
ఆమ్‌స్టర్‌డామ్: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి.
వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా తనకు రానున్న భారీ వార్షిక అలవెన్స్ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపింది.
అందులో.. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాచరికపు నిబంధనల ప్రకారం ఆమెకు 18 ఏట నుంచి.. ప్రతి సంవత్సరం అలవెన్స్‌ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానుండగా.. ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్టపడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలిపింది.
చదవండి: టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!?
Comments
Please login to add a commentAdd a comment