వందమంది కాదు, లెక్క అంతకు మించే అట! ఎవరూ నచ్చలేదు. వచ్చిన వాళ్లను వచ్చినట్టే వెనక్కి పంపించేశారు దర్శక–నిర్మాతలు. చివరకు, కృతీ కర్భందాలో వాళ్లకు కావలసిన హీరోయిన్ కనిపించింది. అంటే... కృతి కంటే ముందు ఆమె నటించిన క్యారెక్టర్‌కు వందమందికి పైగా ఆడిషన్ ఇచ్చారన్న మాట! ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తున్న హిందీ సినిమా ‘షాదీ మే జరూర్ ఆనా’ సినిమా కోసమే ఇదంతా! రాజ్‌కుమార్ రావ్ ఇందులో హీరో. కృతీ కర్భందా హీరోయిన్. తెలుగులో ‘తీన్‌మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేశారీమె. ‘బ్రూస్‌లీ’లో రామ్‌చరణ్‌కి అక్కగానూ నటించారు. అయితే.. పెద్దగా బ్రేక్ రాలేదు. ఇటువంటి టైమ్‌లో హిందీలో ఈ సినిమా చాన్స్ వచ్చింది. సినిమాకు మంచి పేరొస్తే... కృతి కెరీర్ హిట్ టర్న్ తీసుకున్నట్టే!!
Comments
Please login to add a commentAdd a comment