में कई अनमोल जिंदगियों के असामयिक निधन पर गहन शोक व्यक्त किया है। उन्होंने ईश्वर से दिवंगत आत्माओं की शांति व परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने की प्रार्थना की है। मुख्यमंत्री जी ने कहा कि घटना में… — Chief Minister, MP (@CMMadhyaPradesh) February 29, 2024 -
ఫ్రీగా దొరికిన కూరగాయలు..ఎగబడ్డ జనాలు
-
అక్కడ కోడిగుడ్లు..ఇక్కడ టమాటాలు
వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 363వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది. పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు ఓ వ్యాన్ కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్‌లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్ డ్రైవర్ ఎండీ ఆసిఫ్ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు. కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. -
లోయలోకి దూసుకుపోయిన కారు
రంపచోడవరం: రంపచోడవరానికి సుమారు 15 కిలోమీట ర్ల దూరంలోని బర్డ్స్ నెట్ రిసార్ట్స్ సమీపంలో సోమవారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తా కొట్టి లోయలో పడింది. కాకినాడ నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట వెళ్తున్న ఈ వాహనంలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కారులో ప్రయాణికుల వివరాలు తెలియరాలేదు. -
మృతదేహాలు తారుమారు
ఇందల్వాయి/భిక్కనూరు: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం వల్ల మృతదేహాలు తారుమారయ్యాయి. మృతదేహాన్ని చితిపై ఉంచి నిప్పు పెట్టే సమయంలో ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో ఆఖరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన అంకం హన్మాండ్లు (58)కు కరోనా సోకడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు 11 రోజుల క్రితం హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ హన్మాండ్లు గురువారం రాత్రి మృతి చెందాడు. అయితే, చికిత్సకు రూ.10 లక్షలకు పైగా బిల్లు కాగా, అది చెల్లించే వరకూ మృతదేహాన్ని ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రోజంతా డబ్బు కోసం ఇబ్బందులు పడ్డారు. చివరకు శనివారం ఉదయం బిల్లు చెల్లించగా, కరోనా నిబంధనల మేరకు ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని పూర్తిగా ప్యాక్ చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించింది. చివరి నిమిషంలో ఆగిన అంత్యక్రియలు మృతదేహాన్ని అంబులెన్సులో గన్నారం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. చితి పేర్చి, దానిపై ఉంచారు. మరో రెండు నిమిషాల్లో చితికి నిప్పంటిస్తారనగా, అంబులెన్స్ డ్రైవర్‌కు ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహాలు తారుమారయ్యాయని,, హన్మాండ్లు మృతదేహానికి బదులు మరొకరిది ఇచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. దీంతో చివరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. మృతదేహాన్ని తిప్పి పంపించాలని ఆస్పత్రి సిబ్బంది కోరగా, కుటుంబ సభ్యులు నిరాకరించారు. హన్మాండ్లు మృతదేహం తీసుకొచ్చే వరకూ ఈ మృతదేహాన్ని అప్పగించబోమని స్పష్టం చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది మరో అంబులెన్స్‌లో హన్మాండ్లు మృతదేహాన్ని తరలించింది. సుమారు నాలుగు గంటల తర్వాత మృతదేహం గన్నారం చేరుకుంది. ప్యాకింగ్ తెరిచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించగా.. వారు తమదేనని నిర్ధారించుకున్నారు. అప్పటికే చితిపై ఉంచిన మోహన్‌గౌడ్ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసి అంబులెన్స్‌లోకి మార్చి, హన్మాండ్లు అంత్యక్రియలు పూర్తి చేశారు. నిర్లక్ష్యం వల్లే.. హన్మాండ్లు మృతదేహమని చెప్పి ఆస్పత్రి సిబ్బంది అప్పగించిన మృతదేహం కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన మోహన్‌గౌడ్‌ది. అతనికి కూడా కరోనా సోకడంతో సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్చించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆస్పత్రి మార్చురీలో లేదు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన ఆస్పత్రి సిబ్బంది.. అసలేం జరిగిందని ఆరా తీయగా మృతదేహాలు తారుమారైనట్లు తేలింది. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మృతదేహాలను మార్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హన్మాండ్లు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చికిత్స వివరాలు తెలపకుండా రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఫైరింజన్ బోల్తా
సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్ వే పరిశీలనకు వెళ్లిన ఫైరింజన్ అదుపు తప్పి బోల్తా పడింది. అయితే అదే సమయంలో హైదరాబాద్ నుంచి రావాల్సిన ఇండిగో విమానం లాండింగ్‌కు విమానాశ్రయ అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ విమానాన్ని బెంగళూరుకు తరలించారు. మరోవైపు ఫైర్ ఇంజన్ బోల్తాపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కొద్దిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
బోల్తాకొట్టిన ప్రైవేటు బస్సు.. తప్పిన పెనుప్రమాదం!
సాక్షి, నకిరేకల్: వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అయితే, ఈ ఘటనలో త్రుటిలో పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామశివారులో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ సాయికృష్ణ కంపెనీకి చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డుప్రక్కన ఇనుప రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. అయితే, బస్సు స్లీపర్ కోచ్ కావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే బస్సును రోడ్డు ప్రక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. రైలింగ్‌ను ఢీకొట్టడం వల్ల కొంతమేరకు బస్సు వేగం తగ్గి.. బస్సు రోడ్డుదిగి ఎడమవైపు ఒరిగి.. బస్సు పల్టీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ పరారయ్యాడు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి ఆదివారం అర్ధరాత్రి రాత్రి 12: 30 గంటలకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున సుమారు రెండుగంటల ప్రాతంలో ప్రమాదానికి గురైంది. బస్సులోని ప్రయాణికులు వెనుక భాగం, ముందుభాగం అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. ప్రయాణికుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 108 వాహనాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సురక్షితంగా ఉన్న ప్రయాణికులను విజయవాడ బస్సుల్లో పంపారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం
విజయనగరం : విజయనగరం జిల్లా కురుపాం మండలం ధర్మలక్ష్మీపురం వద్ద శనివారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి... బస్సులోని ప్రయాణికులకు బయటకు లాగారు. బస్సు పార్వతీపురం నుంచి సాకి వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగిందని తెలిపారు. బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నారు. -
పట్టాలు తప్పిన లోకల్ రైలు
ముంబై: నగరంలో లోకల్ రైలు ప్రమాదానికి గురికావడంతో మిగతా సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలు మారుతున్నప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో రైలు కోచ్ పూర్తిగా ఓ వైపు ఒరిగి పడిపోయింది. లోయర్ పారెల్, ఎలిఫ్ స్టన్ రోడ్ జంక్షన్ల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో బాంద్రా, చర్చ్ గేట్ల మధ్య ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను నెమ్మదిగా నడుపుతుండగా... ఫాస్ట్ లైన్ల రూట్లలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. కాగా, ప్రమాదానికి గురైన రైలుబోగీలను అక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. -
18 టన్నుల గ్యాస్‌ను 19 గంటల్లో...
బెర్హంపూర్(ఒడిశా): బోల్తా పడిన ట్యాంకర్ నుంచి హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీ) సిబ్బంది లిక్వీఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)ను సురక్షితంగా తరలించారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని ఛత్రపుత్ టౌన్ సమీపంలో శనివారం రాత్రి ఎల్పీజీని తరలిస్తున్న ట్యాంకర్ బొల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే గ్యాస్ లీక్ అయితే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో మూడు ట్యాకర్లలోకి జాగ్రత్తగా పైపుల సహాయంతో తరలించారు. విశాఖపట్నం, జత్నాయికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన టీం 18 టన్నుల గ్యాస్‌ను ట్రాన్స్ఫర్ చేసే మిషన్‌ను 19 గంటల్లో విజయవంతంగా పూర్తి చేశారు. పని పూర్తి అవ్వగానే ఎన్‌హెచ్9 హైవేతోపాటూ, కరెంటు సప్లైని కూడా పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రహదారులు, కరెంటు సప్లైతోపాటూ దగ్గర్లోని స్కూళ్లు, కాలేజీలను మూసివేసిన విషయం తెలిసిందే. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా : ముగ్గురు మృతి
భువనేశ్వర్ : ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం గంజాం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గ్యాస్ ట్యాంకర్ లోని వాయివులు పేలే అవకాశం ఉన్న నేపథ్యంలో కిలోమీటరు మేర నివాసం ఉంటున్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. అనంతరం గ్యాస్ ట్యాంకర్‌ను రహదారిపై నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
స్కూల్ బస్సు బోల్తా : 30 మందికి గాయాలు
-
స్కూల్ బస్సు బోల్తా : 30 మంది విద్యార్థులకు గాయాలు
-
స్కూల్ బస్సు బోల్తా : 30 మంది విద్యార్థులకు గాయాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కాట్పేరి వద్ద శనివారం రాయలసీమ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా... మరికొంతమందిని మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఐదారుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. బస్సును రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రహదారిపై ఎదురుగా వస్తున్న స్కూటర్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు
-
ఇసుక లారీ బోల్తా : ఒకరు మృతి
హైదరాబాద్ : శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై గురువారం ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అతి వేగంగా కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంతో 20 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని కృష్ణగిరి నుంచి కుప్పం వస్తుండగా ఈ బస్సు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: పలువురికి గాయాలు
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం శివారు వెంగముక్కలపాలెం జంక్షన్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం వారిని స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బస్సు ప్రమాదం నేపథ్యంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై బోల్తా పడిన బస్సును పక్కకు తీశారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాటు పడవ బోల్తా: మహిళలు గల్లంతు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మంచంగిపుట్టు మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో సమీపంలో గురువారం నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి... గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం గాలింపు చర్యలు నిలిపివేశారు. గల్లంతైన మహిళల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ట్యాంకర్ బోల్తా: లీకవుతున్న గ్యాస్
-
ట్యాంకర్ బోల్తా: లీకవుతున్న గ్యాస్
విజయనగరం: విజయనగరం పట్టణంలోని ఆర్ అండ్ బీ జంక్షన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో ట్యాంకర్ నుంచి ఎల్పీజీ గ్యాస్ లీకేజీ అవుతుంది. గ్యాస్ లీకవుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతూ... పోలీసులకు సమాచారం అందించిరు. పోలీసులు ఆర్ అండ్ బీ జంక్షన్ వద్దకు చేరుకుని ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకుండా ప్రయత్నాలు చేపట్టారు. అయినా లీకేజీ ఆగడం లేదు. దాంతో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్‌పీసీఎల్ అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. దాంతో హెచ్‌పీసీఎల్ అధికారులు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు సిబ్బందిని హుటాహుటిన విజయనగరం పంపించారు. విశాఖపట్నం నుంచి ట్యాంకర్ రాయ్‌పూర్ వెళ్తుండగా ఆ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకవుతండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆర్ అండ్ బీ జంక్షన్ పరిసర ప్రాంతాలలోని నివాసాల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు.