Hindi movie
-
'పుష్ప 2'కి పోటీగా రష్మిక నుంచే మరో సినిమా
రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్‌స్టార్. ఎందుకంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. వీటితో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ రీజనల్ మూవీస్ కూడా చేస్తోంది. అయితే ఈమెకు ఇప్పుడు ఊహించని చిక్కొచ్చి పడింది. ఒకేరోజు ఈమె రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుండటమే దీనికి కారణం.(ఇదీ చదవండి: కూర్గ్‌లో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. డేట్ ఎప్పుడంటే?)రష్మికకు పాన్ ఇండియా స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా 'పుష్ప'. సీక్వెల్‌తో డిసెంబరు 6న ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. మరోవైపు ఇదే తేదీన 'చావా' అనే బాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. విక్కీ కౌశల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ పీరియాడికల్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. డిసెంబరు 6నే థియేట్రికల్ రిలీజ్ అని ప్రకటించారు. విచిత్రం ఏంటంటే ఇందులోనూ రష్మికనే హీరోయిన్.రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం వల్ల ఎవరికేం ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ పోటీ పక్కా అయితే మాత్రం రష్మికకు పెద్ద కష్టమొచ్చి పడుతుంది. ఎందుకంటే రెండింటికి ప్రమోషన్లు దాదాపు ఒకేసారి జరుగుతాయి. మరి రష్మిక వాటిని ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఇక్కడ ప్రశ్న. అలానే 'పుష్ప 2' లాంటి మంచి బజ్ ఉన్న మూవీకి పోటీగా రావాలని ఫిక్స్ అయ్యారంటే బహుశా మరోసారి 'పుష్ప 2' వాయిదా పడే ఛాన్స్ ఉందని నమ్మకమా? లేదంటే కంటెంట్ మీద 'చావా' దర్శకనిర్మాతలది ధైర్యమా!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే?
హిందీ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తారా? అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందట. ఇక యశ్‌రాజ్ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’ మల్టీస్టారర్ మూవీ అనే విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. ఇంకో విషయం ఏంటంటే... ‘వార్ 2’లో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్‌తో ఆ తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. -
IMDB నుంచి మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్..
-
ఆపరేషన్ డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు.. ఈ మూవీని డిసెంబర్ 8 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలను చూపే యాక్షన్ మూవీ ఇది. శక్తి ప్రతాప్ సింగ్, అమిర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈ చిత్రకథ రాశారు. హిందీ, తెలుగులో రూపొందిస్తున్నాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నందకుమార్ అబ్బినేని. -
సీక్రెట్ మిషన్
తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్‌పీహెచ్’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్ చేశారు. స్పైజానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్‌లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఓ సీక్రెట్ మిషన్ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
కన్నబిడ్డల కోసం ఆ తల్లి పోరాడింది, చివరకు..
పిల్లలకు చిన్నగాయమైనా, కాసేపు కనిపించకపోయినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది.. వాళ్లను తమ నుంచి శాశ్వతంగా దూరం చేసే యత్నం చేస్తే? తమ సంరక్షణలో పెరగనివ్వకుండా చట్టాలు అడ్డుకుంటే!. సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో దూరమైన బిడ్డలు.. స్వదేశంలో తల్లి చెంతకు చేరిన కథే ఇది. అందుకోసం చట్టం పోరాడిందామె. ఈ క్రమంలో భర్తకు దూరమైంది. ఆయినా ఆమె కుంగిపోలేదు. ప్రయత్నించి.. చివరకు పిల్లలను దక్కించుకుంది. ఆ కథనే రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో బాలీవుడ్లో ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’గా తెరకెక్కించారు. తన కన్నబిడ్డల కస్టడీ కోసం భారత్‌కు చెందిన ఓ మహిళ.. నార్వే ప్రభుత్వంతో పోరాడింది. ఆ పోరాటం అప్పట్లో వార్తల్లో హెడ్‌లైన్స్ అయ్యింది. ఆ గడ్డపై ఓటమి పాలైనా.. అది తాత్కాలికమే అయ్యింది. చివరికి స్వదేశానికి చేరుకుని పిల్లల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆ తల్లి విజయం సాధించి పదేళ్లు పూర్తైంది. ఇంతకీ అప్పుడేం జరిగింది.. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన అనురూప్ ఛటర్జీ ఉద్యోగం రిత్యా నార్వేకు వెళ్లాడు. కూడా భార్య సాగరికాను తీసుకెళ్లాడు. అప్పటికే వాళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. ఆటిజంతో బాధపడుతున్న ఆ బాబును చూసుకోవడంతోనే సాగరికకు సరిపోయేదట. ఈలోపు ఆమె మళ్లీ గర్భం దాల్చింది. దీంతో కొడుకును చూసుకోవడం కష్టంగా మారిందామె. ఇదే ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి, కన్నబిడ్డలను దూరం చేసేందుకు నార్వే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. నార్వేలో పిల్లల సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందరూ వాటిని పాటించాలి. పిల్లలను కొట్టినా.. చివరకు చేత్తో తినిపించినా శిక్షార్హమైన నేరమే. అలాంటిది కొడుకు కోసం సెపరేట్ బెడ్ లేకపోవడం(తండ్రితోనే పడుకునేవాడు)తో.. ఆమె తన కొడుకును సరిగా చూసుకోవడం లేదంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్(Barnevarne అని కూడా అంటారు)కు ఫిర్యాదు వెళ్లింది. వెంటనే అనురూప్ ఇంటికి బార్నెవార్నె అధికారులు వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె గర్భవతిగా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఈ క్రమంలో.. ఆమె కొడుకు వెళ్లే ప్లే స్కూల్ నిర్వాహకులు.. సాగరిక దినచర్య సరిగా ఉండదని, తరచూ పిల్లాడి విషయంలో కౌన్సిలింగ్‌కు పిలిచేవాళ్లమంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్‌కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంతలో మరో బిడ్డను ప్రసవించాక ఆ పరిస్థితి మరింత దిగజారింది. పిల్లలిద్దరినీ ఆమె సరిగా పెంచడం లేదంటూ.. వాళ్లను తల్లిదండ్రులకు దూరంగా సంరక్షణా కేంద్రంలో ఉంచారు. అలాగే 18 ఏళ్లు నిండేవరకు వారు అక్కడే పెరుగుతారని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. ఇది జరిగింది 2011లో. అప్పటికి కొడుకు వయసు రెండున్నరేళ్లు కాగా, పాపకి ఏడాది వయసు కూడా లేదు. కోర్టుకు వెళ్తే.. సంరక్షణా కేంద్రానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. కావాలంటే ఏడాదిలో మూడుసార్లు మాత్రమే వచ్చి చూడొచ్చంటూ కోర్టు తల్లిదండ్రులకు చెప్పింది. మానసికంగా వాళ్లకు కుంగదీసింది ఈ పరిణామం. ఆ ప్రభావంతో అనురూప్-సాగరికల మధ్య దూరం పెరిగి.. విడిపోయారు. కోల్‌కతా కోర్టు తీర్పు అనంతరం బయట సంతోషంగా సాగరిక మరోవైపు సాగరిక కథ హెడ్‌లైన్స్ ద్వారా భారత్‌కు చేరింది. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దౌత్యపరమైన పరిష్కారం కోసం యత్నించింది. కానీ, నార్వే ప్రభుత్వం మొండివైఖరి అవలంభించింది. చివరికి.. భారత్ ఒత్తిడికి తలొగ్గి బంధువులకు అప్పగించేందుకు నార్వే ప్రభుత్వం అంగీకరించింది. అలా.. 2012లో పిల్లలు భారత్‌లోని తమ బంధువు వద్దకు వచ్చారు. కానీ, సాగరిక తన న్యాయపోరాటం ఆపలేదు. స్వస్థలానికి చేరుకున్నాక.. కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిందామె. 2013 జనవరిలో కోల్‌కతా హైకోర్టు పిల్లలను ఆమె కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఎట్టకేలకు ఆమె బిడ్డలు ఆమె చెంతకు చేరారు. ఆ సమయంలో ఆ తల్లికి అవి వర్ణించలేని క్షణాలు. సాగరిక పోరాటాన్నే ఇప్పుడు తెరపై రాణీ ముఖర్జీ ప్రదర్శించబోతున్నారు. మార్చి 17వ తేదీన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రం విడుదల కానుంది. :::సాక్షి ప్రత్యేకం -
సమంత యాటిట్యూడ్‌కు స్టార్ హీరో ఫిదా.. సినిమాలో అవకాశం!
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగినవారిలో సమంత ఒకరు. మనోజ్ భాజ్‌పాయ్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత 'పుష్ప: ది రైజ్' చిత్రంలోని 'ఊ అంటావా మావ' సాంగ్‌తో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకుంది. దీంతో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సామ్. ప్రస్తుతం సామ్ చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సమంత మరో హిందీ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో సామ్ అందచందాలతో అదరగొట్టడమే కాకుండా, ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మాటలతో హుషారెత్తించింది. సమంతతోపాటు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు. అయితే ఈ షోలో సమంత యాటిట్యూడ్, మాట విధానం, చమత్కారంతో చెప్పిన సమాధానాలకు అక్కీ ఫిదా అయ్యాడట. దీంతో తన తర్వాతి సినిమాలో సమంతకు అవకాశం ఇచ్చినట్లు హిందీ ఫిల్మీ దునియాలో టాక్ నడుస్తోంది. చదవండి: దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. ఇదివరకే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో నటించిన సామ్ పాపులారిటీ ఓ రేంజ్‌కు వెళ్లింది. ఒకవేళ అక్షయ్ కుమార్ సినిమాలో సమంత చేయడం నిజమైతే ఆమె మరోస్థాయికి వెళ్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం హిందీలో వరుణ్ ధావన్‌తో సామ్ సినిమా ఉండనుంది. చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీతో పెళ్లిపై స్పందించిన రకుల్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఛత్రివాలీ’. తేజస్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల లక్నోలో పూర్తయింది. దాదాపు 45 రోజులు ఈ సినిమా కోసం లక్నోలో ఉన్న రకుల్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్నోలో ఇన్ని రోజులు షూటింగ్లో పాల్గొనడం నా కెరీర్లో ఇదే తొలిసారి. ఇండస్ట్రీలో నాకు మార్పు కనిపిస్తోంది. సినిమాల్లో వర్క్ చేసే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మహిళా దర్శకులు, రచయితలు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇదే విధానం భవిష్యత్‌లోనూ కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పింది. చదవండి: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు అలాగే బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానితో తన పెళ్లిపై కూడా స్పందించింది. ‘‘ప్రస్తుతం నా ఏకాగ్రత అంతా పనిపైనే ఉంది. నా ప్రేమ విశేషాలను సరైన సమయంలో చెబుతాను. దేనికైనా టైమ్ రావాలి’’ అంటూ ఓ చాలెంజింగ్ రోల్ వస్తే వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమే అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. కొంతకాలం జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిన రకుల్ ఇటీవల తన రిలేషన్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు రకుల్ కానీ జాకీ భగ్నానీ కానీ స్పందించలేదు. అయితే కేరీర్ ఫుల్ జోష్‌లో ఉండగానే రకుల్ పెళ్లి చేసుకోవడంపై కొందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి: ‘బంగార్రాజు’ మూవీ స్పెషల్ సాంగ్ వచ్చేసింది -
ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది: బాలీవుడ్ హీరో
సాక్షి, ముంబై: కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర పోషించిన నటుడు షేర్షా మూవీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. షేర్షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు సిద్ధార్థ్ సోషల్ మీడియాద్వారా సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) రేటింగ్‌లో 8.8 తో టాప్‌లో నించింది. 'నంబర్ 1 రేటింగ్ హిందీ మూవీ' అంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. (Shershaah Movie: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్) అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర చేయడం, మూవీ విజయవంతంకావడంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇది తనకు చాలా ప్రత్యేకం, ఎప్పటికీ గుర్తుండిపోయేదని పేర్కొన్నాడు. ఈ సందర్బంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అటు కియారా అద్వానీ కూడా సినిమా సక్సెస్ కావడంపై చాలా ఎమోషనల్‌గా ఉంది. దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. సినిమా తాను కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని, తాను అచ్చం డింపుల్లాగా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెకు బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. తాజాగా మూవీలో విక్రమ్ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని వీక్షిస్తూ కియారా భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అయింది. (Shershaah: వెక్కి వెక్కి ఏడ్చిన కియారా అద్వానీ వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
భలే అనుభవం
తమిళ నటుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్ అని అందరికీ తెలిసిందే. హీరోగా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడూ పాటలు రాస్తుంటారు, పాడుతుంటారు కూడా. ‘3, కొడి, మారి, మారీ 2, పటాస్, తిక్క’ సినిమాల్లో పాటలు పాడారాయన. అయితే ఇప్పుడు తొలిసారి రెహమాన్ సంగీతంలో పాడారు ధనుష్. అది కూడా హిందీ సినిమాకి. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్ ఓ హిందీ సినిమా చేస్తున్నారు. ‘అత్రంగీ రే’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ధనుష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఓ పాటను ధనుష్ పాడారు. ఆ పాటకు సంబంధించిన రికార్డింగ్ ఇటీవలే పూర్తయింది. ‘‘రెహమాన్ సార్ మ్యూజిక్‌లో పాడటం ఓ అద్భుతమైన అనుభవం. ఈ జ్ఞాపకం ఎప్పటికీ మిగిలిపోతుంది’’ అన్నారు ధనుష్. -
మన తప్పుకు మనదే బాధ్యత
బాలీవుడ్ ట్రాక్‌పై స్పీడ్ పెంచుతున్నట్లున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ఈ ఏడాది ‘దే దే ప్యార్ దే’ చిత్రంతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న రకుల్ ఈ నెల 15న విడుదల కానున్న ‘మర్జావాన్’ చిత్రంలో నటించారు. ఇటీవలే అర్జున్‌కపూర్‌కు జోడీగా మరో హిందీ చిత్రానికి ఓకే చెప్పారు. తన బాలీవుడ్ కెరీర్ గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో పాతిక చిత్రాలు పూర్తి చేశాను. నటిగా నన్ను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు బాలీవుడ్‌పై కూడా కొంచెం దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగని దక్షిణాది సినిమాలు చేయనని కాదు. కథ, అందులోని నా పాత్రను బట్టి సినిమా చేయాలా? వద్దా అని నిర్ణయించుకుంటాను. కెరీర్ ఆరంభంలో మాత్రమే కాదు.. మరో స్థాయికి ఎదుగుతున్నప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కెరీర్ తడబడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుని వేరే వారిని నిందించడం తగదు. మన తప్పుకు మనదే బాధ్యత. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ప్రస్తుతం హిందీలో మరో మూడు ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు. వేడుకకు రారండోయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనమని ఐఎఫ్ఎఫ్ఐ నుంచి రకుల్‌కు ఆహ్వానం అందింది. ప్రస్తుతానికి రకుల్‌తో పాటు విజయ్ దేవరకొండ, నిత్యా మీనన్, రష్మికా మందన్నాలకు కూడా పిలుపొచ్చింది. జీవన శైలి, కెరీర్ జర్నీ తదితర అంశాలపై వీరు ప్రసంగించనున్నారు. సూపర్స్టార్లు రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్ కలిసి ఈ వేడుక ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. -
తెలుగు పింక్
ఇక పవన్ కల్యాణ్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారా? అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించని సంగతి తెలిసిందే. ఇక హిందీ ‘పింక్’ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్‌ను నిర్మించబోతున్నారు. ‘దిల్’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్ నిర్మాణానికి తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బోనీ కపూర్, ‘దిల్’ రాజు తాజాగా ‘పింక్’ తెలుగు రీమేక్‌ను కూడా నిర్మించబోతుండటం విశేషం. ‘బదాయిహో’ తెలుగు రీమేక్‌లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి.. ‘పింక్’లో పవన్ నటిస్తారా? లేదా? -
మాఫియాలోకి స్వాగతం
సౌత్‌లో మంచి జోరుమీదున్న పూజాహెగ్డే హిందీలో మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హిందీలో ‘ముంబై సాగ’ అనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని తీసుకున్నారని బీటౌన్‌లో కథనాలు వస్తున్నాయి. మరి.. సంజయ్‌గుప్తా వెండితెర మాఫియాలో పూజా జాయిన్ అవుతారా? వెయిట్ అండ్ సీ. హృతిక్‌రోషన్ ‘మొహెంజోదారో’, అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాల్లో పూజా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. జాకీష్రాఫ్, సునీల్æశెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్న ‘ముంబై సాగ’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ప్రభాస్ (‘జాన్’వర్కింగ్ టైటిల్), అల్లు అర్జున్, వరుణ్‌తేజ్ (వాల్మీకి) సినిమాల్లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
మందు పోయడం నేర్చుకున్నా
పాత్రను బట్టి ప్రతి సినిమాకు హీరో, హీరోయిన్లు చాలా కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్త విద్యలు నేర్చుకుంటారు. తన తాజా చిత్రం ‘దేదే ప్యార్ దే’ సినిమా కోసం బార్టెండింగ్ నేర్చుకున్నారట రకుల్ ప్రీత్ సింగ్. బార్టెండింగ్ అంటే బార్లో సర్వ్ చేసే జాబ్. అజయ్ దేవ్గన్, టబు, రకుల్ ప్రీత్‌సింగ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దేదే ప్యార్‌దే’. టబుతో పెళ్లయిన అజయ్ దేవ్గన్ మళ్లీ రకుల్‌ని ప్రేమించడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటి? అన్నది చిత్రకథ. ఈ సినిమా కోసం రకుల్ 8 కిలోల బరువు తగ్గటమే కాకుండా బార్టెండింగ్ కూడా నేర్చుకున్నారు. కొత్త విద్య నేర్చుకోవడం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో అయేషా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర కోసం కొన్ని వారాలు వర్క్‌షాప్‌కి వెళ్లాను. షేకర్స్ని ఎలా ఉపయోగించాలి, డ్రింక్స్ ఎలా కలపాలి, మిక్సర్స్ని కరెక్ట్‌గా ఎలా హ్యాండిల్ చేయాలనేవాటిపై శిక్షణ తీసుకున్నాను. గ్లాసుని గాల్లో ఎలా తిప్పాలి అనేవి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆ పాత్రకు పర్ఫెక్ట్గా కనిపించాలి తప్పితే కొత్తగా అనిపించకూడదు. స్టార్టింగ్‌లో చేతిలో నుంచి గ్లాస్లు జారిపోతుండేవి తర్వాత మెల్లిగా హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను’’ అన్నారు. ‘దేదే ప్యార్‌దే’ సినిమా ఈనెల 17న విడుదలæ కాబోతోంది. -
రివ కిషన్ డాటర్ ఆఫ్ రవికిషన్
మద్దాలి శివారెడ్డిగా అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు భోజ్‌పురి నటుడు రవికిషన్. ఆ తర్వాత ఆయన ‘కిక్ 2, సుప్రీమ్, రాధ, లై’ వంటి సినిమాలు చేశారు. అటు హిందీలోనూ పలు చిత్రాలు చేశారాయన. ఇప్పుడు ఆయన కుమార్తె రివ కిషన్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. బాలీవుడ్లో నటి పద్మినీ కోల్హాపురి, నిర్మాత ప్రదీప్ శర్మల కుమారుడు ప్రియాంక్ ప్రదీప్ శర్మ ‘సబ్ కుశల్ మంగళ్’ అనే సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయం అవ్వబోతున్నారు. ఈ సినిమాలోనే హీరోయిన్గా ఎంపికయ్యారు రివ కిషన్. ‘‘నేను హిందీ సినిమా చేయబోతున్నందుకు నాన్నగారు సంతోషంగా ఉన్నారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు రివ కిషన్. ప్రస్తుతం ఈ సినిమా వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు రివ అండ్ ప్రియాంక్. ఈ చిత్రం మార్చిలో జార్ఖండ్‌లో స్టార్ట్ కానుంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో కరణ్ కశ్యప్ దర్శకునిగా పరిచయమవుతారు. ఇందులో నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలక పాత్ర చేయనున్నారు. -
అన్న డాన్.. తమ్ముడు సైకో!
‘కళంక్, ప్రస్థానం హిందీ రీమేక్, పానిపట్, షంషేర్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు సంజయ్‌దత్. మరో హిందీ సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అద్నాన్ షేక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ బాంబీ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. 1920 కాలంనాటి ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ టాక్. ఇందులో పవర్ఫుల్ డాన్ పాత్రలో సంజయ్‌దత్ నటించనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో సంజయ్ బ్రదర్‌గా నటుడు బాబీ డియోల్ కనిపిస్తారు. బాబీ పాత్ర కొంచెం సైకోలా ఉంటుందట. ‘‘ఇది ఎవరి లైఫ్ ఆధారంగా తీయబోతున్న సినిమా కాదు. ఫిక్షనల్ స్టోరి. ముంబైలో అండర్‌వరల్డ్ ఉండే నాటి పరిస్థితులను చూపించాలనుకుంటున్నాం. కొన్ని నిజ సంఘటనల రిఫరెన్స్ తీసుకుంటాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కొత్తగా కనిపిస్తా
రకుల్ ప్రీత్‌సింగ్ ఇంటి డోర్‌ని ఈ మధ్య తట్టిన అవకాశాలన్నీ బాలీవుడ్, కోలీవుడ్ నుంచే వచ్చినట్టున్నాయి. అందుకే ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో పాత్ర తప్ప ఆమె చేస్తున్న మిగతావన్నీ హిందీ, తమిళ సినిమాలే. ‘వెంకీమామ’ సినిమా కమిట్ అయ్యారనే వార్త ఉంది. ఇప్పటికే హిందీ చిత్రం ‘దేదే ప్యార్ దే’ షూటింగ్ పూర్తి చేసిన రకుల్ తాజాగా మరో హిందీ సినిమా కూడా ఓకే చేశారు. మిలాప్ జవేరీ దర్శకత్వంలో ‘మర్జావా’ చిత్రంలో హీరోయిన్గా ఎంపికయ్యారామె. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా నటిస్తారు. తారా సుతారియా మరో హీరోయిన్. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్గా రకుల్ కనిపిస్తారట. ఈ సినిమాలో తన పాత్ర గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మిలాప్ నాకీ స్క్రిప్ట్ వినిపించగానే నచ్చింది.నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏదైనా చేయాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి పాత్ర అది. అలాగే నా పాత్రకు మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్ర పోషించలేదు. ఇందులో కొత్తగా కనిపిస్తాను. సిద్ధార్థ్‌తో ‘అయ్యారే’ తర్వాత మళ్లీ యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఇక అజయ్ దేవగన్, రకుల్, టబు తదితరులు నటించిన ‘దేదే ప్యార్ దే’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. తమిళంలో సూర్యతో ‘ఎన్జీకే’, కార్తీ సరసన ‘దేవ్’ చిత్రాలతో పాటు శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు రకుల్. -
ధైర్యం కావాలి
ఈ ఏడాది ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ఇటు బాలీవుడ్ సినిమాలతో పాటు అటు హాలీవుడ్ చాన్స్‌లను దక్కించుకుంటున్నారు. మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. అలాగే కల్కి కోచ్లిన్ మరో కథానాయిక. మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో ఓ డైనమిక్ లేడీ పాత్రలో కనిపించనున్నారు రాధిక. ‘‘ఓ ఖాళీ ప్రదేశంలో కనిపించకుండా ఉన్నారు. వారిని దాటుకుంటూనే చాలామంది వెళ్తుంటారు. ఆ కనిపించనివారికి హలో కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. కమింగ్ సూన్’’ అని ఈ సినిమా కథనాన్ని వివరించే ప్రయత్నం చేశారు రాధిక. ‘‘ఈ మూవీలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. ఈ నెల 13న మరిన్ని వివరాలు చెబుతాం’’ అని రాజ్‌కుమార్ రావు పేర్కొన్నారు. -
కృతి కంటే ముందు వంద మంది
వందమంది కాదు, లెక్క అంతకు మించే అట! ఎవరూ నచ్చలేదు. వచ్చిన వాళ్లను వచ్చినట్టే వెనక్కి పంపించేశారు దర్శక–నిర్మాతలు. చివరకు, కృతీ కర్భందాలో వాళ్లకు కావలసిన హీరోయిన్ కనిపించింది. అంటే... కృతి కంటే ముందు ఆమె నటించిన క్యారెక్టర్‌కు వందమందికి పైగా ఆడిషన్ ఇచ్చారన్న మాట! ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తున్న హిందీ సినిమా ‘షాదీ మే జరూర్ ఆనా’ సినిమా కోసమే ఇదంతా! రాజ్‌కుమార్ రావ్ ఇందులో హీరో. కృతీ కర్భందా హీరోయిన్. తెలుగులో ‘తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ’ సినిమాల్లో హీరోయిన్గా చేశారీమె. ‘బ్రూస్లీ’లో రామ్‌చరణ్‌కి అక్కగానూ నటించారు. అయితే.. పెద్దగా బ్రేక్ రాలేదు. ఇటువంటి టైమ్‌లో హిందీలో ఈ సినిమా చాన్స్ వచ్చింది. సినిమాకు మంచి పేరొస్తే... కృతి కెరీర్ హిట్ టర్న్ తీసుకున్నట్టే!! -
అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే..
అత్యాచారాల బారి నుంచి బయటపడ్డప్పుడే మహిళలకు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని నటి తాప్సీ వ్యాఖ్యానించారు. బోల్డ్ నటీమణుల్లో ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నాయకిగా గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం హిందీ చిత్రాల పైనే పూర్తి దృష్టి సారిస్తున్నారు. మహిళల స్వాతంత్య్రం గురించి ఆ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ ఒక మహిళ ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా నడవ గలుగుతుందో అప్పుడే స్త్రీలకు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని బాబూజీ అన్న విషయం తెలిసిందేనన్నారు. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిర్భయను కిరాతక గుంపు నాశనం చేసిన సంఘటనను మరిచిపోగలమా? అన్నారు. ఎక్కడ చూసినా మహిళా అరాచకాలేనన్నారు. మానభంగాలకు గురవుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు లేని ఇండియాను చూడాలని ఆశపడుతున్నట్లు నటుడు అమితాబ్‌బచ్చన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఆశ తనకూ ఉందన్నారు. అత్యాచారాల బారి నుంచి బయట పడిన ప్పుడే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు అని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలన్నారు. తాను పింక్ అనే హిందీ చిత్రంలో మానభంగానికి గురైన యువతిగా నటించాన ని చెప్పారు. ఆ పాత్రలో నటించినప్పుడు మానభంగానికి గురయ్యే మహిళలు ఎంత కష్టపడతారన్నది అర్థమైందన్నారు. తాను షూటింగ్లో ఏడ్చేశానని, ఇది షూటింగే కదా అని యూనిట్ వర్గాలు సముదాయించారని తెలిపారు. మహిళలు రక్షించబడాలి, గౌరవించబడాలి అని అన్నారు. పింక్ చిత్రం చూసిన వారు అత్యాచారానికి గురైన ఒక స్త్రీ మనోవేదనను అర్థం చేసుకుంటారని, ఇలాంటి అత్యాచారాలు తగ్గుతాయనే అభిప్రాయాన్ని తాప్సీ వ్యక్తం చేశారు. -
తిక్క నిండిన తెలివైనోడు... వర్మ!
ఇటీవలే హైదరాబాద్ నుంచి ముంబయ్‌కి మకాం మార్చేసి, మళ్ళీ చేతి నిండా హిందీ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. విజయవాడలోని ఒకప్పటి గ్యాంగ్‌వార్‌ల నేపథ్యంలో తెలుగులో ‘వంగవీటి’ చిత్రానికి శ్రీకారం చుట్టిన వర్మ మరోపక్క మూడు, నాలుగు హిందీ ప్రాజెక్ట్‌ల ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ నిశ్శబ్దంగా చేస్తున్నారట! వాటిలో ఒకప్పటి అండర్‌వరల్డ్ క్రైమ్ సినిమా ‘కంపెనీ’కి సీక్వెల్ ‘కంపెనీ-2’ కూడా ఉంది. పధ్నాలుగేళ్ళ క్రితం 2002లో ‘కంపెనీ’తో సినీ రంగ ప్రవేశం చేసిన హీరో వివేక్ ఓబెరాయ్ ఇప్పుడీ సీక్వెల్లో కూడా కథానాయకుడు. ‘‘గ్యాంగ్‌స్టర్ సినిమాలు, నేరసామ్రాజ్యం నేపథ్యంలో నడిచే క్రైమ్ సినిమాలు తీయాలంటే వర్మను మించిన మేధావి మరొకరు లేరు. ఆయన పనితనమంటే నాకు చాలా ఇష్టం’’ అని 39 ఏళ్ళ వివేక్ ఓబెరాయ్ అంటున్నారు. ‘‘వర్మ పని అయిపోయిందని చాలామంది అంటున్నారు. కానీ, నాకు వాటితో పని లేదు. నా దృష్టిలో ఆయన తిక్క నిండిన తెలివైనవాడు’’ అని వివేక్ వ్యాఖ్యానించారు. ‘‘వర్మతో ‘కంపెనీ-2’ చేయడం గురించి ఆందోళన పడట్లేదు. నా కెరీర్లో కూడా ఒడుదొడుకులున్నాయి. కానీ, మేమంతా మళ్ళీ పుంజుకుంటాం’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతగా వివేక్ తొలి ప్రయత్నం దావూద్ ఇబ్రహీమ్ ముఠా ‘డి-కంపెనీ’ వివరాలను ఆధారంగా చేసుకొని అజయ్ దేవ్‌గణ్, మనీషా కొయిరాలా, మోహన్‌లాల్ ప్రభృతులతో అప్పట్లో వర్మ ‘కంపెనీ’ తీశారు. ‘‘అది 14 ఏళ్ళ క్రితం సంగతి. ఆ సినిమా ద్వారా హిందీ చిత్రసీమలో నాకు స్థానం కల్పించిన వర్మకు కృతజ్ఞతలు. నాలోని ప్రతిభను ఆయనే బయటకు తీశారు. ఆ కెరీర్లో మైలురాయిగా నిలిచి, సినీ చరిత్రలో అందరికీ గుర్తుండిపోయిన ఆ సినిమాకు తగ్గట్లే ఇప్పుడీ రెండో పార్ట్‌ను కూడా ఆసక్తికకరంగా తీర్చిదిద్దుతున్నాం’’ అని వివేక్ ఓబెరాయ్ చెప్పారు. ఈ సినిమాతో వివేక్ నిర్మాత అవతారం కూడా ఎత్తడం విశేషం. హిందీ, తెలుగు, తమిళాల్లో రూపొందే ఈ చిత్రంలోని తన పాత్ర గురించి మాత్రం ఆయన పెదవి విప్పలేదు. ఈ ఏడాది మధ్యలో ఈ ‘కంపెనీ-2’ సెట్స్ మీదకు వెళ్ళనుంది. -
మరో హాలీవుడ్ సినిమాలో?
ఇక దీపికా పదుకొనె హిందీ సినిమాల్లో నటించడం కష్టమేనా? కొత్తగా ఆరంభమయ్యే హిందీ సినిమాల్లో నటించరా? ప్రస్తుతం హిందీ రంగంలో వాడిగా వేడిగా జరుగుతున్న చర్చ ఇది. దానికి కారణం లేకపోలేదు. గత ఏడాది నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత దీపిక వేరే హిందీ చిత్రం అంగీకరించిన దాఖలాలు లేవు. హాలీవుడ్లో విన్ డీజిల్ సరసన ‘ఎక్స్ఎక్స్ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ అనే చిత్రంలో నటిస్తున్నారామె. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ స్లిమ్ బ్యూటీ కచ్చితంగా హాలీవుడ్ వారిని కూడా ఆకట్టుకుంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా విడుదలకు ముందే అక్కడి దర్శక-నిర్మాతల దృష్టి దీపికా పదుకొనె మీద పడినట్లుంది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే హాలీవుడ్లో రెండో అవకాశం దక్కించుకున్నారని భోగట్టా. అది కూడా హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్ పిట్ సరసన అని నెట్లో వార్తలు షికారు చేస్తున్నాయి. హాలీవుడ్లో మొదటి సినిమా అంగీకరించిన కొన్ని నెలలకే మరో అవకాశం దీపికను వరించడం సహజంగానే హాట్ టాపిక్ అయింది. చూడబోతుంటే.. హాలీవుడ్లో దీపిక హవా కొనసాగేలా ఉంది. -
ఒంటరిగా ఎగిరిపోతే నా మనసు రోజూ...
