unemployement
-
‘నిరుద్యోగంలో భారత్ పాక్‌ను మించిపోయింది’.. రాహుల్ గాంధీ విమర్శలు
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల చిరువ్యాపారులు కుదేలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఓ సభలో మాట్లాడారు. ‘ఈ రోజులో గత 40 ఏళ్లలో లేని అత్యంత భారీ నిరుద్యోగం దేశంలో ఉంది. పాకిస్తాన్లో ఉన్న నిరుద్యోగం కంటే రెండింతలు అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భూటాన్ దేశాలో కంటే ఎక్కువ నిరుద్యోగం భారత్‌లో ఉంది. దానికి గల కారణం ప్రధాని మోదీ అమలు చేసిన విధానాలు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల చిరు వ్యాపారులు కుదేలయ్యారు’ అని రాహుల్‌గాంధీ మడిపడ్డారు. అంతకు ముందు మరో సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. గతంలో చేపట్టిన యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. అయితే మిగతా రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్ఘడ్, గుజరాత్ ఎందుకు వెళ్లలేదని ప్రజలు తనను ప్రశ్నించారని తెలిపారు. అందుకే మరో యాత్ర చేపట్టానని.. ఇది న్యాయ కోసం చేసే యాత్ర అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేసించిన ఇవాళ ఉదయం ఆయన ఎక్స్ సర్వీస్‌మెన్, అగ్నీవీర్లతో మాట్లాడారు. ఈ రోజు రాహుల్ గాంధీ బిహార్‌లో జరిగే ‘ఇండియా కూటమి’ ర్యాలీ సందర్భంగా తన యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. తిరిగి సోమవారం ప్రారంభమై మధ్యప్రదేశ్‌లో పలు జిల్లాకుండా కొనసాగనుంది. రైల్వే పాలసీలు ధనికుల కోసమే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైల్వే పాలసీలపై రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రైల్వే పాలసీలన్నీ కేవలం ధనికుల కోసమే తీసుకువచ్చారని మండిపడ్డారు. ‘ప్రతి ఏడాది 10 శాతం రైల్వే చార్జీలు పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడి చేస్తోంది. క్యాన్సలేషన్ చార్జీలు పెంచుతోంది. ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు పెంచింది. ఉన్నత వర్గానికి చెందిన రైలు పేరుతో ప్రజలను దోపిడి చేస్తోంది. పేదలు కనీసం ఆ రైలులో కాలుపెట్టలేని పరిస్థితి ఉంది. ... రైళ్లలో ఏసీ కోచ్‌లు సంఖ్య పెంచి.. జనరల్ కోచ్‌లు సంఖ్య తగ్గించారు. జనరల్ కోచ్‌ల తగ్గింపుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ కోచ్‌ల తయారీ కంటే మూడు రెట్లు ఎక్కవ ఏసీ కోచ్‌లు తయారు చేస్తున్నారు. రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టడం ఆపేయటం మూలంగా రైల్వేలో జరిగే కుట్రలు తెలియటం లేదు’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ ట్విటర్లో మండిపడ్డారు. -
దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి బేరోజ్గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సందేశాలు వాట్సాప్‌లో చక్కర్లుకొడుతున్నాయి. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా దీన్నే అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆశజూపి అమాయకుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. వెబ్సైట్ లింకులు పంపి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని వాటిని ఖాళీ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అసలు ఈ ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పటివరకు తీసుకురాలేదని చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిరోద్యగ భృతి సందేశాలు మొత్తం ఫేక్ అని తేల్చింది. వీటిని ఎవరూ నమ్మొద్దని, మోసపోవద్దని సూచించింది. एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है। #PIBFactCheck ▶️यह मैसेज फर्जी है। ▶️भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही। ▶️कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें। pic.twitter.com/w0mfOyEAMI — PIB Fact Check (@PIBFactCheck) February 20, 2023 చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే? -
ఇది నిరుద్యోగ భారతం.. ఇంకా తగ్గని కరోనా ఎఫెక్ట్!
దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు మరోసారి ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. ఈ ఏడాది 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ‘నిరుద్యోగ రేటు’ 9.3 శాతానికి పెరిగింది. గత ఏడాది 2020లో ఇదే త్రైమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1 శాతమే. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్ఎఫ్ఎస్) చెప్పిన లెక్కలు. 15 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అక్టోబర్-డిసెంబర్ 2020 లో 10.3 శాతంగా ఉందని 9వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో నిరుద్యోగ రేటు(వయస్సు -
విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి అన్ని పక్షాల మద్దతు: భట్టి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి అన్ని పక్షాలు మద్దతు తెలిపాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన అఖిలపక్షభేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. ‘‘అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మాతో కలసివచ్చే పార్టీలను కోరడం జరిగింది. మా ప్రతిపాదనకు మీటింగ్‌లో పాల్గొన్న అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయి. పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామన్నాయి. మాతో కలిసి వచ్చే పార్టీలే కాదు.. ఆ పార్టీల అనుబంధ సంఘాలు కూడా మాతో కలసి పని చేస్తాయి’’ అని భట్టి విక్రమార్క తెలిపారు. (చదవండి: గుర్రపు బండిపై అసెంబ్లీకి..) నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌తో కలసి పోరాటం చేస్తాం: చాడ వెంకట్ రెడ్డి.. సీపీఐ కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు.. పోడు భూముల సమస్యపై పోరాటం ఉదృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాం అన్నారు సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌తో కలసి పోరాటం చేస్తాం. ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కేసీఆర్ విఫలం అయ్యాడు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలసి పనిచేసినట్లుగానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలసి పనిచేయాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపే అంశంపై మా పార్టీ లో చర్చించి మరోసారి సమావేశం అవుతాం’’ అని చాడ వెంకటరెడ్డి తెలిపారు. చదవండి: విద్యార్థి, నిరుద్యోగులతో ఆందోళన చేస్తాం: రేవంత్‌రెడ్డి -
ప్రయి‘వేటు’ పడగ నీడ!
ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. దీంతో ప్రపంచం లోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. చిత్తశుద్ది ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి– ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రం. ప్రభుత్వ రంగ సంస్థల స్థిరాస్తుల మీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించుకుంటాయి? కార్యదక్షత తెలిసేది కష్టకాలంలోనే! అన్నీ సాఫీగా నడిచినపుడు కాక సంక్షుభిత సమయాలే పాలకుల్లో సమర్థత ఉందో, లేదో అద్దంపడుతాయి. ప్రజల పట్ల ప్రభుత్వాల నిబద్ధతను నిగ్గు తేలు స్తాయి. మాటకి–చేతకి పొంతన ఎంతో తేల్చి చెబుతాయి. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. కోవిడ్ మహమ్మారి కొట్టిన దెబ్బకు దేశంలోని కోట్లాది కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. సంవత్సరాల నుంచి ఉద్యోగమో, ఉపాధో అని నిరీక్షిస్తున్న కుటుంబాల గతి ఇప్పటికే దీనంగా ఉంటే, ఉన్న ఉద్యోగం–ఉపాధి కోవిడ్ వల్ల కోల్పోయి రొడ్డున పడ్డ జీవితాలు దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నాయి. తమ ఉద్దీపన చర్యలతో కోలుకుంటోందని ప్రభుత్వాలు ఊదరగొట్టిన ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ రెండో విజృంభణతో వెనక్కి జారుతోంది. పూర్తి మూసివేత (లాక్డౌన్) లేకపోయినా... దాదాపు అలాంటి పరిస్థితినే తలపిస్తున్న నిర్బంధాలు, నిషేధాలు, కఠిన ఆంక్షలు వివిధ కార్య కలాపాల్ని స్తంభింపజేస్తున్నాయి. సామాన్యుల మనుగడ దుర్భరం చేస్తూ ఆర్థిక వృద్ధిని అడ్డగిస్తున్నాయి. దినకూలీల ఉపాధి ఉట్టెక్కుతోంది. ఉద్యోగాలు ఊడుతున్నాయి. రాబడి తగ్గిన ఈ కష్టకాలం లోనే.. ఖర్చులు రమారమి పెరిగాయి. అత్యధికుల బతుకు దుర్భర మౌతోంది. ప్రకృతి దెబ్బకు ప్రభుత్వాల నిర్వాకంతోడై సమాజంలో ఆర్థిక అంతరాలు అధికమౌతున్నాయి. సంపన్నులు మరింత సంపన్ను లవుతుంటే, పేదలు నిరుపేదలవుతున్నారు. మధ్యతరగతి జీవులు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. అశాంతి ప్రబలుతోంది. ఈ నెల 11తో ముగిసిన వారం నమోదైన జాతీయ నిరుద్యోగిత 8.58 శాతానికి చేరింది. గత నెలా ఖరుకున్న 6.65%పైన ఇది దాదాపు 2% పెరుగుదల. నగర–పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత సుమారు పది శాతానికి చేరుకున్నట్టు ‘భారత ఆర్థిక నిర్వహణ కేంద్రం’ (సీఎంఐఈ) అధ్యయనం చెబుతోంది. ఇవి ప్రమాద సంకే తాలు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. సర్కార్ల చిత్తశుద్ధే ముఖ్యం! ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావు. కనుకే, అందుకు తలపడవద్దని, పోరాడి నిలిచి–గెలవాలనీ అందరూ చెబుతారు. అయినప్పటికీ ఆత్మహత్య చేసుకునే వారి మానసిక పరిస్థితి గురించి ఒక క్షణం ఆలోచించాలి. ‘నేను చాతకాక చావటం లేదు, నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి.. ఆరేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఏ యత్నమూ ఫలించలేదు, సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తేవాలని...’ అంటూ వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్న కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సునీల్ నాయక్ ఒక హెచ్చరిక! మరో నిరుద్యోగి, నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, దుస్థితి తట్టుకోలేక తానూ బలవన్మరణంతో తనువు చాలించిన అతని భార్య అక్కమ్మ... ఇవన్నీ సమస్య తీవ్రతకు ప్రతీకలే! ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి–ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లు, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులు, నర్సులు, టీచర్లు, పోలీసులు, సర్వీసు కమిషన్ ద్వారా ఉన్నతస్థాయి ఉద్యోగులు... ఇలా వివిధ విభా గాల్లో కలిపి రెండేళ్ల కాలంలోనే 4 లక్షల మందికి పైగా ఉద్యోగ–ఉపాధి కల్పించింది. వారంతా, రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడపడంలో భాగమౌతున్నారు. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టక పోవడం విస్మయం. ఖాళీలు భర్తీ చేయరు. వాటిని ఖాళీగా చూపించడం ఇష్టం లేక, విమర్శల్ని ఎదుర్కోలేక పోస్టుల్నే రద్దు చేస్తారు. అయినా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కింద కలిపి సుమారు 60 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం దేశవ్యాప్తం ఖాళీగా ఉన్నట్టు ఓ లెక్క! వాటిని భర్తీ చేసే ప్రయత్నం జరగటం లేదు. ఎన్నికవడానికి ముందు దేశ ప్రజలకు హామీ ఇస్తూ, ‘ఏటా కోటి నుంచి రెండు కోట్ల ఉద్యోగాలి స్తాం’ అన్నారు, ఏవీ? అలాంటిదే మరో ఎన్నికల హామీ, ‘రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం’ అన్నారు, అవెక్కడ? తెలంగాణలో పాలక– విపక్షాల మధ్య ఇదో నిత్యరగడ! ఆరేళ్లలో 1.35 లక్షల మందికి ఉద్యోగ –ఉపాధి కల్పించామని పాలకపక్షం అంటే, నిజానికి ఆ సంఖ్య 35 వేలే అని విపక్షాలంటున్నాయి. ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలూ తమ ఘనతే అంటే, అక్కడ ఊడిపోతున్న అవకాశాలకూ సర్కార్లు బాధ్యత వహించాలి, వహిస్తాయా? పెరగాల్సిన ఉద్యోగులు తగ్గితే? ఏటా లక్షలాది మంది డిగ్రీలు పొంది ఉద్యోగాల కోసం వీధుల్లోకి వస్తు న్నారు. తగినన్ని అవకాశాలు ఉండటం లేదు. 2017–18 లో నిరుద్యోగిత తీవ్రస్థాయికి చేరింది. 1972–73 తర్వాత, 45 ఏళ్లలో ఇదే అత్యధికమని జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) వెల్లడించింది. 2017 నుంచి 2018 కి వచ్చే సరికి పెరగాల్సింది పోయి, 1.09 కోట్ల మంది ఉద్యోగులు తగ్గినట్టు సీఎంఐఈ అధ్యయనం తెలిపింది. ఖాళీలు భర్తీ చేయడం లేదు. ప్రయివేటు రంగంలోనూ విస్తరణలు ఆశించిన స్థాయిలో లేవు. పెద్ద కార్పొరేట్లు మధ్యతరహా పరిశ్రమల్నీ మననీయటం లేదు. ఉద్యోగిత పెంచే చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రభుత్వాలు తగినంత ప్రోత్సహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటివరకు దాదాపు 3 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయని ఒక అంచనా! 1.91 లక్షల ఖాళీలున్నాయని ఇటీవల పీఆర్సీ నివేదికే చెప్పింది. 25 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది యువకులు ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో.. కోవిడ్ పెద్ద దెబ్బే కొట్టింది. మొదటి విజృంభణలో గత సంవత్సరం కష్ట నష్టాలకోర్చి స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికుల్లో 38.6 శాతం మంది మాత్రమే, తమ పని ప్రదేశాలకు తిరిగి వెళ్లినట్టు ఓ అధ్య యనం చెప్పింది. ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకమే (ఎన్నార్ఈజీ) అత్యధికుల్ని ఆదుకుంది. ఈ పథకం ద్వారా 2019–20 లో 7.88 కోట్ల మంది, 2020–21 లో 11.17 కోట్ల మంది శ్రామిక ప్రజలు లబ్ధి పొందారు. కాలం మారుతోంది, కర్కశంగా... ఇదివరకెన్నడూ లేని విధంగా, ‘అవునూ, అన్నీ ప్రైవేటుపరం చేస్తాం, ఏమిటి తప్పు?’ అని దర్జాగా, ధాటిగా సర్కార్లు ఎదురు ప్రశ్నించే కాలం వచ్చింది. సంక్షేమ రాజ్యం–జవాబుదారీతనం అర్థాలే మారుతున్నాయి. ‘‘ప్రభుత్వ నిర్వాకాల వల్ల నష్టాలొస్తున్నాయి, అందుకే పబ్లిక్ రంగ సంస్థల్ని ఎంతో ‘సామర్థ్యం’ ఉన్న ప్రైవేటుపరం చేస్తు న్నామం’’టున్నారు. అంతటా ప్రైవేటు రంగానికి అంతటి సామర్థ్యమే ఉంటే, వాళ్లు తీసుకున్న అప్పులు, ఇన్నిన్ని బ్యాంకుల్లో ఇన్నేసి లక్షల కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్పీయే)గా ఎందుకు మారుతున్నాయి? ప్రజాధనాన్ని ఎందుకిలా కొల్లగొడుతున్నారు? ఇప్పటికే నదులు, సముద్రాలు, అడవులు, కొండలు, కోనలు, ఖనిజాలు.. ఇలా సహజ వనరుల్ని ప్రైవేటుపరం చేసి, కొత్త ఆశ్రిత వర్గాల్ని బలోపేతం చేసు కుంటున్నారు. పరిశ్రమలని, సెజ్లని, ఫార్మాసిటీలని ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తుల కిచ్చేస్తున్నారు. కర్షకులు, కార్మికులు, ఇతర పౌర సమాజం పోరాడి సాధించుకున్న చట్టాల్ని, హక్కుల్ని క్రమంగా నీరుగారుస్తున్నారు. చట్టాల్ని మారుస్తూ, ప్రజల దృష్టి ఏమారుస్తూ... ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అరవై, డెబ్బై ఏళ్లుగా ప్రజాధనం వెచ్చించి, ఇటుక ఇటుకగా పేర్చి అభివృద్ధి చేసిన పబ్లిక్‌రంగ సంస్థల్ని (వ్యూహాత్మ కమైనవి తప్ప) అన్నింటినీ ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. పప్పు బెల్లాలకు ధారా దత్తం చేస్తున్నారు. అందులో నష్టాలొచ్చేవే కాదు, లాభాలు గడించేవీ ఉన్నాయి! వాటి స్థిరాస్తులమీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించు కుంటాయి? జీతాలు కోస్తే అడిగేదెవరు? ఉద్యోగుల్ని తొలగిస్తే పట్టించుకునేదెవరు? అది పరోక్షంగా నిరుద్యోగితకే దారి తీస్తుంది. అందుకే అంటారు, విప్లవం ప్రత్యక్ష ఉత్పత్తి కాదు, విప్లవ పరిస్థితుల ఉప ఉత్పత్తి అని! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నిరుద్యోగులకు శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు ఓ శుభవార్త. రాష్ట్ర బడ్జెట్లో వారికి సంబంధించిన ఓ కొత్త అంశం చేరబోతోంది. అదే.. నిరుద్యోగభృతి. ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లింపునకు సిద్ధమవుతోంది. వచ్చే రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనాల్లో నిరుద్యోగభృతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిసారిగా నిరుద్యోగభృతి పద్దు కింద రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచి్చన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడంతో రెండేళ్లుగా ఈ హామీ మరుగునపడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లించనుందని, త్వరలో దీనిపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేస్తారని ఇటీవల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటన చేయడంతో ఈ హామీ మళ్లీ తెరపైకి వచ్చింది. నిరుద్యోగ భృతిపై లక్షలమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. వీరిలో ఎంతమంది నిరుద్యోగభృతికి అర్హులు? ఎవరు కాదు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం రూపొందించనున్న విధివిధానాల్లో జవాబు లభిస్తుంది. విధివిధానాల రూపకల్పన, బడ్జెట్లో నిధుల కేటాయింపు తదితర అంశాలపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటన చేసే అవకాశముంది. ఆ తర్వాతే ఈ పథకం అమలుపై మరింత స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. లక్షల్లో నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది అన్న అంశంపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేదు. అయితే, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ తదితర స్థాయిల్లో చదువులు చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక దాదాపు 30 లక్షలమందికిపైనే నిరుద్యోగులున్నట్టు ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ కింద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోని నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉండనున్నారు. ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లిస్తే ఒక అభ్యరి్థకి ఏడాదికి రూ.36,192 వ్యయం కానుంది. ఈ లెక్కన ఏడాది కాలంలో 10 లక్షల మంది నిరుద్యోగభృతికి రూ.3,619.20 కోట్లు, 20 లక్షల మందికి చెల్లించడానికి రూ.7,238.4 కోట్ల నిధులను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించాల్సి ఉంటుంది. తొలి ఏడాది గరిష్టంగా 20 లక్షల మంది లోపు నిరుద్యోగులకు భృతి చెల్లించే అవకాశాలున్నాయి. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం గరిష్టంగా రూ.7 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఖాళీల వేట .. ఉపాధికి బాట
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నేపథ్యంలో పెరిగిన నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. లాక్డౌన్, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో వివిధ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కుదించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటం, మరోవైపు వ్యాక్సిన్ రాకతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆర్థిక పురోగతిపై ధీమా పెరుగుతుండటంతో కంపెనీలు తిరిగి ఉద్యోగ నియామకాలపై దృష్టి పెడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల సమన్వయంతో ఉపాధి అవకాశాల కల్పనకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా వివిధ సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలకు లేఖలు రాస్తోంది. ఆయా కంపెనీల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఉద్యోగులను అందించే లక్ష్యంతో అగుడులు వేస్తోంది. ఎక్కడివారికి అక్కడే ఏ ప్రాంతంలోని వారికి అక్కడే అవకాశాలు కల్పించేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ రూపొందింస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. జిల్లా పరిధిలో ఉన్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలతో సమావేశమై ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని సేకరించి... ఆ మేరకు జాబ్ మేళాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. తొలుత జిల్లా పరిధి ప్రాతిపదికన, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ జాబ్ మేళా లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. చిరుద్యోగం మొదలు.. కార్మిక శాఖ జాబితాలో ఉన్న కంపెనీలతో పాటు ఇతర చిన్న కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో చిరు ఉద్యోగం నుంచి సూపర్వైజర్ స్థాయి వరకు జాబ్‌మేళాల ద్వారా భర్తీ చేసే అవకా>శం ఉంది. ఈనెలాఖరులోగా వివిధ కంపెనీలను సంప్ర దించి ఖాళీలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీల వారీగా ఉద్యోగ విభజన చేపట్టి కంపెనీ అవసరాలకు అనుగుణం గా అర్హతలను నిర్దేశించి ప్రకటనలు జారీ చేయడం, రెండు, మూడు విడతల్లో జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణ విభాగం సంచాలకులు కేవై నాయక్ సాక్షికి తెలిపారు. -
6 నెలల గరిష్టానికి నిరుద్యోగం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం గడిచిన ఆరునెలల్లో గరిష్టస్థాయికి చేరింది. గతేడాది డిసెంబర్లో నిరుద్యోగిత 9.06 శాతానికి చేరుకుంది. జూన్‌లో (10.99 శాతం) లాక్డౌన్ సడలింపుల తర్వాత ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. నవంబర్‌లో 2.74 కోట్ల మంది నిరుద్యోగులుండగా... డిసెంబరులో ఇది అనూహ్యంగా 3.87 కోట్లకు పెరిగిం ది. ఫలితంగా ఒక్కనెలలోనే నిరుద్యోగిత 2.55% పెరి గిపోయింది. నవంబరుతో పోలిస్తే... డిసెంబర్లో 60 లక్షల మంది ఉద్యోగార్థులు పెరిగారని, ఇంతటి భారీ సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలు లేక... నిరుద్యోగిత పెరిగిందని సీఎంఐఈ విశ్లేషించింది. ఫలితంగా నవం బర్లో 6.51 శాతమున్న నిరుద్యోగం డిసెంబర్ ముగి సేసరికి 9.06 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం పెరిగింది. గత రెండు, మూడు నెలలుగా దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలు, ఆర్థిక, వాణిజ్య, ఇతర త్రా రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు పుంజుకుంటున్నా... నిరుద్యోగ శాతం మాత్రం క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని బట్టి వివిధ ప్రాధాన్యతారంగాల్లో కార్యకలాపాలు పెరిగినా లేబర్ మార్కెట్ పూర్తిస్థాయిలో కుదుటపడలేదని స్పష్టమౌతోంది. కొద్దినెలలుగా ద్రవ్యోల్బణం 7 శాతం దరిదాపుల్లో ఉండటం, దానికి తోడు నిరుద్యోగం పెరగడం ఆందోళనకరమని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై భయాలను మరింత పెంచుతోందన్నారు. ( మధ్యప్రదేశ్, ఏపీలకు కేంద్రం రివార్డు) పెరిగిన గ్రామీణ నిరుద్యోగం... దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం డిసెంబర్లో గ్రామీణ ప్రాంతాల్లో 9.15%, పట్టణప్రాంతాల్లో 8.84%గా న మోదైంది. సీఎంఐఈ తాజా నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.51% నుంచి 9.15%కి పెరి గింది. అయితే గత కొన్ని నెలలుగా జాతీయ, గ్రామీణ నిరుద్యోగ సగటు కంటే ఎంతో ఎక్కువ శాతంలో కొన సాగిన పట్టణ నిరుద్యోగిత డిసెంబర్లో 8.84 శాతంగా నిలవడం గమనార్హం. ఇతర ›ప్రాంతాలలో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత మెరుగుపడు తున్నట్టు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా పుంజుకోని లేబర్ మార్కెట్ ఈ తాజా గణాంకాల ప్రకారం దేశంలోని ఆర్థిక వ్యవస్థ ఇంకా మందకొడిగా సాగుతోందని, లేబర్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో తనలో ఇముడ్చుకునే ప్రయత్నాల్లోనే ఇంకా ఉన్నట్టుగా స్పష్టమౌతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి గ్రామీణ ఉపాధి హామీ, మౌలిక వసతుల కల్పన సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు రాబోయే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేటాయింపులు పెంచాల్సి ఉందని సూచిస్తున్నారు. ఆర్థికరంగం పూర్తిగా పుంజుకోని నేపథ్యంలో మరిన్ని అవకాశాల కల్పనతో పాటు ఉపాధికి దూరమౌతున్న మహిళా వర్కర్లను తిరిగి పనుల్లో నిమగ్నం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని అజీమ్ ప్రేమ్‌జీ వర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ సూచిస్తున్నారు. ‘జాతీయ ఉపాధి హామీకి కేటాయింపుల పెంపుదల గ్రామీణ భారతానికి మేలుచేస్తుంది. అంతేకాకుండా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజేస్ను (ఎంఎస్ఎంఈ) మరింత బలోపేతం చేసి... మళ్లీ ఈ రంగాన్ని పట్టాలు ఎక్కిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి’అని అమిత్ పేర్కొన్నారు. సీఎంఐఈ డిసెంబర్ గణాంకాలు అత్యధిక నిరుద్యోగమున్న రాష్ట్రాలు (శాతాల్లో) హరియాణా 32.5 రాజస్తాన్ 28.2 త్రిపుర 18.2 జమ్మూ,కశ్మీర్ 16.6 యూపీ 14.9 అత్యల్ప నిరుద్యోగమున్న రాష్ట్రాలు తమిళనాడు 0.5 కర్ణాటక 1.4 మహారాష్ట్ర 3.9 ఏపీ 6.7 తెలంగాణ 7 -
అమెరికాలో కొత్తగా 2.5 మిలియన్ ఉద్యోగాలు!
వాషింగ్టన్: అమెరికాలో నూతనంగా 2.5 మిలియన్ మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ క్రమంలో మే నాటికి నిరుద్యోగిత రేటు 13.3 శాతానికి పడిపోయింది. దీంతో ఏప్రిల్‌లో 14.7 శాతంగా నమోదైన నిరుద్యోగిత రేటు ఒక శాతం మేర పడిపోయింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ శుక్రవారం నెలవారీ ఉద్యోగిత నివేదికను విడుదల చేసింది. కాగా కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలోనూ ఈ మేరకు ఉద్యోగాలు సృష్టించడం గమనార్హం. అయితే కరోనా వ్యాప్తి కట్టడికై విధించిన లాక్డౌన్ నిబంధనలు దశల వారీగా సడలిస్తున్న క్రమంలో ఉద్యోగ కల్పన సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనందున క్రమక్రమంగా మాంద్యం నుంచి బయటపడవచ్చని అంచనా వేస్తున్నారు. (వెయ్యి మందికి ఉద్వాసన పలకనున్న బెంట్లీ?!) ఇదిలా ఉండగా.. మే నాటికి 8.75 మిలియన్ మంది ఉద్యోగాలు కోల్పోతారన్న అంచనాల నేపథ్యంలో ఈ సంఖ్య కేవలం 2.76 మందికే పరిమితమైందని ఏడీపీ వెల్లడించడం మరో విశేషం. ఈ విషయం గురించి మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జండీ మాట్లాడుతూ.. మే గణాంకాలు అంతగొప్పగా ఏమీ లేవని.. అయితే ఊహించినంత నష్టమేమీ జరుగలేదని చెప్పుకొచ్చారు. కాగా డౌ ఫ్యూచర్స్(ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం- స్టాక్ మార్కెట్)లో 800 మేర పాయింట్లు ఎగిసిన క్రమం నిరుద్యోగితను తగ్గించడానికి దారి తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఇటలీపై కరోనా పంజా.. మెడికల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు) అదే విధంగా.. వాల్‌స్ట్రీట్‌లో మూడు ప్రధాన సంస్థలు లాభాల పట్టడం కూడా సానుకూల ఫలితాలకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఫెడరల్ రిజర్వు అసాధారణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రభుత్వం సైతం ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం, పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం ద్వారా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టింది. -
ప్రతిభా శిక్షణ
‘జనాభాతో పాటు దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది..’ఈ వాక్యం మనం తరచూ వింటున్నాం. చదువుతున్నాం. తిరిగి మన పనుల్లో మనం పడిపోతున్నాం. ప్రతిభ పులిజాల అందరిలా ఆ వాక్యాన్ని వదిలేయలేదు. నిరుద్యోగ సమస్యనే తన ఉద్యోగంగా మలుచుకుంది. ఖాళీగా ఉన్నవారు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో తగు శిక్షణ ఇస్తుంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇప్పిస్తుంది. చదువులేనివారికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన లేనివారి దగ్గరకు వెళ్లి వాటి గురించి వివరిస్తుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకొని మెరుగైన జీవనం పొందేలా సహాయం చేస్తుంటుంది. ఇరవై ఏళ్లుగా దాదాపు డెబ్భై ఐదు వేల మందికి పైగా వారెంచుకున్న రంగంలో నైపుణ్యం పెంచి, శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రతిభ. తన మొదటి అడుగు నుంచీ ఇప్పటి వరకు సాగించిన పయనం గురించి ఇలా వివరించారు... ‘‘నిన్న ఉదయం రిసీవ్ చేసుకున్న ఓ ఫోన్ కాల్ గురించి చెబుతాను. ‘మేడమ్.. బాగున్నారా! ఏడాది క్రితం నేను మీ ఇంట్లో పనిచేసిన అనితను’ అంటూ పలకరించింది ఓ అమ్మాయి. ఇప్పుడు తను జూబ్లీ హిల్స్‌లోని ఓ పేరున్న బ్యూటీ స్పాలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తు్తన్నానని చెప్పింది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనికారణంగా ఏడవ తరగతితో చదువు ఆపేసిన అనిత తన తల్లితో కలిసి ఇళ్లలో పనులు చేసేది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగామ్లో చేరి, బ్యుటీషియన్‌గా పనులు నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఇలా జీవితాన్ని మెరుగుపరుచుకున్నవారి గురించి తెలిసినప్పుడల్లా చాలా ఆనందపడుతుంటాను. చదువు లేని వారే కాదు చదువున్నవారు కూడా తమ కెరియర్ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువు తర్వాత సాఫ్ట్వేర్లోనో.. మరేదైనా కంపెనీలోనో విద్యార్హతతో జాబ్‌లో చేరుతారు. ఆ తర్వాత సరైన నైపుణ్యం లేదని ఆ కంపెనీలు ‘రిజక్ట్’ చేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అక్కణ్ణుంచి వెనక్కి వచ్చేస్తే జీవితంలో ఇంకా వెనకబాటుకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితి నుంచి యువతను తప్పించడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో మా ఆఫీస్ ఉంది. హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కౌన్సెలింగ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుంటాను. వారంలో అన్ని రోజులూ శిక్షణాకార్యక్రమాల కోసం తిరుగుతూ ఉంటాను. చిన్న చిన్న బస్తీలు మొదలుకొని కాలేజీ క్యాంపస్‌ల వరకు నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన దేశంలో చదువు ఉంది. కానీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్న దృశ్యం ఇరవై ఏళ్లుగా.. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేశాను. రెండేళ్లు లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. అప్పుడే అర్ధమైంది చదువుకు కొదవ లేదు, నైపుణ్యాలకు సంబంధించిన లోటు అంతటా ఉందని. అప్పుడే ‘కెరియర్ హైట్స్’పేరుతో కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాను. ఇక్కడ నుంచే విద్యార్థులకు జాబ్ ప్లేస్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. అక్కణ్ణుంచి ఆలోచనా విస్తృతి పెరిగింది. కొన్ని ఫార్మా కంపెనీలు, జీడిమెట్ల ప్రాంతంలో ఉండే ఫ్యాక్టరీలకు వెళ్లినప్పుడు అక్కడి యాజమాన్యం పనివాళ్లను వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం గమనించాను. దాంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న జనాభా గురించి వాకబు చేశాను. పనిలేకుండా ఖాళీగా ఉండేవారి సంఖ్యను బేరీజు వేసుకున్నాను. వారిని కలిసి, సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి శిక్షణ ఇచ్చాను. ఫలితంగా అక్కడి కంపెనీలలో ఆ ప్రాంతంలో నివాసం ఉన్నవారికే పని అవకాశాలు పెరిగాయి. గతంలో ఇళ్లలో పనులు చేసుకునేవారు సైతం ఇప్పుడు పేరున్న కంపెనీలలో పనిచేసే స్థాయికి చేరినవారున్నారు. ఇలాగే మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశాను. ప్రభుత్వంతో కలిసికట్టుగా.. ప్రపంచంలో మన దేశాన్ని స్కిల్ క్యాపిటల్‌గా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్ని రంగాలకు అవసరమే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి నిరుద్యోగ యువతకు సరైన పని కల్పించాలన్న లక్ష్యంతో స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌ను ప్రభుత్వమూ నిర్వహిస్తుంది. అయితే వాటి గురించిన అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సౌత్ రీజియన్ అడ్వైజర్‌గా ప్రభుత్వంతో కలిసి వర్క్ చేస్తున్నాను. మీడియా, సినిమా, ఫొటోగ్రఫీ, బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్.. ఇలా 14 రంగాలలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కౌన్సెలింగ్ చేస్తున్నాను. కుటుంబ ప్రోత్సాహం పుట్టి పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్‌లోనే. నాన్న లింగయ్య వైమానిక దళ ఉద్యోగి. అమ్మ ఫణిబాయి. ఇద్దరు అన్నయ్యలు. మా పెంపకంలో ఎక్కడా వివక్ష లేదు. తాతయ్య పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, నాన్న ఎయిర్‌ఫోర్స్‌లోనూ పనిచేయడంతో స్వీయ క్రమశిక్షణతోపాటు సమాజం పట్ల బాధ్యత కూడా చిన్నతనం నుంచే అలవడింది. మా వారు దినేశ్ డెంటిస్ట్. అత్తింటివారూ బాగా చదువుకున్నవారు కావడంతో నా తపనకు ఎక్కడా ఆంక్షలూ, అడ్డంకులూ లేవు. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడాలన్నదే మా కుటుంబం నుంచి వచ్చిన మాట. అదే నన్ను ఎంతోమందిని కలిసేలా, ఎన్నో విషయాలు నేర్చుకునేలా, మరెన్నో విషయాలు నలుగురికి తెలియజేప్పే అవకాశాన్ని ఇచ్చింది. స్వచ్ఛత – శుభ్రత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం మురికివాడలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, పరిస్థితులు చాలా బాధ కలిగించాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా.. ఈ టెక్నాలజీ యుగంలోనూ కనీస వసతులు లేకుండా జీవిస్తున్న దుర్భరమైన జీవితాలను చూసినప్పుడు ఇదేనా మనం సాధించిన ప్రగతి అన్న ఆవేదన కలిగింది. స్వచ్ఛభారత్ అంటున్న కేంద్రప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని గమనించాను. పారిశుద్ధ్య కార్మికుల్లోనూ వృత్తి నైపుణ్యాలు పెంచడంతో పాటు వారి సంక్షేమం గురించీ ఆలోచించాను. వారికీ శిక్షణ ఇవ్వాలని, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ముందుగా నేను ట్రెయిన్ కావాలని ‘సఫాయి కర్మచారి’ సర్టిఫికెట్ కోర్సు చేశాను. ఫండ్స్ కోసం 5కె, 10 కె రన్స్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. అప్పుడు జీహెచ్ఎంసి కమిషనర్‌ను కలిసి నా ఆలోచన చెప్పాను. వారి సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటిగా ‘కర్తవ్య ఫౌండేషన్’ ఏర్పాటు చేసి చందానగర్ ఏరియాలో మూడువందల మందికి శిక్షణ ఇచ్చాం. వారికి నా పనితీరు, నిబద్ధత నచ్చడంతో ఆ తర్వాత ‘సాఫ్ హైదరాబాద్ – షాన్‌దాన్ హైదరాబాద్’, ‘వాటర్ లీడర్షిప్ కన్జర్వేషన్’లో భాగస్వామిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. దేశం మారాలంటూ పథకాలు రూపొందిస్తే ఫలితం ఉండదు ఆయా పథకాల ద్వారా దేశం ప్రగతి పథంలో పయనించాలంటే మార్పు అనేది అట్టడుగు స్థాయి నుంచి మొదలు కావాలి’ అని వివరించారు ప్రతిభ పులిజాల. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ దిశగా సాగుతున్న శిక్షణాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు మురికివాడల్లో పరిశుభ్రమైన జీవనం కోసం, స్వచ్ఛమైన పరిసరాల కోసం కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.– నిర్మలారెడ్డిఫొటోలు: అనీల్‌కుమార్ -
‘కేసీఆర్.. జగన్‌ను చూసి నేర్చుకో’
సాక్షి, జగిత్యాల: ఉద్యోగాల కల్పన, పెన్షన్ల వంటి అంశాల్లో సీఎం కేసీఆర్.. పక్కరాష్ట్ర ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి ఎంతో నేర్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని పాత లబ్ధిదారులందరికి పెన్షన్లు పెరిగాయన్నారు. అయితే కొత్త లబ్ధిదారుల ఊసే లేకపోవడం శోచనీయం అన్నారు. రుణమాఫీపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నిరుద్యోగ యువతను కేసీఆర్ పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గడిచిన ఐదు సంవత్సరాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు జీవన్‌రెడ్డి. ఎన్నికల హామీల్లో చెప్పిన నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ఉద్యోగులకు 27 శాతం పీఆర్సీ ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్యోగుల మీద అవినీతిపరులనే ముద్ర వేసి వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. సీపీఎస్ రద్దు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
ప్రసంగాలు, ప్రకటనలు సరే.. జాబ్‌ల సంగతేంటి
ముంబై : ఎన్నికల ముందు వరకూ బీజేపీకి మద్దతిచ్చిన శివసేన.. ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మీద విమర్శలు ప్రారంభించింది. మోదీని టార్గెట్ చేస్తూ.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని వెలువరించింది. ఉత్తేజపూరితమైన ప్రసంగాలు, ప్రకటనలు ఉద్యోగాలను సృష్టించలేవని పేర్కొంది. బుల్లెట్ ట్రైన్ వల్ల కూడా ఉద్యోగాలు రావని తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం కోసం బీజేపీ గతంలో ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతమంది ప్రయోజనం పొందారో తెలిపాలని డిమాండ్ చేసింది. మోదీ ప్రధానిగా మరోసారి ఎన్నికయ్యాక షేర్ మార్కెట్ల విలువ పెరిగిందని.. మరి జీడీపీ వృద్ధి రేటు సంగతి ఏంటని ప్రశ్నించింది. వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాల్లో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించింది. విమానయాన రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని పేర్కొంది. దేశంలో విమానాశ్రయాలు పెరిగాయని.. విమానలు తగ్గిపోయాయని స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాలు నిరుద్యోగం అని.. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలపాలని శివసేన సామ్నాలో డిమాండ్ చేసింది. -
మోదీ సర్కార్ ముందు ఆర్థిక ఉచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ :అఖండ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసరంగా దేశ ఆర్థిక పరిస్థితిపై దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఏర్పడిందని దేశ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2019 జనవరి నుంచి మార్చి వరకు మొదటి త్రైమాసంలో దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 5.8కి పడిపోవడం ఆందోళనకరమని, గత ఐదేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయికి జీడీపీ రేటు పడిపోలేదని వారంటున్నారు. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగ శాతం 6.1 శాతానికి చేరుకుందని, ఇది గత 45 ఏళ్లలో ఇదే గరిష్టమని ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన పీరియాడికల్ సర్వే తేలిందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పుండు మీద కారం చల్లిన చందమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 2017–18 సంవత్సరం తర్వాత దేశంలోని నిరుద్యోగ సమస్యపై పీరియాడికల్ సర్వేలను కేంద్రం నిలిపి వేసిందని, వాస్తవానికి దేశంలో నిరుద్యోగ సమస్య 2018–19 సంవత్సరానికి 6.6 శాతానికి చేరుకుందని, ఇది ఆల్‌టైమ్ రికార్డని భారతీయ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల ఆ రంగం నుంచి ఏటా 60 నుంచి 70 లక్షల మంది ఉపాధి కోసం ఇతర రంగాలకు మల్లుతున్నారని వారు చెప్పారు. దీనికి అదనంగా కోటి ఇరవై లక్షల నుంచి కోటీ ముప్పై లక్షల మంది యువకులు ఉద్యోగ పర్వంలోకి అడుగుపెడుతున్నారని, వీరందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఇప్పటి ఐదేళ్లపాటు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని న్యూయార్క్‌లోని స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శతి రాజగోపాలన్ హెచ్చరించారు. ఇది జరగకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో దాదాపు పది కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటుందని, ఎన్నికలపై వారి ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికే భారత దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీకి ఓటేశారని, ఒకటి, రెండేళ్లు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్న యువతకు అది అప్పుడు అంత తీవ్రంగా అనిపించదని, ఐదేళ్ల పాటు నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా తానెంతో బలవంతుడినని నిరూపించుకున్న మోదీ ఎక్కడ దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా దష్టి పెట్టరేమోనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
కేసీఆర్ నిరుద్యోగుల్ని మోసం చేశారు
-
విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యార్థి సంఘాల ధర్నా
-
జనం కరువాయే.. దీక్షలు బరువాయే..!
సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈనెల శుక్రవారం నుంచి చేపట్టిన నవ నిర్మాణ దీక్షలకు జనాలు కరువయ్యారు. తమ పరువు కాపాడుకోవడానికి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. జనాలు రాక సభల నిర్వహణ అధికారులకు బరువవుతోంది. ఎక్కడ చూసినా జనం నుంచి నవ నిర్మాణదీక్షలకు స్పందన లేదు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు, టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండాపోతోంది. కేవలం పింఛన్ ఇస్తామని లబ్ధిదారులు సభలకు తిప్పుకోండం.. ఇవ్వకుండా రేపురండని అంటూ ఉద్యోగులు చెప్పడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సభలకు జనాలు రాకపోవడానికి కారణం.. నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి ఎసరుపెట్టి కేవలం పసుపు కుంకుమగా మార్చి అంతో ఇంతో ఇచ్చే సొమ్మును కూడా కంతుల రూపంలో ఆలస్యం చేయడంపై మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్, నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం, నిరుపేదలకు ఇల్లు ఇలా అనేక రకాల హామీలిచ్చి అంతంత మాత్రంగా కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ గ్రామసభలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. కేవలం దీక్షల్లో అధికారులు మాత్రమే ఉంటున్నారు. అంతటా.. అంతంత మాత్రంగానే జిల్లాలో ఎక్కడ చూసినా నవ నిర్మాణ దీక్షలు వెలవెలబోతున్నాయి. కలెక్టర్ హరికిరణ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైన దీక్షలు మినహా అన్ని చోట్ల జనం కరువవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని తరహాలో ఈ సారి మండల కేంద్రాలతోపాటు పంచాయతీల్లో ఎనిమిది రోజుల నవ నిర్మాణ దీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్లెల్లో ఎక్కడా జనం లేని దీక్షలే కనిపిస్తున్నాయి. జనాలు నిండుగా ఉండే దీక్షలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీక్షల్లో ఒక అంకె దాటని జనం.. జిల్లాలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో జనం ముగ్గురు, అయిదు మంది, ఏడు మంది, పది మంది ఇలా కనిపిస్తున్నారు. వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల్లో కేవలం ఐదారు మందే కనిపించారు. అలాగే రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల్లోని పలు చోట్ల కేవలం పది మందిలోపే జనాలు కనిపించా రు. పులివెందులలోని మిస్సమ్మ బంగ్లాలో నిర్వహించిన దీక్షకు జనం లేక చిన్న పిల్లలను తీసుకొచ్చి నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహిస్తున్న సభలకు కూ డా జనాలు లేక కేవలం డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో ప్రజలు లేక నవ నిర్మాణదీక్ష బోసిపోయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల జనం లేని సభలే దర్శనమిస్తున్నా యి. అందునా పింఛన్ల కోసం వృద్ధులను తీసుకొ స్తుండగా.. డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్క ర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనం లేకపోవడంతో ఎవరో ఒకరు కనిపిస్తే కొంతైనా దీక్షలకు స్పందనగా చూపించవచ్చని అధికార యంత్రాంగం ఆరాట పడుతోంది. -
కనికట్టుతో కైవల్యం!
అభిప్రాయం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం ఉపాధి భావననే పునర్ని ర్వచించేందుకు పూనుకుంటోంది. ఉపాధి కల్పన గణాంకాలకు అసంఘటితరంగ వివరాలను జోడిస్తే నిరుద్యోగం హాంఫట్ అవుతుందన్నది ప్రభుత్వ అంచనా మన దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గతంలో పరిపాలించిన యూపీఏ హయాం నాటికంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాతి 3 ఏళ్ల కాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీనికి తార్కాణంగా కొన్ని గణాంకాలను చూడవచ్చు. భారత లేబర్ బ్యూరో గణాంకాల ప్రకారం 2009వ సం‘‘లో జరిగిన ఉపాధి కల్పన 8.89 లక్షలుగా ఉంది. 2014లో ఈ సంఖ్య 4.21 లక్షలు గానూ, 2015లో 1.35 లక్షలు గానూ, 2016లో 2.31 లక్షలు గానూ ఉంది. ఇక 2016 అక్టోబర్, 2017 జనవరి మాసాల నడుమ ఈ సంఖ్య 1.22 లక్షలుగా ఉంది. కాగా, ఈ కాలంలోనే (2016 అక్టోబర్ – 2017 జనవరి) నోట్ల రద్దు క్రమంలో 1.5 లక్షల మంది తాత్కాలిక కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కాగా, ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోన్న నిరుద్యోగ సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నేటి గుజరాత్ ఎన్నికలలో కూడా ఇదొక ముఖ్యమైన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం అసలు ‘‘ఉపాధి’’ అంటే ఏమిటి? అనే దానినే పునర్నిర్వచించాలని నేడు కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ కొత్త నిర్వచనంలోకి, ఇంతకు ముందు ఉపాధి కల్పన గణాంకాల కింద లెక్కలోకి రాని అసంఘటిత రంగ ఉపాధి కల్పనను కూడా తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా కచ్చితంగా, మరింత పెద్దదైన ఉపాధి కల్పన తాలూకు గణాంకం, మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఎన్డీఏ పాలకులకు కావల్సింది కూడా అదే!! తమ హయాంలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతుండటం, దానితో పాటుగా స్వయంకృతాపరాధమైన ‘‘పెద్ద’ నోట్ల రద్దు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయడం గురించిన విమర్శల నుంచి బయట పడేం దుకు పాలక పక్షానికి బహుశా ఇది మాత్రమే దారిగా కనబడి ఉండవచ్చు! నిజానికి, ఉపాధి కల్పనా సంఖ్యను గణించేందుకు సంఘటిత రంగంలోని ఉపాధి కల్పనతో పాటుగా, అసంఘటిత రంగ గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం, పైకి చూడటానికి సరైనదే కావచ్చు. కానీ, అటు అసంఘటిత రంగం తాలూకు గణాంకాలు విశ్వసనీయంగా అందుబాటులో ఉండటంతో పాటుగా, ఈ రంగంలోని ఉపాధి తాలూకు నిలకడా, వేతనాల స్థాయి, పని పరిస్థితులవంటివి అన్నీ కూడా కచ్చితంగా ప్రశ్నార్థకాలే. ఒక అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా కూడా, ఆర్థిక సంక్షోభాల కాలంలో, సంఘటిత రంగంలో పెరిగిపోతోన్న నిరుద్యోగంతో పాటుగా, రెండో వైపున అసంఘటిత రంగంలో ఉపాధి కల్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందన్నది గమనార్హం. అలాగే ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన కాలంలో అసంఘటిత రంగంపై ఆధారపడుతోన్న వారి సంఖ్య తగ్గిపోయి, సంఘటిత రంగ ఉపాధి పెరగడం మనం గమనించాలి. అంటే మరే దారీ లేనప్పుడూ మాత్రమే అత్యధికులు అల్ప వేతనాలు, అభద్రతతో కూడిన అసంఘటిత రంగం దిశగా వెళతారు! అంతిమంగా ఎన్డీఏ పాలకులు దేశంలోని నిరుద్యోగ సమస్య తాలూకు చర్చను సద్దుమణిగించేం దుకూ, తిమ్మిని బమ్మిని చేసేందుకూ మాత్రమే ప్రయత్నిస్తున్నారు అన్నది సుస్పష్టం. ఇటువంటి ప్రయత్నాన్నే వీరు 2015లో స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి) సంఖ్యపై చేసి ఉన్నారు. ఏటికేడాదిగా పడిపోతోన్న జీడీపీ సంఖ్యను, అది తమ హయాంలో మెరుగుపడిందని చెప్పుకునేందుకు దానిని లెక్కించే పద్ధతినే వారు మార్చేశారు అన్న విమర్శలు సర్వత్రా వినపడుతున్నవే. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి విజేత అయిన ఆంగస్ డీటన్ కూడా భారతదేశంలోని జీడీపీ సంఖ్యల విశ్వసనీయత గురించి విమర్శలు చేయడాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి, జీడీపీని లెక్కించే పద్ధతిని.. ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చడం ద్వారా ఏ ప్రభుత్వమైనా మారుస్తుందనేది నిజం. కానీ, 2015 లో ఎన్డీఏ చేసిన ఈ ప్రయత్నంలోని లొసుగులు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అంటే, ప్రస్తుతం జరుగుతోన్న ఉపాధి కల్పన గణాంకాలను గుణించే తీరులో మార్పు వ్యవహారం మొదటిదేమీ కాదు. 2015లో జరిగిన సందేహాస్పద జీడీపీ పునర్నిర్వచనం తీరు కూడా ఎన్డీఏ ఖాతాలోనే పడుతుంది. ఇక, పెట్రోలియం ధరలను రిటైల్ బంకులలో రోజువారీ మార్చే పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఈ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుం టోంది. ఈ ధరలను రోజువారి సవరించే విధానంలో, ఆ ధరల పెరుగుదల.. పైకి పెద్దగా కనపడని చిల్లర పైసల రూపంలో జరిగిపోతోందనీ, దీనితో ధరల పెరుగుదల తాలూకు వినియోగదారుల ఆగ్రహం నుంచి కేంద్రం, చమురు సంస్థలూ బయటపడ చూస్తున్నాయన్న విమర్శలు కూడా నేడు అందరం వింటున్నవే. కాబట్టి, నిజ ఆర్థిక పరిస్థితులనూ, ప్రజల జీవన ప్రమాణాలనూ మెరుగుపరచలేని అసమర్థ, అవకతవక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వం దానిని కప్పిపెట్టుకోవడానికి అంకెల గారడీ, కనికట్టుకు దిగుతోందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. వాస్తవ జీవితంలో ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న సామాన్యుడి విషయంలో ఇది మరింత నిజం! వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ 98661 79615 డి. పాపారావు -
పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగానికి తెర
- పత్తికొండ, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం – జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ నంద్యాలరూరల్: జిల్లాలో నూతన భారీ పరిశ్రమ ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. బుధవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయ పునః ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరుకు చేసేందుకు జిల్లాలోని పత్తికొండ, ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మరికొన్నింటిని అర్బన్ మండలాలుగా ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నంద్యాల, కొలిమిగుండ్ల తహసీల్దార్ కార్యాలయాల ఆధునీకరణ పనులు అభినందనీయమని, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర తహసీల్దార్ కార్యాలయాల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఒక్కో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం రూ.60లక్షలతో దొర్నిపాడు, చాగలమర్రి, ఆళ్లగడ్డకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ఓర్వకల్లు మండలం శకునాల గ్రామం వద్ద 2వేల ఎకరాల్లో వెయ్యి మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని ఇదే ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాంట్ వల్ల వెయ్యిమందికి ఉద్యోగాలు లభిస్తాయని, జూపాడు బంగ్లా మండలం, తంగడంచె వద్ద ప్రభుత్వం జైన్ ఇరిగేషన్ కంపెనీతో మెగా ఫుడ్‌పార్కు, అంబుజ కంపెనీ ద్వారా మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పామని, ఈ పరిశ్రమల వల్ల మరో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వానికి భూమి అప్పగించిన జిల్లాలో మొదటి గుంటూరు కాగా రెండవది కర్నూలు జిల్లానేనన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి, ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి, డీఎస్పీ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరో 593 గ్రూప్-2 పోస్టులు
- భర్తీకి అనుమతిస్తూ సర్కారు నిర్ణయం - టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు - ఇప్పటికే 434 పోస్టులకు నోటిఫై మొత్తంగా 1,027 పోస్టుల - భర్తీకి సన్నాహాలు త్వరలోనే నోటిఫికేషన్ - జారీ అయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరో 593 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటి భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి అనుమతి నిస్తూ శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 434 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా, ఆ పరీక్ష నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులతోపాటు తాజాగా అనుమతించినవి కలిపి మొత్తంగా 1,027 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా అనుమతించిన పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత జీఏడీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్.. 434 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులూ వచ్చాయి. కానీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు, యువత నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. అదే సమయంలో తమకు అదనంగా పోస్టులు అవసరమని పలు ప్రభుత్వ విభాగాలు సీఎస్ రాజీవ్ శర్మ దృష్టికి తీసుకెళ్లాయి. మరోవైపు మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో వెయ్యికిపైగా పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమని.. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై సీఎస్ ఆదేశాల మేరకు తమకు అదనంగా కావాల్సిన పోస్టుల వివరాలను వివిధ ప్రభుత్వ విభాగాలు నివేదికలు సమర్పించాయి. ఆ ఫైలుకు తాజాగా ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ పోస్టులతో నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులివే: తాజాగా భర్తీ చేయనున్న 593 పోస్టుల్లో... వ్యవసాయం-సహకార శాఖ పరిధిలోని కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 62; సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 90; ఆర్థిక శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 28; న్యాయ శాఖ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10; పరిశ్రమల శాఖలోని హ్యాండ్లూమ్, టెక్స్టైల్ విభాగం పరిధిలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ 20; కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 3; వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 46; డిప్యూటీ తహసీల్దార్ 259; ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ 64; దేవాదాయశాఖ పరిధిలో కార్యనిర్వహణాధికారి గ్రేడ్-1 పోస్టులు 11 ఉన్నాయి. -
'ఏటా కోటిమంది నిరుద్యోగులు'
విజయవాడ: దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవడంలో మోదీ వైఫల్యం చెందారని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఏడాది కోటి మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారని ఆయన హెచ్చరించారు. విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభకు హాజరైన సందర్భంగా మాణిక్ ఈ విధంగా కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టారు. -
'టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలి'
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం టెట్‌ను వాయిదా వేసి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేయొద్దని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సూచించారు. బుధవారం కరీంనగర్లో నిరుద్యోగ గర్జనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టెట్ లేకుండా డీఎస్సీని నిర్వహించి రాష్ట్రంలోని 43 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చేంతవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇందుకోసం విద్యార్థులతో కలిసి చదువు-ఉద్యమించు, ఉద్యోగం-సాధించు నినాదంతో పోరాడుతామని ఆయన వెల్లడించారు. -
ఉద్యోగం రాలేదని బలవన్మరణం
ఖమ్మం: ఉద్యోగం రాలేదని ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని చినమునగాలకు చెందిన విద్యార్థి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపాధి అవకాశం దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అతను ఈ రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగాలు: ఇంకా ఎదురుచూపులే!
తొలి ఏడాది నిరుద్యోగులకు నిరాశే ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం, పోస్టుల సంఖ్య తేలకపోవడమే కారణం త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామంటూ హామీలు కనీసం పోటీ పరీక్షల స్కీం, సిలబస్ ఖరారు చేయని వైనంసాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి ఏడాదిలో నిరుద్యోగులకు మాత్రం నిరాశే ఎదురయింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు తప్పలేదు. తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజన, ఖాళీ పోస్టుల వివరాలు ఇంకా తేలకపోవడంతో పాటు ఉన్నతాధికారుల కొరత వల్ల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోంది. దాంతోపాటు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టనున్న దృష్ట్యా డీఎస్సీ నిర్వహించలేమని పేర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులంతా కోచింగ్ కేంద్రాల్లో చేరి శిక్షణ పొందుతున్నారు. ఇందుకోసం అప్పులు చేసి మరీ వేలకు వేలు ఖర్చుచేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళనలో మునిగిపోయారు. ఇక ‘ఇప్పటికే టీచర్లు ఎక్కువగా ఉన్నారు. డీఎస్సీ ఇప్పట్లో ఇచ్చేది కష్టమే..’ అంటూ కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆవేదనలో కూరుకుపోయారు. అనుమతులకే దిక్కులేదు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఏర్పాటు చేసినా.. నోటిఫికేషన్ల జారీకి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అసలు టీఎస్పీఎస్సీ ఏర్పాటు కాగానే రాష్ట్రానికి అనుగుణంగా పరీక్షల విధానం (స్కీమ్), పోటీ పరీక్షల సిలబస్‌ను రూపొందించేందుకు ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఫిబ్రవరిలో నివేదికను అందజేయగా.. ఇంతవరకు ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపలేదు. అంతేగాకుండా రాష్ట్రంలో 371 (డీ)ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తుందా, కొత్త రోస్టర్ విధానాన్ని ప్రవేశపెడుతుందా? అన్నదాని పైనా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతామని ప్రకటించినా, ఇంకా ఉత్తర్వులు జారీ కాలేదు. విభజనతో సంబంధం లేకున్నా.. విభజనతో సంబంధం లేని పోస్టుల భర్తీపైనా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం జిల్లా స్థాయి పోస్టుల్లో గెజిటెడ్ కేటగిరీలో 592, నాన్ గెజిటెడ్ కేటగిరీలో 59,231, లాస్ట్‌గ్రేడ్ కేటగిరీలో 14,353, ఎయిడెడ్ విభాగాల్లో 2,369 పోస్టులు.. మొత్తంగా 76,548 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఉద్యోగుల విభజనతో సంబంధం లేకపోయినా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేబినెట్ భేటీలో పోలీస్ కానిస్టేబుళ్లు (డ్రైవర్లు) 3,620, నీటిపారుదల శాఖలో డీఈఈలు 26, విద్యుత్ విభాగంలో ఏఈలు 1,492, సబ్ ఇంజనీర్లు 427, నీటిపారుదల శాఖలోనే 635 ఏఈ పోస్టులకు ఆమోదం తెలిపారు. కానీ వాటి భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ఉపాధ్యాయ ఖాళీలపై గందరగోళం ప్రస్తుతం రాష్ట్రంలో 17,702 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపడితే తప్ప ఇందులో ఎన్ని పోస్టులు అవసరం అవుతాయన్న విషయంలో స్పష్టత వస్తుందని.. అప్పటివరకు భర్తీపై స్పష్టత రావడం కష్టమేనని అంటున్నారు. అంతేగాకుండా టీచర్లు ఇప్పటికే విద్యార్థుల నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారని.. పిల్లల కోసం డీఎస్సీ ఇవ్వాలా, ఉద్యోగాల కోసం ఇవ్వాలా? అని ప్రభుత్వం పేర్కొంటుండడం గమనార్హం. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది ఆందోళనలో పడ్డారు.