న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి బేరోజ్‌గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సందేశాలు వాట్సాప్‌లో చక్కర్లుకొడుతున్నాయి. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు.
సైబర్ నేరగాళ్లు కూడా దీన్నే అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆశజూపి అమాయకుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. వెబ్‌సైట్ లింకులు పంపి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని వాటిని ఖాళీ చేస్తున్నారు.
ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అసలు ఈ ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పటివరకు తీసుకురాలేదని చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిరోద్యగ భృతి సందేశాలు మొత్తం ఫేక్ అని తేల్చింది. వీటిని ఎవరూ నమ్మొద్దని, మోసపోవద్దని సూచించింది.
एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) February 20, 2023
▶️यह मैसेज फर्जी है।
▶️भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही।
▶️कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें। pic.twitter.com/w0mfOyEAMI
చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే?
Comments
Please login to add a commentAdd a comment