అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్‌ | Bachhala Malli Official Teaser Out Now | Sakshi
Sakshi News home page

అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్‌

Nov 28 2024 5:02 PM | Updated on Nov 28 2024 5:11 PM

Bachhala Malli Official Teaser Out Now

అల్లరి నరేశ్‌ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా టీజర్‌ విడుదలైంది. డిసెంబర్‌ 20న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్‌ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్‌ కుమార్,  బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు.

‘బచ్చల మల్లి’ సినిమాలో అల్లరి నరేశ్‌ లుక్‌ చాలా రగ్గడ్‌గా ఉంది. ఈ మూవీ టీజర్‌ గమనిస్తే ఆయన పాత్ర చాలా మాస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్‌ మెప్పించేలా ఉన్నాయి. 'మందుతో పాటు అప్పడప్పుడు నాకు అమ్మాయిల అలవాటు కూడా ఉంది' అంటూ అల్లరి నరేశ్‌  చెప్పే డైలాగ్స్‌ యూత్‌ను ఆకట్టుకునేలా టీజర్‌లో ఉన్నాయి. డిసెబర్‌ 20న ఈ మూవీ విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement