‘‘బచ్చలమల్లి’ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్ లో కూడా వచ్చేసింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అనేది కాలమే నిర్ణయిస్తుంది’’ అని నాని అన్నారు. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిచన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఈ నెల 20న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగాపాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ చూసి, నరేశ్‌కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పి, నాకు నేనుగా ఈ ఈవెంట్‌కు వచ్చాను. ట్రైలర్‌లోనే సుబ్బు కథ చె΄్పాలనుకున్నాడంటే, సినిమాలో ఇంకా నిజాయతీగా ప్రయత్నించి ఉంటాడని ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.
ఈ క్రిస్మస్ మనదే’’ అన్నారు. ‘‘నాని మా ఫ్యామిలీ మెంబర్. 16 ఏళ్ల నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. నా ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు నాకు కొంత టెన్షన్ ఉంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘మజ్ను’ టైమ్ నుంచి నానిగారు నాకు తెలుసు.
ఆయన ఈవెంట్‌కి రావడమే ఓ బ్లాక్‌బస్టర్ కొట్టేశామనే ఫీలింగ్ కలుగుతోంది. నేను రాసిన దాన్ని నరేశ్‌గారు అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు సుబ్బు మంగాదేవి. ‘‘ఈ క్రిస్మస్‌కి బచ్చలమల్లి మోత మోగిపోద్ది. సినిమా విజయం పట్ల టీమ్ అంతా నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపారు రాజేష్ దండా.
Comments
Please login to add a commentAdd a comment