న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని( సీఏఏ)కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేఎన్‌యూ పీఎచ్‌డీ విద్యార్ధి షార్జిల్ ఇమామ్‌ను అరెస్ట్ చేయటాన్ని శివసేన సమర్ధించింది. అతన్ని అదుపులోకి తీసుకోవటంపై కేంద్రానికి శివసేన పార్టీ తన మద్దతును తెలిపింది. ఈ విషయాన్ని శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో గురువారం ప్రచురించింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారితో రాజకీయం చేయకుడదని.. అలాంటి వారిని ఏరివేయాలని కేంద్ర హోంమత్రిత్వ శాఖకు శివసేన సలహా ఇచ్చినట్లు పేర్కొంది. ప్రజల్లో విద్వేషభావాలను రెచ్చగొట్టే షార్జిల్ ఇమామ్ వంటి చీడ పురుగులను ప్రజల్లో తిరగనివ్వకూడదని సామ్నా సంపాదకీయం పేర్కొంది. (ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది)
కొంతమంది విద్యావంతులు రాజకీయ విషం పులుముకొని.. ఉగ్రవాద చర్యలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని సామ్నా మండిపడింది. కాగా మంగళవారం షార్జిల్ ఇమామ్‌ని బీహార్‌లోని జెన్‌హనాబాద్‌లో పోలీసులు ఆరెస్టు చేశారు. ఇటీవలె సీఏఏకు వ్యతిరేకంగా చేట్టిన నిరసనల్లో పాల్గొన్న షార్జిల్.. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment