
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటో కార్ప్ బైక్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా పాషన్, స్ప్లెండర్ మోడల్ కొత్త వాహనాలను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా వాహనాల ధరలను అమాంతం పెంచేసింది. పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.
హీరో అన్ని మోడల్స్ ఎక్స్ షో రూం ధరలు పెరగనున్నాయి. జనవరి 1, 2018నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాదాపు మోడల్‌కు రూ.400 పెరగనుంది. బైక్ మోడల్, మార‍్కెట్ ఆధారంగా ఈ పెంపు ఉంటుందని వివరించింది. కాగా ఈ నేపథ్యంలోనే గురువారం విడుదల చేసి పాషన్ ప్రో, ఎక్స్ ప్రో, స్ల్పెండర్ ధరలను రివీల్ చేయలేదు.