సమంత,నాగ చైతన్య
నాగ చైతన్య, సమంత ఫస్ట్ టైమ్ కలసి యాక్ట్ చేయబోతున్నారు. అదేంటీ వీళ్లిద్దరూ జంటగా మూడు సినిమాల్లో (‘ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం’) యాక్ట్ చేశారు. లెక్క ప్రకారం ఇది నాలుగో సినిమా అవ్వాలి కదా? అంటే.. పెళ్లి తర్వాత చైతన్య, సమంత జంటగా యాక్ట్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత పెళ్లైన దంపతుల్లానే కనిపించనున్నారు. పెళ్లి తర్వాత జరిగే సంఘటనలతో ఈ చిత్రం కథాంశం ఉండబోతోందని సమాచారం. రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ.
Comments
Please login to add a commentAdd a comment