princess
-
డైరెక్టర్ ఏమీ చెప్పొద్దన్నారు
‘‘నటిగా నాకు అన్ని రకాలపాత్రలు చేయాలని ఉంది. అవకాశం వస్తే యాక్షన్ ఫిల్మ్ కూడా చేయాలని ఉంది. అయితే ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమా చూశాక ప్రిన్సెస్ రోల్ చేసే అవకాశం వస్తే బాగుంటుందనిపించింది’’ అని అన్నారు హీరోయిన్ అమృతా అయ్యర్. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ఓ మనిషికి కోపం వస్తే, ఆ కో΄ాన్ని అతను కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? అతని జీవితం ఎలా ప్రభావితమవుతుంది? అన్నదే ‘బచ్చల మల్లి’ కథ. మంచి ఎమోషనల్ డ్రామా. ‘హను–మాన్’ సినిమా చిత్రీకరణ సమయంలోనే ‘బచ్చల మల్లి’ సినిమా కథ విని, ఓకే చేశాను. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. ఇందులో సిటీ కల్చర్‌ని ఇష్టపడే టౌన్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అమ్మాయి. నరేష్‌గారు ఎలాంటి ఎమోషన్ అయినా పండించగలరు. ఈ సినిమాలో స్క్రీన్‌పై ఆయన క్యారెక్టర్ అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. కానీ ఆఫ్ స్క్రీన్‌లో ఆయన సాఫ్ట్. సుబ్బుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఎమోషనల్ సీన్స్‌ను బాగా తీశారు. రాజేష్గారితో గతంలోనే ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదర్లేదు. ‘బచ్చల మల్లి’తో కుదిరింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నాను. ‘హను–మాన్’ సీక్వెల్లో నా రోల్ గురించి దర్శకుడు ఏమీ చెప్పొపద్దని చెప్పారు. నాపాత్ర ఉంటుందా? లేదా అనే విషయమూ చెప్పొపద్దన్నారు’’ అని తెలిపారు. -
అట్టహాసంగా యువరాణి పెళ్లి
నార్వే యువరాణి మార్తా లూయిస్ (52), అమెరికాకు చెందిన డురెక్ వెర్రెట్ (49) వివాహం అట్టహాసంగా జరిగింది. నార్వేలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, కైరుంగి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు మార్తా తండ్రి, కింగ్ హెరాల్డ్ (87), ఇతర రాజకుటుంబీకులు హాజరయ్యారు. మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రియాలిటీ స్టార్లు, టీవీ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మార్తాకిది రెండో వివాహం. మొదటి భర్తతో ఆమెకు 21, 19, 15 ఏళ్ల వయస్సున్న కూతుళ్లున్నారు. వాళ్లు కూడా వేడుకలో పాల్గొన్నారు. తనకు దేవదూతలతో మాట్లాడే శక్తి ఉందని మార్తా; ఆత్మలతో సంభాíÙంచగలనని, వ్యాధులను నయం చేయగలనని వెర్రెట్ చెప్పుకుంటారు. తమ కుటుంబానికి ఆరు తరాలుగా అతీత శక్తులు సక్రమిస్తూ వస్తున్నాయని వెర్రెట్ ప్రకటించుకున్నారు. – ఓస్లో -
అందం ప్లస్ తెలివి ప్లస్ ధైర్యం.. ఇన్‌స్టా విడాకుల దుబాయ్ యువరాణి షైకా మహ్రా (ఫోటోలు)
-
ఇన్‌స్టాలో దుబాయ్ యువరాణి ఇన్స్టంట్ విడాకులు
దుబాయ్: దుబాయ్ యువరాణి షైఖా మహ్రా మహమ్మద్ రషీద్ అలీ మక్తూమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. తన భర్త షేక్ మనాబిన్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌కు విడాకులిచ్చారు. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యంలో ఉన్నందున మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఐ డివోర్స్ యూ.. ఐ డివోర్స్ యూ.. ఐ డివోర్స్ యూ. జాగ్రత్తగా ఉండండి. ... మీ మాజీ భార్య’’ అంటూ జూలై 16న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. యువరాణి పోస్ట్ చేసిన వెంటనే ఆమె శ్రేయోభిలాషుల నుంచి సందేశాలు వెల్లువలా వచ్చాయి. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా తొలగించారు. షైఖా మహర్రా ప్రస్తుత దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. 2023 మేలో పారిశ్రామికవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ను వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత వారికి కుమార్తె జన్మించింది. ఆ భర్త, కూతురుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ‘మేం ముగ్గురం’ అని జత చేసి పోస్ట్ చేశారు. జూన్ 4న ‘మేమిద్దమే’ కూతురుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడు విడాకుల ప్రకటన సంచలనమైంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.షేఖా మహ్రాకు దుబాయ్‌లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్‌స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్) రాసుకొచ్చారామె. View this post on Instagram A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra) దుబాయ్ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాఖ్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు. -
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
Sreeleela HD Photos: యువరాణిలా శ్రీలీల.. క్యూట్‌నెస్‌తో చంపేస్తోందిగా! (ఫొటోలు)
-
Kate Middleton: నేను కేన్సర్‌తో పోరాడుతున్నా..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్‌తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్‌తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales) ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్‌తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అప్పటి నుంచి.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది. కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. -
సర్జరీ తర్వాత కెమెరా కంటపడిన బ్రిటన్ యువరాణి?
బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన కోడలు కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటి మధ్య కేట్ మిడిల్టన్ మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కేట్ మిడిల్టన్ ఇటీవల తన భర్త ప్రిన్స్ విలియమ్‌తో కలిసి లండన్ సమీపంలోని విండ్సర్ ఫార్మ్స్ లో కనిపించారు. బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం కేట్ మిడిల్టన్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె బహిరంగంగా కనిపించడంపై బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ షాపింగ్ చేస్తూ కనిపించారు. దీనిపై బ్రిటన్ మీడియా సంతోషం వ్యక్తం చేస్తూ ‘కేట్.. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’ అని రాసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ జంటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో పాటు హాజరయ్యారని ఓ బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొంది. కేట్ మిడిల్టన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కారణంగా ఆమె గత ఏడాది చివరి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మదర్స్ డే సందర్భంగా కేట్ మిడిల్టన్ ఫోటో రివీల్ అయ్యింది. అయితే అది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుండి మిడిల్టన్ ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. దీనికితోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్‌లోని పలువురు ఉద్యోగులు తాము కేట్‌ను చాలా రోజులుగా చూడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. I edited the video to enhance the image quality, and it's definitely #PrincessCatherine in the footage.#RoyalFamily #PrincessofWales pic.twitter.com/4yOdGwQ0Vm — Royal Gossip 🇬🇧 (@UKRoyalGossip) March 19, 2024 -
'డైనోసార్ ప్రిన్సెస్': ఎవరీ ఆలియా సుల్తాన్ బాబీ?
డైనోసార్ల వంటి రాక్షస జాతి బల్లుల గురించి జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాల ద్వారే విన్నాం. పురావస్తు శాస్త్రవేత్తల కారణంగా కథకథలుగా తెలుసుకున్నాం. కానీ మన దేశంలోనే జురాసిక్ పార్క్‌ని తలపించేలా డైనోసార్ల శిలాజ స్థలం ఉందన్న విషయం గురించి విన్నారా?. దాని కోసం రాజవంశానికి చెందని యువరాణి కృషి చేసి ప్రపంచ పటంపై ఆ గ్రామాన్ని నిలపడమే గాక అందరికీ తెలిసేలా చేసింది. ఎవరామె? ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అంటే..? గుజరాత్‌లోని బాలాసినోర్కు చెందిన ఆలియా సుల్తానా బాబీ అనే మహిళ భారత గడ్డపై ఉన్న జురాసిక్ పార్క్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. దాన్ని ఒక ఉద్యానవన పార్క్‌గా చేసి టూరిస్టులకు ఆమెనే గైడ్‌గా ఉండి వాటన్నింటి గురించి వివరిస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఆమె ఎలా గుర్తించందంటే..1980లో బాలోసోర్కి సమీపంలో ఉన్న రహియోలీ అనే గ్రామంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు గుడ్లు, కుళ్లిన డైనోసార్ ఎముకలను గుర్తించారు. అక్కడ తవ్విన కొద్ది పెద్ద సైజులో ఉండే ఫిరంగి బంతుల్లా రాయి మాదిరిగా ఉన్న డైనోసార్ గుడ్లను చూశారు. ప్రఖ్యాత జియాలజిస్ట్ అశోక్ సాహ్ని వాటిని గుర్తించి అహ్మదాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని డైనోసార్ శిలాజ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడకు వచ్చి వీటిని సంరక్షించడం అనేది కష్టమైపోయింది. అలాగే దీన్ని అభివృద్ధిపరచడం కూడా సమస్యాత్మకంగా ఉండేది. సరిగ్గా అప్పుడే ఆలియా కాలేజీ చదువు పూర్తై బయటకు వచ్చింది. ఈ ప్రాంతంలో పరిశోధన చేసే శాస్త్రవేత్తలకు, జియాలజిస్ట్ శాస్త్రవేత్తలకు ఆమె తండ్రి, నవాబ్ మొహమ్మద్ సలాబత్ఖాన్ బాబీకి చెందిన పెద్ద ప్యాలెస్ బస చేసే హెరిటేజ్ హోటల్‌గా మారింది. శాస్త్రవేత్తలంతా ఆ గ్రామం వద్ద, సమీపంలో నర్మదా నది ప్రాంతంలో వందల కొద్ది ఎముకలను సేకరించడం వంటివి చేశారు. అలా ఆమెకు డైనోసార్ల శిలాజాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా రాళ్లలో నిక్షిప్తమై ఉన్న శిలాజ భాగాలను గుర్తించడం నేర్చుకుంది. అలా ఈ అరుదైన చారిత్రక ప్రదేశం పట్ల ఆసక్తి ఏర్పడి ఆ ప్రాంతాన్ని డైనోసార్ల పార్క్‌గా తీర్చిదిద్దేందుకు దారితీసింది. ఇలా చేసే సమయంలో గ్రామస్తుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి సుల్తానా బాబీకి. ఆమె చేసిన ప్రయత్నాల కారణంగానే గుజరాత్ ప్రభుత్వం ఈ స్థలాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ కొత్త డబుల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రదేశంలో పశువులు మేయకుండా ఉండేలా గార్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని దాన్నో టూరిస్ట్ ప్రదేశంగా మార్చేలా కృషి చేసింది. ఆమె కృషి ఫలితంగా భారతదేశంలో ఉన్న డైనోసార్ల జాతి గురించి ప్రపంచమే తెలుసుకునేలా చేసింది. అంతేగాదు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులందరికీ తమ రాజప్యాలెస్లోనే బస చేసే ఏర్పాట్లు అందించింది. అలాగే వారికి ఆ డైనోసర్ల గురించి సవివరంగా తెలిపేలా స్వయంగా ఆమె ఓ గైడ్‌గా మారి వివరించేది. అ ఆమె డైనోసార్ల గురించి సవివరంగా పలు ఆసక్తికర విషయాలు తెలియజేయడంతో డైనోసార్ యవరాణి(డైనోసార్ ప్రిన్సెస్ అని ముద్దుగా పిలవడం ప్రారంభించారు స్థానికులు. ఈ విషయంలో తన తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడంతోనే ఇదంత సాధ్యమయ్యిందని చెబుతోందామె. అయితే ఈ శిలాజ పార్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వారు తమ శక్తిమేర రక్షిస్తామని హామీ ఇస్తేనని అప్పగిస్తానని అంటోంది ఆలియా. అంతేగాదు ఇక్కడే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పాలియోంటాలజీ విద్యార్థుల పరిశోధనల్లో సహాయ సహకారాలు అందించాలని యోచిస్తోంది. ఇక ఈ గ్రామం తన తాతగారికి చెందిందని చెప్పుకొచ్చింది. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద చారిత్రక శిలాజ ప్రదేశం. ఈ శిలాజాలను భావితరాలకు తెలియజేసేలా జాగ్రత్తగా భద్రపరచడానికి కృషి చేస్తానని ఆలియా అన్నారు. ఇకి ఆమె అత్త ప్రముఖ బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ. ఆలియా నిర్వహిస్తున్న ఈ పార్క్‌లో డైనోసార్ అవశేషాలు తాకొచ్చు, పట్టుకోవచ్చు అదే డైనోసార్ శిలాజ పార్క్ ప్రత్యేకత. View this post on Instagram A post shared by Dinosaur Musuem (@dinosaur__balasinor) (చదవండి: 24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు) -
మెగా లిటిల్ ప్రిన్సెస్‌కు ఐదేళ్లు.. శ్రీజ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్‌ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది. (ఇది చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ..) తాజాగా నవిష్క బర్త్ డే సందర్భంగా శ్రీజ తన ఇన్‌స్టాలో కూతురి ఫోటోను షేర్ చేసింది. నా కూతురు అప్పుడే ఐదేళ్లు పూర్తి చేసుకుందని తెలిపింది. నవిష్క వైట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను పంచుకుంది. ఇది చూసిన మెగా అభిమానులు హ్యాపీ బర్త్ డే మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీజ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. క్రిస్మస్ సందర్భంగా సోమవారం నిర్వహించిన వేడుకల్లో శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
ఆమె భారత యువరాణి.. బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు కోసం ఎందుకు పోరాడారు?
భారతదేశానికి చెందిన ఒక యువరాణి మహిళల ఓటు హక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆమె కారణంగానే బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు లభించింది. ఈ ఉద్యమం కోసం ఆమె తన రాజ కీయ హోదాను కూడా పక్కన పెట్టారు. అయితే కాలక్రమేణా ఆమె చరిత్ర మరుగున పడింది. ఇంతకీ ఆ భారతీయ యువరాణి ఎవరు? ఆమె బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు గురించి ఎందుకు పోరాడవలసి వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యువరాణి మరెవరో కాదు.. పంజాబ్ చివరి సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ కుమార్తె సోఫియా దులీప్ సింగ్. ఈమె బ్రిటన్‌లోని నార్ఫోక్-సఫోల్క్ సరిహద్దులోని ఎల్వెడీన్లో పెరిగారు. భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటీష్ పాలకులు 1840లో మహారాజా దులీప్ సింగ్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతనిని బ్రిటన్‌కు తరలించారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి దులీప్ సింగ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత తనకు అందిన పరిహారపు సొమ్ముతో ఆయన ఎల్వెడీన్ హాల్‌ను కొనుగోలు చేశారు. అతను తన పిల్లలతో సహా అక్కడే ఉండేవారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం, యువరాణి సోఫియా 1900లలో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడారు. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం బ్రిటన్ రాణి విక్టోరియాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఈ నేపధ్యంలోనే విక్టోరియా రాణి ఈ రాజకుటుంబానికి హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్‌లో అపార్ట్మెంట్ అప్పగించారు. సోఫియా దులీప్ సింగ్‌ను ‘విక్టోరియా రాణి గాడ్ డాటర్’ అని పిలుస్తారు. ఈ కారణంతోనే ప్రిన్సెస్ సోఫియా బ్రిటీష్ మహిళల మాదిరిగానే జీవితాన్ని గడిపారు. కాలక్రమేణా ఆమె బ్రిటన్‌లో మహిళల హక్కుల కోసం ఏదైనా చేయాలని భావించారు. ప్రిన్సెస్ సోఫియా ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ అండ్ ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్‌లో సభ్యురాలు. ఈ లీగ్ మహిళల ఓటు హక్కు కోసం ‘నోట్ నో టాక్స్’ నినాదం అందుకున్నారు. యువరాణి సోఫియా 400 మంది మహిళలతో కలిసి 1910లో బ్రిటీష్ పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో మహిళా ఓటు హక్కు కార్యకర్త ఎమ్మెలిన్ పాన్‌ఖర్స్ట్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జరిగిన రోజున ‘బ్లాక్ ఫ్రైడే’గా పిలిచారు. యువరాణి సోఫియా నినాదాలు చేయడం లేదా నిరసనలలో పాల్గొనడం మాత్రమే కాకుండా, హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్‌లోని తన ఇంటి వెలుపల మహిళల ఓటు హక్కుకు సంబంధించిన వార్తాపత్రికలను విక్రయించారు. ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ మనవరాలు ప్రిన్సెస్ సోఫియా పోరాటాల కారణంగా బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందారు. 1876లో జన్మించిన ఆమె 1903లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఇది ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది. రాజద్రోహం ఆరోపణలతో జైలుకెళ్లిన స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ సాగించిన పోరాట పటిమకు ఆమె ప్రభావితురాలయ్యారు. ఇదే ఆమెను బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రేరేపణ కల్పించింది. ఆమె బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు పోరాటం కొనసాగించేందుకు ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ ఆమె మహిళా ఓటుహక్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె నిరసనలలో పాల్గొంటున్న కారణంగా ఇంగ్లండ్‌లో ఆమెను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె దానిని పట్టించుకోలేదు. ప్రిన్సెస్ సోఫియా బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ పాలుపంచుకున్నారు. అలాగే 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికులకు వైద్య సహాయం అందించారు. ఆమె బ్లూ ఫ్లాక్ అవార్డును అందుకున్నారు. యువరాణి సోఫియా 1948లో తన 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు? -
ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన రొమాంటిక్ కపుల్
రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు బుధవారం ప్రకటించారు. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున గీరాంజర్లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్‌బర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా , ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు ) View this post on Instagram A post shared by Durek Verrett (@shamandurek) 2022 జూన్‌లో మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నవంబరులో వెర్రెట్తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్‌ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్ తాను దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్అని పేర్కొంది. అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త, రచయిత అరిబెన్‌తో విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) . -
ఆమె ముస్లిం రాకుమారి.. దేశంలో తొలి మహిళా పైలెట్.. తరువాత పాక్ వెళ్లిపోయి..
అబిదా సుల్తాన్.. నాటిరోజుల్లో భోపాల్ రాచరిక సంస్థానానికి యువరాణి. మన దేశంలో విమానాన్ని నడిపేందుకు పైలట్ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించకముందే ఆమె మహిళా పైలట్‌గా మారారు. భోపాల్ సంస్థానానికి చెందిన ఈ యువరాణి 1913, ఆగస్టు 28న జన్మించారు. 2002 మే 11న మరణించారు. ఆమె 1942, జనవరి 25న ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. ఆమె తండ్రి హమీదుల్లా ఖాన్ భోపాల్ రాచరిక సంస్థానానికి చివరి నవాబు. హమీదుల్లా ఖాన్‌కు అబిదా పెద్ద కుమార్తె. ఆమె చిన్న వయస్సులో డ్రైవింగ్, గుర్రపుస్వారీ మొదలైన వాటిని నేర్చుకోవడంతో పాటు షూటింగ్లో నైపుణ్యం సాధించారు. ఆ రోజుల్లో ఆమె ముసుగు వేసుకోకుండానే కారు నడిపారు. భోపాల్ సంస్థానం తండ్రి చేతుల్లో ఉన్నంత కాలం ఆమె తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. అయితే ఆమె ముస్లిం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. కానీ తన తండ్రి మంత్రివర్గంలో చైర్పర్సన్, ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. అబిదా ఎంతో ఇష్టంగా పోలో, స్క్వాష్ వంటి క్రీడలను ఆడేవారు. 1949లో ఆమె ఆల్ ఇండియా ఉమెన్స్ స్క్వాష్‌లో ఛాంపియన్‌గా నిలిచారు. ఆమె బాంబే ఫ్లయింగ్ క్లబ్, కోల్‌కతా ఫ్లయింగ్ క్లబ్‌లలో విమానం నడపడం నేర్చుకున్నారు. దేశ విభజన తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టారు. అబిదాకు 1926 జూన్ 18న కుర్వాయికి చెందిన నవాబ్ సర్వర్ అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. 1949లో దేశ విభజన కోసం జరిగిన తిరుగుబాటు తర్వాత నవాబ్ సర్వర్ అలీ ఖాన్ భారతదేశాన్ని విడిచిపెట్టారు. అబిదాకు నాటి రోజుల్లో జిన్నాతో పరిచయం ఉంది. ఆమె తండ్రి భారతదేశ విలీనానికి తన సమ్మతిని తెలియజేస్తూ, విలీన లేఖపై సంతకం చేసినప్పుడు, ఆమె దానిని వ్యతిరేకించారు. అబిదా పాకిస్తాన్‌కు వస్తే అక్కడి రాజకీయాలో ఆమెకు అవకాశం కల్పించడమే కాకుండా ఆ దేశంలో ఆమెకు పూర్తి గౌరవం లభిస్తుందని జిన్నా ఆమెకు హామీ ఇచ్చారు. పాకిస్తాన్‌కు చేరుకున్న ఆమె కరాచీలోని ఒక విలాసవంతమైన రాజభవనంలో నివసించారు. అక్కడ ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి, పాకిస్తాన్ ప్రభుత్వంలో హోదాను కూడా పొందారు. ఆమె ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆమె చైనాలో అధికారిక పర్యటన కూడా చేశారు. 1960లో పాకిస్తాన్లో మార్షల్ లా అమలులోకి వచ్చినప్పుడు జిన్నా సోదరి ఫాతిమాతో కలిసి దానిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అబిదా తండ్రి మొదట్లో తమ రాచరిక సంస్థానాన్ని భారతదేశంలో కలపడంపై తిరుగుబాటు వైఖరి ప్రదర్శించినప్పటికీ, తరువాత ఆయన తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయవలసి వచ్చింది. అప్పడు అతను మాత్రమే భారతదేశంలో ఉన్నారు. కుమార్తెను ఇండియాకు తిరిగి రమ్మని కోరారు. అయితే దీనికి ఆమె అంగీకరించలేదు. అయితే తండ్రి చనిపోయిన సమయంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె కుమారుడు షహర్యార్ ఖాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. 2001 అక్టోబర్ నాటికి అబిదాను అనేక వ్యాధులు చుట్టుముట్టాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అబిదా పాకిస్తాన్లో స్థిరపడినందున, ఆమె తండ్రి తన మధ్య కుమార్తె సాజిదా సుల్తాన్‌ను భోపాల్ పాలకురాలిగా నియమించారు. పటౌడీ రాజకుటుంబానికి చెందిన నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్.. సాజిదా బేగంను వివాహం చేసుకున్నారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ వారి కుమారుడు. అనంతర కాలంలో భోపాల్ రాచరిక సంస్థానంలో ఆస్తి వివాదానికి సంబంధించి పలు వివాదాలు చెలరేగాయి. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి -
Klin Kaara Konidela First Photos: మెగా ప్రిన్సెస్ మొదటి వీడియో షేర్ చేసిన రామ్‌చరణ్ (ఫొటోలు)
-
14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా..
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి.. అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారవి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం. ఈ మేరకు ఏప్రిల్‌లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్‌గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది. View this post on Instagram A post shared by @forestessentials కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్ మీ పేజ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2, 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. -
ట్రావన్ కోర్ యువరాణికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారం
సాక్షి, తిరుపతి: సనాతన ధర్మానికి నిరంతర సేవ చేస్తున్న ట్రావన్ కోర్ ప్రిన్సెస్ అశ్వతి గౌరి లక్ష్మీబాయికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అందజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామండపంలో సేవ్ టెంపుల్స్ భారత్, వేద విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయిని ఘనంగా సత్కరించారు. పద్మనాభ స్వామి దేవాలయం సంపదల పరిరక్షణలో ఆమె చేసిన పోరాటం ప్రశంసనీయమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్, టెంపుల్స్ భారత్ చైర్మన్ డా.గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
ఆయన కోసం రాజభోగాలు వదులుకుంది!
ఓస్లో: అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్-అమెరికన్ ఆరవ తరం షమన్ అయిన డ్యూరెక్ వెరెట్‌తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్‌తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్‌లో జరిగిన ఓ పోల్ వెల్లడించింది. మరోవైపు.. ‘రాయల్ కుటుంబంలో ప్రశాంతతను తీసుకొచ్చేందుకు నేను తప్పుకుంటున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు యువరాణి మార్థా లూయిస్. నార్వే రాజు ప్రకటన.. మరోవైపు.. రాయల్ ప్యాలెస్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నారని, ఇకపై ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, రాజు కోరిక మేరకు ఆమె యువరాణిగా పిలవబడతారని తెలిపింది. యువరాణి మార్థా ప్రకటన తర్వాత రాణి సంజాతో కలిసి మీడియాతో మాట్లాడారు నార్వే రాజు హరాల్డ్. యువరాణి రాయల్ కుటుంబానికి ఇకపై ప్రాతినిధ్యం వహించదని చెప్పేందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయంపై ఆమె ఎంతో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే వివాహం.. ముగ్గురు పిల్లలు.. దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్‌కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అయితే, ఆమె తన భర్త అరిబెన్‌తో విడిపోయారు. 2002లో క్లైర్ వాయెంట్‌గా పని చేసేందుకు సిద్ధమైన క్రమంలో ‘హర్ రాయల్ హైనెస్’ అనే టైటిల్‌ను కోల్పోయారు. మరోవైపు.. 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్ టైటిల్‌ను ఉపయోగించబోనని అంగీకరించారు. గత జూన్‌లో షమన్ వెరెట్‌తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించాయి పలు హెల్త్‌కేర్ గ్రూప్‌లు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) ఇదీ చదవండి: హ్యారీకి అవమానం -
ఆ బాలీవుడ్ హీరో సరసన యువరాణిలా సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్-2, పుష్ప చిత్రాల్లో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వరుణ్ దావన్తో నటిస్తున్న సమంత తాజాగా మరో ప్రాజెక్ట్‌కి ఓకే చేసినట్లు తెలుస్తుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న నాలుగో హారర్ చిత్రంలో సమంత యువరాణి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట. -
షిఫాన్ రాణి
ధరించే దుస్తుల నుంచి అలంకరించుకునే ఆభరణాల వరకు అన్నీ భారీగానే ఉంటాయి మహారాణులకు. మహారాణులంటే ఇలాగే ఉండితీరాలి అన్నట్టుగా ఉంటారు వారు. ఈ సంప్రదాయ ఆహార్యం ఓ మహారాణికి బాగా విసుగు పుట్టించింది. దీంతో ఆమె సాదాసీదా, బరువులేని వస్త్రాలు ధరించాలను కుంది. భారీగా కాకుండా సిల్క్‌తో తయారయ్యే షిఫాన్ చీరను కట్టుకుని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి, షిఫాన్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ఆ రాణీగారు. అప్పటినుంచి ఇప్పటికీ షిఫాన్ చీరలు మగువల మనసులు దోస్తూనే ఉన్నాయి. స్టైల్గానేగాక, ఎంతో సౌకర్యంగా ఉండే షిఫాన్ చీరలను ప్రపంచానికి పరిచయం చేసింది రాణి ఇందిరాదేవి. అప్పటి బరోడా రాష్ట్ర యువరాణి. కూచ్‌బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్‌ను వివాహం చేసుకున్న ఇందిరా దేవి ధరించే దుస్తులు చూపరులను అమితంగా ఆకర్షించేవి. ఎప్పుడూ భారీగా ఉండే చీరలు, నగలు ధరించే ఇందిరకు వాటిమీద మొహం మెత్తేసింది. తేలికగా ఉండే చీరలను ధరించాలనుకుంది. ఎక్కువగా యూరప్‌లో పర్యటించే ఆమె ఎంతో ఖరీదైన షిఫాన్ వస్త్రాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుని ఆరుగజాల చీరను రాజవంశానికి తగ్గట్టుగా కళాకారులతో డిజైన్ చేయించి మరీ ధరించింది. అది ఆమెకు బాగా నప్పడంతోపాటు కట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉండడంతో.. అప్పటి నుంచి షిఫాన్ చీరలనే ధరించేది. ఇలా షిఫాన్ చీరలను ఇందిర ఇండియాకు పరిచయం చేసింది. తల్లికి తగ్గ వారసురాలిగా.. ఇందిర కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా అమ్మ షిఫాన్ చీరకట్టును అనుసరించింది. తల్లి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్హెయిర్తో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. షిఫాన్ చీరకట్టుతో అందంగా ఉండడంతో ప్రపంచంలోని పదిమంది అందమైన మహిళల్లో గాయత్రి దేవి ఒకరుగా నిలిచినట్లు 1960లో ఓ మ్యాగజీన్ పేర్కొంది. ఇందిరా, గాయత్రి షిఫాన్ చీరలు మహిళలను అమితంగా ఆకట్టుకోవడంతో.. అన్ని తరగతుల వారు వీటిని ధరించడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా షిఫాన్ పాపులర్ అయ్యింది. బ్రిటన్ మహారాణి తల్లి నుంచి ప్రిన్సెస్ డయానా వరకు అందరూ షిఫాన్ను వాడినవారే. వారి గౌనులు షిఫాన్‌తో తయారు చేయించుకుని అనేక కార్యక్రమాల్లో మెరిసిపోయేవారు. మహారాణుల నుంచి సామాన్యులు మెచ్చిన షిఫాన్ను సిల్క్ నుంచి రూపొందించేవారు. అప్పట్లో దీనిని సంపద, ప్రతిష్టకు గౌరవసూచికగా భావించేవారు. తర్వాత నైలాన్, సింథటిక్ ఫైబర్ అందుబాటులోకి రావడంతో పాలిస్టర్ షిఫాన్ అందుబాటులోకి వచ్చి ధరకూడా తగ్గింది. ఇప్పటికీ ఫ్రెంచ్‌లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది. ఒకరి విభిన్న ఆలోచనకు ప్రతిరూపమే నేటి షిఫాన్ చీరలు. ట్రెండ్ సెట్టర్లు కావాలంటే గుంపులో గోవిందా అనకుండా..వందమందిలో ఉన్నా ఒక్కరిలా నిలిచేలా సరికొత్తగా ఆలోచించాలి. -
మూడేళ్ల తర్వాత సౌదీ యువరాణి విడుదల
దుబాయ్: అనుమానాస్పద పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం జైలు పాలైన యువరాణిని సౌదీ అధికారులు విడుదల చేసినట్లు ఆమె అనునూయులు తెలిపారు. సౌదీ రెండో రాజు కూతురు బస్మా బిన్ సౌద్ 2019 మార్చిలో అదృశ్యమయ్యారు. అనంతరం ఆమె ఎలాంటి నేరారోపణలు లేకుండా కఠోరమైన సౌదీ జైల్లో కనిపించారు. ఆమెతో పాటు ఆమె కూతురుని కూడా అప్పట్లో నిర్భంధించారు. ఇందుకు సరైన కారణాలు తెలియరాలేదు. అయితే సింహాసనంపై పట్టు సాధించే క్రమంలో యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కఠినంగా వ్యవహరిస్తూవస్తున్న సందర్భంలో పలువురు రాజకుటుంబీకులు ఇబ్బందుల పాలయ్యారు. ఈ క్రమంలోనే బస్మా కూడా బందీగా మారి ఉండొచ్చని కొందరి అంచనా. ఆమె అక్రమంగా రాజ్యం విడిచి పారిపోవడానికి యత్నించినట్లు 2020లో సౌదీ మిషన్ టు యూఎన్ తెలిపింది. అయితే తాజాగా 58 ఏళ్ల బస్మాతో పాటు ఆమె 30ఏళ్ల కుమార్తె సుహౌద్ అల్ షరీఫ్‌ను రియాద్‌లోని అల్హైర్ జైలు నుంచి గతవారం విడుదల చేశారని, ఆమె జిద్దాలోని స్వగృహానికి చేరారాని బస్మా న్యాయ ప్రతినిధి హెన్రి ఎస్ట్రామెంట్ తెలిపారు. చదవండి: నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం బస్మా ఆస్టియోపోరోసిస్ సహా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఇకపై తగు చికిత్సలకు హాజరవుతారని వెల్లడించారు. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లే యత్నాల్లో ఉన్న బస్మాను సెక్యూరిటీ ఏజెంట్లు అన్యాయంగా నిర్భంధించారన్నారు. జైల్లో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్నారు. ఆమె విడుదల కోసం ఐరాసకు దరఖాస్తు చేశామన్నారు. నెలలపాటు ఆమె ఆచూకీ తెలియరాలేదని, చివరకు ఆమె విడుదల కావడం సంతోషమని చెప్పారు. చదవండి: చంద్రుడిపై నీటి జాడలు.. ఇదే తొలిసారి! -
మనకు తెలియని యోధురాలు.. ఆమె ఎవరు?
చరిత్ర కూడా చాలా చమత్కారమైనది. అది కొందరిని ముందుకు తెస్తుంది. కొందరిపై మసక తెర వేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినట్టుగా వేలు నాచ్చియార్ తెలియదు. ఒకరు ఉత్తర భారతదేశం అయితే ఒకరు దక్షిణ భారతదేశం. ఇద్దరూ బ్రిటిష్ వారిపై పోరాడారు. తమిళనాడుకు చెందిన రాణి వేలూ నాచ్చియార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించడంతో వేలూ నాచ్చియార్ ఎవరు అని కుతూహలం ఏర్పడింది. ఆమె ఎవరు? జనవరి 3 ‘రాణి వేలూ నాచ్చియార్’ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆమెను తలుచుకున్నారు. ‘నారీ శక్తికి ఆమె సంకేతం’ అని ట్విటర్ ద్వారా శ్లాఘించారు. సోషల్ మీడియాలో ఆ వెంటనే రాణి వేలూ నాచ్చియార్ వర్ణ చిత్రాలు ఫ్లో అయ్యాయి. అచ్చు ఝాన్సీ లక్ష్మీ బాయిలా గుర్రం మీద కూచుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వేలూ నాచ్చియార్ గురించి దేశానికి తెలిసింది ఎంత అనే సందేహం వచ్చింది నెటిజన్లకు. ఝాన్సీ లక్ష్మీ బాయి కంటే యాభై అరవై ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ వారిపై పోరాడి విజయం సాధించిన తొలి రాణి అయినప్పటికీ ఆమె ఘన చరిత్ర బయటకు రాకుండా బ్రిటిష్ వాళ్లు జాగ్రత్త పడ్డారన్నది ఒక కథనం. దానికి కారణం ఆమె చేతిలో వారు ఓడిపోవడమే. చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడా వేలూ నాచ్చియార్దే కావడం విశేషం. శివగంగ రాణి నేటి రామనాథపురంలో 18 వ శతాబ్దంలో నెలకొన్న రామనాథ రాజ్యపు యువరాణి వేలూ నాచ్చియార్. 1730 జనవరి 3న జన్మించింది. ఆమె ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ఆమెకు అన్ని విద్యలు నేర్పించారు. తమిళం మాతృభాష అయినప్పటికీ నాచ్చియార్ ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు 16 ఏళ్లు వచ్చాక 1746లో– గతంలో రామనాథ రాజ్యం నుంచి విడిపోయి మరొక రాజ్యంగా ఏర్పడిన శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్లింది. శివగంగ రాజ్య యువరాజు వడుగనాథ దేవర్ ఆమెకు భర్త అయ్యాడు. వాళ్లకు వెళ్లాచ్చి అనే కూతురు పుట్టింది. ఆ విధంగా రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తూ ఉండగా బ్రిటిష్‌వారు ఊడిపడ్డారు. బ్రిటిష్ దాడి అప్పటికే దేశం లోపలి రాజ్యాల నడుమ ఉన్న లుకలుకలను ఉపయోగించుకుని తమ పెత్తనాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు దక్షిణాదిలో తమ విస్తరణ కోసం ఆర్కాట్ నవాబుతో చేయి కలిపారు. అప్పటికి ఆర్కాట్ నవాబు మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అతనికి రామనాథ రాజ్యం, శివగంగ రాజ్యం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. దాంతో బ్రిటిష్ వారు అతనిని రెచ్చగొట్టి ఆ రాజ్యాలను హస్తగతం చేసుకోవాలనుకున్నారు. అది 1772వ సంవత్సరం. శివగంగ ఆలయానికి దర్శనానికి నిరాయుధునిగా వెళ్లిన వడుగనాథ దేవర్పైన బ్రిటిష్ వారు హటాత్తుగా దాడి చేసి చంపేశారు. అంతేకాదు ఆలయాన్ని లూటీ చేసి 50 వేల బంగారు నాణేలు తీసుకెళ్లారు. ఆలయంలో భర్తను చంపారన్న వార్త విని వేలూ నాచ్చియార్ హతాశురాలైంది. వెంటనే ఒక మంత్రి సహాయం రాగా కుమార్తెను తీసుకుని విరూపాక్షికి వెళ్లిపోయింది. అయితే బ్రిటిష్ వారు ఆమె నమ్మినబంటు ఉడయాళ్ను పట్టుకుని ఆమె ఆచూకి కోసం నిలదీశారు. అతను చెప్పకపోయేసరికి చంపేశారు. ఈ వార్త విన్నాక వేలూ నాచ్చియార్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘బ్రిటిష్‌వారిని ఓడించి నా రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాను’ అని శపథం చేసింది. 8 ఏళ్ల అజ్ఞాత వాసం వేలూ నాచ్చియర్ 8 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. ఆమె నమ్మినబంట్లు మెల్లమెల్లగా ఆమెను చేరుకున్నారు. బ్రిటిష్ వారిని ఓడించాలన్న తలంపుతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసి మహిళా దళాన్ని తయారు చేసింది. దానికి తన నమ్మినబంటైన ఉడయాళ్ పేరు పెట్టింది. ‘కుయిలీ’ అనే మహిళ దానికి నాయకురాలు. శివగంగ రాణి ఇలా బ్రిటిష్ వారిపై ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నదని విన్న మైసూర్ నవాబు హైదర్ అలీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఆమె తన సైన్యం నిర్మించుకోవడానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాడు. వేలూ నాచ్చియార్ తన పదాతి దళం, అశ్వదళం, మహిళా దళంతో పూర్తిగా దాడికి సిద్ధమైంది. అయితే ఆమె దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి చాలా తక్కువ. బ్రిటిష్ వారి దగ్గర ఉన్నది చాలా ఎక్కువ. దానికి విరుగుడు? మానవబాంబు. ప్రతిదాడి అది 1780. విజయదశమి రోజు. ఆ రోజున కోట గోడలు తెరిచి సామాన్యజనాన్ని ఆహ్వానిస్తారు శివగంగ రాజ్యంలో. వేలూ నాచియార్ తయారు చేసిన మహిళా దళం సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకుని సామాన్య మహిళలుగా కోటలోకి ప్రవేశించారు. అదను చూసి నాయకురాలు కుయిలీ ఆదేశం అందుకుని బ్రిటిష్ వారిపై ఊచకోత సాగించారు. బ్రిటిష్‌వారు ఆయుధగారంలోకి వెళ్లి ఆయుధాలు తీసే లోపు ఒక మానవబాంబు ఒళ్లంతా నెయ్యి పూసుకుని ఆయుధగారంలోకి వెళ్లి మంట పెట్టుకుంది. అంతే. ఆయుధగారం పేలి ఆయుధాలు వృధా అయిపోయాయి. మరోవైపు వేలూ నాచ్చియార్ తన దళంలో ఊడిపడి బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తన రాజ్యం తిరిగి దక్కించుకుంది. అవమానకరమైన ఈ ఓటమిని బ్రిటిష్ వారు చరిత్ర పుటల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ఆ తర్వాత మరో 16 ఏళ్లు జీవించి హృద్రోగంతో 1796లో కన్నుమూసింది వేలూ నాచ్చియార్. ఆమెను తమిళనాడులో ‘వీరనారి’ అని పిలుచుకుంటారు. -
అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి
ఆమ్స్టర్డామ్: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి. వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా తనకు రానున్న భారీ వార్షిక అలవెన్స్ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపింది. అందులో.. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాచరికపు నిబంధనల ప్రకారం ఆమెకు 18 ఏట నుంచి.. ప్రతి సంవత్సరం అలవెన్స్‌ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానుండగా.. ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్టపడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలిపింది. View this post on Instagram A post shared by Koninklijk Huis (@koninklijkhuis) చదవండి: టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!? -
కలలో రాజకుమారి
తానొక రాజ కుమారిగా మారినట్టు కల కనే హక్కు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అయితే ఆ కల అందరికీ నిజం కాదు. నిజం కాదని అందరికీ తెలుసు. కాని కొందరు కలను నిజం చేసుకుంటారు. ముంబై వర్లీ సమీపంలో మురికివాడలో నివసించే 13 ఏళ్ల మలీషా ఖర్వా యూ ట్యూబ్‌లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్‌ను చూసి తానొక మోడల్ని, డాన్సర్‌ని కావాలనుకుంది. అయితే ఆమె చాలా గట్టిగా అనుకుంది. విశ్వమంతా కుట్ర చేసి మరీ ఆమె కలను నిజం చేశాయి. ఇటీవల ఆమెపై నిర్మించిన డాక్యుమెంటరీ ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ విడుదలైన సందర్భంగా మలీషా పరిచయం. మలీషా ఖ్వారా వాళ్ల నాన్న చిన్న పిల్లల బర్త్‌డే పార్టీల్లో ‘జోకర్’ వేషం వేసుకుని వినోదం అందించి ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో బతుకుతుంటాడు. ముంబైలో మురికివాడలో బతకడమే ఒక పెద్ద యుద్ధం అతనికి. అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా మాత్రం ఆ జీవితంతో రాజీ పడదల్చుకోలేదు. ఒకసారి ఫోన్లో ఎవరో యూ ట్యూబ్‌లో ఆ అమ్మాయికి ప్రియాంకా చోప్రా ర్యాంప్‌వాక్ చూపించారు. ‘ఇలా నడవాలంటే ఏం చేయాలి’ అని అడిగింది మలీషా. ‘మోడల్ అవ్వాలి’ అని చెప్పారు ఎవరో. అప్పుడే నిశ్చయించుకుంది మోడల్ అవ్వాలని. ఆ తర్వాత డాన్సర్ కూడా అవ్వాలని. ఆ కలకు తోడు హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మేన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి అందులో నటించడానికి కావలిసిన అమ్మాయి కోసం ముంబై మురికివాడల్లో తిరగసాగాడు. అప్పుడే మలీషా మరో కజిన్‌తో అతణ్ణి కలిసింది. హాఫ్‌మేన్ మలీషాను గమనించాడు కాని ఇంకా చిన్నపిల్ల... వీడియోకు పనికి రాదని అనుకున్నాడు. కాని మాటల్లో ‘నువ్వేం అవుదామనుకుంటున్నావు’ అని అడిగితే ‘నేను మోడల్ అవుదామనుకుంటున్నాను’ అని చాలా ఆత్మవిశ్వాసంతో మలీషా చెప్పిన తీరు హాఫ్మేన్కు నచ్చింది. ‘అయితే నీకు సాయం చేస్తాను. నీ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తాను’ అని ఆమె పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేశాడు. మలీషా ఫొటోలు అందులో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలలో మలీషా ముగ్ధత్వాన్ని, రూపాన్ని, నవ్వును ఇష్టపడిన నెటిజన్లు అతి త్వరలోనే దాదాపు లక్షన్నర ఫాలోయెర్స్గా మారారు. డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్ జస్గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లల మీద ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ తీశారు. అనుకున్నది సాధించడానికి స్లమ్స్, పేదరికం, పరిమితులు అడ్డం కావని ఈ డాక్యుమెంటరీ చెబుతుంది. దీనిని మొన్న (ఏప్రిల్ 16) మలీషా అఫీషియల్ యూట్యూబ్ చానెల్లో విడుదల చేశారు. మలీషా గ్లామర్ రంగంలో భవిష్యత్తులో ఎన్నో వండర్స్ చేయనుంది. మనం వాటిని చూడనున్నాం. ఆల్‌ది బెస్ట్ మలీషా. కవర్ గర్ల్ అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్ మేగజీన్’ మలీషాను అక్టోబర్ 2020న కవర్ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో లోకానికి పరిచయం చేశాక మలీషాకు ఫొటోషూట్ల గిరాకీ అమాంతం పెరిగింది. పీకాక్ మేగజీన్ కోసం ఆ ఫొటోషూట్ నిర్వహించిన జంట షేన్–ఫాల్గుణి పీకాక్‌లు మలీషాతో ఫొటోషూట్ అనుభవాలను చెప్తూ ‘ఫొటోషూట్ వరకూ మలీషా ఎంత ఆంబీషియసో వింటూ వచ్చాం. కాని ఫొటోషూట్‌లో ఆ అమ్మాయి అంకితభావం చూశాక పెద్ద పెద్ద కలలు కనే యోగ్యత ఉందని అనుకున్నాం. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా పని చేసింది’ అన్నారు. – సాక్షి ఫ్యామిలీ