allowences
-
దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి బేరోజ్గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సందేశాలు వాట్సాప్‌లో చక్కర్లుకొడుతున్నాయి. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా దీన్నే అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆశజూపి అమాయకుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. వెబ్సైట్ లింకులు పంపి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని వాటిని ఖాళీ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అసలు ఈ ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పటివరకు తీసుకురాలేదని చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిరోద్యగ భృతి సందేశాలు మొత్తం ఫేక్ అని తేల్చింది. వీటిని ఎవరూ నమ్మొద్దని, మోసపోవద్దని సూచించింది. एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है। #PIBFactCheck ▶️यह मैसेज फर्जी है। ▶️भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही। ▶️कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें। pic.twitter.com/w0mfOyEAMI — PIB Fact Check (@PIBFactCheck) February 20, 2023 చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే? -
భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా?
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏటా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. అసెస్మెంట్ ఇయర్ 2023-24కు ఈ ఏడాది జులై31వ తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంది. తమ ఉద్యోగులకు పన్ను భారం తగ్గించేందుకు యాజమాన్యాలు అలవెన్స్‌ల రూపంలో కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఈ ఏడు అలవెన్స్‌లను సద్వినియోగం చేసుకుంటే పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.. 1.హౌస్ రెంట్ అలవెన్స్ (సెక్షన్ 10(13ఏ): అద్దె ఇళ్లలో నివాసం ఉండే ఉద్యోగులు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) రూపంలో పన్ను ప్రయోజనం పొందవచ్చు. మెట్రో నగరాల్లో నివసించేవారు తమ జీతంలో (బేసిక్, డీఏతో కలిపి) 50 శాతంపై, నాన్ మెట్రో నగరాల్లో నివసించేవారు 40 శాతంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. చెల్లించే అద్దె వార్షిక జీతంలో 10 శాతానికి మించరాదు. 2.లీవ్ ట్రావెల్ కన్సెషన్ లేదా అసిస్టెన్స్ (సెక్షన్ 10(5)): ఈ అలవెన్స్ కింద ఉద్యోగులు సెలవుపై దేశంలో ఎక్కడ పర్యటించినా ఆ ప్రయాణ ఖర్చుపై పన్ను ఉండదు. అయితే రైలు, విమానాలు, ఇతర ప్రజా రవాణా సాధానాల ద్వారా మాత్రమే ప్రయాణించాలి. అయితే నాలుగు కేలండర్ ఇయర్లలో రెండుసార్లకు మాత్రమే ఈ మినహాయింపు పొందొచ్చు. ఇంకా సెక్షన్ 10(14) కింద మరికొన్ని అలవెన్సులు ఉన్నాయి. 3.చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్: ఇది పిల్లల చదువులపై చేసే ఖర్చుకు సంబంధించింది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.100 చొప్పున మినహాయింపు పొందవచ్చు. 4.యూనిఫాం అలవెన్స్: విధి నిర్వహణలో ధరించే యూనిఫాం కొనుగోలు, నిర్వహణ కోసం చేసే ఖర్చుపై ఈ అలవెన్స్ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. 5.పుస్తకాలు, పీరియాడికల్స్ అలవెన్స్: ఆదాయపు శాఖ నియమాల ప్రకారం.. పుస్తకాలు, న్యూస్‌పేపర్లు, జర్నల్స్, పీరియాడికల్స్ వంటివి కొనుగోలు చేసి దానికి సంబంధించి రీయింబర్స్మెంట్ పొందితే దానిపై పన్ను ఉండదు. 6.రీలొకేషన్ అలవెన్స్: కంపెనీలు ఉద్యోగులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేస్తుంటాయి. ఇలాంటప్పుడు ఆ ఉద్యోగి సామాన్లను తరలించేందుకు అయిన ఖర్చు, తమ కార్ల తరలింపు, రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చు, రైలు, విమాన టికెట్లు, ప్రాథమికంగా 15 రోజుల వసతికి అయ్యే ఖర్చును కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. ఈ రీయింబర్స్మెంటుపైనా ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 7.హెల్పర్ అలవెన్స్: విధి నిర్వహణలో భాగంగా సహాయకుడుని నియమించుకునేందుకు కంపెనీలు అనుమతిస్తే ఈ అలవెన్స్ వర్తిస్తుంది. -
పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగుల సంబరాలు...
-
కనీస పెరుగుదల రూ.5,352
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తే.. ఆయా శాఖలు ఉద్యోగుల వేతన స్థిరీకరణ చేపట్టను న్నాయి. ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగికి ఇవ్వాల్సిన కనీస మూల వేతనాన్ని రూ.19 వేలుగా, అత్యున్నత స్థాయిలో ఉండే వారికి గరిష్ట మూల వేతనాన్ని రూ.1,62,070గా సూచిస్తూ.. పీఆర్సీ మాస్టర్ స్కేల్‌ను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమకు ఎంత ప్రయోజనం చేకూరుతుందనే అంచనాలు వేసుకుంటున్నారు. ప్రారంభ వేతనంలో ఎక్కువున్నా.. పీఆర్సీ కమిటీ ప్రస్తుతమున్న కనీస మూలవేతనంలో రూ.6 వేల పెంపును సిఫార్సు చేసింది. గత పీఆర్సీలో కనీస మూల వేతనం రూ.13,000 ఉండగా.. ఇప్పుడు రూ.19 వేలకు పెంచింది. గరిష్ట వేతనం గత పీఆర్సీలో రూ.1,10,850 ఉంటే.. ఇప్పుడు రూ.1,62,070కి పెంచింది. అంటే కనీస మూల వేతనంలో రూ.6 వేలు, గరిష్ట మూల వేతనంలో రూ.51,220 పెంపును ప్రతిపాదించింది. దీనికి లోబడి ఆర్థిక శాఖ వేతన స్థిరీకరణకు అనుమతి ఇవ్వనుంది. ఈ లెక్కన నాలుగో తరగతి ఉద్యోగుల మొత్తం వేతనంలో పెంపు రూ.5,352 నుంచి మొదలు కానుంది. అయితే.. గత పీఆర్సీ సిఫార్సుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే నాలుగో తరగతి ఉద్యోగి కనీస మూల వేతనం రూ.13 వేలుగా ఉంది. అది చాలా తక్కువని నాలుగో తరగతి ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో.. ఆ స్కేల్‌ను సవరించి రూ.14,170 బేసిక్ పేతో వేతన స్థిరీకరణ చేశారు. వీరికి ప్రస్తుత పీఆర్సీ పెరుగుదల తక్కువగా ఉండనుంది. బేసిక్ పే రూ.6వేలు పెరిగినా.. మొత్తం వేతనంలో పెరుగుదల రూ.3,588గానే ఉండనుంది. వీరికి వేతన స్థిరీకరణ 14,170తో చేయడం, మూడు కరువు భత్యాలు(డీఏ) ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే అంతకుముందే చేరిన సీనియర్లకు మాత్రం పెరుగుదల రూ.5 వేలకుపైనే ఉండనుంది. సీఎం కేసీఆర్‌కు పూలమొక్క ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలు మామిళ్ల రాజేందర్, మమత తదితరులు. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ 2018 జూలై 1 వరకున్న డీఏ విలీనం కొత్త పీఆర్సీని 2018 జూలై 1వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉంది. ఆలస్యంగా ఇప్పుడు అమల్లోకి తెస్తున్నా.. అప్పటి మూల వేతనం ఆధారంగానే వేతన సవరణ అమలు చేస్తారు. ఆ గడువునాటికి ఉన్న కరువు భత్యం (డీఏ)ను కొత్త వేతనంలో విలీనం చేస్తారు. ప్రస్తుతం ఉద్యోగులకు 38.776 డీఏ వస్తోంది. ఇందులోనుంచి 2018 జూలై 1 వరకున్న డీఏ 30.392 శాతం కొత్త వేతనంలో కలుస్తుంది. ఈ డీఏను, 30 శాతం ఫిట్‌మెంట్‌ను పాత బేసిక్ పేతో కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు. 2018 జూలై 1 తర్వాత మంజూరైన 7.28 శాతం డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులను కలిపి మొత్తం వేతనాన్ని స్థిరీకరిస్తారు. ఫిట్మెంట్ అంటే.. ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చుల మేరకు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు చేసే జీతాల పెంపునే ఫిట్మెంట్ అంటారు. కేంద్రం పదేళ్లకోసారి, మన రాష్ట్ర సర్కారు ఐదేళ్లకోసారి వేతన సవరణ చేస్తాయి. నిర్ణీత గడువు నాటికి ఉద్యోగికి ఉన్న మూల వేతనానికి.. అప్పటికి ఉన్న డీఏను, ఫిట్‌మెంట్‌గా ఇచ్చే మొత్తాన్ని కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు. అయితే ఉద్యోగుల మూల వేతనాలకు సంబంధించి నిర్ణీత పేస్కేల్ ఉంటుంది. ఉద్యోగి కొత్త మూల వేతనాన్ని ఆ పేస్కేల్‌లో ఉన్న మొత్తానికి సర్దుబాటు చేస్తారు. దీనికి ఇతర అలవెన్సులను కలిపి మొత్తం జీతాన్ని లెక్కిస్తారు.ఉదాహరణకు ఒక సీనియర్ లెక్చరర్ మూల వేతనం రూ.53,950గా ఉంది. ఆయనకు 2018 జూలై 1 నాటికి ఉన్న 30.392% డీఏ అంటే రూ.16,396+30% ఫిట్మెంట్ అంటే రూ.16,185ను మూల వేతనానికి కలిపితే.. రూ.86,531 కొత్త బేసిక్‌పే అవుతుంది. కానీ మాస్టర్ స్కేల్లో ఈ బేసిక్‌పే లేదు. దానికన్నా తక్కువగా రూ.85,240, ఆపైన రూ.92,050 బేసిక్ పేలు ఉన్నాయి. ఇలా ఉంటే పైన ఉండే స్కేల్‌నే ఇస్తారు. ఈ లెక్కన ఈ సీనియర్ లెక్చరర్ కు రూ.92,050 మూల వేతనం, దీనిపై 7.28 శాతం డీఏ+హెచ్ఆర్ఏ+సీసీఏ వంటి ఇతర అలవెన్సులు కలిపి పూర్తి వేతనాన్ని నిర్ధారిస్తారు. ‘సీఎంకు కృతజ్ఞతలు’ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటన చేసినందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రకటన అనంతరం మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ఆయన సీటు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత సీఎం చాంబర్లో కేసీఆర్‌ను కలిసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ ప్రకటనపై కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఉద్యోగ సంఘాల నేతలు మామిళ్ల రాజేందర్, ప్రతాప్ (టీఎన్జీఓ), గెజిటెడ్ అధికారుల సంఘం నాయకురాలు మమత, ఏనుగుల సత్యనారాయణ (టీజీఓ), శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్ (పీఆర్టీయూ టీఎస్), గడ్డం జ్ఞానేశ్వర్ (నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్, బాణాల రాంరెడ్డి (వీఆర్వోలసంఘం) ఉన్నారు. -
మాకేదీ యూనిఫాం అలవెన్స్?
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. పోలీస్ శాఖకు మాత్రమే యూనిఫాం అలవెన్స్‌ను పెంచడంపై అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పోలీస్ శాఖలోని సిబ్బందికి యూనిఫాం అలవెన్స్‌ను రూ.3,500 నుంచి రూ.7,500లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ సి బ్బంది యూనిఫాం అలవెన్స్‌ను పెంచుతామ ని ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల క్రితం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో మిగతా యూనిఫాం సర్వీసులైన జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని అధికారులు, సిబ్బందిలో అసహనం మొదలైంది. తమకు కూడా పోలీస్ శాఖకు సమానంగా అలవెన్స్ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. పదో పీఆర్సీ ప్రకారం.. హోంశాఖ జారీచేసిన జీవోలో, పదో పీఆర్సీ ప్రకారం యూని ఫాం అలవెన్స్‌ను పెంచుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపిం ది. అందులో భాగంగానే సీఎం హామీతో పాటు డీజీపీ ప్రతిపాదనలమేర అలవెన్సును పెంచినట్టు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇచ్చిన జీవో 12లో స్పష్టం చేసింది. అయితే పదో పీఆర్సీ ప్రకారం యూనిఫాం సర్వీసుల్లో తమ అలవెన్స్‌ను కూడా రూ.7,500లకు పెంచాలని జైళ్లు, ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. తమ విభాగాల అధిపతులను కలసినా పట్టించుకోవడం లేదం టూ ఆయా సర్వీసుల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూని ఫాం అలవెన్సుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖకు యూనిఫాం అలవెన్స్ కింద వెచ్చిస్తున్న నిధుల్లో తమకు 30% సరిపోతుందని, తాము పోలీస్ శాఖ సిబ్బందికిగానీ, అధికారులకుగానీ వ్యతిరేకం కాదని వారు అంటున్నారు. -
ఆర్టీసీలో భారీగా భత్యాల పెంపు
కొత్త అలవెన్సులు ఖరారు చేసిన జేఎండీ సంస్థపై అదనపు భారం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధికారులకు యాజమాన్యం వివిధ రకాల భత్యాల(అలవెన్సులు)ను ఖరారు చేసింది. తాజా వేతన సవరణ నేపథ్యంలో భారీగా పెరిగిన జీతాలకు తోడుగా ఇప్పుడు భత్యాలు కూడా భారీగానే పెరిగాయి. 100 శాతం పెంచాలనే డిమాండ్ వచ్చినప్పటికీ సంస్థ ఆర్థిక స్థితి దృష్ట్యా జేఎండీ రమణరావు రెట్టింపు కాకుండా స్వల్పంగా తగ్గించి ఖరారు చేశారు. సూపర్ స్కేల్, స్పెషల్ స్కేల్, సీనియర్ స్కేల్, జూనియర్ స్కేల్ అధికారులకు సంబంధించిన భత్యాలను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి సూపరింటెండెంట్ స్థాయి అధికారుల భత్యాలు ఖరారు చేయాల్సి ఉంది. గతంతో పోలిస్తే వాటిని 60 శాతం వరకు పెంచే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. టీఏడీఏ, స్పెషల్ అలవెన్సు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్సు, న్యూస్‌పేపర్ అలవెన్సు, రీఫ్రెష్మెంట్ రీయింబర్స్మెంట్, కన్వేయన్స్ రీయింబర్స్మెంట్ తదితరాల్లో భారీ పెరుగుదల నమోదైంది. వేతన సవరణతో వీటినీ పెంచాల్సిన అగత్యం ఏర్పడింది. ఇటీవలి వేతన సవరణతో సంస్థపై ప్రతినెలా రూ.75 కోట్ల వరకు అదనపు భారం పడుతుండటంతో ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం చేస్తే తప్ప వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భత్యాల భారాన్ని మోసేందుకు సంస్థ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి. ప్రతి నెలా చెల్లించే భత్యాల పెంపు ఇలా... టీఏడీఏ: సూపర్ స్కేల్ అధికారులకు రూ.1,200 నుంచి 1,920కి, స్పెషల్ స్కేల్లో రూ.వేయి నుంచి 1,600కు, సీనియర్ స్కేల్లో 800 నుంచి రూ.1,280కి, జూనియర్ స్కేల్ అధికారులకు 600 నుంచి రూ.960కి పెంచారు. స్పెషల్ అలవెన్సు: 80 కంటే ఎక్కువ బస్సులున్న డిపో మేనేజర్లకు రూ.6,400, అంతకంటే తక్కువున్న డీఎంలకు రూ.4,800గా నిర్ధారించారు. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్సు: సూపర్ స్కేల్ అధికారులకు రూ.2,500 నుంచి 4 వేలకు, సీనియర్, జూనియర్ స్కేల్ అధికారులకు రూ.2 వేల నుంచి 3,200కు పెంచారు. న్యూస్‌పేపర్ అలవెన్సు: సూపర్ స్కేల్ అధికారులకు రూ.1,500 నుంచి 2,400కు, స్పెషల్ స్కేల్ అధికారులకు రూ.1,200 నుంచి 1,920కి, సీనియర్ స్కేల్లో రూ.వేయి నుంచి 1,600కు, జూనియర్ స్కేల్లో 700 నుంచి రూ.1,120కి పెంచారు. రిఫ్రెష్మెంట్ రీయింబర్స్మెంట్: సూపర్ స్కేల్లో రూ.2,500 నుంచి 4 వేలకు, స్పెషల్ స్కేల్లో రూ.2,300 నుంచి రూ.3,680కి. కన్వేయన్స్ రీయింబర్స్మెంట్: డీఎంలకు రూ.10,400కు, సీనియర్ స్కేల్లో రూ.8 వేలకు పెంచారు. తార్నాకలోని ఆసుపత్రిలో హజార్డెడ్ విధులు నిర్వహించే వైద్యులకు అందించే ప్రత్యేక భత్యాన్ని రూ.7 వేల నుంచి 11,200కు పెంచారు. రెండేళ్లకోమారు అందించే బ్రీఫ్‌కేస్ అలవెన్సును పెండింగులో ఉంచారు.