అల్లరి నరేశ్ బచ్చలమల్లి.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది | Allari Naresh Bachhala Malli Ade nenu Asalu Nenu Song Out Now | Sakshi
Sakshi News home page

Allari Naresh: అల్లరి నరేశ్ బచ్చలమల్లి.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది

Published Fri, Nov 22 2024 12:54 PM | Last Updated on Fri, Nov 22 2024 12:57 PM

Allari Naresh Bachhala Malli Ade nenu Asalu Nenu Song Out Now

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్‌ నటిస్తోన్న తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు.

తాజాగా ఈ మూవీ నుంచి అదేనేను.. ‍అసలు నేను అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్‌ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష  కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement