సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు, దేశీయదిగ్గజం హీరో మోటోకార్ప్ తన కొత్త ప్రీమియం మోటార్ సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది. 200 సీసీ విభాగంలో ఈ కొత్త బైకును లాంచ్ చేసింది . ఇప్పటికే 150 సీసీ విభాగంలో విజయవంతమైన ఎక్స్‌ట్రీమ్ మోడల్‌ను 200సీసీ విభాగంలో కూడా ప్రవేశపెట్టనుంది. యంగ్ కస్టమర్లే లక్ష్యంగా రూపొందంచిన ఈ బైక్ 2018, ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ‍్యంగా నాన్ ఏబీస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఏబీస్ ఆప్లన్లలో ఇది లభించనుంది. ధర వివరాలను కూడా అప్పుడే రివీల్ చేయనుంది.
కొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్‌లో సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 8500 ఆర్‌పీఎం వద్ద 18.4 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. డిజిటల్ అనలాగ్ కన్సోల్, 5స్పీడ్ గేర్బాక్స్ సిస్టం, ఫ్రంట్‌లో 37ఎంఎం టేలీస్కోపిక్ ఫోర్కులు వెనుక 7 ఇంచెస్ మెనోషాక్ సస్పెన్షన్, 17 అంగుళాల స్పోర్టి అల్లాయ్ వీల్స్,ఎల్‌ఈడీ పైలట్ ల్యాంప్స్ వెనక 130/70 రేడియల్ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఈ బైక్‌లో ఉన్న బ్యాలెన్సర్ షిఫ్ట్ కారణంగా వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయనీ, ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపటానికి వీలుగా ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు హీరో పేర్కొంది. కాగా ఇది టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ, బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment