allowances
-
శిక్షణ, ప్రోత్సాహకాలే కీలకం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందివ్వడంతోపాటు, ముద్రా యోజన తదితర పథకాల ద్వారా రుణాలు ఇవ్వాలని డబ్ల్యూఆర్ఐ ఇండియా సీఈవో మాధవ్ పాయ్ సూచించారు. ఈ రంగానికి సంబంధించిన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సాయపడతాయన్నారు. ‘డబ్ల్యూఆర్ఐ ఇండియా కనెక్ట్ కరో’ పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘ఎంఎస్ఎంఈలు కొద్దికాలంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరం. చిన్న వ్యాపారులు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. ఈ దిశగా ప్రభుత్వ వర్గాలు విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు టెక్స్టైల్ ఫ్యాక్టరీలను పెట్‌కోక్ ఆధారితంగా ఎక్కువ కాలం నిర్వహించలేం. పెట్‌కోక్ లేకుండా ఉత్పత్తి పెంచాలంటే కంపెనీలకు అదనంగా పోత్సాహకాలు అవసరం. ప్రపంచంలో 20 అధిక కాలుష్య పట్టణాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన నిబంధనల అనుసరించాలి’ అని మాధవ్ చెప్పారు.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గిందా?‘చాలా ఎంఎస్ఎంఈలు రుణాలు పొందడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ముద్రా యోజన తరహా ఇతర పథకాలను ప్రభుత్వం రూపొందించాలి. తద్వారా ఎంఎస్ఎంఈల రుణ సమీకరణ సామర్థ్యాన్ని పెంచాలి’ అని తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతోపాటే నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర అలవెన్స్‌లు చెల్లించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్‌లు ఏళ్ల తరబడి చెల్లించేవారు కాదు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించింది. అలవెన్స్‌లను కూడా గ్రేడ్–1 ఉద్యోగులకు రూ.600 నుంచి రూ.800కు, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.400 నుంచి రూ.600కు, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ఆ అలవెన్స్‌లను జీతాల బిల్లులతోపాటే ఆమోదించి ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించాలని నిర్ణయించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు జీతాలతోపాటు అలవెన్స్‌లను కూడా చెల్లిస్తూ వచ్చారు. కాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్‌డ్యూటీ అలవెన్స్‌లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను కలపవద్దని విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు షాక్‌కు గురయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో తమకు అలవెన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉండే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఆందోళన చెందుతున్నారు. నేడు నిరసనప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించాం. నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం. రిటైరైన ఉద్యోగులకు సకాలంలో సెటిల్మెంట్ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతాం. – పీవీ రమణారెడ్డి, అధ్యక్షుడు, – వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది. చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌లను ప్రభుత్వం ఆమోదించింది. 2022–2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్‌ల (అడ్ హాక్ బోనస్‌లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది . దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించబడతాయి. -
జగనన్నకు థ్యాంక్స్: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి జీతాలతో పాటు అలవెన్స్‌ల చెల్లింపు జరపనుంది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు అంతటా హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదీ చదవండి: నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా! -
ఎగవేతదారులతో సెటిల్మెంట్
ముంబై: మొండిపద్దుల నుంచి బ్యాంకులు సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టుకునేందుకు వీలు కల్పించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. ఉద్దేశపూర్వక ఎగవేతలు, మోసపూరిత ఖాతాల విషయంలో రాజీ కుదుర్చుకుని, మొండిబాకీలను సెటిల్ చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం రాజీ సెటిల్మెంట్లను చేపట్టే క్రమంలో ఉద్దేశపూర్వక ఎగవేతలు, సాంకేతిక రైటాఫ్‌ల అంశాల్లో పాటించాల్సిన ప్రక్రియలకు సంబంధించి బోర్డు ఆమోదిత పాలసీలను నియంత్రిత సంస్థలన్నీ (ఆర్ఈ) అమలు చేయాల్సి ఉంటుంది. ఏయే పరిస్థితుల్లో రాజీ యత్నాలు చేయవచ్చనేది వాటిలో నిర్దిష్టంగా పేర్కొనాలి. కనీస బాకీ వ్యవధి, తనఖా పెట్టిన ఆస్తుల విలువ కరిగిపోవడం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. నోటిఫికేషన్ అంశాలు.. ► ఇలాంటి కేసుల్లో ఉద్యోగుల జవాబుదారీతనాన్ని పర్యవేక్షించేందుకు తగు వ్యవస్థ ఉండాలి. బాకీ పరిమాణం, కాలపరిమితులు మొదలైనవి బోర్డు నిర్ణయిస్తుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసపూరిత ఖాతాలంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో, రుణదాతలపై క్రిమినల్ చర్యలతో సంబంధం లేకుండా, ఆర్ఈలు రాజీ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ► రాజీ సెటిల్మెంట్ విషయంలో తనఖా ఉంచిన ఆస్తి (ఏదైనా ఉంటే) నుంచి ప్రస్తుతం రాబట్టుకోగలిగే మొత్తాన్ని సముచిత రీతిలో మదింపు చేసి, ఎంత మొత్తం వదులుకోవచ్చు, ఎంతకు సెటిల్ చేసుకోవచ్చు అనే నిబంధనలను పాలసీలో పొందుప ర్చాలి. తనఖా పెట్టిన వాటి నుంచి రాబట్టుకోగలికే విలువను లెక్కించే విధానాన్ని కూడా నిర్దేశించాలి. ► ఆర్ఈకి ప్రయోజనం చేకూర్చేలా మొండిబాకీల నుంచి తక్కువ ఖర్చులో, అత్యధికంగా రాబట్టాల నేది లక్ష్యంగా ఉండాలి.రాజీ సెటిల్మెంట్ చేసుకున్న రుణగ్రహీతలకు ఆర్ఈలు నిర్దిష్ట వ్యవధి తర్వాతే మళ్లీ కొత్తగా రుణాలివ్వడానికి వీలుంటుంది. -
అలవెన్స్ చర్చలు సఫలం
గోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త బొగ్గు గని కార్మి కుల 11వ వేతన ఒప్పందం 10వ సమావేశం శుక్రవారం కోల్‌కతాలో జరిగింది. యాజమాన్యం జరిపిన చర్చలో అన్ని అలవెన్స్‌లపై 25శాతం పెంచేందుకు అంగీకారం కుదిరినట్లు జాతీయ కార్మి క సంఘాల నాయకులు తెలిపారు. అండర్ గ్రౌండ్ అలవెన్స్ 9 నుంచి 11.25 శాతం, స్పెషల్ అలవెన్స్ 4 నుంచి 5 శాతం, హెచ్ఆర్ఏ 2 నుంచి 2.5, ఎల్టీసీ రూ.8వేల నుంచి రూ.10వేలు, ఎల్ఎల్టీసీ రూ.12 వేల నుంచి రూ.15వేలు పెంచడానికి అంగీకారం కుదిరింది. సెలవులు, సిక్ లీవ్‌లు 120 నుంచి 150 అక్యుములేషన్ చేసుకోవడానికి, అంబేద్కర్ జయంతిని పెయిడ్ హాలిడేగా అంగీకరించారు. లైవ్ రోస్టర్‌లో ఉన్న అమ్మాయిలకు 18ఏళ్లు వచ్చే వరకు డిపెండెంట్ జాబ్ అవకాశం కల్పించనున్నారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ మస్టర్‌కు రూ.50 చెల్లించనున్నారు. నర్సింగ్ అలవెన్స్ నెలకు రూ.500 ఇవ్వనున్నారు. కార్మి కుడు..కార్మి కుని భార్య చనిపోయి పిల్లలు అనాథలైతే వారికి సగం జీతం, 18ఏళ్లు దాటితే ఉద్యోగం కల్పిస్తారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం 19శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్, 3శాతం ఇంక్రిమెంట్‌తోపాటు ఒప్పుకున్న డిమాండ్లను శనివారం డ్రాఫ్ట్ రూపంలో పొందుపరుస్తారు. సమావేశాన్ని శనివారం కూడా కొనసాగించనున్నారు. సమావేశంలో కోలిండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు మెంబర్లు ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నుంచి జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యోగులకు అలర్ట్.. టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ బిల్లులు ఉండాల్సిందే!
ఉద్యోగం చేస్తే ప్రతి నెలా జీతం వస్తుంది ఈ కాన్సెప్ట్ మనందరికి తెలసిందే. అయితే మన జేబులోకి వచ్చే జీతం మాత్రమే మనకు ముఖ్యంగా కనిపిస్తుంది, కానీ సీటీసీలో(CTC) చాలా భాగాల ఉంటాయి. మన పని బట్టి వాటికి అలవెన్స్‌లు కూడా అందుకుంటాం. అవి రవాణా భత్యం, టూర్ డ్యూటీ అలవెన్స్, మొబైల్ రీయింబర్స్మెంట్, కన్వీనియన్స్ అలవెన్స్ వంటి రకరకాలు ఉంటాయి. ఇక్కడే దాగిన ఓ విషయం ఏంటంటే.. మనం అలవెన్స్‌ల బిల్లులు లేకపోతే మనపై టాక్స్ భారం పడతుందండోయ్. బిల్లలు తప్పనిసరి.. లేదంటే కంపెనీ నుంచి ఉద్యోగులు పొందే అలవెన్స్‌లపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే అందుకోసం ఉద్యోగులు కచ్చితంగా వారి అలవెన్స్ బిల్లులు సమర్పించాలి. ఒకవేళ బిల్లులు సమర్పించపోతే వాటిపై పన్ను కట్టాల్సి వస్తుంది. ఒక ఉద్యోగి పొందుతున్న అలవెన్సులు పన్ను పరిధిలోకి వస్తే, వారికి టీడీఎస్ (TDS) కూడా వర్తిస్తుంది. అలవెన్సులపై వర్తించే టీడీఎస్ అనేది ఉద్యోగి ఎంచుకున్న ఆదాయపు పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఉద్యోగులు బిల్లులను నిర్వహించడం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు ఉద్యోగి అతని బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేనప్పటికీ, ఆదాయపు పన్ను శాఖ ఒకవేళ మీకు పన్నుకు సంబంధించిన నోటీసు పంపితే, ఆ సమయంలో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసినట్లు రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వ్యక్తి తన ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి ఖర్చు చేసిన అలవెన్స్‌లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉందనే విషయాన్ని గమనించాలి. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 10 (14)i ప్రకారం ఏం చెప్తోందంటే.. ‘ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం తన ఉద్యోగ బాధ్యతలరీత్యా వ్యక్తి పొందే ఏ అలవెన్స్లైనా వాటి నుంచి పన్ను మినహాయింపు లభిస్తుంది. చదవండి: Flipkart: కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే! -
వర్క్‌ఫ్రమ్ హోం.. శాలరీ స్ట్రక్చర్ ఓ కొలిక్కి!
దేశంలో వర్క్‌ఫ్రమ్ హోం విధానంలో కొనసాగే ఉద్యోగుల జీతభత్యాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల విభాగం జరుపుతున్న చర్చలు ‘శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. వర్క్‌ఫ్రమ్ హోంలో కొనసాగే ఉద్యోగులకు బేసిక్ శాలరీ, హైకులు, బోనస్‌ల నిర్ణయాలు పూర్తిగా కంపెనీవే. తాజాగా ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం, కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు నడిచాయి. కొత్త వర్క్ మోడల్‌కు సరిపోయేలా ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే క్రమంలోనే ఇలా పారిశ్రామిక ప్రతినిధులతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వరుస భేటీలు నిర్వహిస్తోందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. హెచ్ఆర్ఏ మీదే.. వర్క్‌ఫ్రమ్ హోం ఎఫెక్ట్‌తో సొంతూళ్లకే పరిమితమైన ఉద్యోగుల కారణంగా ఇంటి అద్దె భత్యంలో తగ్గింపు, వైఫై-కరెంట్ బిల్లులపై రీయంబర్స్మెంట్ను ప్రవేశపెట్టడం గురించి తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే House Rent Allowance శాతం తగ్గించడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, మరో భేటీలో ఈ అంశంపై స్పష్టత రావొచ్చని చెప్తున్నారు. ఆపై సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. తద్వారా ట్యాక్స్ చట్టాలకు అవసరమైన సవరణలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ మేరకు బడ్జెట్-2022లో ఈ విషయాల్ని పొందుపరుస్తారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో జరిగేది కష్టమేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇబ్బందులు లేకుండా చూడండి ఇదిలా ఉంటే జనవరి 13న భారత్‌కు చెందిన కొన్ని కంపెనీల హెచ్ఆర్ హెడ్స్, సీఈవోలతో కార్మిక మంతత్రిత్వ శాఖ భేటీ జరిపింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. ఉపాధి కల్పనను పెంపొందించడం, శ్రామిక శక్తి యొక్క భవిష్యత్తు నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు వర్క్‌ఫ్రమ్ హోం విధి విధానాలపై చర్చ జరిగిందని సమాచారం. యజమానులు- ఉద్యోగుల మధ్య వివాదాల పరిష్కారం, ఏర్పడబోయే ఇబ్బందుల్ని తొలగించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ కోసం ‘‘సమగ్ర’’ నియమాలు, నిబంధనలను రూపొందించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదివరకే.. గత ఏడాది జనవరిలో ప్రభుత్వం స్టాండింగ్ ఆర్డర్ ద్వారా సర్వీస్‌సెక్టార్‌కి ఇంటి నుండి పనిని లాంఛనప్రాయంగా చేసింది. యజమానులు మరియు ఉద్యోగులు పని గంటలు మరియు ఇతర సేవా పరిస్థితులపై పరస్పరం నిర్ణయించుకునేలా చేసింది. అయితే కరోనా పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు అన్ని రంగాలకు సమగ్ర అధికారిక నిర్మాణాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వం తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్‌లో పని నుండి ఇంటి ఖర్చులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని సిఫారసు చేసింది. ‘‘ఫర్నీచర్/ఇతర సెటప్ ఛార్జీల కోసం అయ్యే ఖర్చులు ప్రత్యేకంగా మినహాయింపొచ్చు’’ అని ICAI సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా యొక్క ప్రీ-బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ 2022 నివేదిక ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించింది. ‘‘ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఉద్యోగులు వ్యాపారాలలో ఇంటి నుండి పని చేస్తున్నారు’’’అని అకౌంటింగ్ విభాగం పేర్కొంది, ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేసింది. మరోవైపు పరిశ్రమల సంస్థ నాస్కామ్.. వర్క్‌ఫ్రమ్ హోంకు మద్దతుగా ప్రభుత్వం లేబర్ చట్టాల్లో చేయగల ఆరు చర్యలను సిఫార్సు చేసింది. పని గంటలు, షిఫ్ట్ సమయాలను మార్చేయడం లాంటి కార్మిక చట్టాలలో మార్పుల్ని నాస్కామ్ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులు చేసే ఖర్చుల నుండి ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులను సిఫార్సు చేసింది. ప్రధానంగా ఇంటి నుండి పనిని వ్యాపార ఖర్చులుగా పరిగణించాలని సూచించింది. నాస్కామ్ సమర్పించిన సిఫార్సుల నివేదికను కిందటి ఏడాది మే నెలలోనే.. పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారుల చర్చించి.. ఆపై ఆ నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు పంపారు. చదవండి: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం! -
రాష్ట్రపతి నోట జీతం ప్రస్తావన.. రచ్చ రచ్చ
ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ల జీతం, సెలబ్రిటీల సంపాదన గురించి జనాల్లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ‘ఫలానా వాళ్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు?’ లాంటి హెడ్డింగ్‌లకు దక్కే ఆదరణే అందుకు ఉదాహరణ. అయితే తమ జీతాలు, సంపాదన గురించి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ: తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురించి ట్విటర్ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన ఐదు లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్ల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడు’’ అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అంతే.. राष्ट्रपति बोले- मुझे 5 लाख प्रति महीना तनख्वाह मिलती है जिसमें से पौने 3 लाख टैक्स चला जाता है, हमसे ज्यादा बचत तो एक टीचर की होती है#presidentkovind #UttarPradesh pic.twitter.com/D6MAgmFCZm — News24 (@news24tvchannel) June 27, 2021 రెండు వాదనలతో.. ఇక రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరు ట్విటర్ ద్వారా హేళన చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతరత్రా అలవెన్స్‌లు కూడా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్లు ఉంటాయని వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కట్టింగ్ల జీతం ఎటుపోతుందోనని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కరోనా టైంలో జీతాల్లో కొంత వాటాను(30 శాతం దాకా) త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. చదవండి: రాష్ట్రపతి కాన్వాయ్ కోసం ఆగిన ఊపిరి! -
అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి
ఆమ్స్టర్డామ్: ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. ఇక డబ్బు కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి పరిణామాలు జరుగుతున్న ఈ రోజులల్లో ఓ యువతి కోట్ల రుపాయలను ఖర్చులకోసం ఇస్తుంటే సున్నితంగా తిరస్కరించింది. ఇది నమ్మలేకున్నా నమ్మాల్సిన నిజమండి. వివరాలల్లోకి వెళితే.. డచ్ సింహాసనం వారసురాలు నెదర్లాండ్స్ యువరాణి కాథరినా అమాలియా తనకు రానున్న భారీ వార్షిక అలవెన్స్ హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాగ్జిమా పెద్ద కుమార్తె శుక్రవారం డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టేకు ఓ లేఖను రాసి పంపింది. అందులో.. ఆమె రాజ విధులు చేపట్టే వరకు దాదాపు 2 మిలియన్ డాలర్ల భత్యాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. రాచరికపు నిబంధనల ప్రకారం ఆమెకు 18 ఏట నుంచి.. ప్రతి సంవత్సరం అలవెన్స్‌ల కింద సుమారు రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 7న అమ్మడుకు 18 ఏళ్లు రానుండగా.. ఆమె దీనిని వద్దంటూ వివరణగా.. కష్టపడకుండా వచ్చే డబ్బులు తనకొద్దని తెలిపింది. View this post on Instagram A post shared by Koninklijk Huis (@koninklijkhuis) చదవండి: టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!? -
ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!
ఒకప్పుడు ఏ కొద్ది మందికో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే ఉద్యోగ విధులు) భాగ్యం ఉండేది. కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అన్నది ఐటీ ఉద్యోగులకు పరిచయమే. కానీ, కరోనా మహమ్మారి వచ్చి.. ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేసుకునేలా చేసింది. తప్పనిసరైన ఏ కొద్ది మందో తప్పించి మిగిలినవారు ప్రస్తుతానికి ఈ విధానంలోనే కొనసాగుతున్నారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగుల జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీలు, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ ఇందుకు అనుకూలిస్తున్నాయి కూడా. కానీ, నాణేనికి రెండో కోణం కూడా ఉన్నట్టే.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను అధిగమించడమే కాదు.. పన్ను పరమైన అంశాలను కూడా ఉద్యోగులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యాలయాలకు వెళ్లి పనిచేయడం వల్ల తీసుకుంటున్న కొన్ని రకాల అలవెన్స్‌లు ఇంటి నుంచి చేయడం కారణంగా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నుంచి ప్రత్యేక మినహాయింపులు, వివరణలు వస్తే తప్ప పన్ను చెల్లింపుల బాధ్యత ఉద్యోగులపై ఉంటుంది. ఈ అంశాల గురించి తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ప్రస్తుతమున్న ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి అందుకుంటున్న వేతనం, అలవెన్స్‌లు (మినహాయింపుల్లో ఉన్నవి కాకుండా) పన్ను పరిధిలోకే వస్తాయి. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) అన్నవి నిర్దేశిత పరిమితుల వరకు పన్ను మినహాయింపు కలిగినవి. కానీ, బయటకు వెళితే కరోనా రిస్క్ ఉంటుందన్న కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నప్పుడు.. పర్యటనలకు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇంటి నుంచి కార్యాలయానికి రోజువారీ రవాణా కూడా తక్కువగానే ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లను ఖర్చు చేసే పరిస్థితి లేప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. మినహాయింపులపై ప్రభావం.. వేతనంలో హెచ్ఆర్ఏ ఒక భాగం. ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటూ.. అద్దె చెల్లింపులు చేస్తున్నట్టయితే నిర్దేశిత పరిమితి మేరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వేతనంలో నిర్ణీత శాతం, వాస్తవంగా తీసుకున్న హెచ్ఆర్ఏ, వాస్తవంగా చెల్లించిన అద్దె వీటిల్లో ఏది తక్కువ అయితే దానిని మినహాయింపుగా చూపించుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారికి మూల వేతనంలో 50 శాతం, ఇతర పట్టణాల్లో ఉంటున్నట్టు అయితే మూల వేతనంలో 40 శాతాన్ని క్లెయిమ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా కారణంగా చాలా మంది నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించడంతో.. వారికి ఈ వెసులుబాటు లభించింది. దీనివల్ల అనవసర ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాస్తంత రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వారిది. సొంత ఇల్లు... హెచ్ఆర్ఏ! కొందరు ఇప్పటి వరకు ఉంటున్న అద్దె ఇళ్ల నుంచి తక్కువ అద్దె ఇళ్లలోకి మారుతున్నారు. హెచ్ఆర్ఏ తీసుకుంటూ అద్దె ఇంట్లో ఉండని వారు కచ్చితంగా ఆ మొత్తంపై పన్ను చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు చెల్లించిన అద్దెతో పోలిస్తే తక్కువ అద్దెకు మారిన వారిపైనా పన్ను భారం ఆ మేరకు పడుతుంది. అలాగే, తమ నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చుకున్న వారి విషయంలోనూ నిబంధనలు మారిపోతాయి. ఎందుకంటే మెట్రో నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న వారికి మినహాయింపుల పరంగా స్వల్ప వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గమనించాలి. ట్రూఅప్ౖపై దృష్టి... ఆర్థిక సంవత్సరం ప్రారంభం లోనే (ఏప్రిల్) ఉద్యోగులు తమ పెట్టుబడులు, ట్యూషన్ ఫీజుల అంచనాలు, ఇంటి అద్దె చెల్లింపుల వివరాలను పనిచేస్తున్న సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే సంబంధిత సంవత్సరంలో ఉద్యోగి పన్ను బాధ్యతను కంపెనీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా పన్ను మొత్తాన్ని నెలవాయిదాల రూపంలో వేతనం నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు కంపెనీలు చెల్లింపులు చేస్తాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగి సమర్పించిన డిక్లరేషన్.. అదే విధంగా ఆర్థిక సంవత్సరం చివర్లో (జనవరి తర్వాత) ఉద్యోగి ఇచ్చే తుది డిక్లరేషన్, డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత అదనంగా పన్ను వసూలైందా లేక తక్కువ పన్ను వసూలైందా అన్న నిర్ధారణకు వస్తాయి. దీన్నే ట్రూఅప్‌గా పేర్కొంటారు. కనుక ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఉద్యోగి తప్పకుండా సంస్థకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంటి అద్దెలో మార్పులు జరిగినా లేక నివాసిత ప్రాంతం మారిపోయినా చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో పన్ను వసూలు పరంగా మార్పులు, చేర్పులకు వీలు కలుగుతుంది. ఎల్‌టీఏ... ప్రయోజనం పోయినట్లే! ఎల్‌టీఏ విషయంలో నాలుగు సంవత్సరాలను ఒక బ్లాక్‌గా పరిగణి స్తారు. ఒక బ్లాక్ కాలంలో రెండు పర్యటనల కోసం వాస్తవంగా చేసిన ఖర్చుకు పన్ను మినహాయింపును కోరొచ్చు. ప్రస్తుత బ్లాక్ 2018–2021గా అమల్లో ఉంది. ఎల్‌టీఏ మినహాయింపును ఒక బ్లాక్‌లో వినియోగించుకోని పరిస్థితుల్లో తదుపరి బ్లాక్‌కు దాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే తదుపరి బ్లాక్‌లో మొదటి సంవ్సరంలోనే దీన్ని వినియోగించుకోవాలి. అయినప్పటికీ.. ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటనల పట్ల ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు, కరోనా ఎప్పుడు సమసిపోతుందో తెలియని పరిస్థితుల్లో.. సమీప కాలానికీ పర్యటనల ప్రణాళికలు పెట్టుకోవడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు ఎల్‌టీఏ అలవెన్స్‌పై పన్ను చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా.. అనువైన టేబుల్స్, కుర్చీల ఏర్పాటు, కరెంటు, ఇంటర్నెట్ వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్‌ల రూపంలో మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ, ఇటువంటి ప్రోత్సాహకాల గురించి ఆదాయపన్ను చట్టంలో స్పష్టంగా ఇప్పటి వరకు అయితే నిర్దేశించలేదు. కనుక ఈ విధమైన అలవెన్స్‌లు కూడా పన్ను పరిధిలోకే వస్తాయి. -
మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైలు ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ( డిఎంఆర్సి ) నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలనుంచి ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలను 50 శాతం తగ్గించనున్నట్లు మంగళవారం డిఎంఆర్సి ఒక ఉత్తర్వులో పేర్కొంది. మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినందున ఉద్యోగుల జీతంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో డిఎంఆర్సి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు ఐదు నెలలుగా మెట్రో సేవలు నిలిచిపోయినందున తీవ్ర ఆర్థిక భారం నేపథ్యంలో ఉత్యోగుల జీతభత్యాలను 50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. (రూ.3,756 కోట్లు ప్లీజ్) ఢిల్లీ మెట్రో రైలు ఉద్యోగులకు లభించే అన్ని రకాల అడ్వాన్సులను తదుపరి ఉత్తర్వుల వరకు నిషేధించారు. అయితే ఇప్పటికే అనుమతి పొందిన వారికి మాత్రమే అడ్వాన్సులు ఇస్తారు. అయితే మెట్రో ఉద్యోగులు వైద్య చికిత్స, టీఏ, డీఏ వంటి ఇతర సౌకర్యాలను ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు. దేశంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో మినహా దాదాపు అన్ని రవాణా సౌకర్యాలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో మెట్రో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో గతంలో రైల్వే కార్పేరేషన్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి తీసుకున్న 35,198 కోట్ల రుణాన్ని ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి చెల్లించడం సాధ్యం కాదని కేంద్రానికి లేఖ రాసింది. వచ్చే ఏడాది వరకు రుణాన్ని వాయిదా వేయాలని డిఎంఆర్సి గత నెలలోనే లేఖ రాసింది. ఈ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 1242.83 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించాల్సి ఉందని డిఎంఆర్సి అధికారి ఒకరు వెల్లడించారు. (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్ ) -
అలవెన్సులు ఇవ్వకుంటే విమానాలు నడపం
ముంబై: ఫ్లయింగ్ అలవెన్స్ బాకీలు తక్షణమే చెల్లించని పక్షంలో విమానాలు నడిపే ప్రసక్తే లేదని ప్రభుత్వ రంగ ఎయిరిండియా యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. మిగతా ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం చేయకుండా సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ, తమనూ.. క్యాబిన్ సిబ్బందినీ పక్కన పెడుతున్నారని వారు ఆందోళ వ్యక్తం చేశారు. పైలట్ల జీతాల్లో ఎక్కువ భాగం వాటా ఫ్లయింగ్ అలవెన్సులదే ఉంటుందని తెలిసీ ఇలా చేయడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ అలవెన్సులను తక్షణం చెల్లించని పక్షంలో ఫ్లయింగ్ విధులకు హాజరు కాలేమని ఎయిరిండియా డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌కి పంపిన లేఖలో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) పేర్కొంది. జీతం మాత్రమే చెల్లిస్తున్నందున ఆఫీసుకు వస్తామని, ఫ్లయింగ్ విధులు తప్ప మిగతావన్నీ నిర్వర్తిస్తామని తెలిపింది. పైలట్ల జీతభత్యాల్లో 30 శాతమే జీతం కాగా మిగతాది అలవెన్సుల రూపంలోనే ఉంటుంది. సాధారణంగా ఫ్లయింగ్ అలవెన్సులు రెండు నెలల తర్వాత చెల్లిస్తారు. దీని ప్రకారం జూన్ నెలవి ఆగస్టు 1న చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటిదాకా చెల్లించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
భారత్ వృద్ధి బాట పటిష్టం!
న్యూయార్క్: భారత్ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2018–2019లో వృద్ధి 7.3 శాతమని అంచనావేయగా, 2019–2020 ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషించింది. పెట్టుబడులు స్థిరరీతిన పెరుగుతుండడం, ప్రైవేటు వినియోగంలో వృద్ధి దీనికి కారణమని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ముఖ్యాంశాలను చూస్తే... సమీప భవిష్యత్‌తో భారత్ స్థూల ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్ బాగుంది. ద్రవ్యోల్బణం 2018–19లో 5.2 శాతంగా ఉంటుంది. డిమాండ్ పరిస్థితులు పటిష్టంగా ఉండడం, రూపాయి విలువ క్షీణత, చమురు ధరలు, హౌసింగ్ రెంట్ అలవెన్స్‌ల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల పెంపు దీనికి కారణం. 2018–19కి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 2.6%గా ఉంటుంది. చమురు ధరల పెరుగుదల, దిగుమతులకు డిమాండ్ దీనికి కారణం. భారత్ ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి తగిన చర్యలు ఉన్నాయి. బ్యాంకింగ్ రుణ వృద్ధి మెరుగుపడుతోంది. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో చర్యలు ఉన్నాయి. రానున్న కొద్ది దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలకపాత్ర పోషించనుందని ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ (ఇండియా) రానిల్ సెల్గాడో పేర్కొన్నారు. ఈ విషయంలో గత చైనా పాత్రను ఇకపై భారత్ పోషించే వీలుందని అన్నారు. 2016 ద్వితీయార్ధంలో డీమోనిటైజేషన్, ఆ తర్వాత జీఎస్టీ అమలుపరమైన షాక్‌ల నుంచి భారత ఎకానమీ కోలుకుంటోంది. మెరుగైన స్థూలఆర్థిక విధానాలు, ఇటీవలి కాలంలో అమలు చేసిన కొన్ని కీలక సంస్కరణల ఊతంతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతోంది ఇటీవలి రేట్ల పెంపు సరైనదే. రాబోయే రోజుల్లోనూ పాలసీని క్రమంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
ఎంపీల అలవెన్సు పెంపునకు ఓకే
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులకు అందజేస్తున్న అలవెన్సులను పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఎంపీలకు ప్రతినెల చెల్లించే నియోజకవర్గ అలవెన్సు రూ.45 వేల నుంచి రూ.70 వేలకు చేరుకోనుంది. అలాగే ఆఫీస్ ఖర్చుల కోసం అందిస్తున్న అలవెన్సు మొత్తం రూ.45 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోనుంది. వీటికి అదనంగా ఐదేళ్లకోసారి అందించే ఫర్నీచర్ అలవెన్సును రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అంతేకాకుండా ఎంపీల మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పార్లమెంటు సభ్యుడిపై ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ.2.70 లక్షల మేర ఖర్చుపెడుతోంది. అక్రమరవాణా కేసులు ఎన్ఐఏకు: ఉగ్రవాద కేసుల్ని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు మనుషుల అక్రమరవాణా కేసుల్ని విచారించే బాధ్యతను కూడా కేంద్రం అప్పగించింది. ఈ మేరకు మనుషుల అక్రమ రవాణా(నిరోధం, రక్షణ , పునరావాసం) బిల్లు–2018కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం తరచూ మనుషుల్ని అక్రమంగా తరలించేవారికి యావజ్జీవశిక్ష కూడా విధించవచ్చు. ఎన్ఐఏలో ఏర్పాటుచేయనున్న ప్రత్యేక విభాగానికి నిర్భయ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందిస్తారు.ప్రధానమంత్రి ఉద్యోగ కల్పనా కార్యక్రమం (పీఎంఈజీపీ) కాలపరిమితిని 2019–20 వరకూ పెంచుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.5,500 కోట్లను కేటాయించింది. దీంతో ఏటా 15 లక్షల చొప్పున మూడేళ్లలో 45 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. -
ఎంపీలకు కేంద్రం గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పార్లమెంట్ సభ్యుల(ఎంపీల) నియోజకవర్గం, ఫర్నీచర్, కమ్యూనికేషన్ ఖర్చుల అలవెన్స్‌ల పెంపుకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ అలవెన్స్ పెంపుతో ఇప్పటి వరకున్న ఫర్నీచర్ కొనుగోలు అలవెన్స్ 75వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెరిగింది. అదేవిధంగా నియోజకవర్గ అలవెన్స్ కూడా 60వేల రూపాయలకు పెరిగింది. 45వేల రూపాయలుగా ఉన్న ఈ అలవెన్స్‌ను రూ.60వేలకు పెంచాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అలవెన్స్‌ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.39 కోట్ల అదనపు భార పడనున్నట్టు తెలుస్తోంది. కాగ, ఎంపీల వేతనాలను కూడా ద్రవ్యోల్బణంతో లింక్ చేస్తూ ప్రతి ఐదేళ్లకు ఒక్కసారి సమీక్షించేలా ఓ శాశ్వత మెకానిజనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. ఎంపీలకు ఇచ్చే వేతనంలో 50 వేల రూపాయల బేసిక్ శాలరీ, 45 వేల రూపాయల నియోజకవర్గ అలవెన్స్ ఉంటాయి. మొత్తంగా ఒక్కో ఎంపీపై నెలకు రూ.2.7 లక్షలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. స్పీకర్‌ను మినహాయిస్తే ప్రస్తుతం లోక్‌సభలో 536 మంది ఎంపీలున్నారు. వారిలో ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు. రాజ్యసభలో 239 మంది సభ్యులున్నారు. -
‘ఎంపీల వేతనాలు పెంచండి’
న్యూఢిల్లీ: ఎంపీలు వేతనాలు, అలవెన్సులు పెంచాలని సమాజ్‌వాదీపార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ కోరారు. రాజ్యసభలో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత ఎంపీల వేతనాలు కేబినెట్ సెక్రటరీల జీతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ కూడా గతేడాది ఇదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంచాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం.. ఎంపీల వేతనాలు 100 శాతం పెంచనుందని గతేడాది వార్తలు వచ్చాయి. దీంతో ఎంపీల నెల వేతనం రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెరగనుందని ప్రచారం జరిగింది. ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిన తర్వాత కేబినెట్ కార్యదర్శి నెల వేతనం రూ. 2.5 లక్షలకు పెరిగింది. -
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త
♦ 7వ వేతన సంఘం సిఫారసులకు కేబినెట్ ఆమోదం ♦ కనీస హెచ్ఆర్ఏ ఇవ్వాలని నిర్ణయం ♦ ఖజానాపై ఏడాదికి రూ. 30,748 కోట్ల భారం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల అలవెన్సులకు సంబంధించి ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులకు 34 మార్పులతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మేలు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. కనీస హెచ్ఆర్ఏ విషయంపై కేబినెట్ పలు మార్పులు చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన మూడు వర్గాలుగా విభజించిన నగరాల్లో వరుసగా మూలవేతనంలో 30% (జనాభా 50లక్షలకు పైగా), 20% (5–50లక్షల జనాభా), 10% (5లక్షల కన్నా తక్కువ) ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) ప్రస్తుతం చెల్లిస్తున్నారు. అయితే, దీన్ని 24%, 16%, 8 శాతానికి తగ్గించాలని వేతన సవరణ సంఘం సూచించిందని జైట్లీ తెలిపారు. కేబినెట్ ఈ సవరణకు మార్పులు చేసి ఉద్యోగి నివసిస్తున్న నగరం ఆధారంగా రూ.5,400, 3,600, 1,800 కనీస హెచ్ఆర్ఏ అందేలా నిర్ణయం తీసుకుందన్నారు. రూ.18,000 కనీస వేతనం ఉన్న ఉద్యోగిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు సూచిం చామన్నారు. అయితే.. ఉద్యోగి డీఏ మూలవేతనంలో 25–50 శాతంలోపు ఉంటే హెచ్ఆర్ఏ 27 శాతంగా, 50 శాతానికన్నా ఎక్కువ ఉంటే 30 శాతంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘డీఏ (కరవు భత్యం) 50 నుంచి 100 శాతానికి పెరిగినపుడు హెచ్ఆర్ఏ కూడా పెరగాలని వేతన సవరణ సంఘం ప్రతిపాదించింది. అయితే కేంద్రం డీఏ 25 నుంచి 50 శాతానికి పెరిగినపుడే హెచ్ఆర్ఏను సవరించాలని నిర్ణయించింది’ అని జైట్లీ తెలిపారు. సియాచిన్, సీఆర్పీఎఫ్ బలగాలకు భారీ లాభం భద్రత బలగాలకు రేషన్ అలవెన్సు నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుందన్నారు. సియాచిన్ అలవెన్సు గురించి జైట్లీ వెల్లడిస్తూ.. ‘తొమ్మిదో లెవల్, అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి రూ.31,500 ఇవ్వాలని వేతన సంఘం సూచించింది. అయితే దీన్ని మేం రూ.42,500కు పెంచాం. ఎనిమిదో లెవల్ అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు రూ.30వేలు (రూ.21వేలు చేయాలని సూచన)పొందుతారు’ అని చెప్పారు. నక్సల్స్ ప్రాంతాల్లోని సీఆర్పీఎఫ్ జవాన్లకు నెలకు ఇస్తున్న అలవెన్సులు రూ.8,400 నుంచి 16,800కు, రూ. 17,300 రూ. 25,000లకు పెరుగుతాయి. వీటి ద్వారా ఖజానాపై ఏడాదికి రూ.30,748.23 కోట్ల భారం పడనుంది. పింఛనుదారులకు బొనాంజా ఈ పెరిగిన అలవెన్సులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన సవరణ సంఘం సూచనలకు అదనంగా హెచ్ఆర్ఏను పెంచటం ద్వారా ప్రతిపాదనలకన్నా రూ.1,448 కోట్ల మేర అదనపు భారం పడనుంది. 53 రకాల అలవెన్సులను తొలగించాలని ఏడో వేతన సవరణ సంఘం సూచించగా.. వీటిలో 12 అలవెన్సులను కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా రైల్వేలు, పోస్టల్, రక్షణ, పరిశోధన విభాగాల్లో పనిచేసే లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరగనుంది. దీంతోపాటుగా పింఛనుదారులకు మెడికల్ అలవెన్సులను నెలకు రూ. 500నుంచి రూ.1,000కి పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు. వందశాతం అశక్తత (డిజేబుల్మెంట్) ఉన్న పింఛనుదారుల కాన్స్టంట్ అంటెండెన్స్ అలవెన్సును నెలకు రూ.4,500 నుంచి రూ.6,750కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు -
ఇంకా ఒక్క రోజే: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వస్తుందా?
7వ వేతన సంఘం కింద సమీక్షించిన జీతభత్యాల అమలుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా ఒక్క రోజుల్లోనే జీతభత్యాల విషయంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఓ క్లారిటీ రానుంది. రిపోర్టుల ప్రకారం అశోకా లావాసా ప్యానెల్ ప్రతిపాదిస్తూ సమర్పించిన డ్రాఫ్ట్ రిపోర్టుపై కార్యదర్శుల సాధికారిక కమిటీ సోమవారమే తుదినిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అశోక్ లావాసా ప్యానెల్ రిపోర్టును జూన్ 1 కంటే ముందే కార్యదర్శుల సాధికారిక కమిటీ పరిశీలిస్తుందని, వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రకేబినెట్ ముందుకు తీసుకొస్తుందని కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ కార్యదర్శులు సాధికారిక కమిటీ, లావాసా ప్యానెల్ ప్రతిపాదలపై తుదినిర్ణయం తీసుకొని ఉంటే, ఆ ఫైల్ జూన్ 1 కంటే ముందే కేంద్రకేబినెట్ ముందుకు వెళ్లనుంది. ఏడవ వేతన సంఘ సిపారసుల్లో జీతభత్యాల విషయంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో గతేడాది జూలైలో కేంద్రప్రభుత్వం అశోక్ లావాసా ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. ఈ ప్యానెల్ సమీక్షించిన తమ ప్రతిపాదనలను ఏప్రిల్ 27న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జీతభత్యాలను సమీక్షించాలని కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు. జీతభత్యాల విషయంలో ఈ కొత్త ప్రతిపాదనలతో హెచ్ఆర్ఏ 157 శాతం నుంచి 178 శాతం పెరుగనున్నట్టు తెలుస్తోంది. -
వేతన పెంపు జాప్యానికి కారణం ఇదేనా?
ఏడవ వేతన సంఘ సిఫారసులకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపి దాదాపు ఆరు నెలల కావొస్తోంది. అయినా వేతన పెంపు శుభవార్త కోసం ఇంకా ప్రభుత్వోద్యోగులు వేచిచూస్తునే ఉన్నారు. ఆమోదం పొందినా ఈ సిఫారసులు అమలుకు నోచుకోవడం లేదు. దీనికి గల ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు కొరతేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. గత జనవరి 1 నుంచే ఉద్యోగులకు ఏడవ వేతన కమిషన్ ప్రతిపాదనలను అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం పరిస్థితంతా తలకిందులైంది. అప్పటినుంచి ప్రభుత్వం వేతన పెంపును ఎప్పుడు చేపడుతుందో క్లారిటీగా వెల్లడించడం లేదు. ఏడవ వేతన సంఘ ప్రకారం హౌసింగ్ అలవెన్స్ కింద 138.71 శాతం, ఇతర అలవెన్స్ కింద 49.79 శాతం ఉద్యోగులకు పెంచాల్సి ఉంది. ఈ అలవెన్స్ ప్రతిపాదనల అమలుతో ప్రభుత్వం దాదాపు రూ.29,300 కోట్ల మేర భారాన్ని భరించాల్సి ఉంది. ఇప్పటికే డీమానిటైజేషన్ ఎఫెక్ట్‌తో నగదు కొరతను ప్రభుత్వం ఎదుర్కొంటుండటంతో, ఈ వేతనాలను పెంచి మరింత నగదు కొరత భారాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. త్వరగా తమకు అలవెన్స్ పెంపును చేపట్టాలని ఉద్యోగుల సంఘాలు తెచ్చిన ఒత్తిడి మేరకు, వేతనసంఘ సిఫారసులకు ఆమోదం తెలిపినప్పటికీ, అమలును మాత్రం చేపట్టడం లేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ మధ్యలో అలవెన్స్ పెంపు చేపట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఉండదు. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉన్నంత కాలం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ లోపల నగదు చలామణి కూడా పెరిగి, వేతన పెంపుకు ప్రభుత్వానికి కొంత ఉపశమనం దొరుకుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ ఈ జాప్యం ఉద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి. -
హెచ్‌సీయూ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు..?
సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌సీయూ ఘటనలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు వేయనున్నారా..అంటే అవుననే అంటున్నాయి అధికారిక వర్గాలు. యూనివర్సిటీ సర్వీసు రూల్స్ ప్రకారం ఏదైనా ఒక నేరారోపణపై అరెస్టై 48 గంటల పాటు జైల్లో గడిపితే వారిని సస్పెండ్ చేసే అధికారం ఆ యూనివర్సిటీకి ఉంది. ఒక వేళ యూనివర్సిటీ వీరిని సస్పెండ్ చేస్తే నెలసరి వేతనం సహా ఇతర అలవెన్సులు, సీనియార్టీ, పదోన్నతులన్నీ నిలిచిపోతాయి. అయితే సస్పెన్షన్‌కు ముందు వారికి షోకాజు నోటీసులు జారీ చేస్తారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కేసు కొనసాగుతూనే ఉంటుంది. హియరింగ్‌కు వచ్చిన తర్వాత వాదనలు విన్పించే అవకాశం కల్పిస్తుంది. ముద్దాయి నేరం చేసినట్లు రుజువైతే వారు తమ ఉద్యోగాన్ని కోల్పొయే ప్రమాదం ఉంటుంది. ఒక వేళ నేరం రుజువు కాకపోతే సస్పెన్షన్ కాలంలో నిలిపివేసిన వేతనం సహా ఇతర అలవెన్సులు, సర్వీసు, పదోన్నతి వంటి సదుపాయాలన్నీ తిరిగి పొందుతారు.