డ్రీమ్ గర్ల్, క్వీన్, ప్రిన్సెస్ లాంటి పాత్రలు వస్తే చేయాలని ఉంది అంటోంది ‘హను-మాన్’ ఫైం అమృత అయ్యర్. అల్లరి నరేశ్, అమృత జంటగా నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అమృత అయ్యర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ హనుమాన్ షూట్ చేస్తున్నపుడు బచ్చల మల్లి కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్ కి కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది.
→ 80లలో జరిగిఏ కథ ఇది. నాది సిటీ కల్చర్ ఉన్న టౌన్ అమ్మాయి పాత్ర. తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది.
→ నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు. అన్ స్క్రీన్ అగ్రీసివ్ క్యారెక్టర్ వుంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్శన్. చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.
→ మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన. బచ్చలమల్లి లో కూడా చాలా మంచి పాత్ర. చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది.
→ సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్. చాలా ఫోకస్ గా ఉంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు. బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
→ ఓ కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment