Hero moto Corp.
-
భారీగా పెరిగిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ విడా వీ1 ప్రో ధరను దాదాపు రూ.6000 పెంచినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 1 నుంచి ఫేమ్-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో విడా వీ1 ప్రో ధరను పెంచినట్లు తెలుస్తోంది. దీంతో, తాజాగా పెరిగిన ధరతో ఫేమ్-2 రాయితీ, పోర్టబుల్ ఛార్జర్ కలుపుకుని విడా వీ1 ప్రో స్కూటర్ రూ.1,45,900కు లభించనుంది. పాత ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.6000 ఎక్కువ. అయితే,పెరిగిన ధరలపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్రం ఫేమ్2 పథకాన్ని అమలు చేసింది. ఈ స్కీంలో ఈవీ స్కూటర్లపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై ప్రోత్సాహకాలు 40 శాతం అందించేది. జూన్ 1 నుంచి వాటిని 15 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో వాహనాల తయారీ సంస్థలు ధరల్ని పెంచడం అనివార్యమైంది. కాగా, ఫేమ్-2 కింద తయారీ సంస్థలకు కేంద్రం ఇచ్చే ప్రోత్సహకాల్లో యూనిట్‌కు దాదాపు రూ. 32,000 సబ్సిడీ తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 భారత పర్యటనలో చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్.. ఆయన ఎందుకొస్తున్నారంటే? -
వావ్ అనిపించే ఫీచర్లతో హీరో కొత్త బైక్.. స్టైలిష్ లుక్‌తో అదరగొడుతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే లుక్‌తో ఓ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్‌పల్స్ 200టీ మోడల్లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర ముంబై ఎక్స్‌షోరూంలో రూ.1.25 లక్షలు. కొత్తగా మార్కెటలోకి తీసుకువచ్చిన ఈ అప్డేటెడ్ వెర్షన్లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్‌పీ, 17.3 ఎన్ఎం టార్క్‌తో రాబోతోంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ యాడ్ చేశారు. ఈ బైక్‌లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకున్న వారు కంపెనీ వెబ్సైట్లోకి రూ. 2,500తో ఈ బైక్‌ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్‌తో ఫుల్ డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్, యూఎస్బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లను జోడించారు. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
‘హీరో’ ఆఖరికి నువ్వు కూడా ఇంతేనా?!
దేశమంతటా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు సైతం రాయితీలు, ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నాయి. అంతా బాగానే ఉన్నా.. ప్రముఖ కంపెనీల నుంచి మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు రావడం లేదు. ముఖ్యంగా టూవీలర్ సెగ్మెంట్లో ఈ సమస్య ఉంది. ఇప్పటికే టీవీఎస్, బజాజ్, ఓలాలు మార్కెట్లోకి వచ్చినా అందరి చూపు దేశీ టూ వీలర్ రారాజు హీరో మోటార్ కార్ప్ నుంచి రాబోతున్న విడా ఎలక్ట్రిక్ స్కూటర్ మీదనే ఉంది. ఫస్ట్‌లుక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌కి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హీరో సంస్థ విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి తేబోతున్నట్టు గతేడాది ప్రకటించింది. హీరో పదో వార్షికోత్సవం సందర్భంగా పవన్ ముంజాల్ విడా పక్కన నిల్చుని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అంచనాలను రెట్టింపు చేశారు. ముందుగా జులై హీరో విడాకు సంబంధించి ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ స్కూటర్ వస్తుందా? ఎప్పుడు సొంతం చేసుకుందామా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. చివరకు 2022 జులైలో ఈ స్కూటర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ఫీలర్ వదిలింది హీరో. ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్లో తిరుగులేని హీరో నుంచి ప్రకటన పట్ల పోటీ సంస్థలు ఆసక్తి చూపించాయి. సారీ ఫ్యాన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పెట్టుకున్న ఆశలపై చివరకు నీళ్లు గుమ్మరించింది హీరో మోటార్ కార్ప్. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయని చెబుతూ 2022 జులైలో హీరో విడా రావడం లేదంటూ ప్రకటించింది. నిరాశ పరచం స్కూటర్ తయారీలో ఉపయోగించే కాంపోనెంట్స్ కొరత కారణంగా సకాలంలో విడా మార్కెట్లోకి రావడం లేదంటూ హీరో మోటార్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ కస్బేకర్ ప్రకటించారు. ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా విడాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయబోమంటూ తెలిపారు. చదవండి: బిజినెస్ ‘బాహుబలి’ భవీశ్ -
భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు
ముంబై: లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపుతో ఏప్రిల్‌లో మోటార్ సైకిల్, స్కూటర్ విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. రెండో దశలో విజృంభిస్తున్న కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌లో స్థానిక లాక్డౌన్లను విధించాయి. దీంతో వాహనాల ఉత్పత్తి నెమ్మదించింది. సరఫరా అవాంతరాలు నెలకొని అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దేశవ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ విధింపుతో గతేడాది ఏప్రిల్‌లో వాహన కంపెనీలేవీ విక్రయాలు జరపలేదు. అందువల్ల నాటి అమ్మకాలతో ఈ ఏప్రిల్ విక్రయాలను పోల్చిచూడలేమని ద్విచక్ర వాహన కంపెనీలు చెప్పుకొచ్చాయి. కావున ఈ ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చిచూడగా.., టూ-వీలర్స్ మార్కెట్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఏప్రిల్‌లో మొత్తం 3.72 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ మార్చిలో అమ్మిన 5.76 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. గత మార్చిలో 4.11 లక్షల వాహనాలకు విక్రయించిన హోండా మోటార్ సైకిల్ ఇండియా ఈ ఏప్రిల్‌లో 2.83 లక్షల యూనిట్లుకు పరిమితమైంది. అంటే మాస ప్రాతిపదికన 31 శాతం క్షీణత కనబరిచినట్లైంది. ఇదే ఏప్రిల్‌లో బజాజ్ ఆటో 1.34 లక్షల యూనిట్లను విక్రయించగా, మార్చిలో 3.88 లక్షల వాహనాలకు అమ్మింది. చదవండి: స్థానిక లాక్డౌన్లతో 70 లక్షలకు పైగా ఉద్యోగాల కోత -
ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి కారు, ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకు ధరలు, వస్తువుల ఖర్చులు పెరగడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల పెరుగుదల వల్ల ఇప్పటికే జనవరిలోనే వాహనాల ధరలు పెరిగాయి. కేవలం స్వల్ప సమయంలోనే రెండో సారి ధరలు పెరగనున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే వివిధ మోడల్స్, వేరియంట్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన వాహనా తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని మారుతి సుజుకి పేర్కొంది. అందువల్ల, ఏప్రిల్‌లో కస్టమర్ల మీద అదనపు భారం పడే అవకాశం ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కూడా కొత్త ఎస్‌యూవీల ధరలను పెంచాలని నిర్ణయించింది. నిస్సాన్, డాట్సన్ సిరీస్‌లోని వివిధ వేరియంట్ల ధరలను విడివిడిగా పెంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా వాహనాల ధరలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే ధరల పెరుగుదల గురించి సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా ఇంధన, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలపై భారం పడుతోంది. డీజిల్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కంపెనీలు రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు పెరిగాయి. ఈ కారణాల వల్ల బైక్ కంపెనీ ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నాయి. ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అలాగే ప్రీమియం బైక్స్‌పై కూడా ఈ ప్రభావం పడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 కొత్త వేరియంట్ ధరలు 2 శాతం పెరిగాయి. చదవండి: వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
కంటిన్యూ అవుతాం: హార్లీ డేవిడ్సన్
న్యూఢిల్లీ, సాక్షి: లగ్జరీ బైకులను ఇష్టపడేవారికి శుభవార్త! హార్లీ డేవిడ్సన్ దేశీయంగా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. వెరసి 2021 జనవరి నుంచి అమ్మకాలు, విడిభాగాలు, సర్వీసులు తదితరాలను ఎప్పటిలాగే అందించనున్నట్లు తెలియజేసింది. సుమారు రెండు నెలల క్రితం డిసెంబర్‌కల్లా దేశీ మార్కెట్ల నుంచి వైదొలగనున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం విదితమే. దేశీయంగా తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు సెప్టెంబర్ చివరి వారంలో కంపెనీ తెలియజేసింది. కాగా.. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు.. ఇతర బిజినెస్‌లను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. హీరో మోటోతో జత దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో ఇప్పటికే హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యం, పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల విక్రయాలు, సర్వీసింగ్ బాధ్యతలను హీరో మోటో నిర్వహించనుంది. అంతేకాకుండా విడిభాగాలు, కంపెనీ సంబంధ యాక్సెసరీస్, దుస్తులు తదితరాల అమ్మకాలను సైతం చేపట్టనుంది. హీరో మోటోతో ఒప్పందం ప్రకారం కొత్త మోడళ్లను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు హీరో మోటో, హార్లీ డేవిడ్సన్కుగల డీలర్షిప్ నెట్‌వర్క్‌ను రెండు కంపెనీలూ వినియోగించుకోనున్నాయి. ప్రణాళికలో మార్పులు ప్రస్తుతం దేశీ మార్కెట్లకు సంబంధించి బిజినెస్ మోడల్ ప్రణాళికలను సవరించుకున్నట్లు హార్లీ డేవిడ్సన్ ఇండియా, వర్ధమాన మార్కెట్ల ఎండీ సంజీవ్ రాజశేఖరన్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప్‌తో కలసి ప్రయాణించనున్నట్లు పేర్కొన్నారు. తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు హీరో మోటోతో కలసి కృషి చేయనున్నట్లు తెలియజేశారు. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు ఈ అంశాలపై జనవరి నుంచి అప్డేట్స్ను అందించనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ దేశీయంగా హార్లీ ఓనర్స్ గ్రూప్(హెచ్‌వోజీ) కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్లు డిసెంబర్‌వరకూ కొనసాగుతారని.. తదుపరి కొత్త డీలర్‌షిప్స్‌ను ప్రకటించగలమని పేర్కొన్నారు. డీలర్ల అసంతృప్తి దేశవ్యాప్తంగా హార్లీ డేవిడ్సన్కు 33 ప్రత్యేక డీలర్షిప్స్ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. హార్లీ డేవిడ్సన్ దేశీయంగా కార్యకలాపాల నిలిపివేతకు నిర్ణయించుకున్న నేపథ్యంలో డీలర్లకు చెల్లించనున్న నష్టపరిహారం మరీ తక్కువగా ఉన్నట్లు పలువురు డీలర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశాయి. డీలర్షిప్స్పై వెచ్చించిన పెట్టుబడులతో పోలిస్తే తాము భారీగా నష్టపోయే అవకాశమున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో కొంతమంది డీలర్లు ఏజెడ్‌బీ అండ్ పార్టనర్స్‌ను న్యాయ సలహాల కోసం ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం! -
హీరోమోటో కొత్త బై బ్యాక్ స్కీం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన వినియోగదారుల కోసం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. స్కూటర్ కొనుగోలుదారుల కోసంబైస్యూరెన్స్ పేరుతో ఇప్పటికే పుణే మార్కెట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని కంపెనీ తాజాగా ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, కొత్త హీరో స్కూటర్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కు ఒక గ్యారంటీడ్ బై బ్యాక్ సర్టిఫికెట్ ఇస్తుంది. టూవీలర్ బ్రాండ్ క్రెడర్ ద్వారా ఈ సర్టిఫికెట్‌ను అందిస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఆరునెలల్లో వ్యవధిలో ఈ బై బ్యాక్‌ను ఆఫర్ చేస్తుంది. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటి సారని హీరో మోటో కార్ప్ హెడ్ (అమ్మకాలు మరియు సేల్స్ తర్వాత) సంజయ్ భన్ చెప్పారు. దీని ద్వారా హీరో మోటో కార్ప్ వినియోగదారులకు రీ సేల్‌పై భరోసా లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రణాళిక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలోనే దేశంలో టాప్ 10 మార్కెట్లలో కూడా కలిస్తామన్నారు. -
హీరో ఎక్స్ట్రీమ్ 200 ఆర్ బైక్ ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు, దేశీయదిగ్గజం హీరో మోటోకార్ప్ తన కొత్త ప్రీమియం మోటార్ సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది. 200 సీసీ విభాగంలో ఈ కొత్త బైకును లాంచ్ చేసింది . ఇప్పటికే 150 సీసీ విభాగంలో విజయవంతమైన ఎక్స్ట్రీమ్ మోడల్‌ను 200సీసీ విభాగంలో కూడా ప్రవేశపెట్టనుంది. యంగ్ కస్టమర్లే లక్ష్యంగా రూపొందంచిన ఈ బైక్ 2018, ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా నాన్ ఏబీస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఏబీస్ ఆప్లన్లలో ఇది లభించనుంది. ధర వివరాలను కూడా అప్పుడే రివీల్ చేయనుంది. కొత్త ఎక్స్ట్రీమ్ 200ఆర్‌లో సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 8500 ఆర్పీఎం వద్ద 18.4 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. డిజిటల్ అనలాగ్ కన్సోల్, 5స్పీడ్ గేర్‌బాక్స్ సిస్టం, ఫ్రంట్‌లో 37ఎంఎం టేలీస్కోపిక్ ఫోర్కులు వెనుక 7 ఇంచెస్ మెనోషాక్ సస్పెన్షన్, 17 అంగుళాల స్పోర్టి అల్లాయ్ వీల్స్,ఎల్ఈడీ పైలట్ ల్యాంప్స్ వెనక 130/70 రేడియల్ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఈ బైక్‌లో ఉన్న బ్యాలెన్సర్ షిఫ్ట్ కారణంగా వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయనీ, ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపటానికి వీలుగా ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు హీరో పేర్కొంది. కాగా ఇది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. -
హీరో బైక్స్ ధరల పెంపు
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటో కార్ప్ బైక్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా పాషన్, స్ప్లెండర్ మోడల్ కొత్త వాహనాలను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా వాహనాల ధరలను అమాంతం పెంచేసింది. పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. హీరో అన్ని మోడల్స్ ఎక్స్ షో రూం ధరలు పెరగనున్నాయి. జనవరి 1, 2018నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాదాపు మోడల్‌కు రూ.400 పెరగనుంది. బైక్ మోడల్, మార్కెట్ ఆధారంగా ఈ పెంపు ఉంటుందని వివరించింది. కాగా ఈ నేపథ్యంలోనే గురువారం విడుదల చేసి పాషన్ ప్రో, ఎక్స్ ప్రో, స్ల్పెండర్ ధరలను రివీల్ చేయలేదు. -
హీరో కొత్త బైక్స్, కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: హీరో మోటార్ కార్ప్ కొత్త మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. పాషన్ ప్రో, పాషన్ ఎక్స్ ప్రో, సూపర్ స్ల్పెండర్ పేరుతో మూడు బైక్స్‌ను విడుదల చేసింది. ఐ3ఎస్ టెక్నాలజీతో అప్డేటెడ్ వెర్షన్‌గా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే జనవరి 2018లో వీటి ధరను ప్రకటించనున్నట్లు హీరో మోటో వెల్లడించింది. సూపర్ స్ల్పెండర్‌ను 125 సీసీ ఇంజిన్, పాషన్ ప్రో, పాషన్ ఎక్స్ ప్రో మోడల్స్‌లో 110 సీసీ ఇంజిన్‌ను పొందుపర్చింది. దీని ఇంజిన్ 7500 ఆర్పీఎంవద్ద 8.4 పీఎస్ పవర్‌ను, 11ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. సూపర్ స్ల్పెండర్లో ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్, ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, వైడర్ రియర్ టైర్, సీటు కింద ఎక్కువ ప్లేస్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. పాషన్ ప్రో, ఎక్స్ ప్రోలో ఆటోమ్యాటిక్ హెడ్ ల్యాంప్‌తోపాటు ఫ్యూయల్ లెవల్, ట్రిప్ మీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తదితర వివరాలు అందించేలా డిజిటల్ అన్‌లాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపర్చింది. అయితే పాషన్ ప్రోతో పోలిస్తే ఎక్స్ ప్రోను స్టయిలిష్‌గా తీర్చిదిద్దింది. స్కల్ప్డ్ ఫ్యూయల్ ఇంధన ట్యాంక్, డబుల్ టోన్ రియర్ మిర్రర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ అమర్చింది. -
హీరో గ్లోబల్ రికార్డ్
హైదరాబాద్: దేశీ దిగ్గజ టూవీలర్ కంపెనీ ‘హీరో మోటొకార్ప్’.. ధంతెరాస్ రోజు (అక్టోబర్ 17) ఏకంగా 3 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. ఇది అంతర్జాతీయ రికార్డ్. ‘కేవలం ఒకరోజులోనే 3 లక్షలకుపైగా వాహనాలను విక్రయించాం. ప్రపంచంలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించాం’ అని హీరో మోటొకార్ప్ పేర్కొంది. ఈ పండుగ సీజన్ తమకు బ్లాక్‌బ్లాస్టర్ జ్ఞాపకాలను మిగిల్చిందని తెలిపింది. సెప్టెంబర్ నెలలో 7 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొంది. నెలవారీ అమ్మకాల్లో ఇవే ఇప్పటి వరకు అత్యుత్తమ గణాంకాలని తెలిపింది. రెండో త్రైమాసికంలో 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించామని పేర్కొంది. కంపెనీ ఏర్పాటు నుంచి చూస్తే 7.5 కోట్లకుపైగా యూనిట్లను విక్రయించామని తెలిపింది. -
హీరోమోటొకార్ప్ కొత్త చైర్మన్ పవన్ ముంజాల్
చైర్మన్ ఎమెరిటస్‌గా బ్రిజ్‌మోహన్‌లాల్ న్యూఢిల్లీ: హీరోమోటొకార్ప్ కొత్త చైర్మన్‌గా పవన్ కుమార్ ముంజాల్ నియమితులయ్యారు. ఈ కంపెనీ 1984లో ఏర్పాటైనప్పటి (హోండాతో జాయింట్ వెంచర్) నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న 92 ఏళ్ల బ్రిజ్మోహన్ లాల్ స్థానంలో చైర్మన్‌గా ముంజాల్ నియామకాన్ని కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తనని పదవీ బాధ్యతల నుంచి తప్పించాలన్న బ్రిజ్‌మోహన్‌లాల్ విన్నపాన్ని డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించింది. అయితే చైర్మన్ ఎమెరిటస్‌గా తమకు మార్గదర్శిగా, మెంటార్‌గా వ్యవహరించాలని ఆయనను బోర్డు కోరింది. ఇక పవన్ ముంజాల్ కంపెనీకి సీఎండీగా, సీఈఓగా వ్యవహరిస్తారు. బ్రిజ్‌మోహన్‌లాల్ కంపెనీకి చైర్మన్ ఎమెరిటస్‌గా, డెరైక్టర్ల బోర్డ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తారు. గతేడాది హీరోమోటో 66.3 లక్షల వాహనాలను విక్రయించింది. కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక అమ్మకాలు.