ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏటా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. అసెస్‌మెంట్ ఇయర్ 2023-24కు ఈ ఏడాది జులై31వ తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంది. తమ ఉద్యోగులకు పన్ను భారం తగ్గించేందుకు యాజమాన్యాలు అలవెన్స్‌ల రూపంలో కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఈ ఏడు అలవెన్స్‌లను సద్వినియోగం చేసుకుంటే పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..
1.హౌస్ రెంట్ అలవెన్స్ (సెక్షన్ 10(13ఏ):
అద్దె ఇళ్లలో నివాసం ఉండే ఉద్యోగులు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) రూపంలో పన్ను ప్రయోజనం పొందవచ్చు. మెట్రో నగరాల్లో నివసించేవారు తమ జీతంలో (బేసిక్, డీఏతో కలిపి) 50 శాతంపై, నాన్ మెట్రో నగరాల్లో నివసించేవారు 40 శాతంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. చెల్లించే అద్దె వార్షిక జీతంలో 10 శాతానికి మించరాదు.
2.లీవ్ ట్రావెల్ కన్సెషన్ లేదా అసిస్టెన్స్ (సెక్షన్ 10(5)):
ఈ అలవెన్స్ కింద ఉద్యోగులు సెలవుపై దేశంలో ఎక్కడ పర్యటించినా ఆ ప్రయాణ ఖర్చుపై పన్ను ఉండదు. అయితే రైలు, విమానాలు, ఇతర ప్రజా రవాణా సాధానాల ద్వారా మాత్రమే ప్రయాణించాలి. అయితే నాలుగు కేలండర్ ఇయర్లలో రెండుసార్లకు మాత్రమే ఈ మినహాయింపు పొందొచ్చు. ఇంకా సెక్షన్ 10(14) కింద మరికొన్ని అలవెన్సులు ఉన్నాయి.
3.చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్:
ఇది పిల్లల చదువులపై చేసే ఖర్చుకు సంబంధించింది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.100 చొప్పున మినహాయింపు పొందవచ్చు.
4.యూనిఫాం అలవెన్స్:
విధి నిర్వహణలో ధరించే యూనిఫాం కొనుగోలు, నిర్వహణ కోసం చేసే ఖర్చుపై ఈ అలవెన్స్ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు.
5.పుస్తకాలు, పీరియాడికల్స్ అలవెన్స్:
ఆదాయపు శాఖ నియమాల ప్రకారం.. పుస్తకాలు, న్యూస్‌పేపర్లు, జర్నల్స్, పీరియాడికల్స్ వంటివి కొనుగోలు చేసి దానికి సంబంధించి రీయింబర్స్‌మెంట్ పొందితే దానిపై పన్ను ఉండదు.
6.రీలొకేషన్ అలవెన్స్:
కంపెనీలు ఉద్యోగులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేస్తుంటాయి. ఇలాంటప్పుడు ఆ ఉద్యోగి సామాన్లను తరలించేందుకు అయిన ఖర్చు, తమ కార్ల తరలింపు, రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చు, రైలు, విమాన టికెట్లు, ప్రాథమికంగా 15 రోజుల వసతికి అయ్యే ఖర్చును కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. ఈ రీయింబర్స్‌మెంటుపైనా ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
7.హెల్పర్ అలవెన్స్:
విధి నిర్వహణలో భాగంగా సహాయకుడుని నియమించుకునేందుకు కంపెనీలు అనుమతిస్తే ఈ అలవెన్స్ వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment