ముంబై : ఎన్నికల ముందు వరకూ బీజేపీకి మద్దతిచ్చిన శివసేన.. ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మీద విమర్శలు ప్రారంభించింది. మోదీని టార్గెట్ చేస్తూ.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని వెలువరించింది. ఉత్తేజపూరితమైన ప్రసంగాలు, ప్రకటనలు ఉద్యోగాలను సృష్టించలేవని పేర్కొంది. బుల్లెట్ ట్రైన్ వల్ల కూడా ఉద్యోగాలు రావని తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం కోసం బీజేపీ గతంలో ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతమంది ప్రయోజనం పొందారో తెలిపాలని డిమాండ్ చేసింది. మోదీ ప్రధానిగా మరోసారి ఎన్నికయ్యాక షేర్ మార్కెట్ల విలువ పెరిగిందని.. మరి జీడీపీ వృద్ధి రేటు సంగతి ఏంటని ప్రశ్నించింది.
వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాల్లో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించింది. విమానయాన రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని పేర్కొంది. దేశంలో విమానాశ్రయాలు పెరిగాయని.. విమానలు తగ్గిపోయాయని స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాలు నిరుద్యోగం అని.. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలపాలని శివసేన సామ్నాలో డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment