Sivasena
-
‘మహా’ పోరు: అధికారం పీఠం దక్కించుకునేదెవరు?
సాక్షి ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ మహాయుతి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబరు 23వ తేదీ (శనివారం) వెలుపడను న్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌షాహీ, రిపబ్లిక్ , చాణక్య, పోల్‌డైరీ వంటి అనేక సంస్ధలు ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిర్వహించాయి. మహాయుతిదే మళ్లీ అధికార పీఠమని కొన్ని సర్వేలు వెల్లడించగా, మరి కొన్ని సర్వేలు మాత్రం మహావికాస్ ఆఘాడి కూటమి అ«ధికారంలో రానుందని పేర్కొన్నాయి. మహా వికాస్ ఆఘా డీకి 124 నుంచి 156 స్థానాలు లభించనున్నాయని, మహాయుతి కూటమికి 129 నుంచి 150 స్థానాలు, ఇతరులు 10 స్థానా ల్లో గెలిచే అవకాశముందని లోక్‌షాహీ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. ఇదిలాఉండగా మహాయుతికి 137 నుంచి 157 స్థానాలు, మహావికాస్ ఆఘాడీకి 126 నుంచి 146 స్థానాలు లభించే అవకాశాలున్నాయని రిపబ్లిక్ సర్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారపీఠమెక్కేదెవరన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు గెలుపు మీద ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.#WATCH | Delhi | On Shiva Sena (UBT)'s claim that they (MVA) will secure 160 seats in Maharashtra elections, Union Minister Giriraj Singh says, “The election results will be out by this time tomorrow. They (Shiv Sena) are nervous, that’s why they are making such claims.” pic.twitter.com/oQhlxkevZm— ANI (@ANI) November 22, 2024 -
‘స్పీకర్ పదవి తీసుకోండి.. లేదంటే మీ పని అంతే!’
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయింది. దీంతో కేంద్రంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి తెలుగుదేశం(టీడీపీ), జేడీ (యూ)లు కీలకంగా వ్యవహరించి మద్దతు పలికాయి.టీడీపీ, జేడీ(యూ) పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడానికి మద్దతు పలికిన టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు.If TDP and JDU want to save their party, they should keep Loksabha speaker post with them otherwise BJP will break their parties for sure. — Aditya Thackeray pic.twitter.com/vopynhKkVp— Shantanu (@shaandelhite) June 10, 2024 ‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్’ వేదికగా అన్నారు.మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్డీయే కూటమి ఇంకా లోక్‌సభ స్పీకర్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. భాగస్వామ్య పార్టీలు స్పీకర్ పదవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోవటం లేదని ఎన్డీయే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
కాంగ్రెస్ ‘మాజీ’లు ఇప్పుడేం చేస్తున్నారు?
2014లో బీజేపీ సారధ్యంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లోని చాలా మంది బడానేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి, బీజేపీలో చేరారు. 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. కాంగ్రెస్‌ను వీడిన బడా నేతల జాబితా ఇలా ఉంది. అల్పేష్ ఠాకూర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ 2019 జూలైలో రాజ్యసభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత పార్టీని వీడారు. అనంతరం బీజేపీలో చేరారు. రాధాపూర్ నుండి ఉప ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2022లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ సౌత్ నుంచి గెలుపొందారు. జ్యోతిరాదిత్య సింధియా ప్రముఖ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మార్చి 2020లో పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లో పలువురు సింధియా అనుకూల ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దాని కారణంగా కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. అయితే రాజీనామా చేయడానికి ముందు జ్యోతిరాదిత్య సింధియా హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తరువాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్లో సింధియా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. జితిన్ ప్రసాద్ జితిన్ ప్రసాద్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా భావించేవారు. 2021 జూన్‌లో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత ఆయన కూడా బీజేపీలో చేరారు. ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సుస్మితా దేవ్ ఆగస్ట్ 2021లో మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. సెప్టెంబర్ 2021లో టీఎంసీ ఆమెను రాజ్యసభకు పంపింది. 2023 వరకు పార్లమెంటు ఎగువ సభ సభ్యునిగా కొనసాగారు. ప్రస్తుతం ఆమె తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి. సుస్మితను టీఎంసీ తిరిగి రాజ్యసభకు పంపుతోంది. ఆర్పీఎన్ సింగ్ కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ 2022 జనవరిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన పార్టీని వీడారు. ఇటీవలే బీజేపీ ఆయనను యూపీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా ప్రకటించింది. అశ్విని కుమార్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, 2022 ఫిబ్రవరిలో మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో అశ్వినీ కుమార్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. సునీల్ జాఖర్ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న సునీల్ జాఖర్ 2022 మేలో పార్టీని వీడారు. అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు అధినాయకత్వం నుండి షోకాజ్ నోటీసు అందుకున్న తర్వాత జాఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత జాఖర్ బీజేపీలో చేరారు. జూలై 2023లో బీజేపీ అతనిని పంజాబ్ యూనిట్‌కి చీఫ్‌గా చేసింది. హార్దిక్ పటేల్ గుజరాత్ పాటిదార్ నేత హార్దిక్ పటేల్ 2022 మేలోనే కాంగ్రెస్‌ను వీడారు. రాహుల్ గాంధీ 2019లో హార్దిక్‌ని పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీకి చెందిన పలువురు బాడా నేతలు తమ ఫోన్లలో బిజీగా ఉంటున్నారని ఆరోపిస్తూ హార్దిక్ పటేల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తర్వాత బీజేపీలో చేరారు. కపిల్ సిబల్ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా పార్టీని వీడిన వారి జాబితాలో చేరారు. సిబల్ 2022 మేలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రాజ్యసభకు చేరుకున్నారు. గులాం నబీ ఆజాద్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆగస్టు 2022లో పార్టీకి రాజీనామా చేశారు. దేశంలో ఘన చరిత్ర కలిగిన పార్టీకి ఇది పెద్ద దెబ్బ. తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. అనిల్ ఆంటోని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ జనవరి 2023లో పార్టీని వీడారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మిలింద్ దేవరా 2024, జనవరి 14 న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మిలింద్ దేవరాను శివసేన రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అశోక్ చవాన్ 2024, ఫిబ్రవరి 12న అశోక్ చవాన్ భోకర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 13న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో చవాన్ బీజేపీలో చేరారు. ఫిబ్రవరి 14న భారతీయ జనతా పార్టీ.. మహారాష్ట్రలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా అశోక్ చవాన్‌ను ప్రకటించింది. -
Maharashtra: ఉద్దవ్ ఠాక్రేకు షాక్.. షిండేదే అసలైన శివసేన!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలక నిర్ణయం వెల్లడించారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. 2013 తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగలేదని అన్నారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఏ వర్గం నిజమైన పార్టీ అని తెలపడానికి నిర్ణయించే జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినట్లు శివసేన(యూబీటీ) వర్గం ఎటువంటి ఆధారం సమర్పించలేదని తెలిపారు. శివసేన పార్టీ చీఫ్‌గా ఉద్దవ్ ఠాక్రే కొనసాగాలని ఆ వర్గం నేతల ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ రాహుల్ నార్వేకర్ తిరస్కరించి.. శివసేన పార్టీకి చీఫ్‌గా సీఎం ఏక్నాథ్ షిండేను అడ్డుకోలేమని తెలిపారు. మహారాష్ట్రలో 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుప్రీకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ అన్నారు. పార్టీ నాయకత్వంపై శవసేనలోని ఇరు వర్గాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మేజార్టీ ఒక్కటే ప్రధామైన అంశమని అన్నారు. నాయకత్వ నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోని సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల సంఘానికి షిండే, ఉద్దవ్ వర్గాలు సమర్పించిన ఫిర్యాదుల్లో ఏకాభిప్రాయం లేదని తెలిపారు. మహారాష్ట్రలోని శివసేనకు చెందిన 34 ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గడువు బుధవారం ముగిసింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత సీఎం ఎక్నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయంపై ఇరు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. స్పీకర్ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
ఏకే-47తో కాల్చి చంపుతాం’.. సంజయ్ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
ముంబై: ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే తనను కూడా హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ హత్య చేస్తామని బెదిరించినట్లు సంజయ్ రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలో కనపడితే, నిన్ను ఏకే-47తో కాల్చి చంపుతా. సిద్దూ ముసావాలాకు పట్టిన గతే నీకు పడుతుందనిని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం (ఏక్నాథ్ షిండే) మా క్యాంపు నాయకులకు భద్రత తగ్గించింది. దీని గురించి నేను ఎప్పుడూ లేఖ రాయలేదు, కానీ పదే పదే సీఎం కుమారుడు గూండాలతో మాపై కుట్రకు ప్లాన్ చేసాడు. ఈ నేపథ్యంలో మా భద్రత విషయంగా ఎన్ని సార్లు తెలియజేస్తున్న హోం మంత్రిత్వ శాఖ, వీటన్నింటిని స్టంట్‌గా పరిగణిస్తోంది’ ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బెదిరింపుల గురించి నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎవరికీ భయపడను. నేను జైలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని’ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా భద్రతను తగ్గించిన తర్వాత గతేడాది మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఆయన్ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఈ దాడికి బాధ్యత వహించారు. కాగా..రౌత్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామన్న పోలీసులు.. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
ప్రచారం చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు: శివసేన నాయకుడు
ముంబై: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సచిన్ భోంస్లేపై దాడి జరిగింది. ఈ ఘటన పూణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భోంస్లే తెలిపిన వివరాల ప్రకారం..‘ఉప ఎన్నికల కోసం చించ్వాడ్ ప్రాంతంలో ఎన్సీపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నాం. అంతలో బీజేపీ కార్యకర్తలు నేరుగా వచ్చి మమ్మల్ని కొట్టారు. వారితో నాకు వ్యక్తిగత వాదనలు లేవు. గతంలో బీజేపీ అభ్యర్థి నాపై పోటి చేశారు. వీళ్లు ఆయన కార్యకర్తలే’ అని చెప్పారు. ఈ క్రమంలో భోంస్లే సహా ఎన్సీపీ కార్యకర్తలపై వారు దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో భోంస్లే చేతికి గాయం కాగా, ఎన్సీపీ కార్యకర్త గోరఖ్ పాశంకర్ కాలు విరిగిందని చెప్పారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపి సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్తా తిలక్ గత ఏడాది డిసెంబర్ 22న మరణించగా, చించ్వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ దీర్ఘకాలిక అనారోగ్యంతో జనవరి 3న కన్నుమూశారు. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎన్సీపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపి నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే సహా అన్ని పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కస్బా పేట, చించ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. చదవండి అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం -
థాక్రేకు బిగ్ షాక్.. బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు!
