unveiled
-
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు -
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం(డిసెంబర్ 9) సాయంత్రం ఆరు గంటలకు అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో 20 అడుగుల తెలంగాణతల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో వరి,జొన్న, సజ్జ ధాన్యాలతో విగ్రహాన్ని రూపొందించారు.తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టం: సీఎం రేవంత్మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణతల్లి4 కోట్ల ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిఉద్యమ సమయంలో టీజీని యువకులు తమ గుండెలపై రాసుకున్నారుబీఆర్ఎస్ టీజీ అని కాకుండా టీఎస్ అని మార్చింది.తమ కుటుంబం కోసమే గత ప్రభుత్వం ఆలోచించిందిఈరోజు తెలంగాణతల్లి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన అదృష్టంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్చను: భట్టి విక్రమార్కగత ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందిరూ.7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నాం ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నాంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛను మాత్రమే -
‘మైన్ అండ్ యువర్స్’ వెడ్డింగ్ షో తళుక్కుమన్న తారలు (ఫోటోలు)
-
వందేభారత్ స్లీపర్ కోచ్ వచ్చేసింది..విశేషాలివే..
బెంగళూరు: ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్ఎల్) తయారీ కర్మాగారంలో వీటిని ప్రారంభించారు. బీఈఎమ్‌ఎల్‌లో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి ఆదివారం(సెప్టెంబరు1) శంకుస్థాపన చేశారు. First visual of the #VandeBharatSleeper is here!Union Minister @AshwiniVaishnaw unveiled the prototype version of #VandeBharat sleeper coach today.#VandeBharatTrain Credit: @DDNewslive@RailMinIndia @Murugan_MoS @PIB_India pic.twitter.com/TbTew5TJLN— Ministry of Information and Broadcasting (@MIB_India) September 1, 2024ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ కోసం చాలా శ్రమించామని చెప్పారు.వందేభారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ ఇప్పుడే పూర్తయిందన్నారు. పది రోజుల పాటు వీటికి కఠినమైన ట్రయల్స్, టెస్ట్‌లు నిర్వహించనున్నామని తెలిపారు. మూడు నెలల్లో ప్రయాణికులకు ఈ కోచ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.The Vande Bharat sleeper train will have 24 coaches and will reach Chennai from Bangalore on September 20 for final testing. 🚄🏁#VandeBharat #vandebharatsleeper pic.twitter.com/5zgFAsQNqE— MAYA ✍🏻 (@Maya_Lokam_) August 24, 2024 వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే...కోచ్‌లలో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్లెట్లు, స్నాక్ టేబుల్, మొబైల్, మ్యాగజైన్ హోల్టర్స్ ఉంటాయి.India's first Vande Bharat prototype sleeper train unveiled in Bengaluru. Excited to Travel in Vande Bharat Sleeper 😍#IndianRailways #VandeBharatExpress #VandeBharatSleeper pic.twitter.com/8n6dcmFXyE— Shiwangi Thakur (@ShiwangiThakurX) September 1, 2024రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్’ వ్యవస్థ ఉంటుంది.అన్ని కోచ్‌లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో నిర్మించారు. లోపల జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.కోచ్‌లన్నీ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్లు ఇందులో అమర్చారు.16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో స్లీపర్ ట్రైన్ రానుంది. వీటిలో పదకొండు 3టైర్ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు), నాలుగు 2 టైర్ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్(24 బెర్త్‌లు) ఉంటాయి. #WATCH : First Look of Vande Bharat Trains Sleeper Version.#VandeBharat #VandeBharatExpress #VandeBharatSleeper #India #latest #LatestUpdate pic.twitter.com/1Vt7Zmjo1g— upuknews (@upuknews1) October 2, 2023 -
'సెల్-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి...
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ వర్షిణి గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా సందడి చేశారు. షావోమీ ఆధ్వర్యంలోని సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ మోడల్‌ను నటి వర్షణి గురువారం ఆవిష్కరించారు.ఎప్పటికప్పుడు మారిపోతున్న సాంకేతికత అధునాతన జివన విధానానికి చేరువ చేస్తుందని ఆమె అన్నారు. వినూత్న ఫీచర్స్‌తో రూపొందించిన ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించడం సంతోషమన్నారు. తెలంగాణ కస్టమర్లకు అధునాతన ఉత్పత్తులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని సెల్ బే వ్యవస్థాపకులు, ఎండీ సోమా నాగరాజు పేర్కొన్నారు.ఇండియా డిప్యూటీ హెడ్ కునాల్ అగర్వాల్, ఛానల్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జున రావు, ట్రేడ్ ఛానల్ హెడ్ సాజు రత్నం, జోనల్ హెడ్ సయ్యద్ అన్వర్, నేషనల్ రిటైల్ ఎండీ మొహమ్మద్ ఇఫ్తేకర్ పాల్గొన్నారు.ఇవి చదవండి: బే విండోకు.. డిజైన్ ఎక్స్‌లెన్స్! -
బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో షకీరా విగ్రహం ఆవిష్కరణ
గ్రామీ అవార్డు విజేత సింగర్ షకీరా బెల్లి డ్యాన్స్‌కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు! తన బెల్లి డ్యాన్స్‌తో అభిమానుల ప్రేమను కొల్లగొట్టిన ఈ కొలంబీయన్ సింగర్ క్యాంసం విగ్రహన్ని ఆమె సొంత సిటీ బారన్క్విల్లాలో ఆవిష్కరించారు. బెల్లీ డ్యాన్స్ పోజ్‌లో ఉన్న 6.5 మీటర్లు (21 అడుగుల) విగ్రహాన్ని బారన్క్విల్లా మేయర్ జైమ్ పుమారెజో, ఆమె తల్లిదండ్రుల సమక్షంలో నగరంలోని మాగ్డలీనా నది తీరంలో మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కాంస్య విగ్రహంలో షకీరా.. పొడవాటి రింగుల జుట్టుతో చేతులు పైకి ఎత్తి బెల్లి డ్యాన్స్ చేస్తున్న పోజ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహ రూప శిల్పి అయిన యినో మార్క్వెజ్ మాట్లాడుతూ..‘అమ్మాయిలు తమ జీవితంలో ఎటువంటి కలలు కంటారో. వాటిని ఎలా సాధిస్తారో షకీరా కాంస్య విగ్రహం ద్యారా తెలుస్తుంది’ అని తెలిపారు. స్థానిక పిల్లలకు సంబంధించి పలు పాటల కాన్సెర్టుల్లో షకీరాను చూశానని మేయర్ జైమ్ పుమారెజో తెలిపారు. షకీరా 2023లో మూడు లాటిన్ గ్రామీ అవార్డులు గెలుపొందారు. oh shakira, don't end the liberty statue like that pic.twitter.com/6w5a5HUaAw — alexander AG7 ERA (@grandesrockwell) December 26, 2023 మరోవైపు ఆమె ‘పైస్ డెస్కాల్జోస్’, ‘బేర్ ఫుట్’ అనే సంస్థల ద్వారా పిల్లల కోసం స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షకీరా మియామిలో ఉంటోంది. తన కాంస్య విగ్రహం ఆవిష్కరణపై మేయర్ కార్యాలయానికి ఆమె ఓ సందేశం పంపారు. ‘నా కాంస్యం విగ్రహం ఆవిష్కరించం పట్ల చాలా గొప్పగా భావిస్తున్న. ‘బారన్క్విల్లా’ సీటీ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సిటీ నాకు సొంత ఇల్లుతో సమానం’ అని షకీరా తెలిపారు. -
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్‌హాసన్.. కృష్ణ–మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్‌హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్‌బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్‌కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్‌బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
సీతమ్మకొండపై హర్ శిఖర్ తిరంగా
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ పాంగి బేస్ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్ శిఖర్ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీతమ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగాను అక్టోబర్ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ అధిరోహకుడు ఆనంద్‌కుమార్, టూరిజం అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్ రెహమాన్ గీతం అదుర్స్
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్హౌస్లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్‌స్కేప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్ షోరూమ్) ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్ విభాగాలు) రాజేశ్ జెజూరికర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్‌ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు జెజూరికర్ వివరించారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్) థార్.ఈ, గ్లోబల్ పికప్ ఆవిష్కరణ.. ఫ్యూచర్‌స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘థార్.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్‌తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ పికప్ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్‌లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ (ఎంఈఏఎల్)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపర్చారు. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) -
కేంద్రం నిధులపై లెక్కలు రాయాలి
మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రజలందరూ లెక్కలు రాసి వాటిని అవసరమైనప్పుడు చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేజ్–2 కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఆదివారం ఆమె మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొ. జయశంకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం ఖర్చు చేసిన నిధులపై లెక్కలు రాసి రాష్ట్ర సాధన ఉద్యమాల సమయంలో ప్రజలకు నాయకుల ద్వారా వివరించారన్నారు. ఆయన రాసిన లెక్కల ద్వారానే తెలంగాణ ఎంత అన్యాయం జరిగింది ప్రజలకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మోసం చేస్తున్న వారిని పక్కాగా గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటో తమకు అర్థంకావడం లేదని అన్నారు. అలుపెరగని యోధుడు జయశంకర్.. అలుపెరగని యోధుడు జయశంకర్ అని ఆమె పేర్కొన్నారు. జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశాడన్నారు. ఆంధ్రలో తెలంగాణ వీలీనాన్ని ఆయన ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమన్నారు. కేసీఆర్‌కు అండగా నిలిచారు.. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ దొర అని ఆయన వెనుక బీసీ అయిన జయశంకర్ ఉండవద్దని ఎంతో మంది జయశంకర్‌కు చెప్పారని అందుకు ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడని ఆయన తెలంగాణ నినాదం వదిలితే తాను కేసీఆర్‌ను వదులుతానని అనేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమాన్ని వదలేదని జయశంకర్ కేసీఆర్‌ను వదలేదన్నారు. ఉద్యమంలో అమరుడైన శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తానని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవీ వరప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, వీరభద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్ ,సత్యపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ యాద వ్, శంకర్‌ముదిరాజ్, జగన్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, రమేష్ , దేవ, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బహుజన చక్రవర్తి పాపన్నగౌడ్
కందుకూరు: మొగల్ పాలకుల దౌర్జన్యాలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి 33 కోటలను జయించి, గోల్కొండ కోటను సైతం ఆరు నెలల పాటు పాలించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కందుకూరులో గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిద్ధూగౌడ్, సీనియర్ నాయకుడు అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులను నిర్మించిన ఘనత పాపన్నకే దక్కుతుందన్నారు. ఆయన జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు వీరేందర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న మరో ఫ్రెంచ్ కారు, ఇదే! లాంచ్ ఎప్పుడంటే?
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో మరో కొత్త SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే సి3 హ్యాచ్‌బ్యాక్, సి5 ఎయిర్ క్రాస్ వంటి వాటిని విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ కంపెనీ త్వరలోనే తన మూడవ మోడల్ విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ పేరుతొ విడుదలకానున్న ఈ లేటెస్ట్ ఎస్యువి ఎట్టకేలకు దేశీయ విఫణిలో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా 2023 ద్వితీయార్థంలో ఈ కొత్త కారు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారు సుమారు 90 శాతం స్థానీకరణను కలిగి ఉంటుంది. డిజైన్: కొత్త సిట్రోయెన్ సి3 CMP మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతుంది. కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక డిజైన్ పొందుతుంది. పొడవు వెడల్పు మాత్రమే కాకుండా గణనీయమైన వీల్ బేస్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!) దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 4.3 మీటర్ల పొడవు కలిగి హ్యుందాయ్ క్రెటా కంటే పొడవుగా ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే బ్రాండ్ మోడల్స్ గుర్తుకు తెచ్చినప్పటికీ ముందు భాగంలో లోగో గ్రిల్ భాగంలో నిక్షిప్తం చేశారు. అంతే కాకుండా హాలోజన్ హెడ్ లాంప్స్ కలిగి ఫ్రంట్ బంపర్ పొడవుగా రౌండ్ ఫాగ్ లాంప్స్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, రియర్ ప్రొఫైల్ పొవాడైన టెయిల్ గేట్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్స్: ఇంటీరియర్ విషయానికి వస్తే, సి3 ఎయిర్‌క్రాస్ రెండు సీటింగ్ ఆప్షన్స్ పొందుతుంది. 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ కలిగి మూడు వరుసలతో వస్తుంది. 5 సీటర్ కారులో 444 లీటర్ల బూట్ స్పేస్, 7 సీటర్ కార్లు 511 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే సమయంలో 10.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అలాగే ఉంటుంది. అయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగా అప్డేట్ పొందుతుంది. మిగిలిన అన్ని ఫీచర్స్ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) ఇంజిన్ వివరాలు: సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 110 హెచ్‌పి పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటాయి. ఆటోమాటిక్ గేర్ బాక్స్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త SUVలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉండదు. ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఇప్పటికే విక్రయానికి ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ లేటెస్ట్ SUV ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. ఈ కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
బీఎండబ్ల్యూ సరికొత్త ఆవిష్కరణ..! క్షణాల్లో కారు కలర్ ఛేంజ్..!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త కారును ఆవిష్కరించింది. బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రంగుల మార్చే కారును బీఎండబ్ల్యూ రూపొందించింది. క్షణాల్లో కలర్స్ ఛేంజ్.! బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో(BMW iX Flow) పేరుతో రూపొందించిన ఈ కారును అమెరికాలో లాస్ వేగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES- 2022)లో ఆవిష్కరించింది. ఈ కారులో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఎలక్ట్రోఫొరెటిక్ టెక్నాలజీ సహయంతో కారు కలర్‌ను క్షణాల్లో మారిపోతుందని కంపెనీ పేర్కొంది. ఈ-ఇంక్ కంపెనీ భాగస్వామ్యంతో కలర్ ఛేజింగ్ కారును బీఎండబ్య్లూ రూపొందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎండబ్ల్యూ ట్విటర్లో షేర్ చేసింది. బ్లాక్ టూ వైట్... బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో ఏర్పాటుచేసిన బటన్ సహాయంతో కారును క్షణాల్లో బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్‌కు; వైట్ కలర్ నుంచి బ్లాక్‌కు మారిపోనుంది. ఇక్కడ కారు కలర్ ఛేంజ్ అవ్వడం కోసం ఎలాంటి శక్తి వినియోగం జరగదని కంపెనీ వెల్లడించింది. ఈ కలర్ ఛేంజిగ్ సదుపాయంతో కారులో ఎయిర్ కండిషనింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తోందని కంపెనీ పేర్కొంది. Ready for the next step in innovation ⚡️ Join us as we unveil our future innovations around the CES 2022. #BMWCES #BMW #FromSoultoSoul #BornElectric https://t.co/tsUKqXf92g — BMW (@BMW) January 5, 2022 చదవండి: BMW iX M60: కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు..! ఒకటా...రెండా కారు నిండా సూపర్ ఫీచర్సే..! -
కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు
నవాబుపేట: కీడు శంకించిందని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పక్కనపడేశారు. ఏళ్ల తరబడి చెట్టు కింద బాపూజీ విగ్రహం పడి ఉంది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మూఢనమ్మకాలతో ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెట్టిన చోటే శిథిలమైంది. వివరాలిలా ఉన్నాయి. సుమారు 40 ఏళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంటలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పోమాల్కు పంపించారు. అక్కడ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా ఓ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో 30 ఏళ్ల కిందట మండల కేంద్రం నవాబుపేటకు తీసుకొచ్చారు. ఇక్కడా ప్రతిష్టించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం కాస్తా శిథిలావస్థకు చేరింది. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా -
భారత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారు ఇదే..!
ప్రముఖ బ్రిటిష్ కార్ల దిగ్గజం మోరిస్ గ్యారేజ్ భారత మార్కెట్లలోకి ఎమ్జీ ఆస్టర్ కాంపాక్ట్ ఎస్యూవీను అధికారికంగా ఆవిష్కరించింది. ఎమ్జీ ఆస్టర్‌ను ఈ పండుగ సీజన్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు టెస్ట్‌డ్రైవ్ కోసం సెప్టెంబర్ 19 నుంచి ఎమ్జీ మోటార్స్ కంపెనీ డీలర్ల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అనేక ఆధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఎమ్జీ ఆస్టర్ సొంతం. చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! కారు ఇంటిరియర్స్లో భాగంగా 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఈ కారు జియో ఈ-సిమ్‌తో కనెక్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. కారులో ఏర్పాటుచేసిన ఏఐ ఆధారిత రోబోట్ వ్యక్తిగత సహాయకుడిగా వినియోగదారుడికి వాయిస్ ఆదేశాలతో సమాధానమిస్తుంది. వికీపీడియా, జోక్స్, న్యూస్, ఎమోజి, చిట్-చాట్, ఫెస్విల్లే గిఫ్ట్, నావిగేషన్, మ్యూజిక్ సెలెక్ట్, వంటి ఫీచర్లు కారులో ఉన్నాయి. ఎమ్జీ గ్లోస్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీలోని అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్(ఎడీఎఎస్) తో రానుంది. ఎమ్జీ ఆస్టర్‌లో లేన్ చేంజ్ అసిస్ట్, ఆరు ఎయిర్బ్యాగ్స్లను, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. MG ఆస్టర్ ఇంజన్ విషయానికి వస్తే రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ఆప్షన్లతో రానుంది. మొదటి వేరియంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 హెచ్‌పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే ఆటో, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. రెండో వేరియంట్ 1.3లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 140 హెచ్‌పీ సామర్థ్యంతో 220 టార్క్‌ను ఉత్పతి చేస్తోంది. ఈ వేరియంట్లో 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్ అందుబాటులో ఉంది. చదవండి: Maruti Suzuki Swift : సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన మారుతి -
‘ప్రైమ్‌డే’లో 2,400 ఉత్పత్తుల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై 26–27 తేదీల్లో నిర్వహించే ’ప్రైమ్ డే’లో 100 పైచిలుకు చిన్న, మధ్య తరహా సంస్థలు 2,400 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ తెలిపారు. ఈ సంస్థల్లో స్టార్టప్‌లు, మహిళా ఎంటర్ప్రెన్యూర్లు, చేనేత కళాకారులు మొదలైన వారు ఉంటారని పేర్కొన్నారు. ఇల్లు..వంటగదికి అవసరమైన ఉత్పత్తులు మొదలుకుని ఫ్యాషన్, ఆభరణాలు, స్టేషనరీ, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులు ఉంటాయని భాసిన్ వివరించారు. ప్రైమ్ డేలో 450 నగరాల నుంచి 75,000 పైచిలుకు ’లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ విక్రేతలు పాల్కొంటారని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం గతేడాది లాక్డౌన్లు విధించినప్పట్నుంచీ ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లో తమ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని భాసిన్ చెప్పారు. ప్రస్తుతం తమ కస్టమర్ ఆర్డర్లలో 65 శాతం, కొత్త కస్టమర్లలో 85 శాతం మంది వీరే ఉంటున్నారన్నారు. వర్క్–ఫ్రం–హోమ్, ఆన్లైన్ స్కూలింగ్‌కు సంబంధించిన ఉత్పత్తులతో పాటు వ్యక్తిగత సౌందర్య సాధనాలు, నిత్యావసరాలు మొదలైన వాటికి డిమాండ్ ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. -
సరికొత్తగా మహీంద్రా "థార్''
సాక్షి,న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర ఎట్టకేలకు సరికొత్త థార్‌ను ఆవిష్కరించింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రతిష్టాత్మ ఎస్యూవీ "థార్'' ను దేశీయంగా తీసుకొచ్చింది. రెండు, మూడు సంవత్సరాల సుదీర్ఘ పరీక్షల అనంతరం ఐకానిక్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో శనివారం పరిచయం చేసింది. ఫ్రీడమ్ డ్రైవ్‌లో భాగంగా ఈ వాహనాన్ని తీసుకొస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.బీఎస్ -6 నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోఉండనుందని తెలిపింది. ఫస్ట్-జెన్ మోడల్ కంటే పెద్ద వాహనంగా తీసుకొస్తున్న ఈ కొత్త థార్ 2020 అక్టోబర్ 2న లాంచ్ చేయనుంది. ధర, ప్రీ బుకింగ్ వివరాలు కూడా అక్టోబర్ 2 న ప్రకటిస్తామని ఎంఅండ్ఎం వెల్లడించింది. సెకండ్ జెనరేషన్ థార్ వాహనంలో ప్రతీ కొత్తదిగానే ఉంటుందని ఎం అండ్ ఎం ప్రకటించింది. శక్తివంతమైన ఇంజీన్, టచ్‌స్క్రీన్ సామర్థ్యాలతో కొత్త 18 సెం.మీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌ను, ఫార్వర్డ్ ఫేసింగ్ సీట్లు, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 650 మిమీ వాటర్ వాడింగ్ సామర్ధ్యంలాంటి ఫీచర్లను అమర్చింది. ఇంకా డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ అసిస్ట్, సెకండ్ జనరేషన్ థార్ టైట్రానిక్స్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, హిల్ హోల్డ్, హిల్ డీసెంట్ కంట్రోల్‌ను కూడా జోడించింది. కొత్త మహీంద్రా థార్ ఏఎక్స్, ఎల్ ఎక్స్ సిరీస్ లో రెండు రంగుల్లో ఇది లభించనుంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్‌పీ, 320ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజీన్ 130హెచ్‌పి, 320 ఎన్ ఎం టార్క్ ను ఇస్తుంది. -
10 వేరియంట్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ త్వరలో లాంచ్ చేయనున్న గ్రాండ్ ఐ10 నియోస్ 2019ని బుధవారం ప్రటకించింది. 3వ జనరేషన్ ఐ10 బుకింగ్స్ ను ప్రారంభించింది. కేవలం రూ.11 వేలకు ఈ కారును ప్రీ బుకింగ్ అవకాశాన్ని కల్పిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్ పది వేరియంట్లలో, ఆగస్టు 20న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. డెలివరీలు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. హ్యుందాయ్ కొత్త కారులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతోపాటు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఇన్ఫోటైమెంట్ ఫీచర్లను జతచేర్చింది. బీఎస్-6 నిబంధనల కనుగుణంగా 1.2-లీటర్ పెట్రోల్ డీజిల్ ఇంజన్లతో ఇది లాంచ్ చేయనుంది. ప్రస్తుతం వున్న 4 స్పీడ్‌కు బదులుగా..5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌తో రానుంది. గ్రాండ్ ఐ 10 నియోస్ పెట్రోల్ బేస్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్లలో ఆప్షన్‌గా కంపెనీ ఏఎంటీ గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. గత 21 ఏళ్లుగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తున్న హ్యుందాయ్ సరికొత్త సాంకేతికతతో భారతీయ ఆటో పరిశ్రమలో హ్యుందాయ్ ఆటోమొబైల్ పలు సరికొత్త కొలమానాలను సృష్టించిందని హ్యుందాయ్ సీఎండీ ఎస్ఎస్ కిమ్ వెల్లడించారు. కొత్త గ్రాండ్ ఐ 10 నియోస్ మా మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
వివో వై71 స్మార్ట్‌ఫోన్..బిగ్ స్క్రీన్, బడ్జెట్ ధర
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీదారు వివో సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో ‘వివో వై 71’ పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మాట్ట్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్‌లో విడుదలైన ఈ డివైస్ ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 14 నుంచి అన్ని ఆఫ్‌లైన్ విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తామని వివో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎంమాల్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. భారీ డిస్ప్లే, మెరుగైన పనితీరు, హై డెఫినిషన్ కెమెరా సామర్థ్యాలతో తమ తాజా స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించామని వివో ఇండియా సీఎంఓ కెన్నీ జెంగ్ తెలిపారు. వై 71 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6 అంగుళాలఫుల్‌వ్యూ డిస్ప్లే 84.4 శాతం స్క్రీన్ బాడీరేషియో క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 చిప్సెట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 13ఎంపీ హై డెఫినిషన్ వెనుక కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3360 ఎంఏహెచ్ బ్యాటరీ -
హీరో ఎక్స్ట్రీమ్ 200 ఆర్ బైక్ ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు, దేశీయదిగ్గజం హీరో మోటోకార్ప్ తన కొత్త ప్రీమియం మోటార్ సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది. 200 సీసీ విభాగంలో ఈ కొత్త బైకును లాంచ్ చేసింది . ఇప్పటికే 150 సీసీ విభాగంలో విజయవంతమైన ఎక్స్ట్రీమ్ మోడల్‌ను 200సీసీ విభాగంలో కూడా ప్రవేశపెట్టనుంది. యంగ్ కస్టమర్లే లక్ష్యంగా రూపొందంచిన ఈ బైక్ 2018, ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా నాన్ ఏబీస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఏబీస్ ఆప్లన్లలో ఇది లభించనుంది. ధర వివరాలను కూడా అప్పుడే రివీల్ చేయనుంది. కొత్త ఎక్స్ట్రీమ్ 200ఆర్‌లో సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 8500 ఆర్పీఎం వద్ద 18.4 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. డిజిటల్ అనలాగ్ కన్సోల్, 5స్పీడ్ గేర్‌బాక్స్ సిస్టం, ఫ్రంట్‌లో 37ఎంఎం టేలీస్కోపిక్ ఫోర్కులు వెనుక 7 ఇంచెస్ మెనోషాక్ సస్పెన్షన్, 17 అంగుళాల స్పోర్టి అల్లాయ్ వీల్స్,ఎల్ఈడీ పైలట్ ల్యాంప్స్ వెనక 130/70 రేడియల్ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఈ బైక్‌లో ఉన్న బ్యాలెన్సర్ షిఫ్ట్ కారణంగా వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయనీ, ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపటానికి వీలుగా ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు హీరో పేర్కొంది. కాగా ఇది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. -
మైక్రోసాప్ట్ కొత్త ల్యాప్ టాప్, ధరెంతంటే..
క్లాస్ రూమ్ విద్యార్థుల కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన విండోస్ 10 ఎస్ ను మైక్రోసాప్ట్ ఆవిష్కరించింది. ఈ విండోస్ 10 ఎస్ కూడిన మైక్రోసాప్ట్ సర్ ఫేస్ ల్యాప్ టాప్ నూ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ డివైజ్ ధర 999 డాలర్లు అంటే సుమారు 64,090 రూపాయలు. మే 2 నుంచి కంపెనీ ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనుంది. జూన్ 15 నుంచి మైక్రోసాప్ట్ సర్ ఫేస్ ల్యాప్ టాప్ లను డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. బుర్గుండి, కోబాల్ట్ బ్లూ, గ్రే, ప్లాటినం రంగుల్లో ఈ ల్యాప్ టాప్ అందుబాటులో ఉండనుంది. దీని బరువు 2.76 పౌండ్లు కాగ, 14.5ఎంఎం కంటే తక్కువ మందాన్నే ఇది కలిగి ఉంది. మార్కెట్లో ఉన్న మ్యాక్ బుక్ ఎయిర్ లేదా ప్రోలకంటే ఈ ల్యాప్ టాప్ చాలా పలుచగా, తేలికగా ఉండనుందని కంపెనీ చెబుతోంది. వాటి కంటే ఎక్కువ వేగవంతంగా కూడా పనిచేయనుందట. ఆపిల్ మ్యాక్ బుక్ ప్రొడక్ట్ లకంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉందని మైక్రోసాప్ట్ వెల్లడించింది. మైక్రోసాప్ట్ సర్ ఫేస్ ల్యాప్ టాప్ ఫీచర్లు.. 13.5 అంగుళాల డయోగ్నల్ పిక్సెల్ సెన్స్ డిస్ ప్లే థిన్నెస్ట్ ఎల్సీడీ టచ్ మోడ్యుల్ మెటల్ బాడీ, ఆల్ట్రా స్లిమ్ బాడీ ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్స్ కోర్ ఐ5 వెర్షన్ కు 4జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఎస్ఎస్డీ స్టోరేజ్ 14.5 గంటల బ్యాటరీ లైఫ్ -
న్యూ లుక్‌లో డిజైర్ ఆవిష్కరణ.. ధరెంత?
మారుతీ సుజుకి పాపులర్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కొత్త అవతారం వచ్చేసింది. కొత్తతరం డిజైర్ వాహనాన్ని నేడు కంపెనీ భారత మార్కెట్లో ఆవిష్కరించింది. టాటా టీగోర్, హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల లాంచ్ కావడంతో మారుతీ సుజుకీ కూడా తన న్యూ డిజైర్ ను ఆవిష్కరించేసింది. మే 16న దీన్ని లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ వాహనం డిజైర్ బ్యాడ్జ్ తోనే మార్కెట్లోకి రానుంది. ముందువరకున్న సిఫ్ట్ డిజైర్ పేరు ఇక మనకు కనిపించదు. స్వతంత్రంగానే దాని సత్తా చూపించాలని కంపెనీ భావిస్తోంది. 2008లో ఇది లాంచ్ అయిన దగ్గర్నుంచి 13 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు మారుతీ సుజుకీ ఫ్యాక్టరీ నుంచి బయట మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.. సోమవారం ఆవిష్కరణ అయిన కొత్త డిజైర్ లో ఉన్న ఫీచర్లేమిటో ఓ సారి చూద్దాం.. లుక్స్... ఈ కొత్త డిజైర్ పూర్తిగా న్యూ, ప్రెష్ లుక్‌లో వచ్చింది. హెక్సాగోనల్ గ్రిల్ తో దీన్ని కంపెనీ రీడిజైన్ చేసింది. ఈ కొత్త డిజైర్ 40ఎంఎం వైడర్, 20ఎంఎం లాంగర్ వీల్ బేస్‌తో ఉంది. అతిపెద్ద ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కర్వ్డ్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను, పూర్తిగా రీడిజైన్ చేసిన అలోయ్ వీల్స్ ను ఇది కలిగి ఉంది. ఇంజిన్.. గరిష్ట పవర్ 83బీహెచ్పీ, 115ఎన్ఎం గరిష్ట టర్క్ ఉత్పత్తిచేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను ఇది కలిగి ఉంది. అదేవిధంగా 74బీహెచ్పీ పీక్ పవర్, 190ఎన్ఎం పీక్ టర్క్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ మల్టి-జెట్ ఇంజిన్ తో ఇది రూపొందింది. ట్రాన్స్మిషన్.. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది కలిగి ఉంది. ఫీచర్లు.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో బ్లూటూత్, యూఎస్బీ, అక్స్-ఇన్. ధర : బేస్ ధర ఆరు లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ధర తొమ్మిది లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిప్ట్, న్యూ టాటా టిగోర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, ఫోక్స్ వాగన్ అమియోలకు గట్టిపోటీనే ఇచ్చేందుకు ఇది లాంచింగ్ కు సిద్ధమైందట.