బోల్తా పడిన ట్యాంకర్ నుంచి హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్పీ) సిబ్బంది లిక్వీఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)ను సురక్షితంగా తరలించారు.
బెర్హంపూర్(ఒడిశా): బోల్తా పడిన ట్యాంకర్ నుంచి హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్పీ) సిబ్బంది లిక్వీఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)ను సురక్షితంగా తరలించారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని ఛత్రపుత్ టౌన్ సమీపంలో శనివారం రాత్రి ఎల్పీజీని తరలిస్తున్న ట్యాంకర్ బొల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే గ్యాస్ లీక్ అయితే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ట్యాంకర్లోని గ్యాస్ను మరో మూడు ట్యాకర్లలోకి జాగ్రత్తగా పైపుల సహాయంతో తరలించారు. విశాఖపట్నం, జత్నాయికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన టీం 18 టన్నుల గ్యాస్ను ట్రాన్స్ఫర్ చేసే మిషన్ను 19 గంటల్లో విజయవంతంగా పూర్తి చేశారు.
పని పూర్తి అవ్వగానే ఎన్హెచ్9 హైవేతోపాటూ, కరెంటు సప్లైని కూడా పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రహదారులు, కరెంటు సప్లైతోపాటూ దగ్గర్లోని స్కూళ్లు, కాలేజీలను మూసివేసిన విషయం తెలిసిందే.