– అమృతా అయ్యర్
‘‘నటిగా నాకు అన్ని రకాలపాత్రలు చేయాలని ఉంది. అవకాశం వస్తే యాక్షన్ ఫిల్మ్ కూడా చేయాలని ఉంది. అయితే ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమా చూశాక ప్రిన్సెస్ రోల్ చేసే అవకాశం వస్తే బాగుంటుందనిపించింది’’ అని అన్నారు హీరోయిన్ అమృతా అయ్యర్. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు.
సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ఓ మనిషికి కోపం వస్తే, ఆ కో΄ాన్ని అతను కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? అతని జీవితం ఎలా ప్రభావితమవుతుంది? అన్నదే ‘బచ్చల మల్లి’ కథ.
మంచి ఎమోషనల్ డ్రామా. ‘హను–మాన్’ సినిమా చిత్రీకరణ సమయంలోనే ‘బచ్చల మల్లి’ సినిమా కథ విని, ఓకే చేశాను. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఇందులో సిటీ కల్చర్‌ని ఇష్టపడే టౌన్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అమ్మాయి. నరేష్‌గారు ఎలాంటి ఎమోషన్ అయినా పండించగలరు. ఈ సినిమాలో స్క్రీన్‌పై ఆయన క్యారెక్టర్ అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.
కానీ ఆఫ్ స్క్రీన్‌లో ఆయన సాఫ్ట్. సుబ్బుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఎమోషనల్ సీన్స్‌ను బాగా తీశారు. రాజేష్‌గారితో గతంలోనే ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదర్లేదు. ‘బచ్చల మల్లి’తో కుదిరింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నాను. ‘హను–మాన్’ సీక్వెల్‌లో నా రోల్ గురించి దర్శకుడు ఏమీ చెప్పొపద్దని చెప్పారు. నాపాత్ర ఉంటుందా? లేదా అనే విషయమూ చెప్పొపద్దన్నారు’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment