Samantha Got Her Second Bollywood Movie Offer With Akshay Kumar, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha - Akshay Kumar: సమంత చమత్కారానికి హీరో ఫిదా.. హిందీలో మరో అవకాశం!

Published Sat, Jul 23 2022 8:26 PM | Last Updated on Sun, Jul 24 2022 12:07 PM

Samantha Bollywood Movie With Akshay Kumar - Sakshi

అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగినవారిలో సమంత ఒకరు. మనోజ్‌ భాజ్‌పాయ్‌ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌ సిరీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత 'పుష్ప: ది రైజ్‌' చిత్రంలోని 'ఊ అంటావా మావ' సాంగ్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకుంది. దీంతో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది సామ్. ప్రస్తుతం సామ్ చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సమంత మరో హిందీ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  

బాలీవుడ్‌ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్‌' టాక్‌ షోలో సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో సామ్‌ అందచందాలతో అదరగొట్టడమే కాకుండా, ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మాటలతో హుషారెత్తించింది. సమంతతోపాటు బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా పాల్గొన్నాడు. అయితే ఈ షోలో సమంత యాటిట్యూడ్‌, మాట విధానం, చమత్కారంతో చెప్పిన సమాధానాలకు అక్కీ ఫిదా అయ్యాడట. దీంతో తన తర్వాతి సినిమాలో సమంతకు అవకాశం ఇచ్చినట్లు హిందీ ఫిల్మీ దునియాలో టాక్ నడుస్తోంది.

చదవండి: దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్‌..
మిస్‌ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే..


ఇదివరకే ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌లో నటించిన సామ్‌ పాపులారిటీ ఓ రేంజ్‌కు వెళ్లింది. ఒకవేళ అక్షయ్ కుమార్‌ సినిమాలో సమంత చేయడం నిజమైతే ఆమె మరోస్థాయికి వెళ్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం హిందీలో వరుణ్‌ ధావన్‌తో సామ్‌ సినిమా ఉండనుంది.  



చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement