భయానక చిత్రం | Sree Vishnu unveils first look poster of Pindam | Sakshi
Sakshi News home page

భయానక చిత్రం

Published Fri, Oct 20 2023 3:30 AM | Last Updated on Fri, Oct 20 2023 3:30 AM

Sree Vishnu unveils first look poster of Pindam - Sakshi

సాయికిరణ్, శ్రీ విష్ణు, యశ్వంత్‌

శ్రీకాంత్‌ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’.  ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని 
ఆకాంక్షించారు.

సాయికిరణ్‌ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్‌ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది.  స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ను ఈ నెల 30న రిలీజ్‌ చేస్తాం. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్‌ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్‌ సూరంపల్లి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement