తాళి, గాజులు.. అన్నీ తనకే! అందుకే పెళ్లిలో అలా చేశా..: హీరో | Rajkummar Rao reveals Reason Behind Patralekha Put Sindoor on Him at Wedding | Sakshi
Sakshi News home page

Rajkummar Rao: తాళి, గాజులు, సింధూరం.. అన్నీ అమ్మాయికే! మరి నాకు..?

Published Thu, Nov 28 2024 6:38 PM | Last Updated on Thu, Nov 28 2024 7:08 PM

Rajkummar Rao reveals Reason Behind Patralekha Put Sindoor on Him at Wedding

పెళ్లిలో భార్యతో నుదుటన సింధూరం పెట్టించుకున్నాడు బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావు. ఇద్దరం సమానమే అని నిరూపించడానికే ఈ పని చేశానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్‌ కుమార్‌ రావు మాట్లాడుతూ.. పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు ఓ విషయం అర్థం కాలేదు. మంగళసూత్రం, సింధూరం, గాజులు అన్నీ పాత్రలేఖ ధరించి ఉంది. 

మంత్రాలకు అర్థం చెప్పమన్నా..
నా వేలికి ఒక ఉంగరం మాత్రమే ఉంది. అప్పుడు తనను.. నువ్వు కూడా నా నుదుటన బొట్టు పెట్టు, అప్పుడు ఇద్దరం సమానమవుతామని చెప్పాను. నా మాటలు విని పాత్రలేఖ చాలా సంతోషించింది. అంతేకాదు పూజారి వేద మంత్రాలు చదువుతున్నప్పుడు దాని అర్థాలు కూడా విడమరిచి చెప్పమన్నాను. ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకోవాలనుకున్నాను. 

నాపై కోప్పడకూడదట
అలా ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకునే క్రమంలో కొన్ని నాకు మింగుడుపడలేదు. ఉదాహరణకు ఓ మంత్రంలో ఏమని ఉందంటే.. నా భార్య నాపై కోప్పడకూడదట! అది విని ఆశ్చర్యపోయాను. ఆ లైన్‌ చదివేందుకు నేను ఒప్పుకోలేదు. తనకు నచ్చినట్లుగా ఉండాలంతే అని చెప్పాను  అంటున్నాడు రాజ్‌కుమార్‌.

సినిమా
రాజ్‌కుమార్‌ రావు, పాత్రలేఖ 2010లో ఓ మ్యూజిక్‌ వీడియో షూటింగ్‌లో పరిచయమ్యారు. ఆ పాట షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డారు. 2021 నవంబర్‌ 15న చంఢీగడ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యే మూడో పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇకపోతే రాజ్‌కుమార్‌ రావు ఈ ఏడాది.. స్త్రీ 2, శ్రీకాంత్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, విక్కీ విద్యకా వో వాలా వీడియో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement