Bachhala Malli Movie
-
బచ్చలమల్లి గ్లింప్స్: ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి?
అల్లరి నరేశ్ ఇటీవల 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిట్టవుతుందని ఆశించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ హీరో మాస్ లుక్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అల్లరి నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న మూవీ బచ్చల మల్లి. ఇందులో మల్లి అనేది హీరో పేరు కాగా బచ్చల ఇంటి పేరు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక.నేడు (జూన్ 30) అల్లరి నరేశ్ బర్త్‌డే సందర్భంగా బచ్చల మల్లి సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో.. తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైకును కోపంతో నేలకు విసిరేశాడు. తర్వాత ఓ సీన్లో ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి? అంటూ మందు తాగి తన చుట్టూ ఉన్నవారిని చితబాదాడు. ఈ గ్లింప్స్‌లో మల్లి గడ్డం, జుట్టుపెంచుకుని ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె! -
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాను: రాజేష్ దండా
‘‘మా హాస్య మూవీస్‌లో ‘ఇట్లు మారేడుమిల్లి, ఊరిపేరు భైరవకోన, సామజవరగమన’ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాను. ‘అల్లరి’ నరేశ్, సందీప్ కిషన్, శ్రీవిష్ణు, కిరణ్ అబ్బవరం వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాను. నాకు కాంబినేషన్ కాదు.. కథే ముఖ్యం. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత రాజేశ్ దండా. సోమవారం రాజేశ్ దండా విలేకరులతో మాట్లాడుతూ–‘‘స్వామి రారా’ చిత్రంతో పంపిణీదారునిగా నా ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 82 సినిమాలు రిలీజ్ చేశాను. అనిల్ సుంకరగారితో కలిసి ‘సామజవరగమన, ఊరిపేరు భైరవకోన’ వంటి చిత్రాలు నిర్మించా. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌తో తీస్తున్న ‘బచ్చలమల్లి’ 50 శాతం పూర్తయింది. అలాగే సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా ఉంది. చిరంజీవిగారి కోసం ప్రసన్నకుమార్ బెజవాడ రెడీ చేసిన కథతోనే సందీప్ కిషన్ మూవీ తీస్తున్నాం అనడంలో వాస్తవం లేదు. ఇక ఓ స్టార్ హీరోతో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నా. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు.