
ఆ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా భయపెట్టిన చిత్రం మసూద. ఇటీవలి కాలంలో అదే స్థాయిలో భయపెడుతూ ఓ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అదే పిండం. సినిమా పేరుకు తగ్గట్లే కథ కూడా విభిన్నంగా ఉంటుంది. హీరో శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
నెలన్నర రోజులకు ఓటీటీలో
ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో పిండం అందుబాటులోకి వచ్చేసింది.
సడన్‌గా స్ట్రీమింగ్
ముందస్తు సమాచారం లేకుండానే ప్రైమ్ వీడియోలో గురువారం (ఫిబ్రవరి 1) అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది రిలీజైన వాటిలో బెస్ట్ హారర్ ఫిలిం ఇదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది. మరి ఈ హారర్ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ప్రైమ్‌లో చూసేయండి..
It's ShowTime #Pindam @PrimeVideoIN pic.twitter.com/riDgCpASEU
— Arbaz Hashmi Review (@mad4movie_yt) February 2, 2024
చదవండి: అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇప్పుడు వయసు దాటిపోయింది
Comments
Please login to add a commentAdd a comment