ఉద్యోగం చేస్తే ప్రతి నెలా జీతం వస్తుంది ఈ కాన్సెప్ట్ మనందరికి తెలసిందే. అయితే మన జేబులోకి వచ్చే జీతం మాత్రమే మనకు ముఖ్యంగా కనిపిస్తుంది, కానీ సీటీసీలో(CTC) చాలా భాగాల ఉంటాయి. మన పని బట్టి వాటికి అలవెన్స్‌లు కూడా అందుకుంటాం. అవి రవాణా భత్యం, టూర్ డ్యూటీ అలవెన్స్, మొబైల్ రీయింబర్స్‌మెంట్, కన్వీనియన్స్ అలవెన్స్ వంటి రకరకాలు ఉంటాయి. ఇక్కడే దాగిన ఓ విషయం ఏంటంటే.. మనం అలవెన్స్‌ల బిల్లులు లేకపోతే మనపై టాక్స్ భారం పడతుందండోయ్.
బిల్లలు తప్పనిసరి.. లేదంటే
కంపెనీ నుంచి ఉద్యోగులు పొందే అలవెన్స్‌లపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే అందుకోసం ఉద్యోగులు కచ్చితంగా వారి అలవెన్స్ బిల్లులు సమర్పించాలి. ఒకవేళ బిల్లులు సమర్పించపోతే వాటిపై పన్ను కట్టాల్సి వస్తుంది. ఒక ఉద్యోగి పొందుతున్న అలవెన్సులు పన్ను పరిధిలోకి వస్తే, వారికి టీడీఎస్ (TDS) కూడా వర్తిస్తుంది. అలవెన్సులపై వర్తించే టీడీఎస్ అనేది ఉద్యోగి ఎంచుకున్న ఆదాయపు పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఉద్యోగులు బిల్లులను నిర్వహించడం చాలా ముఖ్యం.
ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు ఉద్యోగి అతని బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేనప్పటికీ, ఆదాయపు పన్ను శాఖ ఒకవేళ మీకు పన్నుకు సంబంధించిన నోటీసు పంపితే, ఆ సమయంలో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసినట్లు రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వ్యక్తి తన ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి ఖర్చు చేసిన అలవెన్స్‌లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉందనే విషయాన్ని గమనించాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 10 (14)i ప్రకారం ఏం చెప్తోందంటే.. ‘ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం తన ఉద్యోగ బాధ్యతలరీత్యా వ్యక్తి పొందే ఏ అలవెన్స్‌లైనా వాటి నుంచి పన్ను మినహాయింపు లభిస్తుంది.
చదవండి: Flipkart: కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే!
Comments
Please login to add a commentAdd a comment