
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్‌తోనే ప్రేక్షకులను మెప్పించిన నరేశ్ ఇప్పుడు ట్రైలర్‌తో మరింత ఆసక్తి పెంచాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు.
ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment