మారుతీనగర్ సుబ్రమణ్యం హీరో లేటేస్ట్ మూవీ.. సాంగ్‌ రిలీజ్ | Tollywood Hero Ankith Koyya latest Movie Beauty Song Release | Sakshi
Sakshi News home page

Beauty Movie: మారుతీనగర్ సుబ్రమణ్యం హీరో లేటేస్ట్ మూవీ.. కన్నమ్మ సాంగ్‌ రిలీజ్

Published Sun, Apr 6 2025 8:11 PM | Last Updated on Sun, Apr 6 2025 8:12 PM

Tollywood Hero Ankith Koyya latest Movie Beauty Song Release

టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తోన్న తాజా చిత్రం బ్యూటీ. ఈ సినిమాకు భలే ఉన్నాడే ఫేమ్ జేఎస్‌ఎస్‌ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి కన్నమ్మ అనే బ్యూటీఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను సనారే రాయగా..  ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement