2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. త్వరలో 2025 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి LPG సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరలలో కూడా మార్పులు జరగనున్నాయి.
అమెజాన్ ప్రైమ్
జనవరి 1 నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.
ఈ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
2025 జనవరి 1 నుంచి పాత వెర్షన్స్ అయిన.. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఎస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ, హెచ్‌టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా టీ, ఎల్‌జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, మోటో జీ, మోటో ఈ 2014 వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు.
కార్ల ధరల పెంపు
2025 జనవరి 1 నుంచే కార్ల ధరలు సమంత పెరగనున్నాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి. కార్ల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
థాయిలాండ్ ఈ-వీసా
1 జనవరి 2025 నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్‌సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభమైపోతోంది.
యూఎస్ వీసా నిబంధనల్లో మార్పులు
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. యూఎస్ వీసా నిబంధనల్లో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
LPG సిలిండర్ ధరలు
చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. గత 5 నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
RBI ఫిక్స్‌డ్ డిపాజిట్ నియమాలలో మార్పులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 1 నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు & హెచ్‌ఎఫ్‌సీల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలను మార్చే ప్రక్రియ, లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం, డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి.
యూపీఐ 123 పే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. ఇది స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment