pindam
-
తిరుమలలో తెలుగు హీరో సతీమణి.. హీరోయిన్లా ఉందంటూ కాంప్లీమెంట్స్
రోజా పూలు, ఒకరికొకరు సినిమాలతో తెలుగువారికి పరిచయమయ్యాడు శ్రీకాంత్ శ్రీరామ్. వాస్తవంగా ఆయన పేరు శ్రీకాంత్.. అప్పటికే టాలీవుడ్లో ఆ పేరుతో స్టార్ హీరో ఇక్కడ ఉండటంతో శ్రీరామ్‌గా వెండితెరకు పరిచయం అయ్యాడు. తమిళ్లో మొదట 'రోజా కూటం' అనే పేరుతో వచ్చిన ఈ సినిమా 'రోజా పూలు'గా తెలుగులోకి వచ్చింది. అందులో భూమిక హీరోయిన్ కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. వాస్తవంగా శ్రీరామ్ తెలుగువాడు కానీ ఆయన కోలీవుడ్‌లో స్థిరపడ్డారు. శ్రీరామ్ తాజాగా తిరుమలకు వచ్చారు. ఆయన సతీమణితో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీరామ్ వివాహం 2008లో వందనతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఆహిల్ వయసు 15 ఏళ్లు కాగా, కూతురు అహానా వయసు 13 ఏళ్లు.. శ్రీరామ్ తండ్రి చిత్తూరుకి చెందినవారు కాగా.. తల్లి స్వస్థలం తమిళనాడులోని కుంభకోణం. ఆయన ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. కొన్నేళ్ల తర్వాత తాము మళ్లీ తిరుమలకు వచ్చామంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను వందన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో వందనను హీరోయిన్లా ఉన్నారంటూ నెటిజన్లు కాంప్లీమెంట్స్ ఇస్తున్నారు. ఒక షోలో శ్రీరామ్ తన భార్య వందన గురించి చెప్పుకొచ్చాడు. మీ భార్య మీకన్నా అందంగా ఉంటుంది కదా.. మీకెప్పుడైనా అసూయగా అనిపించిందా.. ? అన్న ప్రశ్నకు శ్రీరామ్ మాట్లాడుతూ.. అలా ఏం లేదు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాంటి అందమైన అమ్మాయి ప్రేమను పొందినందుకు.. అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు కదా అని చెప్పుకొచ్చాడు. శ్రీరామ్ సినిమా విషయాలకొస్తే.. ఈ మధ్య పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం హీరోగా, సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు. View this post on Instagram A post shared by Vandana Srikanth (@vandanasrikanth) -
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘పిండం’
ప్రముఖ నటుడు శ్రీరామ్ అలాగే శ్రీనివాస్ అవసరాల, సీనియర్ నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం “పిండం”. ఇటీవల మంచి ప్రమోషన్స్ నడుమ అలాగే మోస్ట్ స్కేరియెస్ట్ సినిమాగా థియేటర్స్ లో విడుదలై థియేటర్ ఆడియాన్స్ తో ప్రశంశలు పొందింది. తాజాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. పిండం సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతొంది. అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఆహలో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణం వహించారు. థియేటర్స్ లో మిస్ ఆయన ప్రేక్షకులు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా సినిమాను తెరకెకించారు సాయి కిరణ్ దైదా. ‘పిండం’ కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో ఓ అకౌంటెంట్. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్‌నాథ్(అవసరాల శ్రీనివాస్)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే. -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ
ఆ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా భయపెట్టిన చిత్రం మసూద. ఇటీవలి కాలంలో అదే స్థాయిలో భయపెడుతూ ఓ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అదే పిండం. సినిమా పేరుకు తగ్గట్లే కథ కూడా విభిన్నంగా ఉంటుంది. హీరో శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. నెలన్నర రోజులకు ఓటీటీలో ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో పిండం అందుబాటులోకి వచ్చేసింది. సడన్‌గా స్ట్రీమింగ్ ముందస్తు సమాచారం లేకుండానే ప్రైమ్ వీడియోలో గురువారం (ఫిబ్రవరి 1) అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది రిలీజైన వాటిలో బెస్ట్ హారర్ ఫిలిం ఇదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది. మరి ఈ హారర్ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ప్రైమ్‌లో చూసేయండి.. It's ShowTime #Pindam @PrimeVideoIN pic.twitter.com/riDgCpASEU — Arbaz Hashmi Review (@mad4movie_yt) February 2, 2024 చదవండి: అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇప్పుడు వయసు దాటిపోయింది -
2023లో బాగా భయపెట్టిన చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది
టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా అద్భుతంగా డైరెక్టర్ చూపించారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన పిండం చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు సమాచారం. 2023లో బాగా భయపెట్టిన చిత్రంగా పిండం గుర్తింపు పొందింది. ఈ సినిమా టైటిల్ 'పిండం' అని ఎందుకు పెట్టారో దర్శకుడు గతంలో ఇలా చెప్పారు. మొదటి సినిమానే ఇలాంటి పేరుతో ఎందుకు తీస్తున్నావని అందరూ ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టాను.' అని ఆయన అన్నారు. సినిమా చూశాక ఇదే సరైన టైటిల్ అని అందరికీ అనిపించింది.. హరర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు. -
Pindam Movie Success Meet Pics: పిండం మూవీ హారర్ హిట్ మీట్ (ఫోటోలు)
-
‘పిండం’ మూవీ రివ్యూ
టైటిల్: పిండం నటీనటులు: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నిర్మాణ సంస్థ: కళాహి మీడియా బ్యానర్ నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి దర్శకత్వం: సాయికిరణ్ దైదా సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహర్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో ఓ అకౌంటెంట్. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్‌నాథ్(అవసరాల శ్రీనివాస్)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ చిత్రాలు అంటే భయపెట్టాలి. కానీ ఈ మధ్యకాలంలో హారర్ అంటే కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. హారర్ జానర్ అని చెప్పి కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తూ ప్రేక్షకులను భయపెట్టడం పక్కకి పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఓ ట్రూ హారర్ ఫిల్మ్‌గా పిండం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హరర్ ఎలిమెంట్స్‌తో పాటు చైల్డ్ సెంటిమెంట్ అంశాలతో దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. అలా అని ఇది కొత్త కథ కాదు.. చాలా సన్నివేశాలు ఇతర హారర్ సినిమాల్లో చూసినవే ఉంటాయి. కానీ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడు. ఈ కథ 1992లో ప్రారంభమై.. 1932లో సాగుతుంది. ఓ భయంకరమైన సన్నివేశంతో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కేస్ స్టడీ అంటూ లోక్‌నాథ్ రావడం..అన్నమ్మ గురించి తెలుసుకునే క్రమంలో కథ 1932లోకి వెళ్తుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆంథోనీ ఫ్యామిలీ ‘నాయుడమ్మ’ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోనే దెయ్యం ఉంటుందని ప్రేక్షకులను అర్థమై పోతుంది. అయితే అసలు ఆ దెయ్యం కథేంటి? అది ఎవరిని ఆవహించదనే సస్పెన్స్ మాత్రం ఇంటర్వెల్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆంథోని ఫ్యామిలోని ప్రతి వ్యక్తిపై అనుమానం కలిగించేలా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ ఏదో జరగబోతుంది అనే విషయం ప్రేక్షకుడికి తెలిసినప్పటికీ.. సీన్ ఎండింగ్లో భయపడిపోతాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం కథనం సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మాత్రం గుండెలను పిండేస్తుంది. దర్శకుడి సాయి కిరణ్‌కి ఇది తొలి సినిమానే అయినా.. కొన్ని సన్నివేశాలను మాత్రం ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తీర్చిదిద్దాడు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి పిండం నచ్చుతుంది.కథ రొటీన్‌గా ఉన్నా.. కొన్ని సన్నివేశాలను మాత్రం భయపెడతాయి. ఎవరెలా చేశారంటే.. డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్‌తో శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. అయితే ఇందులో ఆయన హీరోయిజం చూపించే సన్నివేశాలేవి లేవు. ఎమోషన్ సీన్లను చక్కగా నటించాడు. ఇక మేరీగా ఖుషి రవి ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తుంది. అయితే ఆమెకు కథలో బలమైన సన్నివేశాలేవి లేవు. అన్నమ్మగా ఈశ్వరిరావు అద్భుతంగా నటించింది. కథ మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. సోఫియా, తారలుగా నటించిన ఇద్దరు చిన్న పిల్లలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తారగా నటించిన చిన్నారి నటన భయపెడుతుంది. లోక్‌నాథ్‌గా అవసరాల శ్రీనివాసరావు తన పాత్ర పరిధిమేర నటించాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ భయం లేదు!
‘‘లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించే విధానం మారింది. కథ, నటీ నటుల పాత్రల్లో కొత్తదనం ఉంటేనే చూస్తున్నారు. అందుకే ప్రయోగాత్మక, కొత్త తరహా పాత్రలే చేయాలనుకుంటున్నాను. కథ నచ్చి, అందులో నా పాత్ర బలంగా ఉంటే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా రెడీ’’ అన్నారు ఖుషీ రవి. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన హారర్ చిత్రం ‘పిండం’. ఈ చిత్రం ఈ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఖుషీ రవి మాట్లాడుతూ– ‘‘నటిగా కన్నడంలో ‘దియా’ నా తొలి చిత్రం. ఆ చిత్రం తర్వాత పెళ్లి చేసుకున్నాను. నాకో పాప ఉంది. ఇక ‘పిండం’ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో నేను మేరీ పాత్రలో నటించాను. కథ రీత్యా ఇద్దరు కుమార్తెలు నాకు. మూడో ప్రసవం కోసం గర్భిణిని. కెరీర్‌ప్రారంభంలోనే తల్లి పాత్రæచేస్తే నా కెరీర్ ఏమౌతుందోననే భయం, అభద్రతాభావం నాకు లేవు. నా మరో చిత్రం ‘రుద్ర’లో ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తున్నాను. సవాల్ అనిపించే పాత్రలు చేయడం నాకు ఇష్టం’’ అని చెప్పుకొచ్చారు. -
నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను: అవసరాల శ్రీనివాస్
‘‘దర్శకత్వం, నటనల కంటే నాకు రైటింగ్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీసినప్పుడు ఆ తరహా చిత్రాలు అప్పుడు రాలేదు. అలానే ‘జో అచ్యుతానంద’ కూడా. ఇలా నా కథలతో నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’లో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సాయికిరణ్ చేసిన ‘స్మోక్’ షార్ట్ ఫిల్మ్ చూసి, తనలో రచన, దర్శకత్వ ప్రతిభ ఉందని గ్రహించాను. తను చెప్పిన ‘పిండం’ కథ నచ్చింది. ఈ సినిమాలో అతీంద్రియ శక్తులపై పరిశోధనలు చేసే లోక్‌నాథ్ పాత్ర చేశాను. ‘ప్రేమకథా చిత్రమ్’ చూసినప్పుడు కొంచెం భయపెడితే ప్రేక్షకులు సినిమాను శ్రద్ధగా చూస్తారని అర్థమైంది. కానీ కథలో హారర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండాలి. అప్పుడే కనెక్ట్ అవుతారు. ఇక ప్రస్తుతం ‘ఈగల్’, ‘కిస్మత్’, ‘కన్యాశుల్కం’ సినిమాల్లో నటిస్తున్నాను. రైటర్‌గా, దర్శకుడిగా ఓ మర్డర్ మిస్టరీ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నాను. నా తర్వాతి చిత్రం ఇదే కావొచ్చు. అలాగే ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. -
పిండం మూవీ ట్రైలర్
-
తెలుగులో భయంకరమైన హారర్ సినిమా అదే: హీరో శ్రీరామ్
‘‘హారర్ సినిమాల విషయంలో నాకు ఓ భయం ఉంటుంది. పేరుకి హారర్ సినిమా అంటారు కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్‌ను ఇరికిస్తుంటారు. హారర్ అంటే థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్ దైదా ‘పిండం’ మూవీ కథ చెప్పినప్పుడు ప్రేక్షకులు ఉలిక్కి పడతారనిపించింది’’ అని హీరో శ్రీరామ్ అన్నారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ చెప్పిన విశేషాలు. ► నేను నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఒకరికి ఒకరు’ రిలీజై 20 ఏళ్లయింది. ఇన్నేళ్లయినా అలాగే ఉన్నారు. ఆరోగ్య రహస్యం ఏంటి? అని అడుగుతుంటారు. ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటాను. బయటకు వెళ్లినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. ఉన్న దాంతో సంతృప్తి చెంది ఆనందంగా ఉంటాను. ► సాయి కిరణ్ దైదా తీసిన ‘స్మోక్’ అనే షార్ట్ ఫిలిం చూసి తన ప్రతిభపై నమ్మకం కలిగింది. చెప్పిన బడ్జెట్ ప్రకారం టైమ్‌కి ‘పిండం’ పూర్తి చేశారు. యశ్వంత్ ఈ కథను నమ్మి సినిమా నిర్మించారు. ఇది థియేటర్లో చూసి అనుభూతి చెందాల్సిన హారర్ సినిమా. 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది. ► నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన హారర్ సినిమా అంటే రామ్‌గోపాల్ వర్మగారు తీసిన ‘రాత్రి’. ఆ మూవీని చాలాసార్లు చూశాను. ‘పిండం’ అనేది కేవలం హారర్ సినిమా కాదు... ఇందులోని బలమైన కథ, భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ► నేను చేసిన ‘రెక్కీ’ వెబ్ సిరీస్ సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ఓటీటీ కోసం ‘నెట్ వర్క్, హరికథ’ అనే ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. నేను, జీవీ ప్రకాశ్ తమిళ్లో ‘బ్లాక్ మెయిల్’ అనే మూవీ చేస్తున్నాం. అలాగే ‘సంభవం’ చిత్రం చేస్తున్నా. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను. చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి? -
ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు – దర్శకుడు సాయికిరణ్ దైదా
‘‘తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మా పిండం’ ఉంటుంది. భయపెట్టాలని హారర్ సీన్స్ పెట్టలేదు. బలమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. అమెరికాలో వ్యాపారం చేస్తున్నా స్క్రిప్ట్‌లు రాసేవాడిని. కోన వెంకట్‌గారు అమెరికాలో పరిచయమయ్యారు. నేను రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ ఆయనకు నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా డల్లాస్‌లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కుదరలేదు. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకుని ‘పిండం’ తీశాను. ఇది హారర్ సినిమా కాబట్టి భయపెట్టే సీన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నెక్ట్స్ ‘కృష్ణుడి లంక’ టైటిల్‌తో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
'పిండం' చూసి భయపడతారు: డైరెక్టర్ సాయి కిరణ్ దైదా
‘నల్లగొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను.దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. ఇప్పటి వరకు తెలుగులో చాలా హారర్ మూవీస్ వచ్చాయి. అవన్ని ఒకెత్తు.. మా పిండం మూవీ మరో ఎత్తు. హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు’అని అన్నారు దర్శకుడు సాయి కిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన తాజా చిత్రం ‘పిండం’.'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సాయికిరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకొని ‘పిండం’సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు హారర్ జానర్ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హారర్ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. ఇది నా మొదటి సినిమా కాబట్టి భారీ తారాగణం ఉండదు. కథ బలంగా ఉండాలి. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని ఎంతో శ్రద్ధతో రాసుకోవడం జరిగింది. హారర్ సినిమా కాబట్టి ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా మొత్తం పూర్తయ్యాక, సినిమా చూసుకొని విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది. ► పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ►ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివాను. సబ్జెక్ట్ లోకి మరింత లోతుగా వెళ్ళడం కోసం అంతగా రీసెర్చ్ చేశాను. ఎప్పుడూ వచ్చే హారర్ సినిమాల్లాగా కాకుండా, కొత్తగా ఎలా చూపించాలి అనే దానిపై ఎంతో వర్క్ చేశాము. క్లైమాక్స్ సన్నివేశంలో.. వివిధ భాషల్లో ఉండే నిజమైన మంత్రాలను తెలుసుకొని పెట్టడం జరిగింది. ► టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది. ► ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం. ►ఈ సినిమాలో సంగీతానికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. ►త్వరలో కృష్ణుడి లంక అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను. హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను. -
'మరణించిన తర్వాత అసలేం జరుగుతుంది?'.. ఆసక్తిగా ట్రైలర్!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం పిండం. ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ మూవీ ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూడగానే ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. నిజంగానే దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలోనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. ఈనెల 15న మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తోంది. -
ముప్పైకి పైగా భయపడే సీన్లు ఉన్నాయి
‘‘నా 30 ఏళ్ల వయసులోనే ఐటీ కంపెనీలను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశాను. దాంతో సినిమా తీయడం సులభం అనుకున్నాను. కానీ వంద కాదు.. వెయ్యి కోట్లు ఉన్నా సినిమా చేయడం అంత సులభం కాదని తెలుసుకున్నాను. వందల మంది కలిసి పని చేస్తూ, అన్నీ కలిసి వస్తేనే ఓ సినిమా పూర్తవుతుంది. లేదంటే ఎన్ని కోట్లు డబ్బులున్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. శ్రీరామ్, ఖుషీ జంటగా ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ– ‘‘నాకు యూఎస్‌లో ఐటీ కంపెనీలున్నాయి. సాయికిరణ్‌కు సినిమాలపై ఆసక్తి. ఓ సినిమా చేద్దామని ఇండియా వచ్చాం. సిద్ధు జొన్నలగడ్డతో మేం చేయాల్సిన ‘డల్లాస్ దేశీ దొంగలు’ సినిమా లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మరో కథ అనుకున్నాం. అది కూడా కుదర్లేదు. ఆ నెక్ట్స్ ‘పిండం’ కథను రెడీ చేశారు సాయికిరణ్. ఓ సందర్భంలో సాయికిరణ్ వాళ్ల నాన్నమ్మ ఓ భవంతిని చూపించి, ఓ కథ చె΄్పారట. ఆ కథకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘పిండం’ కథ రాశారు. ఈ సినిమాలో ముప్పైకి పైగా భయపడే సన్నివేశాలు ఉన్నాయి. 1930, 1990, 2023.. ఇలా మూడు కాలమానాల్లో స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఇక మా సంస్థలో మొదలైన తొలి చిత్రం ‘డల్లాస్‌లో దేశీ దొంగలు’ ఉంటుంది. మరికొన్ని కథలు ఉన్నాయి’’ అన్నారు. -
హారర్ సినిమా.. షూటింగ్‌లోనూ అలాంటి భయపెట్టే సంఘటనలు
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన సినిమా 'పిండం'. హారర్ కథతో తీసిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. డిసెంబర్ 15వ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. నా పేరు యశ్వంత్. నాకు యూఎస్ లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఎప్పటినుంచో సినిమా చేయాలని ఉంది. ఓ మంచి కథతో సినిమా చేద్దామని ఇండియాకి వచ్చా. మొదట వేరే కథ చేద్దామనుకున్నాం. అయితే దర్శకుడికి అనుకోకుండా ఈ కథ ఆలోచన వచ్చింది. వారం రోజుల్లోనే కథ పూర్తి చేసి, పిండం అనే టైటిల్ చెప్పారు. మీ అందరి లాగానే మేము కూడా మొదట టైటిల్ విని ఆశ్చర్యపోయాము. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) అయితే ఓ జీవి జన్మించాలంటే పిండం నుంచే రావాలి. మరణం తర్వాత పిండమే పెడతారు. జననంలోనూ, మరణంలోనూ ఉంటుంది కాబట్టి పిండం టైటిల్ పెట్టడంలో తప్పేముంది? సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి కూడా మనం ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుందని దర్శకుడు చెప్పారు. కథ ఓకే అనుకున్నాక పనులన్నీ చకచకా జరిగిపోయాయి. జూన్‌లో షూటింగ్ ప్రారంభమైంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం. మిగతా హారర్ చిత్రాలతో పోలిస్తే, ఇది భిన్నంగా ఉంటుంది. ఈ తరహాలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి పిండం టైటిలే సరైనది. అలానే షూటింగ్ జరుగుతున్న టైంలో ఒకరు ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఒకరికి కాలు విరిగింది. ఒకసారి సెట్ లోకి పాము వచ్చింది. ఇంకోసారి ఈశ్వరి గారి తలకి గాయమైంది. అలాగే ఒకసారి ఆదివారం అమావాస్య అని తెలియకుండా అర్ధరాత్రి షూటింగ్ ప్లాన్ చేశాం. చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ వచ్చి అమావాస్య అర్ధరాత్రి అని భయపడుతుంటే, దగ్గరలోని గుడి నుంచి కుంకుమ తెప్పించి అందరికీ బొట్లు పెట్టించాము. (ఇదీ చదవండి: నా భర్త నుంచి దూరం అయ్యాను: బిచ్చగాడు-2 నటి) -
భయపెట్టే పిండం!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది. డిసెంబరు 7న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. -
Pindam Movie Teaser Launch Event: పిండం మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
'ఇది అన్ని కుక్కల్లా లేదు.. ఏదో తేడాగా ఉంది'
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం పిండం. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేస్తూ..'ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రం ఓ ఆత్మ చూట్టు తిరిగే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలాల్లో జరిగే కథనే ఈ మూవీలో చూపించనున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..'చిన్నప్పుడు విన్న ఓ కథను హారర్ జోనర్లో తెరకెక్కించాలని అనిపించింది. ఈ మూవీ స్క్రీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్ పేరు వినగానే అందరూ ఈ పేరు ఎందుకు పెట్టావని అన్నారు. మీ మొదటి సినిమానే ఇలా ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టా. సినిమా చూశాక టైటిల్ సరైందే అని మీకందరికీ అనిపిస్తుంది.' అన్నారు. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
పిండ ప్రదానం.. వస్తువులు మాయం
– దోపిడీకి గురవుతున్న పిండ ప్రదాన కత్రువు భక్తులు – అరకొరగా వస్తువుల అందజేత – పూర్తి స్థాయి సామగ్రి కోసం అదనంగా చెల్లింపు శ్రీశైలం (జూపాడుబంగ్లా): తరతరాల కుటుంబ బాంధవ్యాలకు ప్రతీకమైన పిండ ప్రదానానికి పుష్కరాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. తమను వీడి పోయిన ఆత్మీయులకు 12 సంవత్సరాలకోసారి వచ్చే పుష్కరాల్లో భక్తిశ్రద్ధలతో పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజుల్లో పితదేవతలు నదుల్లో ఉంటారనే విశ్వాసం ఉంది. భక్తుల నమ్మకాన్ని కొందరు దోచుకుంటున్నారు. పుష్కరాల్లో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసే వస్తువులు సరిగా లేకుండానే చేయాల్సి వస్తోంది. పిండప్రదాన కార్యక్రమం నిర్వహించేందుకు పసుపు, కుంకుమ, వక్కలు, బెల్లం, నెయ్యి ఐదు గ్రాములు, మూడు అగరవత్తులు, 30గ్రాముల నల్లనువ్వులు, పావుకిలో వరిపిండి, గంధం 10 గ్రాములు, కర్పూరం నాలుగు బిళ్లలు, తమలపాకులు 10, విస్తరాకులు 4, అరటిపండ్లు 12 అవసరం ఈ సామగ్రిని పొదుపులక్ష్మి మహిళలు రూ.50 విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. అందులో పిండప్రదాన క్రతువుకు అవసరమైన అన్నిరకాల వస్తువులు లేకపోవటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిట్లులోలేని వస్తువులు కావాలంటే అదనంగా పొదుపు మహిళలు మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నట్లు భక్తులు పేర్కొంటున్నారు. డబ్బులు చెల్లించలేని భక్తులు పొదుపు మహిళలు ఇచ్చిన కిట్టులో ఉన్న వస్తువులతోనే పిండప్రదానాన్ని మమ అనిపిస్తున్నారు. పిండ ప్రదానం వస్తువులపై అవగాహన ఉన్న భక్తులు దబాయిస్తుండటంతో మిగిలిన వస్తువులను ఇస్తున్నారు. రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు: పిండప్రదానికి అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను దేవస్థానం వారు 30 మంది పొదుపు మహిళల ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో కిట్టు రూ.50 చొప్పున రోజుకు ఒక్కో పొదుపు మహిళ కనీసం 150 కిట్లను విక్రయిస్తున్నారు. ఈలెక్కన రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు జరుగుతున్నాయి. లింగాలగట్టు దిగువ పుష్కరఘాటులో రోజుకు కనీసం 4,500 మంది భక్తులు పిండప్రదానాలు చేస్తున్నారు. పిండప్రదానం చేసే ఒక్కోభక్తుని నుంచి పూజారులు నిర్ణీత ధర రూ.300ల చొప్పున వసూళ్లు చేస్తున్నారు. దీంతో రోజుకు రూ.13.50 లక్షల మేర పిండప్రదానాల ద్వారా బ్రాహ్మణులకు ఆదాయం సమకూరుతుంది.