Avasarala Sreenivas
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ
ఆ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా భయపెట్టిన చిత్రం మసూద. ఇటీవలి కాలంలో అదే స్థాయిలో భయపెడుతూ ఓ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అదే పిండం. సినిమా పేరుకు తగ్గట్లే కథ కూడా విభిన్నంగా ఉంటుంది. హీరో శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. నెలన్నర రోజులకు ఓటీటీలో ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో పిండం అందుబాటులోకి వచ్చేసింది. సడన్‌గా స్ట్రీమింగ్ ముందస్తు సమాచారం లేకుండానే ప్రైమ్ వీడియోలో గురువారం (ఫిబ్రవరి 1) అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది రిలీజైన వాటిలో బెస్ట్ హారర్ ఫిలిం ఇదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది. మరి ఈ హారర్ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ప్రైమ్‌లో చూసేయండి.. It's ShowTime #Pindam @PrimeVideoIN pic.twitter.com/riDgCpASEU — Arbaz Hashmi Review (@mad4movie_yt) February 2, 2024 చదవండి: అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇప్పుడు వయసు దాటిపోయింది -
‘పిండం’ మూవీ రివ్యూ
టైటిల్: పిండం నటీనటులు: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నిర్మాణ సంస్థ: కళాహి మీడియా బ్యానర్ నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి దర్శకత్వం: సాయికిరణ్ దైదా సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహర్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో ఓ అకౌంటెంట్. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్‌నాథ్(అవసరాల శ్రీనివాస్)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ చిత్రాలు అంటే భయపెట్టాలి. కానీ ఈ మధ్యకాలంలో హారర్ అంటే కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. హారర్ జానర్ అని చెప్పి కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తూ ప్రేక్షకులను భయపెట్టడం పక్కకి పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఓ ట్రూ హారర్ ఫిల్మ్‌గా పిండం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హరర్ ఎలిమెంట్స్‌తో పాటు చైల్డ్ సెంటిమెంట్ అంశాలతో దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. అలా అని ఇది కొత్త కథ కాదు.. చాలా సన్నివేశాలు ఇతర హారర్ సినిమాల్లో చూసినవే ఉంటాయి. కానీ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడు. ఈ కథ 1992లో ప్రారంభమై.. 1932లో సాగుతుంది. ఓ భయంకరమైన సన్నివేశంతో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కేస్ స్టడీ అంటూ లోక్‌నాథ్ రావడం..అన్నమ్మ గురించి తెలుసుకునే క్రమంలో కథ 1932లోకి వెళ్తుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆంథోనీ ఫ్యామిలీ ‘నాయుడమ్మ’ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోనే దెయ్యం ఉంటుందని ప్రేక్షకులను అర్థమై పోతుంది. అయితే అసలు ఆ దెయ్యం కథేంటి? అది ఎవరిని ఆవహించదనే సస్పెన్స్ మాత్రం ఇంటర్వెల్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆంథోని ఫ్యామిలోని ప్రతి వ్యక్తిపై అనుమానం కలిగించేలా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ ఏదో జరగబోతుంది అనే విషయం ప్రేక్షకుడికి తెలిసినప్పటికీ.. సీన్ ఎండింగ్లో భయపడిపోతాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం కథనం సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మాత్రం గుండెలను పిండేస్తుంది. దర్శకుడి సాయి కిరణ్‌కి ఇది తొలి సినిమానే అయినా.. కొన్ని సన్నివేశాలను మాత్రం ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తీర్చిదిద్దాడు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి పిండం నచ్చుతుంది.కథ రొటీన్‌గా ఉన్నా.. కొన్ని సన్నివేశాలను మాత్రం భయపెడతాయి. ఎవరెలా చేశారంటే.. డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్‌తో శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. అయితే ఇందులో ఆయన హీరోయిజం చూపించే సన్నివేశాలేవి లేవు. ఎమోషన్ సీన్లను చక్కగా నటించాడు. ఇక మేరీగా ఖుషి రవి ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తుంది. అయితే ఆమెకు కథలో బలమైన సన్నివేశాలేవి లేవు. అన్నమ్మగా ఈశ్వరిరావు అద్భుతంగా నటించింది. కథ మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. సోఫియా, తారలుగా నటించిన ఇద్దరు చిన్న పిల్లలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తారగా నటించిన చిన్నారి నటన భయపెడుతుంది. లోక్‌నాథ్‌గా అవసరాల శ్రీనివాసరావు తన పాత్ర పరిధిమేర నటించాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలో వచ్చే ఎమోషన్ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు: అవసరాల
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మా కష్టం థియేటర్స్‌లో తెలుస్తుంది. నా కెరీర్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల గురించి ఎలా చెప్పుకున్నానో ‘ఫలానా..’ సినిమా గురించి అంతే బాగా చెప్పుకుంటాను. ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితంలో చూసినట్లుగా ఉంటాయి. ఎమోషనల్ మూవీ ఇది. నటనపై ఆధారపడ్డ సినిమా కాబట్టే సింక్ సౌండ్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలోని సంజయ్ పాత్రకు నాగశౌర్య బాగా సరిపోయాడు. ఏడు చాప్టర్లు ఉండే ఈ సినిమాలోని నాలుగో చాప్టర్ నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఈ చాప్టర్లో వచ్చే ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘నాగశౌర్య, మాళవికల సహజ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల.‘‘ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి థ్యాంక్స్’’ అన్నారు దాసరి ప్రసాద్. -
‘నూటొక్క జిల్లాల అందగాడు’ మూవీ రివ్యూ
టైటిల్ : నూటొక్క జిల్లాల అందగాడు జానర్ : కామెడీ డ్రామా నటీనటులు : అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిని, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాతలు : శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కథ: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్ సంగీతం : శక్తికాంత్ కార్తీక్ విడుదల తేది : సెప్టెంబర్ 3, 2021 Nootokka Jillala Andagadu Movie Review: ‘అష్టాచెమ్మా’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్.. మంచి నటుడిగా, దర్శకుడిగా, రచయితగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలతో నటిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. .‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’సినిమాలతో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా మారిపోయారాయన. తాజాగా ఆయన రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బట్టతల వల్ల ఒక యువకుడు ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ... శుక్రవారం(సెప్టెంబర్ 3)న థియేటర్లలో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. నూటొక్క జిల్లాల అందగాడి కథేంటంటే..? గొత్తి సత్యనారాయణ అలియాస్ జీఎస్ఎన్(అవసరాల శ్రీనివాస్) వంశ పారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదని, జీవితంలో తనకు పెళ్లి కూడా కాదనే అభద్రతాభావంతో జీవిస్తుంటాడు. బట్టతల ఉందనే విషయం తెలిస్తే ఎక్కడ తనను హేళన చేస్తారోనన్న భయంతో విగ్ పెట్టి కవర్ చేస్తుంటాడు. ఇలా తనని తనను ఇష్టపడని జీఎస్ఎన్.. తను పని చేసే ఆఫీస్‌లో అంజలి(రుహానీ శర్మ)ని ఇష్టపడతాడు. అంజలి కూడా జీఎస్ఎన్ని ఇష్టపడుతుంది. అయితే ఒకరోజు అనుకోకుండా జీఎస్ఎస్ విగ్ మ్యాటర్ అంజలికి తెలిసిపోతుంది. ఆ తర్వాత వీరి మధ్య బంధం ఎలా కొనసాగింది? బట్టతల ఉంటే ఎవరూ ఇష్టపడరనుకునే జీఎస్ఎన్ అనుమానం నిజం అయిందా? ఆ నిజం బయటపడ్డాక వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి? చివరకు ఈ జంట ఎలా కలిశారనేదే మిగత కథ. ఎవరెలా చేశారంటే? బట్టతలతో బాధపడే యువకుడు జీఎస్ఎన్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ అద్భుతంగా నటించాడు.. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా భారం మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. ఇక అంజలి పాత్రలో రుహానిశర్మ జీవించేసింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. అలాగే హీరో తల్లిపాత్రలో రోహిణి ఎప్పటి మాదిరే ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా చేసిన సినిమానే ‘నూటొక్క జిల్లాల అందగాడు’.తన అందానికి, ఆనందానికి బట్టతల అడ్డంగా మారిందని తనను తాను అసహ్యించుకునే ఓ యువకుడి కథ ఇది. నేటి సమాజంలో చాలా మంది బట్టతల వస్తే నామోషీగా ఫీలవుతుంటారు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. అందం అంటే శరీరానికి సంబంధించినది కాదని మనసు సంబంధించినది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు. అందరికి కనెక్ట్ అయ్యే విషయాన్ని.. కాస్త ఫన్నీగా, ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు విద్యాసాగర్. అయితే బట్టతల కాన్సెప్ట్‌తో హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘బాలా’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘నూటొక్క జిల్లాల అందగాడు’కూడా దాదాపు అలాంటి కథే. కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త కథ. కోట్లాది మందికి ఈజీగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అయితే ఈ కథను ఇంకాస్త పకడ్భందీగా తీర్చిదిద్దితే బాగుండేది. ఫస్టాఫ్ అంతా చాలా వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకున్నాడు. అయితే అక్కడ కూడా కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్ టిస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ కథనంలో కొత్తదనం లేకపోడం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ కూడా అంత హాట్ టచింగ్‌గా అనిపించకపోవడం సినిమాకు కాస్త మైనస్. ఇక క్లైమాక్స్ కూడా అందరూ ఊహించినట్టుగా రొటీన్‌గా ఉంటుంది. డైలాగ్స మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం శక్తికాంత్ కార్తీక్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎమోషనల్ సీన్లను తన రీరికార్డింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అవసరాల.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు
‘‘కంచె’ సినిమా అప్పుడు అవసరాలగారు.. ‘హైట్‌గా లేననో, జుట్టు లేదనో, కలర్‌గా లేననో అనేకమైన ఇన్‌సెక్యూరిటీస్‌తో కొందరు తమ జీవితాలను నరకప్రాయంగా మార్చుకుంటారు. దాన్ని హిలేరియస్‌గా చూపిస్తాను’ అంటూ ఓ ఇరవై నిమిషాల కథ చెప్పారు. ఆ పాయింట్ నాకు, రాజీవ్‌గారికి బాగా నచ్చింది’’ అన్నారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. రాచకొండ విద్యాసాగర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ‘దిల్’రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ – ‘‘2017లో దర్శకుడు సాగర్ ఓ థ్రిల్లర్ కథ చెప్పారు. ఆ కథను అవసరాలతో చేద్దామని నేను, రాజీవ్‌గారు అనుకున్నాం. అయితే ‘కంచె’ అప్పుడు చెప్పిన కథ గురించి అవసరాలను అడిగితే, ఆ కథకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్ పెట్టానని చెప్పారు. ఆ సినిమా చేద్దామను కున్నాం. అవసరాల అంకితభావం ఉన్న నటుడు. టెక్నాలజీ సాయంతో బట్టతల కనిపించేలా చేస్తామన్నాం.. కానీ బట్టతల కనిపించేలా షేవ్ చేసుకుని ఓ నాలుగైదు నెలలు ఆయన అలానే ఉన్నారు. అందంగా, కొత్తగా అవసరాల శ్రీనివాస్.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు. నిర్మాతలుగా ఎవరూ చెప్పని కథలను చెప్పాలని కంకణం కట్టుకున్న మాకు ‘దిల్’ రాజు, శిరీష్ వంటి నిర్మాతలు తోడయ్యారు. ఈ సినిమా కథ వెండితెరపైకి రావడానికి కృషి చేసిన రాజీవ్ రెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. రాచకొండ విద్యాసాగర్ మాట్లాడుతూ– ‘‘నాకు చిన్న ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది (సరిగా నడవలేకపోవడం, చేయి సరిగా ఉండకపోవడం). నేను డిఫరెంట్‌గా నడుస్తుంటే అందరూ ఏమనుకుంటారో అని బాధపడేవాడిని. నా ఇబ్బందిని యాక్సెప్ట్ చేయడానికి భయపడ్డాను. అమేజింగ్ కథ రాశారు శ్రీని (అవసరాల శ్రీనివాస్). సినిమా తీసిన రెండేళ్లకు అర్థమైంది.. అది నా కథ కూడా అని. ఈ సినిమా కథ చాలామందిని ఆలోచింపజేస్తుంది. నన్ను చూసి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నా డైరెక్షన్ టీమ్, చిత్రయూనిట్‌తో పాటు నా లైఫ్‌లో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఫస్ట్ ఈ సినిమా ఐడియా వచ్చినప్పుడు నా ఐడియా అనుకున్నాను. స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి క్రిష్‌గారికి చెప్పిన తర్వాత అది మా ఐడియా అయింది. ఆ తర్వాత ఆ ఐడియా సినిమాగా మారింది. సినిమా మీలోని నిజమైన మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. -
‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’
‘‘నేను చేసే పాత్ర నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తే చాలు. సినిమా ఒప్పుకుంటాను. పారితోషికం గురించి పెద్దగా ఆలోచించను. పదేళ్ల తర్వాత ఆ నిర్మాత అంత ఇచ్చాడు.. ఈ నిర్మాత ఇంత ఇచ్చాడు అని లెక్కలు వేసుకోను. అలా లెక్కలేసుకుని పదివేలు తక్కువయ్యాయని ‘అష్టా చమ్మా’ సినిమాను వదులుకుని ఉంటే నాకు జీవితమే ఉండేది కాదు. నేను కొన్ని సినిమాలు ఉచితంగా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్ కూడా చేశాను. అలాగని అన్నీ ఫ్రీగా చేయలేం. నాకూ ఖర్చులు ఉంటాయి’’ అన్నారు దర్శక,నటుడు, రచయిత శ్రీనివాస్ అవసరాల. నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. బాలాజీ సానల దర్శకత్వంలో శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఊరిని, కుటుంబాలను, సంప్రదాయ విలువలను గౌరవించాలనుకునే ప్రేమికుల కథ ఇది. నాది తమిళ వ్యక్తి పాత్ర. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ ఊరికి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆసక్తికరం. శ్రీనివాస్ అవసరాల ఉంటే వినోదం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం కొంతవరకు నిజమని నమ్ముతాను. కానీ నేను కూడా చెత్త సినిమాలు చేశాను. ఆడుతూపాడుతూ చేసిన ‘అష్టాచమ్మా’ పెద్ద విజయం సాధించింది. సూపర్ హిట్ సాధిస్తాయనుకున్న నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. యాక్టర్స్ అందరూ స్క్రీన్ రైటింగ్ చదువుకోవాలన్నది నా నమ్మకం. అప్పుడే కథలు వినేప్పుడు ఏయే అంశాలకు కథలు ఒప్పుకుంటున్నామో తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడిగా నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా చేస్తున్నాను. నటుడిగా ‘నాయనా రారా ఇంటికి’ (ఎన్ఆర్ఐ) సినిమా చేస్తున్నాను. ఈ సినిమా సగం పూర్తయింది. అలాగే ఓ కథ రాస్తున్నా. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు’’ అన్నారు. -
పెళ్లి తర్వాత...
నాగ చైతన్య, సమంత ఫస్ట్ టైమ్ కలసి యాక్ట్ చేయబోతున్నారు. అదేంటీ వీళ్లిద్దరూ జంటగా మూడు సినిమాల్లో (‘ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం’) యాక్ట్ చేశారు. లెక్క ప్రకారం ఇది నాలుగో సినిమా అవ్వాలి కదా? అంటే.. పెళ్లి తర్వాత చైతన్య, సమంత జంటగా యాక్ట్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత పెళ్లైన దంపతుల్లానే కనిపించనున్నారు. పెళ్లి తర్వాత జరిగే సంఘటనలతో ఈ చిత్రం కథాంశం ఉండబోతోందని సమాచారం. రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ. -
ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి
– దర్శకుడు నవీన్ మేడారం ‘‘బాబు బాగా బిజీ’ నా తొలి చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటువంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి. ఈ సినిమా చేయడానికి కారణం అభిషేక్ నామాగారు. ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా సరదాగా సాగుతుంది’’ అని దర్శకుడు నవీన్ మేడారం అన్నారు. అవసరాల శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ హిట్ మూవీ ‘హంటర్’కు రీమేక్‌గా నవీన్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘బాబు బాగా బిజీ’. అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ముఖ్య తారలు. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో హీరోగా అవసరాలని తప్ప మరెవర్నీ ఊహించుకోలేదు. ఆయన కూడా ‘హంటర్’ చూడగానే ‘బాబు బాగా బిజీ’ చేయటానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ఎక్కడా వల్గారిటీ కనపడదు. రియల్ లైఫ్‌ను చూస్తున్నట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. ఇందులో సైకలాజికల్ కంటెంట్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కావడంతో చేశా’’ అన్నారు అవసరాల. నటుడు తనికెళ్ళ భరణి, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, శ్రీముఖి, సుప్రియ ఐసాల తదితరులు పాల్గొన్నారు. -
అవసరాల హీరోగా మరో సినిమా
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన టాలీవుడ్ స్టార్ అవసరాల శ్రీనివాస్. స్టార్ కమెడియన్‌గా కొనసాగుతూనే ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి విజయాలు సాధించాడు. ఇటీవల విడుదలైన జెంటిల్మన్ సినిమాతో విలన్ గానూ మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బాగా బిజీ' రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ అడల్డ్ మూవీ హంటర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అవసరాల సెక్స్ అడిక్ట్‌గా నటిస్తున్నాడు. తాజాగా మరో సినిమాలో హీరోగా నటించేందుకు అంగీకరించాడు అవసరాల శ్రీనివాస్. విజయ్ అనే కొత్త దర్శకుడి సినిమాలో హీరోగా నటించేందుకు ఓకె చెప్పాడు. బాబు బాగా బిజీ రిలీజ్ తరువాత దర్శకుడిగా నానితో సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత., తను హీరోగా విజయ్ తెరకెక్కించే సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నాడు.