ఈడొచ్చిన పిల్లల్లో సహజంగా ఉద్భవించే హార్మోన్ల వల్ల కలిగే భావుకత్వంతో కూడిన ఆలోచనలు.. అందుకు తగ్గట్టుగా మారే ప్రవర్తన.. తద్వారా ఎదురయ్యే పరిణామాలు.. ఆ అనుభవాలు వాళ్లను ఏ తీరాలకు తీసుకెళతాయనే..పరస్సర విరుద్ధ భావాల్ని సోకాల్డ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లుగా కాకుండా అంతరాత్మ ఉట్టిపడేలాంటి చిత్రాన్ని ఒకే కాన్వాసుపై చిత్రీకరిస్తే.. ఓపెనింగ్ సీన్.. అప్పటివరకు తనలోని అనైతికతను అణుచుకుంటూ వచ్చిన దీపా పాఠక్ అనే విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి లాడ్జి రూమ్‌కి వెళుతుంది. అక్కడ వాళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో (ఇద్దరున్నప్పుడు అది ఏకాంతమెలా అవుతుంది?) పోలీసులు సీన్లోకి వస్తారు. ఇద్దరూ పట్టుబడతారు. ఏమీ జరగకపోయినా తమ తప్పును ఒప్పుకుంటారు. ఆ కన్ఫెషన్ సీన్ మొత్తాన్ని వీడియో తీసి దాచుకుంటాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఆ వీడియోతో అతడేం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదనుకుంటాం. కానీ చెప్పుకోవాల్సిందే.. పోలీసుకు కావాల్సింది ఆ అమ్మాయి కాదు డబ్బు. పెద్ద మొత్తంలో డబ్బిస్తేగానీ ఆ వీడియోను, ఆమెపై ఉన్న కేసును కొట్టేయనని బెదిరిస్తాడు. ఎవరిని? అమ్మాయిని కాదు వాళ్ల నాన్నను. ఆ తండ్రి చేసేదీ మామూలు పనేమీకాదు.. కాశీలో బాగా డిమాండ్ ఉన్న 'కర్మకాండల పూజారి' పని. కూతురి మీద పడ్డ నిందను తుడిచేసుకునే క్రమంలో ఎంత సంపాదించినా సరిపోవట్లేదని భావించిన ఆ పూజారి.. అదనపు సంపాదన కోసం అప్పటికే బడి మానేసిన ఓ పదేళ్ల కుర్రాణ్నిఅసిస్టెంట్గా పెట్టుకుంటాడు. .. మెడకు డోలన్నట్లు అసిస్టెంట్‌ని పెట్టుకుంటే సంపాదనెలా పెరుగుతుంది? పెరుగుతుంది. అంతే. అది కాశీ మరి. దేశంలో డబ్బున్న మారాజులందరూ కర్మకాండలకు అక్కడికే వస్తారు. వేల రూపాయల నాణాలను గంగకు సంతర్పణం చేస్తారు. నది అడుగు భాగానికి వెళ్లి ఆ నాణాలను వెతికి తీసుకురావడమే అసిస్టెంట్ పని. అలా నాణాల కోసం వెళ్లి చనిపోయేవారి సంఖ్య తక్కుమేమీకాదు. అయినాసరే కూతురి కోసం అసిస్టెంట్ కుర్రాడి జీవితాన్ని రిస్కులో పెట్టక తప్పదు ఆ తండ్రిగారికి. ఏంటిదంతా? అడుసు తొక్కనేల? కాలు కడగనేలా? అనుకునే అవకాశం ప్రేక్షకుడికి రానేరాదు ఎందుకంటే.. చైతన్య స్రవంతి (స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్) ని కళ్లతో చూడగలమా? అది సాధ్యమేనా? అనే ప్రశ్నకు చాలా ఏళ్ల తర్వాత దొరికే లేదా దొరికిన సమాధానం 'మసాన్'. సహజంగానే విరుద్ధ స్వభావానికి దగ్గరిగా పరుగెత్తే మనుషులకు.. అలా మారిపోయే ప్రక్రియను మరింత సులభతరం చేసిన నేటి సామాజిక, సాంకేతిక పరిస్థితులను ఒడిసిపట్టడం.. వంద ఆలోచనల్ని ఒక్క కాన్వాసుగా గీసినంత పని. ఆ పనిని తన మొదటి సినిమాలోనే అత్యద్భుతంగా చేసి చూపాడు దర్శకుడు నీరజ్ ఘవాన్. ఈ సినిమాకు ముందు ఆయన అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. రోడ్డుకు ఎడమవైపు కేవలం ఆభరణాలు మాత్రమే ధరించి వనిత ఫుల్ సైజ్ ఫ్లెక్సీ .. రోడ్డు మధ్యలో డివైడర్ మీద సిక్స్ ప్యాక్ ఇలా అంటూ చెడ్డీ మీద నించున్న స్మార్ట్ గైయ్ యాడ్. తల పైకెత్తి చూస్తే 'పైకి రా' అనే టైటిల్‌తో U/A సినిమా పోస్టర్. అన్ని చోట్లా ఒలికేది శృంగార రసమే. ఇక చేతిలో సెల్ ఫోన్లయితే ఆ రసాన్ని మరింతగా ఒలికించగలిగే సాధనం. నైతికతను కనీసం గుర్తుచేయకుండా ఉంచగలిగేంత టెక్నాలజీ సిగ్నళ్ల మధ్య అనైతికంగా ఉండొద్దనే ఉద్భోదకు ఫ్రీక్వెన్సీ తక్కువ. మ్యాగ్నిట్యూడ్.. హ్యూమనిట్యూడయితే అసలు ఉండనే ఉండవు. ఇంత గందరగోళంలో యువతరం ఎలా మనగలుగుతోంది? తన భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటోంది? తనను తాను ఎలా మౌల్డ్ చేసుకుంటున్నారు? ఇలాంటి మౌలికమైన భారీ ప్రశ్నలకు అత్యల్ప (కేవలం రెండు గంటల్లో) సమయంలో సమాధానం చెప్పేందుకు చేసిన ప్రయత్నమే 'మసాన్'. తర్వాతి కథ.. చదువు పూర్తయిన తర్వాత దీపకు రైల్వే బుకింగ్ క్లర్క్ ఉద్యోగం వస్తుంది. ఓ రోజు ఆమె బుకింగ్ కిటికీ ముందు నిల్చుని ఓ అబ్బాయి-అమ్మాయి జంట ఏదైనా చోటుకు పోయి, రాత్రికి కలసి గడపాలని రెండు టికెట్లు అడుగుతారు. అది చూసి దీప బిర్రబిగుసుకుపోతుంది. అసమ్మతి పూర్వకమైన ఆమె కళ్లు మానిటర్‌ను చూసే సరికి 26 ఖాళీ సీట్లు కనిపిస్తుంటాయి. కానీ ఆమె వారికి లేవని చెబుతుంది. ఎందుకంటే రెండు గంటలపాటు ఒక బాయ్‌ఫ్రెండ్‌తో తను సన్నిహితంగా గడిపితే, ఆ తర్వాత ఎంతటి అపనిందలు, వేధింపులకు గురి కావాల్సి వస్తుందో ఆమెకు తెలుసు. మరోవైపు.. నాణానికి రెండు వైపులున్నట్లు.. చావు పుట్టుకలు కాశీ మనుగడకు కీలక ఆధారాలు. దివ్య కథతోపాటే షాలూ గుప్తా, దీపక్ కుమార్ల కథా సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. కాశీ ఘాట్లలో శవాలను తగలబెట్టే వృత్తిపని చేసేవాళ్లను 'డోమ్' అంటారు. ఆ కులానికి చెందిన దీపక్ కుమార్ (విక్కీ కౌశల్) ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతుంటాడు. ఉన్నత వర్గానికి చెందిన శాలూ గుప్తాతో ప్రేమలో పడతాడు. నిజానికి దీపక్ ప్రేమలో ఉన్నాడు అనేకంటే ఆత్మన్యూనతలో ఉంటాడని ఇట్టే అర్థమవుతుంది మనకు. 'నేను కాల్చే శవాలతోపాటే నా మనసూ రోజూ కాలిపోతూ ఉంటుంది' అని శాలూకు చెప్తూంటాడు. ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లా అనిపించే శాలూ మాత్రం ఇవేవీ పట్టించుకోదు. 'పారిపోవడం తప్పుదుకదా.. అప్పుడు తప్పకుండా పారిపోదాం' అని దీపక్ తో అంటుంది. ఇది ప్రేమా? లేక అనైతికత రుచి కోసం ఎంత రిస్క్ అయినా భరించాలనుకునే హార్మోన్ల ప్రభావమా? అనే మానసిక సంఘర్షణను తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు నీరజ్. దీప పాత్రలో రిచా చద్దా, పురోహితుడిగా ఆమె తండ్రి విద్యాధర్ పాఠక్ పాత్రలో సీనియర్ నటుడు సంయన్ మిశ్రా, వల్లకాట్లో పనిచేస్తూ ఇంజనీరింగ్ చదివే దీపక్ కుమార్ పాత్రలో విక్కీ కౌషల్, శాలూ గుప్తాగా శ్వేతా త్రిపాఠి అభినయం అవార్డులతోపాటు ప్రేక్షకుల హృదయాలూ గెల్చుకునే స్థాయిలో ఉంటుంది. ఇవికాకుండా ఇన్ స్పెక్టర్ సహా కేవలం తొమ్మిది లేదా పది క్యారెక్టర్లతో బిగుతైన స్క్రీన్ ప్లే రాసుకుని, అనుకున్నట్లే తెరకెక్కించాడు దర్శకుడు నీరజ్ ఘవాన్. 'మసాన్' అంటే అర్థం 'ఒంటరిగా ఎగిరిపో' అని. -
'మద్రాస్ కేఫ్' రాజీవ్ హత్యకు సంబంధించినది కాదు
శ్రీలంకలో సాగుతున్న అంతర్యుద్ధంపై తాను తీస్తున్న 'మద్రాస్ కేఫ్' చిత్రంలో రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నమాట వాస్తవమే గానీ, ఆ సినిమా మాత్రం రాజీవ్ గురించి కానే కాదని చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్ తెలిపారు. చిత్ర నిర్మాత, బాలీవుడ్ హీరో, ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి జాన్ అబ్రహంతో కలిసి ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ హత్యకు సంబంధించిన సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అనుమతి ఏమైనా తీసుకున్నారా అని విలేకరులు సర్కార్‌ను ప్రశ్నించారు. దీనిక.. ఇది రాజీవ్ జీవిత చిత్రం కాదని, ఆయన పాత్రధారికి, రాజీవ్ గాంధీకి కొన్ని పోలికలు ఉన్నమాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం సభ్యుల దాడిలో రాజీవ్ మరణించగా, అలాంటి సంఘటననే సినిమా ట్రైలర్లో చూపించారు. అయితే, తాము వార్తాపత్రికలలో చదివి మాత్రమే ఆ సంఘటనను తీసుకున్నామని, ఇక దానిచుట్టూ ఉన్న మిగిలిన సంఘటనలను మాత్రం స్క్రిప్టు రచనలో ఊహాత్మకంగా రూపొందించినవేనని సర్కార్ చెప్పారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, అయితే.. ప్రతి ఒక్కరికీ ఆ సంఘటన జరిగిందని మాత్రం తెలుసని ఆయన అన్నారు. మద్రాస్ కేఫ్ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. అయితే, దీనిపై ఇప్పటికే నామ్ తమిళర్, ఎండీఎంకే లాంటి పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎల్టీటీఈ కార్యకర్తలను ఇందులో ఉగ్రవాదులుగా చూపించారంటూ వారు మండిపడుతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ చిత్ర ప్రాజెక్టుపై ఏడు సంవత్సరాలు వెచ్చించిన సర్కార్ మాత్రం.. ఈ సన్నివేశం చిత్రానికి చాలా కీలకమని వాదిస్తున్నారు. తమ చిత్రంలో జాతికి జరిగిన నష్టం గురించి మాత్రమే చెబుతున్నామన్నారు. చాలామంది పౌరులు అక్కడ ప్రాణాలు కోల్పోయారని, ఇంకా చాలామంది నిరాశ్రయులుగా మారిపోయారని, అక్కడి సజీవ చిత్రాన్నే తాము చూపిస్తున్నామని అన్నారు.