samna editorial
-
రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాల తీరుపై శివసేన అసహనం
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ తరుణంలో శివసేన పార్టీ.. విపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికలను ఇకనైనా సీరియస్‌గా తీసుకోవాలంటూ సూచించింది. బలమైన రాష్ట్రపతినే ఎంపిక చేయడంలో తడబడితే.. రాబోయే రోజుల్లో ప్రధానికి సమర్థవంతమైన అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారంటూ విపక్షాలకు శివసేన సూటి ప్రశ్న సంధించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. పవార్ కాకపోతే.. ఇంకెవరు?. అభ్యర్థి విషయంలో కనీసం ఆరు నెలల ముందు నుంచైనా మంతనాలు జరపాల్సింది. ఇప్పుడు చర్చించడం వల్ల ఈ ఎన్నికలను తేలికగా తీసుకున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించినట్లయ్యింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఇంత చర్చలు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని అభ్యర్థిగా.. అది సమర్థుడిని ఎలా నిలబెడతారు? అని ప్రజలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. గోపాకృష్ణగాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా.. ఇలా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎప్పటిలా వినిపించే పేర్లే ఈసారి వినిపిస్తున్నాయి. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరూ కనిపించడం లేదా అని విపక్షాలను పశ్నించింది శివసేన. అదే సమయంలో బలమైన అభ్యర్థి కోసం కేంద్రం కూడా పెద్దగా ఆలోచన చేయడం లేదని అనిపిస్తోంది. ఐదేళ్ల కిందట.. రామ్‌నాథ్ కోవింద్ పేరును ఇద్దరు ముగ్గురు మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఈసారి కూడా అలాగే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విపక్షాలకు సూచించింది శివసేన. -
Sivasena: శభాష్ చౌహన్‌జీ.. దేశానికి మార్గం చూపారు
ముంబై: ప్రస్తుత కరోనా సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్ర సేవలను ప్రశంసించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు అభినందనలు తెలిపింది. ఒక బీజేపీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్న చిన్నారులకు ఉచిత విద్యతో పాటు నెలకు పింఛన్ రూపేణ రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై తాజాగా శివసేన స్పందించింది. ఆ పార్టీ గొంతుకగా భావించే ‘సామ్నా’ పత్రికలో మధ్యప్రదేశ్‌ప్రభుత్వ చర్యలను కొనియాడుతూ సంపాదకీయం ప్రచురించింది. ఈ పిల్లల బాధ్యత చూసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలపడం అభినందనీయమని శివసేన కొనియాడింది. ఉచిత విద్యతో పాటు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామనడంపై అభినందించింది. (‘సామ్నా’ సంపాదకీయం చదవండి) ‘కరోనాతో దేశం వెనకబడుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందిస్తామని ప్రకటించడంపై అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇది మానవత్వంలో గొప్ప అడుగు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశానికి ఒక సందేశం అందిస్తున్నారు’ అని సంపాదకీయంలో శివసేన పేర్కొంది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి మధ్యప్రదేశ్‌ప్రభుత్వం ఒక మార్గం చూపిందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కీర్తిస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా’ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ.25,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అవనసరంగా శివసేన ‘సామ్నా’లో స్పష్టం చేసింది. -
గెలిపిస్తే లైసెన్స్ ఇచ్చినట్లు కాదు..
సాక్షి, ముంబై: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై శివసేన తమ సామ్నా పత్రికలో స్పందించింది. ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే అది ఇష్టారీతిన వ్యవహరించడానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదని కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించింది. పటేల్ పేరును చరిత్ర నుంచి తొలగించడానికి గాంధీ–నెహ్రూ కుటుంబాలు కుట్రలు చేస్తున్నాయని గత ఐదేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయని, కానీ వాస్తవంగా ఆ కుట్రలు ఎవరు చేస్తున్నారో స్టేడియం పేరు మార్పుతో ఇప్పుడు స్పష్టమైందని మండిపడింది. ఈ మేరకు శివసేనకు చెందిన పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. పెద్దవన్నీ గుజరాత్‌లోనే ఉండాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోందని పేర్కొంది. అందులో తప్పు లేనప్పటికీ తాము దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని చురకలంటించింది. ఇన్నాళ్లూ ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఉండేదని, ఇప్పుడు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం పేరును మోదీ పేరుతో మార్చాక నరేంద్ర మోదీ స్టేడియమే ప్రపంచంలో పెద్దదని తెలిపింది. మోదీ గొప్ప నాయకుడే.. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని, కానీ మహాత్మ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీల కంటే గొప్ప నాయకుడని అంధ అనుచరులు భావిస్తే అది మరో స్థాయి గుడ్డి నమ్మకం అవుతుందని పేర్కొంది. మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించారని అభిప్రాయం వ్యక్తం చేసింది. మోదీ చాలా ప్రజాదరణ గల నాయకుడని, ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతుందని రాసుకొచ్చింది. పటేల్, నెహ్రూలకు కూడా జనాల నుంచి మంచి మద్దతు లభించిందని, దాంతో వారు దేశాభివృద్ధికి పునాది వేశారని వివరించింది. ఐఐటీలు, బార్క్, భాక్రానంగల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను నెహ్రూ జాతికి అంకితం చేశారని, కానీ మోదీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించింది. సర్దార్ పటేల్ పేరిట ఉన్న స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరు మీదకు మార్చుకున్నారని ఎద్దేవా చేసింది. ఇప్పుడు పటేల్.. రేపు నేతాజీ.. నిన్న మొన్నటి వరకు పటేల్‌ను ప్రశంసించినవారు ఇప్పుడు స్టేడియం పేరు మార్పు విషయానికి వచ్చేసరికి వ్యతిరేకిస్తున్నారని సామ్నా పత్రిక తమ సంపాదకీయంలో దుయ్యబట్టింది. నేటి రాజకీయాల్లో పటేల్ ప్రాముఖ్యతను ఎలా తగ్గించారో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు కూడా ఇలానే చేస్తారని మండిపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ పేరును కూడా వాడుకున్నారని గుర్తుచేసింది. సర్దార్ పటేల్ తీసుకొచ్చిన ఏ పాలసీలను ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందో చెప్పాలని ప్రశ్నించింది. రైతుల హక్కుల కోసం పటేల్ బార్దోలి సత్యాగ్రహం ముందుండి నడిపించారని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని అడిగింది. బార్దోలి సత్యాగ్రహం ముగిసిన రెండేళ్ల తర్వాత కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ తాను రైతునని ప్రకటించుకున్నారని తెలిపింది. బహుశా అందుకేనేమో.. గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు సర్దార్ పటేల్‌ను ప్రశంసిస్తున్నారని పేర్కొంది. బహుశా అందుకే మొతేరా క్రికెట్ స్టేడియం పేరును మార్చి పటేల్ పేరును తుడిచేద్దామని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. కానీ ప్రజలు కోరుకున్నది ఇదేనని, గుజరాత్ పౌరులు ఈ మార్పును అంగీకరించారని వ్యాఖ్యానించింది. గుజరాత్ ప్రజలకు వల్లభ్‌భాయ్ పటేల్ పట్ల గౌరవం లేకపోతే, ఈ నిర్ణయాన్ని విమర్శించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు కూడా లేదని అభిప్రాయపడింది. -
‘బీజేపీ ప్లాన్ ప్రకారమే దారి మళ్లించింది’
ముంబై: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమం గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. ఆ తర్వాత రైతు సంఘాల మధ్య చీలికలు ఏర్పడి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓ పథకం ప్రకారమే రైతుల ఉద్యమం హింసాయుతంగా మారేలా చేశాయని శివసేన ఆరోపించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో కేంద్రం తీరును ఎండగడుతూ పలు విమర్శలు చేసింది. ‘‘కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దాదాపు 60 రోజుల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమంలో ఎలాంటి చీలికలు రాలేదు.. వారు సహనం కోల్పోలేదు. రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడం.. విదేశాల్లో సైతం మోదీ ప్రభుత్వం పట్ల విమర్శలు రావడంతో కేంద్రం ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలని చూసింది. దాంతో ఉద్యమంలో హింస చేలరేగేలా చేసి దారి మళ్లేలా చూసింది’’ అంటూ శివసేన ఆరోపించింది. ‘‘కర్రలతో ఉన్న రైతులను మోదీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంది.. మరి ‘‘గోలీ మారో’’, ‘‘ఖతం కరో’’ అని నినాదాలు చేసిన వ్యక్తులు మాత్రం ఇంకా మోదీ క్యాబినేట్‌లోనే ఉన్నారు.. వారి సంగతి ఏంటి’’ అని ప్రశ్నించింది. (చదవండి: నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం) ఇక ‘‘గణతంత్ర దినోత్సవం నాడు చెలరేగిన హింసలో బీజేపీ పాత్ర ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ రైతులు ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి.. దారి మళ్లించింది. ఉగ్రవాదులు ఆందోళన చేపట్టారు. ఇక ఎర్రకోట వద్ద హింస చేలరేగడానికి ప్రధాన కారకుడు దీప్ సిధు. అతడికి బీజేపీతో సంబంధం ఉంది. పంజాబ్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కి, దీప్ సిధుకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సిధు గత రెండు నెలలుగా రైతులను రెచ్చగొడుతున్నాడని.. కానీ వారు సమన్వయం కోల్పోలేదని రైతుల సంఘాల నాయకులు పలువురు వెల్లడించారు’’ అంటూ శివసేన సామ్నాలో రాసుకొచ్చింది. ఇక ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు కేవలం రైతుల్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరైంది కాదని శివసేన అభిప్రాయ పడింది. ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుందో అదే చేసి చూపింది. ఫలితంగా రైతులు, పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా హింసను ప్రోత్సాహించలేము అని తెలిపింది. -
స్టీరింగ్ నా చేతిలోనే ఉంది..
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్ తన చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల ఆశ్వీరాదాలు తమ ప్రభుత్వానికి ఉన్నాయని, ఇక ఈడీ, సీబీఐలతో భయమెందుకని? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. 2019 నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహావికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం కొలువుదీరి నేటితో ఏడాది పూర్తయిన నేపథ్యంలో శివసేన ముఖపత్రిక ‘సామ్నా’కు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సామ్నా సంపాదకుడైన శివసేన నేత సంజయ్ రౌత్ తీసుకున్న ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై సీఎం ఉద్ధవ్ మాట్లాడారు. ముఖ్యంగా ఈడీ, సీబీఐ దాడులు, ప్రతిపక్షాల ఆందోళనలపై తనదైన శైలిలో అందరికి వివరించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ఘాటైన సమాధానాలిచ్చారు. మహావికాస్ అఘాడి కూటమి గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ‘ఇప్పుడు పడిపోతుంది.. అప్పుడు పడిపోతుంది’అంటూ తరచూ కలలు కంటున్నాయన్నారు. కానీ వారం రోజుల్లో పడిపోతుందని, తాము ప్రభుత్వాన్ని కూలుస్తామని పేర్కొన్న ప్రతిపక్షాలు చూస్తుండగానే తమ ప్రభుత్వం విజయవంతంగా మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటోందని ఉద్దవ్ పేర్కొన్నారు. ఈడీ, ఇతర కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ తమపై ఒత్తిడి పెంచేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కుటుంబం, పిల్లల వెంటపడి పైశాచికానందం పొందే వాళ్లకు తమకు కూడా పిల్లలు, కుటుంబం ఉందన్న సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. కానీ తమకు సంస్కారం ఉందని, అందుకే తాము శాంతంగా, సహనంతో ఉన్నామన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇలా అనేక విషయాలపై ఆ ఇంటర్వ్యూలో సీఎం ఉద్ధవ్ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. (రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి) పవార్ తమకు మార్గదర్శి... ‘ముఖ్యమంత్రి అయినప్పటికీ నా కాళ్లు భూమి మీదనే ఉన్నాయి. అదేవిధంగా బండికి క్లచ్, బ్రేక్‌లు, ఎక్సిలేటర్తో పాటు స్టీరింగ్ కూడా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బండికి కూడా అన్ని ఉన్నాయి, దాని స్టీరింగ్ కూడా నా వద్దే ఉంది’అంటూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఉద్ధవ్ ఠాక్రే సమాధానమిచ్చారు. శరద్ పవార్ తమకు మార్గదర్శకులని, రిమోట్ కంట్రోలర్ కాదని కూడా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది జరగని పని అని ముందు అంతా భావించారు, కానీ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలోని అనుభవమున్న నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కలిసి పనిచేయగలరా అని అనేక ప్రశ్నలు అందరి మదిలోనా మెదిలాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రితో భేటీ కంటే ముందు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో భేటీ అవుతారని, ఆయనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారా..? తదితర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు..? ఉద్ధవ్ ఠాక్రేనా..? లేక అజిత్ పవారా? అంటూ బహుజన్ అఘాడీ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఇటీవలే ప్రశ్నిస్తూ ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో తనదైన శైలిలో ఈ ప్రశ్నలన్నింటికీ ఉద్ధవ్ సమాధానం ఇచ్చారు. అందరి సహకారంతో తమ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అందరి సహకారంతో నడుస్తున్నప్పటికీ, ప్రభుత్వ స్టీరింగ్ మాత్రం తన చేతిలోనే అంటే తన నేతృత్వంలోనే నడుస్తుందన్నది అందరికీ తెలిసేలా చెప్పారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం.. రాష్ట్రంలో అందరి సహకారంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కరోనా మహమ్మారి వచ్చిందని, అయితే గత సంవత్సరం కాలంలో మిత్ర పక్షాలు, ప్రభుత్వ అధికారులు అందరూ సహకరించారని ఉద్ధవ్ చెప్పారు. ఇందుకు ఆయన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మా మిత్ర పక్షాల నేతలతో పాటు ఇతర సహకార పార్టీలు కూడా తమ వంతు సహకరించాయన్నారు. (ప్రమాదకరంగా సెకండ్ వేవ్) ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేది.. తమ నానమ్మ (శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ ఠాక్రే తల్లి) తన పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలనుకునేదని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. అయితే ఆమె పిల్లలు రాష్ట్రంలో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారని, మనుమలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. హిందుత్వమంటే ఆలయంలో గంట కొట్టడం కాదు హిందుత్వం అంటే ఆలయాల్లో గంట కొట్టడం కాదని, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించేలా చేయడమని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలోని మట్టికి హిందుత్వాన్ని ఎవరూ నేర్పించవద్దు. ఎందుకంటే కాషాయ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించారు. నేను శివసేన అధినేత, మా తాతల హిందుత్వ సిద్ధాంతాలను నమ్ముతాను. వారు మనకు ఆలయాల్లో గంట కొట్టేవారు కాదు, ఉగ్రవాదుల గుండెల్లో గంటలు మోగించే హిందువులు కావాలి అనేవారు. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్ర మట్టికి మీరు హిందుత్వం గురించి నేర్పించాల్సిన అవసరం లేదు’అని ఘాటు సమాధానమిచ్చారు. -
అర్నాబ్ వివాదం : ‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింత ముదురుతోంది. శివసేన, బీజేపీ మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అర్నాబ్ అరెస్టును "బ్లాక్ డే" గా అభివర్ణించిన బీజేపీ నేతలపై శివసేన మండిపడింది. బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్ననేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కౌంటర్ ఎటాక్ చేసింది. ముఖ్యంగా "పత్రికా స్వేచ్ఛపై దాడి, "అత్యవసర పరిస్థితులు" అంటున్న పలువురు కేంద్రమంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, హత్యలను ప్రస్తావించింది. (మంత్రగత్తె వేట : అర్నాబ్ న్యాయ పోరాటం) మహారాష్ట్ర ప్రభుత్వంలో మీడియాపై దాడి అనే ప్రశ్నే లేదని, ఇలా అరోపిస్తున్నా వారే ప్రజాస్వామ్యం మొదటి స్థంభమైన శాసనసభను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడింది. గోస్వామిని రక్షించడానికే గత రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఆత్మహత్య కేసును కప్పిపుచ్చిందని సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్లో ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు, యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమాయక వ్యక్తి తన వృద్ధాప్య తల్లితో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య న్యాయం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు బాధిత నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని సూచించింది. అలాగే ప్రధానమంత్రితో సహా అందరూ చట్టం ముందు సమానమేనని సంపాదకీయం వ్యాఖ్యానించింది -
వ్యాక్సిన్: దేశం మొత్తానికి సమాన హక్కులు!
ముంబై: బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడంపై శివసేన పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడంపై బీజేపీ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వ్యాక్సిన్‌పై బీజేపీ చేస్తున్న రాజకీయాలను గురించి శివసేన అనుబంధ పత్రిక సామ్నాలో ప్రస్తావిస్తూ.. బిహార్‌లో బీజేపీ గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామంటున్నారు. మరి మిగిలిన రాష్ట్రాలు భారత్‌లో కాకుండా పాకిస్తాన్లో ఏమైనా ఉన్నాయా..?. బిహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంది. దేశం మొత్తం వైరస్ బారిన పడుతున్నప్పుడు కేవలం అక్కడకు వెళ్లి వ్యాక్సిన్ కోసం బీజేపీని గెలిపించండి అని కరోనా వ్యాక్సిన్‌పై ఎందుకు రాజకీయాలు చేస్తారు..?. టీకాపై ఒక్క బిహార్‌కే కాదు దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయి' అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. (ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్) గతంలో ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో దేశం మొత్తంగా అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని.. దీనికి కులం, మతం, రాష్ట్రం ప్రాతిపదిక కాదు అని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ వైఖరి మార్చుకొని బిహార్ ఎన్నికల మ్యానిఫెస్టో సందర్భంగా మరో రకంగా వ్యాఖ్యానించడం విచిత్రమైన విషయం. బీజేపీకి ఈ విషయంలో ఎవరు మార్గనిర్దేశం చేస్తున్నారు' అంటూ సామ్నా సందపాదకీయంలో విమర్శించింది. ('అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్‌లా పరిగెడుతోంది') కాగా, శుక్రవారం రోజున ఇదే విషయంపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. 'మేం స్కూల్లో చదువుకునే రోజుల్లో 'మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను' అనే నినాదాన్ని వినేవాళ్లం. ఇప్పుడు 'మీరు మాకు ఓటేయండి, మేం మీకు వ్యాక్సిన్ ఇస్తాం' అనే నినాదాన్ని వింటున్నాం. ఆ ప్రకారంగా ఎవరైతే బీజేపీకి ఓట్లు వేస్తారో వాళ్లకే వ్యాక్సిన్ అందుతుంది. ఇది ఆ పార్టీ వివక్షతకు అద్దం పడుతోంది అని సంజయ్‌రౌత్ పేర్కొన్నారు. -
‘స్వార్థపూరిత పార్టీతో ఎందుకు ప్రయత్నిస్తున్నారు’
పూణే: మహారాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో శివసేన వైదొలిగితే తిరిగి శివసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధమని ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. కాగా బీజేపీ వ్యాఖ్యలకు శివసేన అధికార పత్రిక సామ్మాలో శివసేన నాయకులు గట్టిగా కౌంటరిచ్చారు. ఇటీవల 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకులు శివసేనను స్వార్థ, మోసపూరిత పార్టీ అంటూ దూషించారని శివసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. మీరు తీవ్రంగా దూషించిన శివసేన పార్టీతో పొత్తుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ శివసేన నాయకులు బీజేపీపై మండిపడుతున్నారు. గతంలో శివసేన, బీజేపీ పరస్పర సహకారంతో 2014అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్తంగా అధికారాన్ని చేపట్టారు. కానీ , 2019ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరు పార్టీలకు విబేధాలు వచ్చాయి. తమ ప్రభుత్వ సుస్థిరతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందిస్తూ.. తమ ప్రభుత్వం పూర్తి పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటుందని అన్నారు. ఆయన ఓ ఉదాహరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం మూడు చక్రాల్లాంటిదని, పేద ప్రజలకు వాహనాం లాగా పనిచేస్తుందని అన్నారు. కాగా అద్భుతంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఎందుకంత కడుపుమంటని మండిపడ్డారు. -
సోనూకు రాజకీయ రంగు: మోదీతో భేటీ!
సాక్షి, ముంబై : కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై శివసేన విమర్శల వర్షం కురిపించింది. తన అధికారిక పత్రిక సామ్నా వేదికగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సోనూను రాజకీయ రొచ్చులోకి లాగారు. వలస కార్మికులను అడ్డుపెట్టుకుని మరో మహాత్ముడు దిగి వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనూ మంచి నటుడని కితాబిస్తూనే.. ఆయన వెనుక మంచి దర్శకులు కూడా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సోనూసుద్ సహాయంలో ఎన్నో లోతుపాతులు ఉన్నాయని, త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారంటూ రాజకీయ రంగు పూశారు. ఈ మేరకు ఆదివారం సామ్నా ఎడిటోరియల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. (28 వేల మందికి సోనూసూద్ సాయం) ‘వలస కార్మికులకు మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ అండగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సొంత ఖర్చుతో నటుడు సోనూసుద్ కొంతమంది కార్మికులను వారి స్వస్థలాలకు పంపించారు. ఆయన సహాయం వెనుక స్థానిక ప్రభుత్వ సహకారం కూడా ఉంది. సోనూ కార్యక్రమాల్లో రాజకీయ కోణం కూడా దాగి ఉంది. ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు నిలవడమే దీనికి నిదర్శనం. వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసుద్ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడం ఖాయం. సోనూ సెలబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ అంటూ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా లాక్డౌన్ కారణంగా మహారాష్ట్రలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తనసొంత ఖర్చులతో స్వస్థలాలకు తరలించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నిసర్గ తుపాను ముంచుకొస్తున్న సమయంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.సోనూ సహాయం దేశంలో నిజమైన హీరోగా ఆయన్ని నిలబెట్టిందంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, త్రిపుర సీఎం బిప్లద్ దేవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం సోనూను అభినందనల్లో ముంచెత్తారు. తెరపై చేసే సాహసాల కంటే నిజ జీవితంలో ప్రజలను ఆదుకునేవారే నిజయమైన హీరో అంటూ కొనియాడారు. (సోనూసూద్.. నువ్వు రియల్ హీరో) -
ఆ సిటీల్లో కోవిడ్-19 అలజడి..
ముంబై : మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో ముంబై, పుణే నగరాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొందని శివసేన పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. మహారాష్ట్రలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 5218కి పెరిగాయని, 251 మంది మరణించారని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సామ్నా ఎడిటోరియల్ ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబై, పుణే నగరాల్లో కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాప్తి చెందుతుండటంతో మహారాష్ట్రలో అత్యవసర పరిస్థితి నెలకొందని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. పాల్ఘార్ జిల్లాలో ఇద్ధరు సాధువులను కొట్టిచంపిన ఘటనను సామ్నా ఎడిటోరియల్ తీవ్రంగా ఖండించింది. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందని, దీనికి మతం రంగు పులమడం అమానవీయమని పాలక శివసేన పేర్కొంది. లాక్డౌన్ సమయంలో దొంగలు సాధువుల వేషంలో వచ్చారనే వదంతులతో గడ్చింకల్ గ్రామస్తులు ఇద్దరు సాధువులను దారుణంగా హింసించి చంపారని తెలిపింది. మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌కు వెళుతున్న సాధువులపై దాడి జరిగిందని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సరైన చర్యలు చేపట్టారని మహా సర్కార్‌ను సమర్ధించింది. బాధితులు, నిందితులు ఒకే మతానికి చెందిన వారు కావడంతో ఈ కేసుకు మతం రంగు పులమడం సరికాదని సేన సంపాదకీయ వ్యాఖ్యానించింది. చదవండి : శివ సైనిక -
‘బీజేపీ పగటికలలు నెరవేరవు’
ముంబై : జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్‌లో నెలకొన్న పరిణామాలపై శివసేన స్పందించింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని, కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే మహా సర్కార్‌ను సమర్ధవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తమ యువనేతలను కలుపుకునిపోవడంలో విఫలమవుతోందని శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తామన్న బీజేపీ పగటికలలను మానుకోవాలని సామ్నా సంపాదకీయం ఎద్దేవా చేసింది. మహారాష్ట్రలో అస్ధిరత కోసం మూడు నెలల కిందట బీజేపీ చేసిన విఫల ప్రయోగం గుర్తుకుతెచ్చుకోవాలని సూచించింది. ఇక మధ్యప్రదేశ్ పరిణామాలపై కాంగ్రెస్ తీరునూ తప్పుపట్టింది. మధ్యప్రదేశ్‌లో సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లు సమన్వయంతో సర్కార్‌ను నడుపుతున్నా జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలను నిర్లక్ష్యం చేసి పొరపాటు చేసిందని ఎత్తిచూపింది. సీనియర్ నేతగా పేరొందిన కమల్‌నాథ్‌ను తక్కువగా అంచనా వేయలేమని మహారాష్ట్ర తరహాలో మధ్యప్రదేశ్‌లోనూ ఆయన బీజేపీకి షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంది. ఇక రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌ల సీఎంలు కమల్‌నాథ్, అశోక్ గెహ్లోత్‌ల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుందని సామ్నా సంపాదకీయం ప్రస్తావించింది. చదవండి : ‘ఆ వైరస్ మాకు సోకదు’ -
షార్జీల్ ఇమామ్ అరెస్ట్: శివసేన మద్దతు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని( సీఏఏ)కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేఎన్‌యూ పీఎచ్డీ విద్యార్ధి షార్జిల్ ఇమామ్‌ను అరెస్ట్ చేయటాన్ని శివసేన సమర్ధించింది. అతన్ని అదుపులోకి తీసుకోవటంపై కేంద్రానికి శివసేన పార్టీ తన మద్దతును తెలిపింది. ఈ విషయాన్ని శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో గురువారం ప్రచురించింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారితో రాజకీయం చేయకుడదని.. అలాంటి వారిని ఏరివేయాలని కేంద్ర హోంమత్రిత్వ శాఖకు శివసేన సలహా ఇచ్చినట్లు పేర్కొంది. ప్రజల్లో విద్వేషభావాలను రెచ్చగొట్టే షార్జిల్ ఇమామ్ వంటి చీడ పురుగులను ప్రజల్లో తిరగనివ్వకూడదని సామ్నా సంపాదకీయం పేర్కొంది. (ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది) కొంతమంది విద్యావంతులు రాజకీయ విషం పులుముకొని.. ఉగ్రవాద చర్యలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని సామ్నా మండిపడింది. కాగా మంగళవారం షార్జిల్ ఇమామ్ని బీహార్‌లోని జెన్హనాబాద్లో పోలీసులు ఆరెస్టు చేశారు. ఇటీవలె సీఏఏకు వ్యతిరేకంగా చేట్టిన నిరసనల్లో పాల్గొన్న షార్జిల్.. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వం ఏర్పడింది 80 రోజుల కోసం కాదు..
ముంబై: మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు అన్ని చర్యలు తీసుకుంటోందని శివసేన పేర్కొంది. కేబినెట్‌ను ఏర్పాటు చేయడంలో మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత ఆశీష్ శెల్లర్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం..కనీసం ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. అయితే ఆశీష్ వ్యాఖ్యలను శివసేన తిప్పికొట్టింది. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కేబినెట్ విస్తరణకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది. కేబినెట్‌ను ఎప్పుడూ విస్తరించాలో ప్రభుత్వానికి తెలుసునని పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా కార్యకలాపాలను నిర్వహించే సత్తా ఉందని తెలిపింది. మంత్రులకు శాఖలను కేటాయించనంత మాత్రాన వారికి ప్రాధాన్యత లేదనడం సరికాదని పేర్కొంది. నాగ్‌పూర్ సమావేశం చాలా ముఖ్యమని.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. కాగా, మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఎలాంటి సందేహం అక్కర్లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం 80 రోజుల కోసం ఏర్పాటు చేసింది కాదని కచ్చితంగా ఐదు సంవత్సరాలు పాలిస్తుందని తెలిపింది. మరోవైపు ఉద్దవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడింది. -
‘వారి జీవితాలతో ఆటలు ఆడొద్దు’
ముంబై: గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రతను తొలగించటంపై శివసేన పార్టీ మండిపడింది. కేంద్ర సర్కారు గాంధీ కుటుంబ భద్రతపై వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కథనం వెలువరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర.. దేశంలో ఎక్కడైనా రాజకీయాలు భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణంలో జరగాలని పేర్కొంది. గాంధీ కుంటుంబీకుల జీవితాలతో ఆటలు ఆడొద్దని ధ్వజమెత్తింది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు తమకు భద్రత కలింగించే రక్షణ సిబ్బంది లేకుండా ఉండలేరు. అంటే భద్రతకు ఎంత ప్రముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని సామ్నా పేర్కొంది. అటువంటి భద్రత గాంధీ కుంటుంబానికి తొలగించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని స్పందించాలని కోరింది. హోం మంత్రిత్వ శాఖలో ఇటువంటి నిర్ణయం ఎవరు.. ఎలా తీసుకుంటారని సామ్నా తన సంపాదకీయంలో ప్రశ్నించింది. గాంధీ కుటుంబానికి చెందినవారు కాకుండా ఆ స్థానంలో వేరే వాళ్లు ఉంటే. కేంద్రం ఇదే తరహాలో నిర్ణయం తీసుకుంటుందా.. అని సామ్నా తన సంపాదకీయంలో నిలదీసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ కుటుంబాన్ని ఎస్పీజీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. కాగా గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసిన విషయం తేలిసిందే. ఇక దాదాపు 28 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను.. వారికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇకపై రాష్ట్రపతి, దేశ ప్రధానికి భద్రతకై ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులను వినియోగించనుంది. కాగా 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. చదవండి: మీ అందరికీ ధన్యవాదాలు: రాహుల్ గాంధీ -
‘మహా గవర్నర్‌పై సేన ఫైర్’
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ సహా ఆ రాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారి అనుసరిస్తున్న తీరు పట్ల శివసేన మండిపడింది. వరదలతో దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని, తమకు ఓటు వేయని రైతులపై కేంద్రం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడరాదని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన దుయ్యబట్టింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోనందుకు కేంద్రం రైతులపై ప్రతీకారం తీర్చుకోరాదని తాము కోరుతున్నామని సంపాదకీయంలో శివసేన పేర్కొంది.మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని రాజాగా అభివర్ణించిన సేన ఆయన రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోకాలడ్డుతున్నారని ఆరోపించింది. హెక్టార్‌కు రూ 25,000 చొప్పున రైతులకు పరిహారం ప్రకటించాలని శివసేన కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రైతుల తరపున తాము ఢిల్లీ (కేంద్రం)తో పోరాడుతున్నామని పేర్కొంది. బీజేపీ మాటలు ఓ రకంగా ఉంటే చేతలు మరోరకంగా ఉంటాయని విమర్శించింది. -
బీజేపీకి శివసేన చురకలు..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో భారతీయ జనతా పార్టీ విఫలమైన నేపథ్యంలో శివసేన రైతులపై ప్రతికార చర్యలకు పాల్పడవద్దని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడింది. ఆదివారం మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ట్విటర్ వేదికగా శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రేను ప్రజలకు ‘ఆత్మగౌరవం’ విలువను నేర్పించారని ప్రశంసిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆత్మ గౌరవం కాపాడుకోవాలి అంటూ ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో స్పందించింది. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనందుకు కేంద్ర ప్రభుత్వం రైతులపై పగ తీర్చుకుంటుందని విమర్శించింది. రైతులపై అలాంటి చర్యలకు పాల్పడవద్దని హితవు పలికింది. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు కోరటంపై ఫడ్నవిస్ పరోక్షంగా విమర్శించినట్టుగా అర్థం వస్తోంది. దీంతో ఆత్మగౌరవంతో వ్యాపారం చేసే 105 మంది ఎమ్మెల్యేలను కలిగిన బీజేపీ.. శివసేనకు ఆత్మగౌరవం గురించి చెప్పుతుందా? అని సామ్నాలో ప్రశ్నించింది. బాల్ ఠాక్రే ఇచ్చిన ఆత్మగౌరవాన్ని శివసేన కోల్పోకుండా రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుందని పేర్కొంది. రైతులకు తక్కువ పరిహారం అంటూ ప్రశ్నించిన బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ ఉద్దేశిస్తూ.. ఆత్మగౌరవం కోసం పోరాడే స్థితిలో ఉన్నారా అని విమర్శించింది. మహారాష్ట్ర్ర గవర్నర్‌ను ‘సుల్తాన్’ అని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సుల్తాన్ అనుమతించటం లేదని తెలిపింది. ‘రాజా’ నుంచి ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయని.. కానీ తన దగ్గర నుంచి తగినంతగా స్పందన లేదని పేర్కొంది. రైతులకు హెక్టారుకు రూ. 25 వేలు ఇవ్వాలని శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహిరిస్తోందని.. ఆ పార్టీ చర్యలు చాలా ప్రమాదకరంగా మారాయని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. -
రాష్ట్రపతి పాలన మాటున బేరసారాలు
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తున్న శివసేన చిరకాల మిత్రుడైన కమలదళంపై కస్సుమంటోంది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తోందని శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లు తమ పార్టీకి 119 (స్వతంత్ర అభ్యర్థులు 14 మందితో కలిపి) ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ పార్టీ సహకారం లేకుండా మరెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టింది. మేజిక్ ఫిగర్ అయిన 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించిందని గుర్తు చేసింది. క్రికెట్లోనూ, రాజకీయాల్లోనూ ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చునన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపైనా సామ్నా ఎడిటోరియల్ విరుచుకుపడింది. ఇవాళ, రేపు క్రికెట్ అంటే ఆట తక్కువ, వ్యాపారం ఎక్కువ అన్నట్టుగా తయారయ్యాయని వ్యాఖ్యానించింది. అంతేకాదు క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణమైపోయిందని, అప్పుడే విజయం వరిస్తోందని పేర్కొంది. బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వలవేసి రాజకీయ క్రీడలో గెలవాలని చూస్తోందని సామ్నా తన సంపాదకీయంలో ఆరోపించింది. మరోవైపు ఎన్సీపీ కూడా బీజేపీపై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. తమ పార్టీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఇతర పార్టీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఎమ్మెల్యేలను తమ గూటికి లాగాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌తో భేటీ వాయిదా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఇంకా ముందుకు కదలలేదు. వాస్తవానికి శనివారమే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి చర్చించి, ఆ తర్వాత గవర్నర్‌తో భేటీ కావాలని భావించారు. కానీ ఈ సమావేశాలన్నీ వాయిదా పడ్డాయి. ఆదివారం శరద్ పవార్, సోనియాతో కలిసే అవకాశాలున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై పవార్ సోనియాతో చర్చించాక మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఒక స్పష్టత రానుంది. ఎన్డీయే భేటీకి సేన దూరం ఈ నెల 18న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎన్డీయే సమావేశం కానుంది. ఈ సమావేశానికి తాము హాజరు కాబోమని శివసేన స్పష్టం చేసింది. ఎన్డీయేకి రాం రాం చెప్పడం ఇక లాంఛనప్రాయమేనని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విలేకరులకు చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న శివసేనకు చెందిన ఒకే ఒక మంత్రి అరవింద్ సావంత్ ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎప్పుడైతే 50:50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదో అప్పట్నుంచే తాము ఎన్డీయేకి దూరమయ్యామని రౌత్ స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్ష స్థానాల్లో సేన ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో శివసేన పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు ఇకపై మారిపోనున్నాయి. శివసేన ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షం వైపు అయిదో వరసలో ఇక కూర్చోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
‘రాష్ట్రపతి పాలన ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు’
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న శివసేన మాజీ మిత్రపక్షం బీజేపీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు రాయబేరాలు సాగిస్తోందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. 105 మంది ఎమ్మెల్యేలతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు స్పష్టం చేసిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో తమ పార్టీ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని ఎలా చెప్పగలుగుతుందని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి దారిలోకి తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టింది. బీజేపీ చెబుతున్న పారదర్శక ప్రభుత్వం ఏంటో ఇప్పుడు వెల్లడవుతోందని శివసేన విమర్శించింది. అనైతిక పద్ధతుల్లో ఎమ్మెల్యేలను లోబరుచుకోవడం మహారాష్ట్ర సంప్రదాయం కాదని హితవు పలికింది. కాగా తమ పార్టీ త్వరలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ సామ్నా సంపాదకీయం బీజేపీని ఎండగట్టింది. ఇక రాజకీయాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్రికెట్‌తో పోల్చడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయాలు ఆటల కన్నా ఇప్పుడు వ్యాపారంలా మారాయని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. క్రికెట్లోనూ రాయబేరాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని గుర్తెరగాలని పేర్కొంది. మహారాష్ట్రలో గడువులోగా ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకురాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. -
‘కశ్మీర్ మన అంతర్గత విషయం కాదా?’
సాక్షి, ముంబై : కశ్మీర్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ప్రతినిధుల బృందాన్ని అనుమతించడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన కూడా చేరిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో ఇబ్బంది పడ్డ శివసేన ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తోంది. ఇన్నాళ్లూ కశ్మీర్ దేశ అంతర్గత సమస్య అంటూ ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను కూడా అడుగుపెట్టనివ్వని ప్రభుత్వం, ఇప్పుడు విదేశీ ప్రతినిధులను ఎందుకు అనుమతినిచ్చిందని బుధవారం ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో నిలదీసింది. ‘కశ్మీర్ మనదేనని ఆర్టికల్ 370 రద్దు చేశాం. అక్కడ జాతీయ జెండా ఎగురవేశాం. ఈ పరిణామాలతో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాలను చూసి యావత్ దేశం గర్వపడింది. కానీ, కశ్మీర్లో అంతా బావుందనే ప్రభుత్వం ఇప్పుడు విదేశీ ప్రతినిధులను ఎందుకు ఆహ్వానించింది? కశ్మీర్ మన అంతర్గత విషయం కాదా? ఇది మన స్వేఛ్చపై దాడి కాదా? అంతేకాక, ఈ చర్య కొన్ని సీరియస్ ప్రశ్నలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలకు అవకాశమిచ్చింద’ని తీవ్రంగా మండిపడింది. కాగా, మహారాష్ట్రలో 50 : 50 ఫార్ములా ప్రకారం అధికార కాలాన్ని పంచుకోవాలని, పదవుల్లో కూడా చెరిసగం వాటాలుండాలని శివసేన బీజేపీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే శివసేన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. మంగళవారం ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. అలాంటి ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తికి లోనైన శివసేన మరునాడే బీజేపీని విమర్శిస్తూ తన పత్రికలో సంపాదకీయం రాయడం గమనార్హం. -
‘పుల్వామా దాడి పాక్ పనే’
ముంబై : ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. మోదీ ప్రభుత్వ నిర్ణయం మరిన్ని పుల్వామా తరహా ఘటనలకు దారితీస్తాయని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే పుల్వామా దాడి వెనుక పాక్ హస్తం ఉందనేందుకు తిరుగులేని ఆధారమని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం రద్దుపై పాక్ నిర్ణయం ఆ దేశానికే నష్టమని స్పష్టం చేసింది. పాక్ నిర్ణయం భారత వృద్ధి రేటుకు ఎంతమాత్రం అవరోధం కాదని పేర్కొంది. భారత రాయబారిని తిప్పిపంపడం, పాక్‌లో తమ రాయబారిని వెనక్కిపిలవడం వంటి పాక్ దౌత్య నిర్ణయాలను స్వాగతిస్తున్నామని పేర్కొంది. కశ్మీర్ వివాదంలో భారత్ గెలుపును పాక్ అంగీకరించాలని శివసేన వ్యాఖ్యానించింది. ఒక చేత్తో చర్చలంటూ మరో చేత కుట్ర పన్నే పాక్ తీరు భారత్‌తో పనిచేయదని తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి ముందు భారత్ తమను సంప్రదించలేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను సేన తప్పుపట్టింది. ఇరాక్‌పై దండెత్తే సమయంలో, సద్ధాం హుస్సేన్ ఉరితీత సందర్భాల్లో అమెరికా భారత్ అభిప్రాయాన్ని కోరిందా అని ప్రశ్నించింది. -
‘పాక్ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోంది’
ముంబై : పాకిస్తాన్లో భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అతిధుల పట్ల పాక్ వ్యవహరించిన తీరుపై శివసేన స్పందించింది. పాకిస్తాన్ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. బాలాకోట్ వైమానిక దాడులతో పాకిస్తాన్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పినా ఇప్పటికీ పాక్ తీరు మారలేదని దుయ్యబట్టారు. పొరుగు దేశం తోకలను కత్తిరించే చర్యలు చేపట్టాలని కోరారు. మోదీ ప్రభుత్వం తిరుగలేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో థాకరే పేర్కొన్నారు. శాంతి ప్రక్రియ పట్ల ఇమ్రాన్ ఖాన్ చొరవ చూపడం మంచిదే అయినా శనివారం ఇఫ్తార్ విందులో జరిగిన ఘటన శాంతిని నెలకొల్పే దిశగా ఉపకరిస్తుందా అని థాకరే ప్రశ్నించారు. కాగా, ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లో బారత హైకమిషన్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి హాజరైన అతిధులను వేదిక వెలుపల భద్రతా అధికారులు నిలిపివేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ప్రసంగాలు, ప్రకటనలు సరే.. జాబ్‌ల సంగతేంటి
ముంబై : ఎన్నికల ముందు వరకూ బీజేపీకి మద్దతిచ్చిన శివసేన.. ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మీద విమర్శలు ప్రారంభించింది. మోదీని టార్గెట్ చేస్తూ.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని వెలువరించింది. ఉత్తేజపూరితమైన ప్రసంగాలు, ప్రకటనలు ఉద్యోగాలను సృష్టించలేవని పేర్కొంది. బుల్లెట్ ట్రైన్ వల్ల కూడా ఉద్యోగాలు రావని తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం కోసం బీజేపీ గతంలో ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతమంది ప్రయోజనం పొందారో తెలిపాలని డిమాండ్ చేసింది. మోదీ ప్రధానిగా మరోసారి ఎన్నికయ్యాక షేర్ మార్కెట్ల విలువ పెరిగిందని.. మరి జీడీపీ వృద్ధి రేటు సంగతి ఏంటని ప్రశ్నించింది. వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాల్లో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించింది. విమానయాన రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని పేర్కొంది. దేశంలో విమానాశ్రయాలు పెరిగాయని.. విమానలు తగ్గిపోయాయని స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాలు నిరుద్యోగం అని.. అందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలపాలని శివసేన సామ్నాలో డిమాండ్ చేసింది. -
‘మందిర నిర్మాణం మరవద్దు’
ముంబై : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరనున్న నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అయోధ్య అంశాన్ని ముందుకు తెచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మోదీ సర్కార్‌కు గుర్తుచేసింది. మందిర నిర్మాణం సత్వరమే చేపట్టాలని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన కేంద్రాన్ని కోరింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు రామ రాజ్యానికి, మందిర నిర్మాణ ఆకాంక్షలకు అద్దం పట్టిందని సేన ఈ సంపాదకీయంలో పేర్కొంది. మందిర నిర్మాణం తప్పక జరిగి తీరుతుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలనూ శివసేన ప్రస్తావించింది. ఇక విపక్ష పార్టీల తీరును తప్పుపడుతూ వాటిని పురాణాల్లో రాక్షసులైన రావణ, విభీషణ, కంసులతో పోల్చింది. మరోవైపు సుప్రీం కోర్టు అనుమతితో చట్టబద్ధంగా అయోధ్యలో మందిర నిర్మాణం చేపడతామని ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని శివసేన గుర్తుచేసింది. -
మందిర్ వివాదం: బీజేపీకి సేన అల్టిమేటం
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌తో ముందుకు రావాలని, మందిర నిర్మాణ తేదీని ప్రకటించాలని శివసేన శుక్రవారం బీజేపీని డిమాండ్ చేసింది. రామ జన్మభూమిలో బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన శివసైనికులను చూసి పాలకులు గర్వపడాలని బీజేపీని దుయ్యబడుతూ వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో రాముడి పేరిట తాము ఓట్లను అభ్యర్ధించమని సామ్నా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని కోరుతూ నవంబర్ 25న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్యను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తమకు తాము హిందుత్వ ప్రతినిధులమని చెప్పుకునే వారు తాము అయోధ్య యాత్రను చేపడుతున్నామని ప్రకటిస్తే ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారని శివసేన ప్రశ్నించింది. తాము రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్లడం లేదని సంపాదకీయంలో పేర్కొంది. తమ పార్టీ ‘ఛలో అయోధ్య’ పిలుపు ఇవ్వలేదని, అయితే రాముడి దర్శనం కోసం శివసైనికులు వెళుతున్నారని, అయోధ్య ఏ ఒక్కరి ప్రైవేటు ప్రాంతం కాదని స్పష్టం చేసింది. మందిర నిర్మాణంపై స్పష్టమైన ప్రకటనతో ముందుకు రాకపోతే 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దూరమవుతుందని, ప్రగల్బాలు పలికిన నేతలు నాలుకలు కోల్పోతారని సామ్నా సంపాదకీయం హెచ్చరించింది. -
సీబీఐని కుక్కలా కట్టిపడేశారు : శివసేన
సాక్షి, ముంబై : సీబీఐ వివాదానికి సంబంధించి మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని శివసేన విమర్శలతో విరుచుకుపడింది. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సీబీఐని సొంత ఆస్తిలా మార్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్ కేడర్ ఆఫీసర్, సీబీఐలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న రాకేష్ ఆస్ధానా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు నమ్మినబంటని పేర్కొంది. సీబీఐపై ఇప్పటి వరకూ పలు ఆరోపణలు వచ్చినా, ఈ తరహా బురదచల్లుకునే పరిణామాలు ఇంతకు ముందెన్నడూ చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రభుత్వంలో కట్టిపడేసిన కుక్కలా సీబీఐ వ్యవహారశైలి ఉందని సామ్నా ఎడిటోరియల్ దుయ్యబట్టింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాల అంతర్యుద్ధం, ఇరువురిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో దర్యాప్తు ఏజెన్సీ విశ్వసనీయతపై సర్వత్రా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. సీబీఐ కీచులాటల నేపధ్యంలో ఉన్నత స్ధాయి దర్యాప్తు సంస్థపై మోదీ సర్కార్ పట్టు కోల్పోయిందని కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. సీబీఐలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సర్వోన్నత న్యాయస్ధానం చొరవ తీసుకుంది. అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీని ఆదేశించింది. మరోవైపు సీబీఐ నూతన చీఫ్‌గా నియమితులైన ఎం నాగేశ్వరరావు పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని, విధాన నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది.