
ముంబై : మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో ముంబై, పుణే నగరాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొందని శివసేన పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. మహారాష్ట్రలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 5218కి పెరిగాయని, 251 మంది మరణించారని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సామ్నా ఎడిటోరియల్ ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబై, పుణే నగరాల్లో కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాప్తి చెందుతుండటంతో మహారాష్ట్రలో అత్యవసర పరిస్థితి నెలకొందని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది.
పాల్ఘార్ జిల్లాలో ఇద్ధరు సాధువులను కొట్టిచంపిన ఘటనను సామ్నా ఎడిటోరియల్ తీవ్రంగా ఖండించింది. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందని, దీనికి మతం రంగు పులమడం అమానవీయమని పాలక శివసేన పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో దొంగలు సాధువుల వేషంలో వచ్చారనే వదంతులతో గడ్చింకల్ గ్రామస్తులు ఇద్దరు సాధువులను దారుణంగా హింసించి చంపారని తెలిపింది. మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌కు వెళుతున్న సాధువులపై దాడి జరిగిందని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సరైన చర్యలు చేపట్టారని మహా సర్కార్‌ను సమర్ధించింది. బాధితులు, నిందితులు ఒకే మతానికి చెందిన వారు కావడంతో ఈ కేసుకు మతం రంగు పులమడం సరికాదని సేన సంపాదకీయ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment