January 1
-
అసలే ఖరీదైన బైకులు.. మరింత పెరగనున్న ధరలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన బైకుల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు 2024 జనవరి 1నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ఏప్రిల్ 2017లో బీఎండబ్ల్యూ ఇండియా అనుబంధ సంస్థగా, తన కార్యకలాపాలను ప్రారంభించిన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ జీ310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ సీఈ 02, బీఎండబ్ల్యూ సీఈ 04 మొదలైనవి ఉన్నాయి.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా బీఎండబ్ల్యూ సీఈ 04 (రూ. 14.90 లక్షలు). ప్రస్తుతం, దేశంలో విక్రయించే అన్ని బీఎండబ్ల్యూ బైక్‌లు, స్కూటర్లు ప్రామాణికంగా 3 సంవత్సరాల, అపరిమిత మైలేజ్ వారంటీతో వస్తున్నాయి. బీఎండబ్ల్యూ ఇండియన్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 27 మోడల్స్ ఉన్నట్లు సమాచారం. వీటి ధరలన్నీ జనవరి 1నుంచి గణనీయంగా పెరుగుతాయి. -
ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. అయితే ఇదెలా పనిచేస్తుంది? ఎలాంటి ఫోన్లలకు సపోర్ట్ చేస్తుందనే మరిన్ని విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఇది వరకు యూపీఐ లావాదేవీలు చేయాలంటే.. తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులోకి రానున్న యూపీఐ 123 పే.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.యూపీఐ 123 పే చెల్లింపులు నాలుగు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఐవీఆర్ నెంబర్స్, మిస్డ్ కాల్స్, ఓఈఎమ్ ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ. అంటే యూజర్ తమ లావాదేవీలను ఈ నాలుగు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇవన్నీ 2025 జనవరి 1 కంటే ముందు అమల్లోకి వచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.యూపీఐ 123 పే కస్టమర్లు బహుళ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండకూడదు. కస్టమర్ మరొక ఖాతాను జోడించాలనుకుంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి.UPI 123PAYతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి?•మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్‌కి కాల్ చేయండి•కాల్ చేసిన తరువాత మీ భాషను ఎంచుకోండి•మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయడానికి ఎంచుకోండి•మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి•యూపీఐ పిన్ సెట్ చేసుకోండి.•పై దశలను పాటిస్తే మీ యూపీఐ 123 పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. -
Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు
పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్ ఈజ్ అజ్’ సంస్థలోని టీనేజ్ పిల్లలే ఈ క్లీనింగ్‌కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు. విందామా వారి మాట? మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్‌కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది! కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే? మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది. ఛేంజ్ ఈజ్ అజ్ ముంబైలో ఎంతలేదన్నా డజన్ అందమైన బీచ్‌లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్‌లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్‌కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్ షా, శుభ్ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్ మీడియా వేదికగా ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్‌ను ప్రారంభించి ముంబైలోని బీచ్‌ల క్లీనింగ్‌కి నడుం కట్టారు. జూలై 2019న మొదటిసారి అక్షత్ షా, శుభ్ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్‌ను క్లీన్ చేయడానికి సోషల్ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్‌ను క్లీన్ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్‌లను క్లీన్ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్‌ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్ షా, శుభ్. ప్రస్తుతం అక్షత్ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. పాతిక వేలమంది వాలంటీర్లు ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్‌ల శుభ్రత గురించి ఛేంజ్ ఈజ్ అజ్ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్‌లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో బీచ్‌లు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్‌ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్‌లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు. -
వాహన ప్రియులకు షాక్.. రేపటి నుంచి అమల్లోకి కొత్త ధరలు!
దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఇప్పటికీ 'ఇయర్ ఎండ్ 2023' ఆఫర్స్ కింది అద్భుతమైన డిస్కౌంట్స్ అందించాయి. ఈ ఆఫర్స్ అన్నీ కూడా దాదాపు ఈ రోజుతో ముగియనున్నాయి. రేపటి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో 2024 జనవరి 1 నుంచే వాహనాల ధరలు పెరుగుతాయని ఇప్పటికే చాలా సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. ఇందులో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు ఉన్నాయి. ఇన్పుట్ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే తెలిపాయి. దీని ప్రకారం ధరల పెరుగుదల 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలు లేదా కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇప్పటికే పలు కంపెనీలు 0.8 శాతం ధరలను ఏప్రిల్ నెలలో పెంచాయి. కాగా ఇప్పుడు మరో సారి పెంచడానికి సన్నద్ధమైపోయాయి. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ప్యాసింజర్ కార్ల ధరలు మాత్రమే కాకుండా.. లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ల ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గుతాయా? లేదా కార్ల విక్రయాను పెంచడానికి కంపెనీలు ఏమైనా వారంటీలు వంటివి అందిస్తాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్‌లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్‌కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
Kanipakam: జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు
యాదమరి(చిత్తూరు జిల్లా): జనవరి 1, 2 తేదీల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. స్వామివారి సమావేశపు మందిరంలో చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు అధ్యక్షతన ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను ఎమ్మెల్యే బాబు మీడియాకు వెల్లడించారు. వేకువజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామన్నారు. 12 గంటల తర్వాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, చిత్తూరు పీలేరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుందని వివరించారు. (క్లిక్ చేయండి: టోకెన్ ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం) -
జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!
జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2022 జనవరి 1 నుంచి భారతదేశంలో తయారు చేసే అన్ని ప్యాసింజర్ కార్లలో తప్పనిసరిగా ముందు వరుస సహ ప్రయాణీకుల కోసం కూడా ఎయిర్ బ్యాగ్ ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. డ్రైవరు పక్కన ఉన్న ప్రయాణీకులకు ఎయిర్ బ్యాగ్ ఇన్ స్టాల్ చేసే గడువు తేదీని మరోసారి పొడగించే అవకాశం లేదు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. జనవరి 1, 2022 నుంచి తయారు చేసే అన్ని ప్యాసింజర్ వేహికల్ మోడల్స్ లలో తప్పనిసరిగా సహ డ్రైవర్ కోసం ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు. ఇంతకు ముందు, ఈ గడువు తేదీని ఆగస్టు 31 నుంచి డిసెంబర్ 31 వరకు వాయిదా వేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల్లో డ్రైవర్ ఎయిర్ బ్యాగులు మాత్రమే తప్పనిసరి. ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాద బాధితుల్లో భారతదేశంలోనే దాదాపు 10 శాతం మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..ఎయిర్ బ్యాగులు, సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందు కూర్చొన్న వారిలో మరణించే వారి శాతం 61 శాతం వరకు తగ్గింది. ఎయిర్ బ్యాగు ఉండటం వల్ల మరణాల శాతం 34 శాతం తగ్గినట్లు ఆ నివేదికలో తేలింది. (చదవండి: భారత్‌లో బిర్యానీతో పాటు ఇది కూడా చాలా ఫేమస్..?) -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
రేపటి నుంచి ఆపరేషన్ స్మైల్
సాక్షి, హైదరాబాద్: వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న చిట్టి చేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగితేవాలన్న సంకల్పంతో చేపడుతోన్న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలను ఇస్తోంది. ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ పేరిట పోలీసులు చేపడుతున్న దాడులు వేలాది మంది చిన్నారులకు విముక్తి కలిగిస్తున్నాయి. ఈసారి దాడుల్లో గుర్తించిన పిల్లల్లో దళిత, గిరిజనులు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టనున్నారు. 2020 మొత్తం వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల పోలీసులకు సూచించారు. చిన్నారుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు.. రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, బాలికల వివరాలను సేకరించి వారి ఫొటోలతో ఆల్బమ్‌ను రూపొందిస్తారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న జంక్షన్లు, చౌరస్తాలను తనిఖీ చేస్తాయి. దీనికిగాను ప్రతీ సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ టీమ్‌లో ఒక మహిళా సిబ్బంది కూడా ఉంటారు. -
అందరి బర్త్‌డేలూ నేడే!
నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా అఫ్గానిస్థాన్‌లో వేలాది మంది ‘జనవరి 1’నే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటో వివరించే కథనం ఇది. కాబూల్: సమద్ అవాదీ ఏటా నూతన సంవత్సరం ప్రారంభమయ్యే జనవరి ఒకటిన పుట్టినరోజు జరుపుకుంటారు. నిజానికి అది ఆయన పుట్టిన తేదీ కానేకాదు. ఒక్క సమద్ ఏంటి.. ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, 32 మంది స్నేహితులూ జనవరి ఒకటినే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. అంతేనా.. అఫ్గానిస్థాన్‌లో ఇలా చేసే వాళ్లు వేలాది మంది ఉన్నారు. ఇందుకు ఒక కారణం ఉంది. వీళ్ల పుట్టిన తేదీ తెలియకపోవడం. జన్మదిన ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ రికార్డులు పుట్టినరోజును నమోదు చేయకపోవడంతో వీళ్లు ‘జనవరి 1’నే ఎంచుకుంటున్నారు. కొందరేమో పండుగలు, ముఖ్యమైన రోజుల ఆధారంగా తమ వయసును లెక్కించుకుంటారు. అన్ని దేశాల మాదిరే అఫ్గాన్‌లోనూ ఫేస్బుక్ విస్తృతి పెరిగింది. ఇందులో చేరాలంటే పుట్టినతేదీని తెలియజేయడం తప్పనిసరి. పాస్‌పోర్టులకు, వీసాలకు దరఖాస్తు చేయాలన్నా పుట్టినతేదీ కావాల్సిందే! అందుకే ‘జనవరి 1’ని మెజారిటీ ప్రజలు ఎంచుకుంటున్నారు. కొంతమందికి నిజంగానే పుట్టినరోజు తెలిసినా ప్రయోజనం ఉండటం లేదు. ఎందుకంటే అఫ్గన్‌లో ఇప్పటికీ ఇస్లామిక్ క్యాలెండర్ ఉపయోగిస్తున్నారు. దాని ప్రకారం ఇప్పుడు 1365వ సంవత్సరం నడుస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్ తేదీని అంగ్ల సంవత్సరంలోకి మార్చడం కష్టం కావడంతో జనవరి 1 తేదీకి ఆదరణ పెరిగింది. ‘నేను 2014లో తొలిసారి ఫేస్బుక్లో చేరారు. పుట్టినరోజుగా జనవరి ఒకటో తేదీని ఎంచుకోవడం సులువయింది. మా దేశంలో ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్ తేదీని అంగ్ల సంవత్సర తేదీకి మార్చడం కష్టం’ అని 43 ఏళ్ల సమద్ వివరించారు. అఫ్గన్ ప్రభుత్వం పౌరులకు జారీ చేసే తజ్కిరా లేదా గుర్తింపుకార్డు కోసం దరఖాస్తుదారుడి ఆకారం, ముఖాన్ని బట్టి వయసును నిర్ధారిస్తారు. ఉదాహరణకు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఒక వ్యక్తి 1365లో పుడితే ఆంగ్లసంవత్సరం ప్రకారం అతని పుట్టినతేదీ 1986 అన్నమాట. ఇది వరకైతే తజ్కిరాలో పుట్టిన తేదీ నమోదుకు స్థలమే ఉండేది కాదు. అందుకే చాలా మంది పుట్టినతేదీ తెలియదు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. బిడ్డ పుట్టిన తరువాత ఆస్పత్రులు జన్మధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. తజ్కిరాలోనూ పుట్టినతేదీ చేర్చి కొత్తగా జారీ చేసే ప్రతిపాదన కూడా ఉంది. అయితే రాజకీయ, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ నిల్చిపోయింది. ఏదో ఒక రోజు తమ ప్రజలందరికీ పుట్టినతేదీలు తెలిసే రోజువస్తుందని సమద్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
హీరో బైక్స్ ధరల పెంపు
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటో కార్ప్ బైక్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా పాషన్, స్ప్లెండర్ మోడల్ కొత్త వాహనాలను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా వాహనాల ధరలను అమాంతం పెంచేసింది. పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. హీరో అన్ని మోడల్స్ ఎక్స్ షో రూం ధరలు పెరగనున్నాయి. జనవరి 1, 2018నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాదాపు మోడల్‌కు రూ.400 పెరగనుంది. బైక్ మోడల్, మార్కెట్ ఆధారంగా ఈ పెంపు ఉంటుందని వివరించింది. కాగా ఈ నేపథ్యంలోనే గురువారం విడుదల చేసి పాషన్ ప్రో, ఎక్స్ ప్రో, స్ల్పెండర్ ధరలను రివీల్ చేయలేదు. -
మరో ఆధార్ నిర్వాకం: గ్రామస్తుల గగ్గోలు
ఆధార్ కార్డ్ జారీలో జరిగిన నిర్వాకం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు ఆధార్ కార్డ్ గోప్యతపై అందోళనలు కొనసాగుతుండగానే ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఒకే గ్రామంలోని 800 మందికి ఒకే పుట్టిన తేదీతో ఆధార్ కార్డ్ జారీ కావడంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామ ప్రజలకు ఇటీవల జారీ చేసిన కొత్త ఆధార్ కార్డుల్లో 8వందలమందికిపైగా గ్రామస్తులకు పుట్టిన రోజు జనవరి 1 అని నమోదైంది. ఈ వ్యవహారంపై గ్రామస్తులు మండిపడితున్నారు. ఆధార్ కార్డ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందుతామని అధికారులు చెప్పారు. కానీ దీంట్లో ప్రత్యేకమైనది ఏమిటి? అని అల్ఫాదీన్ ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయిన నేపథ్యంలో తాజా వివాదంతో వాటిని నష్టపోతామని గ్రామస్తులు భయపడుతున్నారని డిప్యూటీ గ్రామ పంచాయితీ అధికారి మొహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు. అయితే ఈ తప్పిదాన్ని గుర్తించడానికి నిరాకరించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇది సాంకేతిక తప్పిదమని చెబుతోంది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చింది. అలాగే పుట్టిన తేదీ తెలిసిన వారు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని అందుబాటులో ఉన్నఆధార్ కేంద్రాల ద్వారా అప్డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై హరిద్వార్ డివిజినల్ మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందనీ, కారణాలపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ఆగస్టులో కూడా ఆగ్రా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. గ్రామంలోని అందరి డేట్ఆఫ్బర్త్ జనవరి 1గా నమోదైందని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. కాగా ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ కచ్చితంగా తెలియనివారి వారి పుట్టినతేదీ జనవరి 1గా నమోదవుతుందని మేలో యూఐడీఏఐ ప్రకటించడం గమనార్హం. -
10వేలమంది జనవరి 1నే పుట్టారట...
అలహాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని వారంతా జనవరి 1వ తేదీనే పుట్టారట. అమ్మ, నాన్న, తాత, అమ్ముమ్మ, నానమ్మ, అత్త, మామయ్యలు, పిన్ని, బాబాయ్, పిల్లలు పక్కింటి వాళ్లు, ఎదురింటివాళ్లు... ఇలా ఒకరేంటి..అందరూ ఒకేరోజు పుట్టారు. అదెలా సాధ్యమనుకుంటున్నారా?. కంజాసా గ్రామస్తులంతా తాము పుట్టింది జనవరిలోనే అని .. ఆధార్ కార్డులో నమోదు చేసుకోవడమే. సుమారు పదివేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలోని వారంతా తామంతా పుట్టింది జనవరి ఒకటో తేదీ అని పేర్కొనటం విశేషం. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, పలు పనులకు ఆథార్ కార్డును అనుసంథానం చేయడంతో, కార్డు పొందటానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో వీరంతా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు... విద్యార్థుల ఆధార్ కార్డు సంఖ్యను నమోదు చేయడానికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా యూపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై గ్రామ పెద్ద రామ్ డులారి మాట్లాడుతూ ‘తాము ఆధార్ కార్డు నమోదు సందర్భంగా జనన తేదీపై తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ లోపాన్ని సరిదిద్దుతామని, గ్రామస్తులందరికీ కొత్త ఆధార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. -
డెబిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: డెబిట్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై ఎండిఆర్ చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎండిఆర్ రద్దుతో బ్యాంకులపై పడే భారాన్ని భర్తీ చేయనున్నట్టు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. జనవరి 1 నుంచి ఉన్న ఈ బకాయిలను బ్యాంకులకు రీఇంబర్స్ చేయనున్నట్టు తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకాన్నిఅమలు చేసే దిశగా జనవరి 1, 2017 నుంచి డెబిట్ కార్డుల మీద టాక్స్ అండ్ నాన్ టాక్స్ బకాయిలను ఆయా బ్యాంకులకు చెల్లించనున్నట్టు సెంట్రల్ బ్యాంకు ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకులు ఎండీఆర్ బకాయిల కోసం త్రైమాసిక ప్రాతిపదికన చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్ తోపాటు ఆర్బిఐ నాగ్‌పూర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరింది. అలాగే రూ. ఒక లక్షలోపు లావాదేవీలపై చెల్లింపుదారునుండి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని బ్యాంకులు సర్టిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ బకాయి ల చెల్లింపుల కోసం ఏప్రిల్30 లోగా ఆర్బీఐలో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ లో కోరింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. సంవత్సర కాలానికి గాను రూ.లక్ష నుంచి 2లక్షల వరకు బంగారంపై రుణాలను తీసుకోవచ్చు. కాగా గత ఏడాది డిశెంబర్ లో డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. డీమానిటైజేషన్ అనంతరం డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహాన్నందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
జనవరి 1నుంచి ప్లాస్టిక్ కప్పుల నిషేధం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఎన్సీఆర్ పరిధిలో డిస్పోజబుల్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా పచారీ సరుకుల్లో వినియోగించే ప్లాస్టిక్, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకాన్ని బ్యాన్ చేసింది. ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. వ్యర్థాల తగ్గింపు, వ్యర్థాల వినియోగం కోసం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎన్సీటీ సహా ఇతర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీలో ఆందోళనకరంగా మారుతున్న వాయుకాలుష్యం, కప్పివేస్తున్న పొగమంచు పరిస్థితులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిపట్ల ఇటీవల ఎన్ జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
జనవరి1ని సెలవుదినంగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆంధ్రలో టీడీపీ సర్కార్‌కు క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జనవరి 1వ తేదీని (నూతన సంవత్సరం రోజు) ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ అధ్యక్షుడు సి.ఎ.డానియేలు ఆడమ్స్ డిమాండ్ చేశారు. ఇఫ్తార్ విందు మాదిరిగానే క్రైస్తవులకు క్రిస్మస్ విందు ఇవ్వాలని గతంలో సీఎంను కలసి కోరగా సానుకూలంగా స్పం దించి, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. క్రిస్మస్ ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు మంజూరు చేయాలని కోరారు.