ముంబై: ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. శివసేన గుర్తును కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న థాక్రే వర్గానికి మరో దెబ్బ తగలనుంది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారటా! ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నలుగురు శివసేన ఎమ్మెల్యేలు అధికార వర్గంలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శనివారం వెల్లడించారు. అంధేరీ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది బయటకు వెల్లడించలేదు రాణే. ‘మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉద్ధవ్ థాక్రే వర్గంలో) వారు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కానీ, వారి పేర్లు నేను వెల్లడించను.’ అని తెలిపారు. పుణెలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. ఉద్ధవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు రాణే. ఆయన రాజకీయం కేవలం మాతోశ్రీ వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
మహా నంబర్ గేమ్
పదవిలో ఉన్న ముఖ్యమంత్రి సాక్షాత్తూ అధికారిక నివాసం వీడి సొంత ఇంటికి వెళ్ళిపోవడం... కిడ్నాప్‌కు గురయ్యామంటా రెబల్ ఎమ్మెల్యేలు సొంత గూటికి రావడం... తిరుగుబాటు మానేసి ఎమ్మెల్యేలంతా తిరిగొచ్చి కోరితే కూటమి నుంచే వైదొలుగుదామని అధికార పక్షమే ఆఫరివ్వడం... బహుశా సినిమాల్లోనూ కనిపించని నాటకీయతకు మహారాష్ట్ర వేదికైంది. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల అండతో ఉద్ధవ్ ఠాకరే సారథ్యంలో శివసేన నడుపుతున్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కుదిరేలా లేదని తెలిశాక, కనీసం తన తండ్రి బాలాసాహెబ్ ఠాకరే పెట్టిన పార్టీని నిలబెట్టుకోవడమె లాగో తెలియని స్థితిలో పడ్డారు ఉద్ధవ్. వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితే లేదని తిరుగుబాటు వర్గం నేత ఏక్నాథ్ శిందే గురువారం స్పష్టం చేయడంతో ఇక నేడో, రేపో... ఉద్ధవ్ ప్రభుత్వ పతనం ఖాయం. 2019 అక్టోబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకున్న బాసలకు కట్టుబడకుండా కాంగ్రెస్, ఎన్సీపీ లతో అసహజ కూటమి కట్టిన శివసేన, ఉద్ధవ్‌లపై బీజేపీ సరిగ్గా సమయం చూసి, పగ తీర్చుకుంది. రాజకీయాల్లో రెండు వారాలంటే సుదీర్ఘ సమయం. రెండువారాల క్రితం కూడా బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వం కనిపించింది. కానీ, రాజ్యసభ ఎన్నికల్లో, ఆ వెంటనే విధాన పరిషత్ ఎన్నికల్లో ఎదురైన ఓటములతో రెండే వారాల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని కూటమి కోట బీటలు వారిపోయింది. శివసేనకు కొంతకాలంగా అంగబలం, అర్థబలమైన ఏక్నాథ్ శిందే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. 285 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మొన్నటిదాకా 55 స్థానాలున్న శివసేన 17 సీట్ల ఉద్ధవ్ సేనగా, 38 సీట్ల శిందే సేనగా దాదాపు చీలిపోయిందని తుది వార్త. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండడానికి కావాల్సిన మూడింట రెండు వంతుల అంకెను శిందే వర్గం చేరుకుందనిపిస్తోంది. కనీసం 8 మంది స్వతంత్ర అభ్యర్థులూ శిందే సేన ఉన్న గువాహటీకే పరుగులు తీస్తుండడాన్ని బట్టి గాలి ఎటు వీస్తున్నదో అర్థమవుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో అంకెల మెజారిటీదే ఆఖరు మాట గనక అసెంబ్లీ వేదికగా బలపరీక్ష సాగవచ్చు. ఏమైనా ఉద్ధవ్ నిష్క్రమించడం, 106 సీట్ల బీజేపీ కాస్తా శిందే సేనతో కలసి మెజారిటీ మార్కు 144ను ఇట్టే దాటేసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం క్రమానుగత లాంఛనమే. మూడు రోజులు దాటినా ముగిసిపోని మహారాష్ట్ర సంక్షోభం వెనుక కనపడుతున్న వ్యక్తులు, అంశాల కన్నా పైకి కనపడనివి చాలానే ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని మమతా బెనర్జీ సహా పలువురి ఆరోపణ. బీజేపీ మాత్రం అమాయకత్వం నటిస్తోంది. మరోసారి సీఎం పీఠం ఎక్కాలని తపిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ సహా సీనియర్ బీజేపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు. కానీ, తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్ మొదలు అస్సామ్‌లోని గువాహటి దాకా ప్రత్యేక విమానాలు, బస్సుల్లో వందల కిలోమీటర్లు వెళ్ళడం, స్టార్ హోటళ్ళలో మకాం సహా సమస్త ఏర్పాట్లు జరగడం, స్థానిక బీజేపీ సర్కార్ల సంపూర్ణ రక్షణ ఛత్రంలో ఉండడం – ఇవన్నీ తెర వెనుక ఉన్నదెవరో చెప్పకనే చెబుతున్నాయి. పాకిస్తాన్‌తో పోరాడుతున్న ఓ జాతీయ పార్టీ తమ తిరుగుబాటు నిర్ణయాన్ని చరిత్రా త్మకమని ప్రశంసించినట్టు శిందేయే తన సహచరులతో గురువారం పేర్కొనడం గమనార్హం. గతంలో గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా పలుచోట్ల ప్రతిపక్షాల ప్రభుత్వాలను ఉండనివ్వ కుండా బీజేపీ సాగించిన ‘ఆపరేషన్ కమల్’ను తేలిగ్గా మర్చిపోలేం. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే జరుగుతోంది. కాకపోతే, 2019లో తగిలిన దెబ్బతో ఈసారి ఆచితూచి అడుగేస్తూ, ఆఖరి క్షణం వరకు తాను బయటపడకూడదన్న జాగ్రత్త వహిస్తోంది. అలాగని తప్పంతా బీజేపీదే అనడానికి వీల్లేదు. ఇందులో ఉద్ధవ్ స్వయంకృతాపరాధమూ ఉంది. కరోనా కాలం, సర్జరీతో బలహీనపడ్డ ఆరోగ్యం – కారణాలు ఏమైనా సొంత ఎమ్మెల్యేలకు సైతం ఉద్ధవ్ అందుబాటులో లేరనేది ప్రధాన ఆరోపణ. చుట్టూ ఉన్న కోటరీ సరేసరి. ఇక, అందరి బలవంతం వల్లే సీఎం అయ్యానంటున్న ఉద్ధవ్ తీరా తన రాజకీయ వారసుడిగా కుమారుడు ఆదిత్యను భుజానికెత్తుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పరిశ్రమించిన శిందే ప్రభృతులకు ఇవన్నీ పుండు మీద కారమయ్యాయి. హిందూత్వ నినాదంతో బీజేపీకి సహజ మిత్రపక్షమైన శివసేన తద్భిన్నంగా, లౌకికవాదాన్ని నెత్తినెత్తుకోవడమూ శివసైనికులకు మింగుడుపడట్లేదు. అన్నిటికీ మించి కేంద్రం చేతిలోని ఈడీ వేధింపుల భయం, గీత దాటి వస్తే ఇస్తామంటున్న భారీ ప్యాకేజీలు తిరుగుబాటుకు దోహదకారిగా ఉండనే ఉన్నాయి. వెరసి, ఈ మొత్తం వ్యవహారంలో శివసేన తన బలాన్నే కాదు... తన పూర్వ ప్రభావాన్నీ పోగొట్టుకుంది. ఒకప్పుడు శివసేనదే రాజ్యమైన మహారాష్ట్రలో గత మూడు దశాబ్దాల్లో బీజేపీ అనూహ్యంగా పెరిగితే, శివసేన ఊపు తగ్గింది. యూపీ తర్వాత మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కమలనాథుల వశమైతే, దేశంలో బీజేపీ సాగిస్తున్న అశ్వమేధంలో మరో కోట కూలిపోయినట్టే! రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పనీ మరింత సులువవుంది. పాత సిద్ధాంతాల కన్నా, నయావాద విస్తరణ కాంక్షతో సాగుతున్న బీజేపీ 2.0కు కావాల్సిందీ ఇదే! ఏమైనా, ప్రజాస్వామ్యం వట్టి అంక గణితంగా మిగిలిపోతే మహారాష్ట్ర లాంటి పరిణామాలు తప్పవు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ – పేర్లు ఏవైనా సరే ప్రతి పార్టీ ఇలాంటి రాజకీయాలే చేస్తుండడం విచారకరం. -
ధైర్యముంటే ఎదురునిల్చి పోరాడండి: సీఎం ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి, ముంబై: ధైర్యముంటే ఎదురుగా నిలిచి పోరాడాలని, మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలోని మంత్రులపై ఈడీ, సీబీఐ, ఐటీ ముసుగులో ఎందుకు దాడి చేస్తున్నారని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా వ్యాఖ్యానించారు. మాటుంగాలోని షణ్ముఖానంద హాలులో శుక్రవారం శివసేన దసరా మేళావ నిర్వహించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏటా శివాజీపార్క్‌లోని మైదానంలో జరిగే దసరా మేళావకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షకుపైగా కార్యకర్తలు తరలి వచ్చేవారు. కానీ ఈ సారి కీలకమైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు సహా సుమారు వేయి మంది సమక్షంలో మేళావా జరిగింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే అనేక అంశాలపై శివసేన కార్యకర్తలకు మార్గదర్శనం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న బీఎంసీ ఎన్నికల ప్రచారానికి ఉద్ధవ్ శంఖం పూరించారు. ఒకేతాటిపైకి రావాలి కుల, మత, మరాఠీ, మరాఠేతర అనే భేదాలను పక్కన బెట్టి హిందులందరూ ఒకతాటిపైకి రావల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. హిందువులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఇలాంటి వారి (పరోక్షంగా బీజేపీని ఉద్ధేశించి)వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ఎన్ని కుయుక్తులు, పన్నాగాలు పన్నినా, తమ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధైర్యముంటే ప్రభుత్వాన్ని కూల్చి చూపించాలని సవాలు విసిరారు. వచ్చే బీఎంసీ ఎన్నికల్లో మరాఠీ, మరాఠేతర విభేదాలు సృష్టించి ప్రజల్లో చీలికలు తెచ్చే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. హరహర మహాదేవ్ నినాదంతో వచ్చే బలమేంటో కేంద్రానికి రుచి చూపించాలన్నారు. హిందుత్వం అనే కార్డును అడ్డుపెట్టుకుని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న వారు ఇప్పుడు అదే కార్డును అడ్డుపెట్టుకుని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే తను రాజకీయాల నుంచి తప్పుకుని ఉండేవాడినని అన్నారు. ఓ శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రి చేయాలని తన తండ్రి, శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే కోరిక అని గుర్తు చేశారు. ఆ మేరకు తన తండ్రికి ఇచి్చన మాటకు కట్టుబడి ఉండేందుకు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని చరెప్పారు. ఇంతటితో తన బాధ్యత పూర్తికాలేదని, భవిష్యత్తులో శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ జోలికి రావద్దు అనేక సంవత్సరాలుగా శివసేన, బీజేపీ కలిసి వివిధ ఎన్నికల్లో పోటీ చేశాయి. కూటమిగా ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఆకస్మాత్తుగా శివసేన అవినీతిగా ఎలా మారిందని నిలదీశారు. తమతో ఉంటే ఒక మాట, విడిపోతే మరో మాట చెప్తూ.. రెండు నాల్కల ధోరణి బీజేపీ అవలంభిస్తోందని దుయ్యబట్టారు. మీ పల్లకిలు మోసేందుకు శివసేన పుట్టలేదు. గడ్డుకాలంలో సైతం బీజేపీకి అండగా నిలిచాం. అప్పుడు తమ పార్టీ అవినీతి పార్టీ అని గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. వెన్నుపోటు పొడవకుండా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే శివసేన పార్టీ ధ్యేయమని మరోసారి గుర్తు చేశారు. అనవసరంగా తమ పార్టీ మంత్రులపై ఈడీ, సీఐడీ, ఐటీ దాడులు చేయించవద్దని, ముఖ్యంగా తమ పార్టీ జోలికి రావద్దని, ఒకవేళ వస్తే కొమ్ములతో పొడుస్తామని హెచ్చరిం చారు. దసరా మేళావకు ఎంపీ సంజయ్ రావుత్, పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఎంపీలు గజానన్ కీర్తికర్, వినాయక్ రావుత్, అనీల్ దేసాయి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. -
రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం
సాక్షి,ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలతో రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడిచేశారు. అలాగే నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బీజేపీ-శివసేన కార్యకర్తల వార్ మరింత ముదురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి నారాయణ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శివసేన కార్యకర్తలు దూకుడుమీద ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు , ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం పూణేలోని ఆర్ డెక్కన్ మాల్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. యువ నేత వరుణ్ దేశాయ్ నాయకత్వంలో, కొంతమంది శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముంబైలోని జుహులోని రాణే బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో, రాణే మద్దతుదారులు ప్రతిఘటించడంతో జుహు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, చిప్లూన్, సాంగ్లీ, ఔరంగాబాద్ లలో శివ సైనికులు రెచ్చిపోయారు. వీరి ఆందోళనలు, ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తత రాజేశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని మరచిపోయారని, అదే తానైతే ఆయనను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినంటూ కేంద్రమంత్రి రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో నాసిక్ పోలీసులు రాణేను అరెస్టు చేయడం, చివరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
‘మేం తిరిగి కొడితే...లేవడం కష్టం: బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్
సాక్షి, ముంబై: శివసేన ప్రధాన కార్యాలయంపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో బీజేపీ, శివసేన మధ్య మరోసారి మాటల యుద్ధం రగులుతోంది. అవసరమైతే శివసేన భవనాన్ని కూల్చి వేస్తామన్న బీజేపీ నేత వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. రెచ్చగొట్టేభాష మాట్లాడితే సహించమని, అలాంటి వారికి తగిన సమాధానం చెబుతామంటూ ఘాటుగా స్పందించారు. ఆదివారం పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ థాకరే తమది మూడు పార్టీల మహా వికాస్ అఘాది "ట్రిపుల్ సీట్" ప్రభుత్వంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందీ బ్లాక్‌బస్టర్ "దబాంగ్" లోని "థప్పడ్ సే డర్ నహీ లగ్తా (చెంపదెబ్బకు భయపడేది లే)" అనే ఫ్యామస్ డైలాగ్‌ను గుర్తుచేస్తూ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. చెప్పుతో కొట్టే భాష మాట్లాడేవారు. అంతకంటే గట్టిగా తామిచ్చే కౌంటర్‌కి మళ్లీ తిరిగి లేవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ముంబైలోని శివసేన భవన్‌ను కూల్చివేస్తామని బీజేపీ నాయకుడు ప్రసాద్ లాడ్ వ్యాఖ్యానించారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల తనకు అత్యంత గౌరవమనీ, సేన భవన్‌ను పవిత్ర నివాసంగా భావిస్తానంటూ చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ విచారం చేసిన ఆయన ఈ మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.మరోవైపు బీజేపీ వ్యాఖ్యలపై స్పందిచిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శివసేన భవన్ పై దాడి గురించి బీజేపీ ఎప్పుడూ ఆలోచించదనీ, బీజేపీ వ్యతిరేక శక్తులు మాట్లాడుతున్నాయన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి వీరి వల్ల నష్టమని, ప్రసాద్ క్షమాపణను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీల నేతల మధ్య తాజాగా మాటల తూటాలు పేలుతున్నాయి. మత్తుమందులకు బానిసలైన రాజకీయనేతలను మరాఠీలు సహించరనీ, తక్షణమే రాష్ట్రంలో డ్రగ్ డీ ఎడిక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని సేన నేత రౌత్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు కూడా భారీగానే తిప్పికొట్టారు. "నువ్వు చెప్పింది నిజమే రౌత్ సాహెబ్. మహారాష్ట్ర డ్రగ్స్ రహితంగా ఉండాలి. ఈ కార్యక్రమం కళానగర్ నుంచే ప్రారంభించాలి" అంటూ కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ట్వీట్ చేశారు. ఠాక్రే నివాసం ముంబై బాంద్రాలోని కళానగర్ ప్రాంతంలో ఉండటంతో సీఎంను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. BJP can never think of attacking Shiv Sena Bhavan. These people are not from BJP. There are some outsiders, some export-import material. These people will take down BJP in Maharashtra. We don't accept this apology: Sanjay Raut on BJP leader Prasad Lad's Shiv Sena Bhavan remark pic.twitter.com/Vlm0FwIO5V — ANI (@ANI) August 2, 2021 नशामुक्त महाराष्ट्र बरोबर "महिलांसाठी सुरक्षित महाराष्ट्र" हाही कार्यक्रम तातडीने घेतला पाहिजे.. जेणेकरून डॉ. स्वप्ना पाटकर सारख्या महिलांना न्याय भेटेल! बरोबर ना राऊत साहेब? @rautsanjay61 — nitesh rane (@NiteshNRane) August 1, 2021 -
ఠాక్రే, మోదీ భేటీ.. ‘రాజకీయాలు వేరుగా ఉంటాయి’
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు మంచి అనుబంధమే ఉందని, కానీ అది రాజకీయంగా కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. జూన్ 8న ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ త్వరలోనే రాజకీయంగా కూడా ఒకటవుతారనే వార్తలు వినిపించాయి. ఈ సమావేశంపై కొందరు విమర్శలు కూడా చేశారు. మహారాష్ట్ర పాలక శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) -కాంగ్రెస్ కూటమి ఇబ్బందుల్లో ఉందని, శివసేన బీజేపీతో జట్టు కట్టనుందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘జూన్ 8న మోదీని ఉద్ధవ్ కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు వారి మధ్య చర్చ కొనసాగింది. వెంటనే అనేక ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. శివసేనతో బీజేపీ మరోసారి చెతులు కలుపుతుందనే వార్తలు గుప్పుమన్నాయి. మా మార్గాలు వేరు కావచ్చు కానీ మా మధ్య గట్టి అనుబంధమే ఉంది. ఠాక్రే కుటుంబానికి, నరేంద్ర మోదీకి మధ్య చాలా సంవత్సరాలు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు వేరుగా ఉంటాయి’ అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఇక శరద్ పవార్ గురించి స్పందిస్తూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తాము ఎల్లప్పుడూ పవార్ కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాము. అందరితో మమేకమై జీవించడం మహారాష్ట్ర సంస్కృతి అని సంజయ్ రౌత్ అన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ల కోటా విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరినట్టు ఆయన తెలిపారు. చదవండి: జాబ్ నిలవాలంటే టెన్త్ పాసవ్వాలన్నారు, ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో -
Sivasena: శభాష్ చౌహన్‌జీ.. దేశానికి మార్గం చూపారు
ముంబై: ప్రస్తుత కరోనా సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్ర సేవలను ప్రశంసించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు అభినందనలు తెలిపింది. ఒక బీజేపీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్న చిన్నారులకు ఉచిత విద్యతో పాటు నెలకు పింఛన్ రూపేణ రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై తాజాగా శివసేన స్పందించింది. ఆ పార్టీ గొంతుకగా భావించే ‘సామ్నా’ పత్రికలో మధ్యప్రదేశ్‌ప్రభుత్వ చర్యలను కొనియాడుతూ సంపాదకీయం ప్రచురించింది. ఈ పిల్లల బాధ్యత చూసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలపడం అభినందనీయమని శివసేన కొనియాడింది. ఉచిత విద్యతో పాటు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామనడంపై అభినందించింది. (‘సామ్నా’ సంపాదకీయం చదవండి) ‘కరోనాతో దేశం వెనకబడుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందిస్తామని ప్రకటించడంపై అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇది మానవత్వంలో గొప్ప అడుగు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశానికి ఒక సందేశం అందిస్తున్నారు’ అని సంపాదకీయంలో శివసేన పేర్కొంది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి మధ్యప్రదేశ్‌ప్రభుత్వం ఒక మార్గం చూపిందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కీర్తిస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా’ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ.25,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అవనసరంగా శివసేన ‘సామ్నా’లో స్పష్టం చేసింది. -
మోదీ వద్దకు సరిహద్దు వివాదం
సాక్షి, ముంబై: రోజురోజుకు ముదురుతున్న మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదంపై చర్చించేందుకు శివసేన త్వరలో ప్రధాని నరేంద్రమోదీ నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సాయంతో నరేంద్రమోదీతో భేటీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు శివసేన ఎంపీ వినాయక్ రావుతే స్పష్టంచేశారు. స్వాతంత్య్రం, ఆ తరువాత ప్రత్యేక మహారాష్ట్ర ఏర్పడిన తరువాత మొదలైన మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఇటీవల కాలంలో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకునే వరకు దారితీసింది. మూడు రోజుల కిందట కర్నాటకకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం తమదేనని, కర్నాటకలో భాగమని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా మారాయి. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని మోదీతో శివసేన ఎంపీలు భేటీ కానున్నారు. వీరితోపాటు శరద్ పవార్ కూడా భేటీ అవుతారు. అంతకుముందు సరిహద్దు వివాదం అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు శివసేన ఎంపీలందరూ శరద్ పవార్‌తో భేటీ అవుతారు. ఈ భేటీలోనే ప్ర«ధాని మోదీతో భేటీ అయ్యేందుకు శరద్ పవార్ మధ్యవర్తిగా వ్యవహరించాలని శివసేన ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నారు. ఒకవేళ ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ లభిస్తే శరద్ పవార్‌తో కలిసి శివసేన ఎంపీలందరు మోదీతో చర్చించనున్నట్లు రావుతే తెలిపారు. -
అర్నాబ్ వివాదం : ‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింత ముదురుతోంది. శివసేన, బీజేపీ మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అర్నాబ్ అరెస్టును "బ్లాక్ డే" గా అభివర్ణించిన బీజేపీ నేతలపై శివసేన మండిపడింది. బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్ననేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కౌంటర్ ఎటాక్ చేసింది. ముఖ్యంగా "పత్రికా స్వేచ్ఛపై దాడి, "అత్యవసర పరిస్థితులు" అంటున్న పలువురు కేంద్రమంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, హత్యలను ప్రస్తావించింది. (మంత్రగత్తె వేట : అర్నాబ్ న్యాయ పోరాటం) మహారాష్ట్ర ప్రభుత్వంలో మీడియాపై దాడి అనే ప్రశ్నే లేదని, ఇలా అరోపిస్తున్నా వారే ప్రజాస్వామ్యం మొదటి స్థంభమైన శాసనసభను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడింది. గోస్వామిని రక్షించడానికే గత రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఆత్మహత్య కేసును కప్పిపుచ్చిందని సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్లో ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు, యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమాయక వ్యక్తి తన వృద్ధాప్య తల్లితో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య న్యాయం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు బాధిత నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని సూచించింది. అలాగే ప్రధానమంత్రితో సహా అందరూ చట్టం ముందు సమానమేనని సంపాదకీయం వ్యాఖ్యానించింది -
కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ
ముంబై: బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. 'నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ మరోసారి ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్నినా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. ‘ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, నా వరకు ఇది రామ మందిర్. గుర్తుంచుకోండి బాబర్, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు. కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారు. నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. Babur and his army 🙂#deathofdemocracy pic.twitter.com/L5wiUoNqhl — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 దీనిపై బీఎంసీ మేయర్ కిషోర్ పెడ్నేకర్ మాట్లాడుతూ, ‘ కంగనా తనకు నచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె తన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఈ పని చేసిది శివసేన పార్టీ కాదు, బీఎంసీ. ఫిర్యాదు అందిన తరువాత మేం భవానాన్ని కూల్చివేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై కంగనా తరుపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది. मणिकर्णिका फ़िल्म्ज़ में पहली फ़िल्म अयोध्या की घोषणा हुई, यह मेरे लिए एक इमारत नहीं राम मंदिर ही है, आज वहाँ बाबर आया है, आज इतिहास फिर खुद को दोहराएगा राम मंदिर फिर टूटेगा मगर याद रख बाबर यह मंदिर फिर बनेगा यह मंदिर फिर बनेगा, जय श्री राम , जय श्री राम , जय श्री राम 🙏 pic.twitter.com/KvY9T0Nkvi — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
షార్జీల్ ఇమామ్ అరెస్ట్: శివసేన మద్దతు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని( సీఏఏ)కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేఎన్‌యూ పీఎచ్డీ విద్యార్ధి షార్జిల్ ఇమామ్‌ను అరెస్ట్ చేయటాన్ని శివసేన సమర్ధించింది. అతన్ని అదుపులోకి తీసుకోవటంపై కేంద్రానికి శివసేన పార్టీ తన మద్దతును తెలిపింది. ఈ విషయాన్ని శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో గురువారం ప్రచురించింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారితో రాజకీయం చేయకుడదని.. అలాంటి వారిని ఏరివేయాలని కేంద్ర హోంమత్రిత్వ శాఖకు శివసేన సలహా ఇచ్చినట్లు పేర్కొంది. ప్రజల్లో విద్వేషభావాలను రెచ్చగొట్టే షార్జిల్ ఇమామ్ వంటి చీడ పురుగులను ప్రజల్లో తిరగనివ్వకూడదని సామ్నా సంపాదకీయం పేర్కొంది. (ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది) కొంతమంది విద్యావంతులు రాజకీయ విషం పులుముకొని.. ఉగ్రవాద చర్యలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని సామ్నా మండిపడింది. కాగా మంగళవారం షార్జిల్ ఇమామ్ని బీహార్‌లోని జెన్హనాబాద్లో పోలీసులు ఆరెస్టు చేశారు. ఇటీవలె సీఏఏకు వ్యతిరేకంగా చేట్టిన నిరసనల్లో పాల్గొన్న షార్జిల్.. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
అందుకే ఆ బిల్లుకు మద్దతు: శివసేన
ముంబై: పౌరసత్వ సవరణ బిల్లుపై శివసేన పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది. అయితే సోమవారం బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు అనూహ్యంగా శివసేన మద్దతు పలికింది. ఈ బిల్లు ద్వారా హిందువులు, ముస్లిముల మధ్య ‘అదృశ్య విభజన’ సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సోమవారం శివసేన తన అధికారపత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించిన విషయం తెలిసిందే. కానీ అదే రోజు శివసేన పార్టీ పౌరసత్వ బిల్లుపై యూటర్న్ తీసుకుంది. ఈ విషయంపై స్పందించిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్.. దేశ ప్రయోజనాల కోసం ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు ‘కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)’ అనేది కేవలం మహారాష్ట్ర రాజకీయాల వరకే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సిద్ధాంత పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి.. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం’ ఏర్పటు చేసిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం తమ పార్టీ ఎంపీకి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి పదవి కూడా వదులుకుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలో మత యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన పార్టీకి.. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శివసేన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వటం వల్ల మహారాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందన్న మీడియ ప్రశ్నకు.. ‘అది శివసేన పార్టీనే అడగాలి’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. -
మహా ఉత్కంఠ..వీడని సస్పెన్స్
-
బీజేపీపై శివసేన విమర్శలు
-
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం
-
పొత్తు కుదురుతుందా..? వికటిస్తుందా..?
సాక్షి, ముంబై: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా ముంబై రద్దయింది. బీజేపీ–శివసేన పొత్తుపై ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడనుందనే నేపథ్యంలో ఆయన గురువారం ముంబైలో పర్యటించాల్సి ఉంది. అయితే అమిత్ షా పర్యటన అనూహ్యంగా వాయిదా పడింది. దీనిపై భారతీయ జనతా పార్టీ నిన్న రాత్రి ఓ ప్రకటన చేసింది. అయితే ఆయన పర్యటన ఎప్పుడు ఉంటదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 21న జరగనున్నాయి. బీజేపీ–శివసేన కాషాయ కూటమి పొత్తుపై గత కొద్ది రోజులుగా ఇరు పారీ్టల నాయకులు తమకు తోచిన విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పొత్తు కుదురుతుందా..? వికటిస్తుందా..? అనే దానిపై ఇరుపారీ్టల నాయకులు సందిగ్ధంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రద్దుతో పొత్తుపై అధికారికంగా ప్రకటన మరికాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నా.. ప్రతిపక్షాలు, గిట్టని పార్టీ నాయకులు ఇలా ఎవరేమనుకున్న బీజేపీ–శివసేన మధ్య కచి్చతంగా పొత్తు కుదురుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం విలేకరుల సమావేశంలో స్పష్టమైన సంకేతాలిచ్చారు. పొత్తుపై తను కూడా ఆందోళన చెందుతున్నానని అన్నారు. దీంతో పొత్తు, సీట్ల పంపకం అంశాన్ని ఎక్కువ రోజులు నాన్చకుండా సాధ్యమైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫడ్నవీస్ చెప్పారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్-శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగింది. కాని పొత్తుపై ఇంతవరకు ఒక స్పష్టత రాకపోవడంతో ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఫడ్నవీస్ పొత్తు, సీట్ల పంపకంపై వివరాలు వెల్లడిస్తుండవచ్చని విలేకరులు భావించారు. కాని వారి అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులపై వివరాలు వెల్లడించి విలేకరుల సమావేశాన్ని ముగించారు. ఇరు పారీ్టల మధ్య పొత్తుపై మీరెంత ఆందోళన చెందుతున్నారో... నేను కూడా అంతే ఆందోళన చెందుతున్నానని అన్నారు. కానీ, సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. -
మరోసారి వాయిదా!
సాక్షి, ముంబై : రాష్ట్ర మంత్రిమండలి విస్తరణకు తేదీ ఖరారైనట్లు తెలుస్తున్నా.. అది మరోమారు వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు ముందుగా జూన్ 14వ తేదీన మంత్రి మండలిని విస్తరించనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే శివసేన, బీజేపీల మధ్య మంత్రి పదవుల కేటాయింపులపై విభేదాలు ఏర్పడటంతో మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ–సేనల మధ్య విభేదాలతో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రిమండలిని విస్తరించడంతో పాటు అసెంబ్లీలో మంచి ఫలితాలు సాధించేందుకు పలువురు కొత్త ముఖాలతోపాటు బీజేపీలోకి చేరిన, చేరేందుకు సిద్ధంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. అయితే మంత్రి మండలిలో పదవుల కేటాయింపుపై శివసేన, బీజేపీ నేతలలో విభేదాలు కన్పిస్తున్నాయి. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి? కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్ మంత్రి పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టనున్న మంత్రి మండలి విస్తరణలో శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే శివసేన మాత్రం డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ అంశంపై చర్చలు జరిపారు. అనంతరం వర్షకాలం సమావేశాలు (బడ్జెట్ సమావేశాలు) ప్రారంభానికి ముందే మంత్రి మండలిని విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే మంత్రిమండలి విస్తరణలో శివసేనకు లభించే మంత్రి పదవులపై కొంత అసంతృప్తి ఏర్పడిందని దీంతో ఈ మంత్రిమండలి విస్తరణ జాప్యమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిని శివసేనకు కేటాయించాలని బీజేపీ భావిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఏక్నాథ్ శిందే, సుభాశ్ దేశాయి పేర్లు విన్పిస్తున్నాయి. అయితే ఉప ముఖ్యమంత్రులకు బదులుగా మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని శివసేన కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. దీనిపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని శివసేన పార్టీ నేతలు చెబుతున్నారు. -
కశ్మీర్, మోదీ విదేశీ టూర్లపై థాకరే సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్‌పై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి ధ్వజమెత్తారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందటూ తీవ్ర విమర్శలకు దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తప్పుడు వాగ్దానాలు చేసిందని దుయ్యబట్టారు. గురుగావ్‌లో శివసేన 52వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన థాకరే మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ టూర్లపై కూడా థాకరే సెటైర్లు వేశారు. త్వరలోనే ప్రధాని ఇతర గ్రహాల పర్యటనకు కూడా వెళ్లనున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జమ్మూ కశ్మీర్లో పీడీపీ ప్రభత్వానికి మద్దతు ఉపసంహరణపై థాకరే విమర్శలు గుప్పించారు. 600 మంది జవాన్లు ప్రాణత్యాగం, మూడు సంవత్సరాల సమయం గడిచిన తరువాత గానీ అక్కడి ప్రభుత్వం వేస్ట్ అని అర్థం కాలేదా అంటూ మండిపడ్డారు. పీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు. మరిక పాకిస్థాన్‌పై కూడా ఒత్తిడి తీసుకురండి..అప్పుడు బీజేపీని స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేనపుడు, రంజాన్ రోజు కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించిందని ఆయన ప్రశ్నించారు. గణపతి పండుగ లేదా దసరా సమయంలో పాకిస్తాన్ ఇదే విధానాన్ని అనుసరిస్తుందా అంటూ రంజాన్ మాసంలో కశ్మీర్లో కాల్పుల విరమణ నిర్ణయాన్ని థాకరే తప్పు బట్టారు. -
పవర్ పాలిటిక్స్
-
బీజేపీతో తెగదెంపులకు శివసేన తీర్మానం
-
బడ్జెట్‌పై శివసేన స్పందన
ముంబై: 2017-18 ఆర్థిక బడ్జెట్ పై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ పై స్పందించిన బీజేపీ సోదర సంస్థ శివసేన అధినేత ఉధ్దవ్ థాకరే మరోసారి మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ ఆర్థిక బడ్జెట్ లో ప్రజల ఆకాంక్షలను కేంద్రం అందుకోలేకపోయిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు అచ్ఛే దిన్ తీసుకొస్తామని వాగ్దానం చేశారని.. కానీ. ఎక్కడ ఆ అచ్ఛే దిన్ అని థాకరే ప్రశ్నించారు. చ్ఛే దిన్ గురించి ప్రభుత్వం ఇపుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలకు అనేక కష్టాలనెదుర్కొన్నారని థాకరే మండిపడ్డారు. డీమానిటైజేషన్ తరువాత ఉగ్రదాడులు తగ్గుముఖం పడతాయని కేంద్రం చెప్పిందనీ, అయితే టెర్రరిస్టుల దాడులు తగ్గకపోగా ..మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రి మనోహరి పారికర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించిన థాకరే వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలన్నారు. ఏ రుజువు లేకుండా ఎవరూ అలాంటి విషయాలను చెప్పరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. -
బీజేపీకి షాకిచ్చిన శివసేన
-
మహారాష్ట్రలో కాంగ్రెస్-3, శివసేన-2
ముంబయి : మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ముంబై, అహ్మద్‌నగర్, ధూలే-నందర్బార్, అకోలా-వాషిమ్ -బుల్ధానా, సోలాపూర్, కొల్హాపూర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. శివసేన రెండు, బీజేపీ, ఎన్సీపీ చెరోసీటు కైవసం చేసుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. ముంబైలో శివసేన, కాంగ్రెస్ చెరో సీటును గెలుచుకున్నాయి. ధూలే, కొల్హాపూర్లలోనూ కాంగ్రెస్ విజయ బావుటా ఎగిరేసింది. కాగా కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు చూపింది. మొత్తం 25 స్థానాల్లో సగానికి పైగా సీట్లు గెలిచింది. -
టీఆర్ఎస్కు శివసేన లక్షణాలు
ఓవైపు ప్రజలు చనిపోతుంటే యాగాలా: ప్రొ. కంచె ఐలయ్య సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు పూర్తిగా శివసేన పార్టీ లక్షణాలున్నాయని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తెలంగాణ శివసేన అని గతంలోనే తాను రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవైపు ప్రజలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ ఆయత మహా చండీయాగాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. 16వ శతాబ్దంలో రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించగా.. 21వ శతాబ్దంలో సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూడలిజం బురదలో పడిందని, దాన్నుంచి బయటకు తీసుకురావాలన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఐలయ్య రచించిన ‘ఫ్యూడలిజం మల్లొచ్చింది’ వ్యాస సంపుటిని దళిత విద్యార్థిని కుమారి కన్నం ప్రజ్వలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ‘‘సర్దార్ వల్లభాయ్‌పటేల్ తొలి ప్రధాని అయితే దేశం ఇలా ఉండేది కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. కానీ పటేల్ ఆ పదవిలో ఉండి ఉంటే అంబేడ్కర్‌ను రాజ్యాంగాన్ని రాయనిచ్చే వారు కాదు. బీజేపీ సంపుడు పార్టీ’’ అని అన్నారు. రకరకాల ముసుగులు వేసుకుని పాలకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని దుర్మార్గంగా అణిచివే స్తున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. -
బాలీవుడ్ వర్సెస్ శివసేన
ముంబై: పాకిస్తానీ నటులు, కళాకారులు, క్రీడాకారుల పట్ల శివసేన వైఖరిపై బాలీవుడ్ మండిపడుతోంది. సంస్కృతీ, సంప్రదాయాలను రాజకీయాల నుంచి వేరుచేసి చూడాలని సూచిస్తోంది. ముంబైలో 'ద బ్యూటీ అండ్ ద బీస్ట్' పేరుతో నిర్వహిస్తున్న ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కళాకారులకు హద్దులు నిర్ణయించడం సరైనది కాదన్నారు. కళలకు ఎల్లలు ఉండవంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలీ కచేరీని అడ్డుకున్న శివసేన వైఖరిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్శకులు కబీర్ ఖాన్, ఓమంగ్ కుమార్, మోహిత్ సూరి, నటుడు ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ సోహా అలీ ఖాన్, నటి నిమ్రాత కౌర్, రచయిత, గాయకుడు స్వానంద్ కిర్ కిరే తదితరలు శివసేన వైఖరిని ఖండించారు. ఇలాంటి హెచ్చరికల వల్ల బాలీవుడ్ కు జరిగే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిషేధాలు విధించడం విచారకరమని, ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఖండిచాలని అన్నారు. నైపుణ్యం కలిగిన కళాకారులకు ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తన కళను ప్రదర్శించుకునే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రఖ్యాత సంగీతకారుడు, 8 సార్లు ఆస్కార ఆవార్డు విజేత అలెన్ మెంకెన్ తొలిసారిగా ఇండియాలో 'బ్యూటీ అండ్ బీస్ట్' పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ముంబై, ఢిల్లీ నగరాలలో సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
ఆత్మాభిమానం లేని పార్టీ
శివసేనపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర విమర్శలు ♦ బాల్ ఠాక్రే హయాంలోని సేన, ప్రస్తుత సేనకు పొంతనే లేదు ♦ షా వ్యాఖ్యలపై స్పందించలేని స్థితిలో ఆ పార్టీ ♦ ఆత్మాభిమానం ఉంటే మద్దతు ఉపసంహరించుకోవాలని వ్యాఖ్య ♦ ప్రభుత్వానికి అదే ఆఖరిరోజు: అజిత్ పవార్ సాక్షి, ముంబై : బాలా సాహేబ్ ఉన్న సమయంలో శివసేనకు ఆత్మగౌరవం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో శివసేనను ప్రభుత్వంలోకి తీసుకోవాల్సి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగంగా విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ సేనలో ఎలాంటి హావభావాలు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. సేన మారిపోయిందని, బాల్ ఠాక్రే హయాంలోని సేనకూ ప్రస్తుత సేనకూ చాలా మార్పు ఉందని విమర్శించారు. కొంకణ్ పర్యటనలో ఉన్న పవార్ సింధుదుర్గ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సేనకు ఆత్మాభిమానం ఉన్నట్లయితే.. లేదా ఉన్నట్లు గుర్తొస్తే సేన బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంటుందని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. పవార్ వ్యాఖ్యలపై సేన నేత ఒకరు మాట్లాడుతూ.. ఆత్మ గౌరవం గురించి సేనకు పవార్ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. విదేశీ మూలాలున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో విభేదించిన పవార్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిశారని గుర్తు చేశారు. పుణేలో అల్లర్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణం : అజిత్ పవార్ ఓ వైపు శరద్ పవార్ సేనకు ఆత్మాభిమానం లేదని విమర్శిస్తుంటే మరోవైపు అజిత్ పవార్ తనదైన శైలిలో సేనపై విరుచుకుపడ్డారు. బీజేపీకి సేన మద్దతు ఉపసంహరించుకున్న రోజే ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఆఖరి రోజవుతుందని ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ పేర్కొన్నారు. శాంతికి నిలయమైన పుణే నగరంలో అల్లర్లు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. వర్షకాల సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి జాతీయ సమస్యలను పక్కనబెట్టి స్థానిక పౌర సమస్యలపై దృష్టి సారించాలని శివసేనకు బీజేపీ హితవు పలికింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య భేటీ దురదృష్టకరమని శివసేన వ్యాఖ్యానించడంపై ముంబై బీజేపీ నేత అశిష్ షేలర్ స్పందిస్తూ.. మోదీ, నవాజ్ షరీఫ్‌తో ఎందుకు భేటీ అయ్యారో తెలుసుకోవాలని సూచించారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చించేందుకు ఆయన భేటీ అయ్యారని తెలిపారు. 26/11 ముంబై దాడుల కేసు పాకిస్తాన్‌లోని ఓ కోర్టులో విచారణ జరుగుతోందని, త్వరితగతిన కేసును పూర్తి చేయాలని మోదీ పాకిస్తాన్‌ని కోరారని చెప్పారు. దేశానికి చెందిన జాలర్లు కొంతమంది పాకిస్తాన్ జైళ్లల్లో ఉన్నారని, వారి విడుదలపై కూడా సమావేశంలో చర్చించారని షేలర్ పేర్కొన్నారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఎలా ఉన్నాయో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో మోదీ భేటీ దురదృష్టకరమని, సరిహద్దుల్లో పరిస్థితి ఇంకా మారలేదని, దీనిపై పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ముంబై డ్రైనేజీ గురించి మాట్లాడరేం.. కాగా, సేనపై షేలర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇటీవల ముంబైలో వరదలు వచ్చాయని, జాతీయ సమస్యలను ఇంతగా పట్టించుకుంటున్న సేన.. ముంబైలో డ్రైనేజీ వ్యవస్థను సరిగా పట్టించుకోని, శుభ్రం చేయించని ఎంసీజీఎం కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ముంబైలో ఉధృతమవుతున్న మెదడువాపు కేసుల విషయంలో కూడా సేన దృష్టిపెట్టాలని చెప్పారు. -
'మహారాష్ట్ర కంటే మంగోలియా లక్కీ'
ముంబై: మంగోలియాకు వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన విమర్శలు సంధించింది. అంతటి అత్యుత్సాహాన్ని అప్పుల భారంతో కుంగిపోతున్న మహారాష్ట్ర రైతులకు ఆదుకోవడానికి ఎందుకు చూపించలేదని బుధవారం తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మండిపడింది. అంతపెద్ద మొత్తాన్ని అందుకోనున్న మంగోలియా మహారాష్ట్ర కంటే అదృష్టవంతురాలు అని ఎద్దేవా చేసింది. ‘ఇది చిన్న మొత్తం కాదు. దీంతో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్ర రైతుల ఆత్మలు మరింత బాధపడతాయి. రూపాయి మారకం ధర ఘోరంగా పడిపోతోంటే అంత భారీ మొత్తాన్ని ఇవ్వాల్సిన అవసరమేముంది?’ అని ప్రశ్నించింది. కాగా, శివసేన విమర్శలతో ఏకీభవిస్తున్నాని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. -
కలహాల కాపురం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షాలైన శివసేన, బీజేపీలు అధికారంలో ఉన్నా పలు అంశాల్లో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయి. గల్లి నుంచి ఢిల్లీ దాకా అనేక అంశాలు వీరి మధ్యదూరాన్ని పెంచుతున్నాయి. 15 ఏళ్ల పొత్తుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో మంగళం పాడాయి. విడిపోయి పోటీ చేసినా... తరువాత కలసి అధికారాన్ని చేపట్టాయి. అయితే శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. చాలా విషయాలపై అసంతృప్తి వ్యక్త చేస్తోంది. ముంబై కార్పొరేషన్లో కూడా వీరి కూటమి కొనసాగుతోంది. అక్కడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజా బడ్జెట్, పార్లమెంట్ సమావేశాల్లోనూ బీజేపీ వ్యతిరేకంగా పలు అంశాలను శివసేన లేవనెత్తుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను ఒప్పుకునేది లేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతామని కుండ బద్ధలు కొట్టారు. ముంబైలో చేపట్టాలనుకుంటున్న మెట్రో-3 ప్రాజెక్టు, పార్లమెంటులో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో మరిన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సేనను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం.... శివసేన వైఖరిపై బీజేపీలో నిరసన వెల్లువెత్తుతున్నా ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ముఖ్యంగా భూ సేకరణ బిల్లు అంశంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడినిట్లు సమాచారం. అధికారికంగా వివరాలు తెలియరానప్పటికీ బిల్లుకు మద్దతు పలకాలని ఉద్ధవ్‌ను వెంకయ్య కోరినట్టు తెలిసింది. ఈ విషయంపై ఢిల్లీలో కూడా శివసేన ఎంపీలందరూ మంగళవారం సమావేశం నిర్వహించారు. భూ సేకరణ అంశంపై ఎలా వ్యవహరించాలనే విషయంపై చర్చలు జరిపారు. సరైన సమయంలో భూ సేకరణ బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. -
ఉత్తమ మంత్రిగా పంకజా ముండే
►రెండో స్థానంలో ముఖ్యమంత్రి ►మరాఠీ చానెల్ సర్వేలో ప్రజాభిప్రాయం సాక్షి, ముంబై : బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉత్తమ మంత్రిగా పంకజా ముండే ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా రాష్ట్రాధినేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోగా, తృతీయ స్థానంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ శిందే నిలిచారు. బీజేపీ, శివసేనల ప్రభుత్వం శనివారంతో వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ మరాఠీ న్యూస్ చానెల్ మంత్రుల పనితీరుపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. దాదాపు లక్ష మంది పాల్గొన్న ఈ సర్వేలో అత్యధిక ఓట్లతో పంకజా ముండే అందరికంటే ముందు నిలిచారు. మంత్రిగా ఆమె పనితీరు బాగుందంటూ 11,760 మంది ఓటు వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మెచ్చకుంటూ 9,545 మంది ఓటేశారు. మరోవైపు ఏక్నాథ్ శిందే పనితీరుబాగుందని 8,093 మంది ఓటేశారు. ఇక అత్యల్పంగా కేవలం 3,267 ఓట్లతో చంద్రశేఖర్ బావన్కులే చివరి స్థానంలో నిలిచారు. మిగిలిన మంత్రుల్లో వినోద్ తావ్డే (7,411) నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా సుభాష్ దేశాయి (6,726), రామ్‌దాస్ కదం (6,694), దివాకర్ రావుతే (6,024), దీపక్ సావంత్ (5,473), సుధీర్ మునగంటివార్ (5,466), ఏక్నాథ్ ఖడ్సే (5,320), చంద్రకాంత్ పాటిల్ (5,186), గిరీష్ మహాజన్ (4,930), గిరీష్ బాపట్ 860)లున్నారు. -
బీజేపీలో చేరట్లేదు.. ప్రతిపక్షంలోనే..!
-
శివసేనకు షాకిచ్చిన సురేష్ ప్రభు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా
సన్మానసభలో శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే పేర్కొన్నారు. తన విజయానికి సహకరించిన తెలుగువారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భివండీ (తూర్పు) నియోజకవర్గం నుంచి గెలుపొందిన రూపేష్ మాత్రేని అఖిల పద్మశాలి సమాజ్ సంస్థ మంగళవారం ఉదయం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రూపేష్ మాత్రే మాట్లాడుతూ సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడాన్నే విజయంగా భావిస్తానన్నారు. తెలుగువారికి తోడుంటా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తెలుగు సమాజ ప్రజల కృషి ఉందన్నారు. వారికి అన్నివేళలా తోడుంటానన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానన్నారు. అఖిల పద్మశాలి సమాజానికి కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పద్మనగర్ ప్రాంతంలో త్వరలోనే జన సంపర్క్ కార్యాలయాన్ని ప్రారంభిస్తానన్నారు. కాగా రూపేష్‌ని సన్మానించిన వారిలో అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్, కార్యదర్శి వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, మాజీ నగరాధ్యక్షుడు ఎస్. మల్లేశం, సంకు శశిధర్, కొండి మల్లేశం, భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కు చెందిన కొంతమంది పదాదికారులతో పాటు వివిధ తెలుగు సంఘాల పదాధికారులున్నారు. -
వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు!
-
బీజేపీ చూపు ఎటువైపు?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా బీజీపీ అవతరించినా సర్కారు ఏర్పాటుకు సరిపడా సీట్లు రాకపోవడంతో ఆ పార్టీ ఇతర పార్టీల మద్దతుతీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. నిన్నటివరకు బద్ధశత్రువులుగా వ్యవహరించిన పార్టీలు ఒక్కసారిగా తమ గొంతును సవరించుకుంటున్నాయి. మహారాష్ర్ట అభివృద్ధి కోసం బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తామని ఎన్సీపీ స్వచ్ఛందంగా ప్రకటించినా.. ఆ పార్టీ మద్దతు తీసుకునే విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అలాగే శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని బీజేపీపై మరోవైపునుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆర్ఎస్ఎస్ సైతం రంగంలోకి దిగడంతో ఇప్పుడు రాజకీయం మంచి రసకందాయంలో పడింది. శివసేనతోనే కాపురం...? రాష్ట్రంలో మళ్లీ బీజేపీ, శివసేనలు ఒక్కటవుతాయని అంచనాలు మొదలయ్యాయి. ప్రజలు కూడా అదే విధంగా తీర్పునిచ్చారని, దాన్ని గౌరవించి రెండు పార్టీలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం కొంత మేర ఇరు పార్టీల నాయకుల వైఖరిలో మార్పు కన్పిస్తోంది. ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న రెండు పార్టీల నాయకులూ ఇప్పుడు పరిస్థితులకనుగుణంగా ఆచితూచి వ్యాఖ్యలు చేస్తున్నారు. శివసేన సీనియర్ నాయకులైన మనోహర్ జోషీ, దేశాయ్ తదితరులు మాట్లాడుతూ మద్దతు విషయమై బీజేపీ నుంచి ప్రస్తావన వచ్చిన అనంతరం ఆలోచిస్తామని, అయితే తుది నిర్ణయం మాత్రం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తీసుకుంటారని చెబుతున్నారు. ఇలా ఒకరకంగా బీజేపీతో జతకట్టేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. మరోవైపు బీజేపీ కూడా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెబుతూనే పాతికేళ్లమిత్రులైన శివసేనతోనే జతకట్టేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం పార్టీ పార్లమెంటరి బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరోవైపు ఎన్సీపీ మద్దతు ప్రకటించడం విశేషం. అయితే ఎన్నికల సమయంలో ఎన్సీపీ నాయకులతోపాటు పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు తీసుకునే విషయంపై ఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, బీజేపీ అగ్రనాయకులైన నరేంద్ర మోదీ,అమిత్ షాలకు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడంతో ఈ రెండుపార్టీల మధ్య మైత్రి తిరిగి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్సీపీ కోటలో బీజేపీ హవా పుణే సిటీ, న్యూస్‌లైన్ : పుణేలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎప్పుడు లేని విధంగా మోది ప్రభావంతో అభ్యర్థులు అవలీలగా విజయం సాధించారు. నగరంలోని 8 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా అన్నిచోట్ల బీజేపీ విజయం సాధించడం గమనార్హం. మాజీ (సహాయక) గృహ మంత్రి రమేష్ భాగ్వే, వినాయక విమ్హాన్, బాపు పఠారే వంటి ఎన్సీపీ నాయకులు ఓడిపోయారు. ఎన్సీపీ పురుడు పోసుకున్న పుణే జిల్లాలో ఇంత ఘోరంగా ఓడిపోవడం పార్టీ కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లా మొత్తంలో 21 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మూడు చోట్ల మాత్రమే ఎన్సీపీ తన ఉనికిని చాటుకుంది. శివ్‌సేన మూడుచోట్ల, కాంగ్రెస్ ఒక్క చోట, ఎమ్మెన్నెస్ జున్నార్‌లో ఖాతా తెరవగా, దౌన్లో రాష్ట్రీయ సమాజ్ పక్ష విజయం సాధించింది. అదేవిధంగా బోసిరిలో స్వతంత్య్ర అభ్యర్థి మహేష్ లాండ్గే విజయం సాధించగా, భారతీయ జనతాపార్టీ 11 చోట్ల విజయం సాధించి తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉండే పుణే కంటోన్మెంట్ ఈ దఫా బీటలు వారింది. పుణే కంటోన్మెంట్ పరిసర ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగరీత్యా, వ్యాపారాల రీత్యా వచ్చి స్థిరపడినవారే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో 1962 నుంచి ఏడు పర్యాయాలు కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈ ప్రాంతం బీజేపీ ఖాతాలో చేరింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి దిలీప్ కాంబ్లే కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ భాగ్వేపై 14,955 ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అదేవిధంగా హడాప్సర్ స్థానం శివసేన వశ మవుతుందని అందరూ భావించినా చివరకు యోగేష్ తిలేకర్, శివసేన అభ్యర్థి మహాదేవ్ బాబర్‌పై 30248 ఓట్ల తేడాతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన దిగ్గజాలు సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వివిధ రాజకీయ పార్టీల దిగ్గజాలు చతకిలపడ్డారు. ఆదివారం వెలువడిన శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు పేరుపొందిన నాయకులను మట్టికరిపించారు. తమకు తిరుగే లేదని చెప్పుకునే నాయకుల అంచనాలన్నీ తరుమారు చేస్తూ ఊహించని విధంగా తీర్పునిచ్చారు. వర్లీ శాసనసభ నియోజక వర్గంలో తనకు తిరుగులేదని భావించిన ఎన్సీపీ అభ్యర్థి సచిన్ అహిర్, ఎమ్మెన్నెస్‌కు చెందిన బాలా నాంద్‌గావ్కర్, నితిన్ సర్దేశాయి. ప్రవీణ్ దరేకర్ లాంటి దిగ్గజాలు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇలా అనేక మంది బడా నాయకుల అంచనాలన్నీ ఈ ఎన్నికల్లో తలకిందులయ్యాయి. -
ఎవరు ఎవరికి మద్దతిస్తారో..?!
-
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే!
-
మహారాష్ట్రాలో సంకీర్ణం!
-
ప్రజలు మాపై విశ్వాసముంచారు!
-
హార్యానాలో అధికారం.. బీజేపీదే!
-
మహారాష్ట్రాలో బీజేపీదే హవా!
-
రేపే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు!
-
‘క్షుద్ర’ రాజకీయం..
సాక్షి, ముంబై: రాజకీయాల్లో రాణించేందుకు ప్రత్యర్థిని అంతమొందించాలని క్షుద్రపూజలు చేయిస్తున్న విరార్‌లోని మాన్వేల్ పాడా ప్రాంతానికి చెందిన శివసేన ఉప శాఖ ప్రముఖుడు వినాయక్ బోంస్లేను మూఢ నమ్మకాల చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వినాయక్ భోంస్లే రాజకీయాల్లో ఎదిగేందుకు బహుజన్ వికాస్ ఆఘాడి నాయకుడు, స్థానిక కార్పొరేటర్ ప్రశాంత్ రావుత్ అడ్డుపడుతున్నాడు. వసయి-విరార్ కార్పొరేషన్ ఎన్నికలు 2015లో జరగనున్నాయి. రావుత్ లేకుంటే తనకు రాజకీయంగా అన్ని అడ్డంకులు తొలగిపోతాయని భోంస్లే భావించాడు. అందుకు అతన్ని అంతమొందించాలని నిర్ణయించున్నాడు. మామూలుగా హత్య చేయిస్తే ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని.. క్షుద్ర శక్తులను ఉపయోగించి అతడిని అంతమొందిస్తే ఎవరికీ అనుమానం రాదని ఆలోచించాడు.తర్వాత పథకం ప్రకారం గత నెల 23వ తేదీన క్షుద్రపూజలకు అవసరమైన సామగ్రి తీసుకుని రత్నగిరి చేరుకున్నాడు. అడవిలోకి వెళ్లి గుంత తవ్వి పూజలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ప్రయాణం చేయడంవల్ల అలసిపోవడంతో విశ్రాంతి తీసుకునేందుకు రత్నగిరిలోనే ఉన్న సోదరుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ వారిద్దరి మధ్య ఆస్తి విషయమై మాటామాటా పెరిగి చివరకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన భోంస్లే తమ్ముడిని క్షుద్ర శక్తులతో అంతమొందిస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ మేరకు సదరు సోదరుడు భోంస్లేపై స్థానిక సంగమేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి భోంస్లే కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు స్థానిక అడవిలో క్షుద్రపూజలు చేయించడానికి సిద్ధమవుతున్న భోంస్లేను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా విరార్‌లో తన ప్రత్యర్థి ప్రశాంత్ రావుత్‌ను హతమార్చేందుకు ఈ క్షుద్ర పూజలు చేస్తున్నట్లు చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని శనివారం పోలీసులు తెలిపారు. -
టికెట్ దక్కేదెవరికో..బరిలో ఉండేదెవరో..?
పింప్రి, న్యూస్‌లైన్ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. పోటీలో నిలిచేది ఎవరో మరో రెండ్రోజుల్లో తేలనుంది. పుణే నగరంలో ఉన్న 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 23 మంది కార్పొరేటర్లు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇంత మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేయడం ఇదే మొదటిసారి. నగరంలోని 8 నియోజక వర్గాలల్లో 6 నియోజక వర్గాల్లో ఎన్సీపీ, అత్యధికంగా 6 గురు కార్పొరేటర్లకు సీట్లు కేటాయించింది. ఎమ్మెన్నెస్ కూడా 6 గురు కార్పొరేటర్లకు సీట్లు ఇచ్చింది. బీజేపీ -3, శివసేన-2, కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్‌కు అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశాలిచ్చాయి. ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులుగా సీట్లు లభించని కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. వీరితోపాటు మరో ముగ్గురు మాజీ కార్పొరేటర్లు ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమయ్యారు. జిల్లాలో 561 నామినేషన్లు... ఎవరికి ఏ పార్టీ టిక్కెట్ లభించిందో తెలియదు. పార్టీ ఎవరికి భి ఫారం ఇచ్చిందో తెలియదు. అసలైన పార్టీ అభ్యర్థులు ఎవరో తెలియ దు. అంతా గందరగోళంగా మారింది. చివరి రోజు శనివారం అంద రూ నామినేషన్లు వేశారు. ఆ తర్వాత అదృష్టం ఎవరిని వరించి వారికి టిక్కట్ దొరికితే వారే అభ్యర్థి కదా! అప్పటి వరకు చూద్దాం అనే ధోరణీ అన్ని రాజకీయ పార్టీల నాయకుల్లో నెలకొన్నది. మధ్య జిల్లాలో చివరి రోజూ 335 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గత 8 రోజుల్లో జిల్లాలోని 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు 561 మంది నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 1వ తే దీ నామినేషన్ల ఉపసంహరణతో బరిలో ఎవరు ఉండేది తెలుస్తోంది. ఇందార్ నుంచి అత్యధికం ఇందాపూర్ నుంచి అత్యధికంగా 45 మంది, పింప్రి నుంచి 40, శివాజీ నగర్-23, కోత్రోడ్-15, కసబా-24, పర్వతి-22, ఖడక్వాస్లా-32, పుణే కంటోన్మెంట్-23, హడప్సర్-20, వడగావ్‌శేరి-35, పింప్రి-40, చించ్వడ్-33, బోసిరి-35, మావల్-25, ఆంబేగావ్-16, జున్నర్-19, ఖేడ్ ఆలంది-30, శిరూర్-25, దౌండ్-25, పురంధర్-18, భోర్-23, బారామతి-24, ఇందాపూర్-45 నామినేషన్లు వేశారు. ఊరేగింపుగా నామినేషన్ల దాఖలు భివండీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం చివరిరోజు కావడంతో భివండీ మూడు విధాన సభ నియోజక వర్గాలలోని వివిధ పార్టీలకు చెందిన 52 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నామినేషన్ల చివరి రోజు కావడంతో దాదాపు అన్నీ పార్టీల అభ్యర్ధులు కార్యకర్తలతో పాటు భాజా భజంత్రీలతో టపాకాయలు కాల్చు తూ ఊరేగింపుగా ప్రాంత్ కార్యాలయం, తహసిల్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. 134-భివండీ రూరల్.. శివసేన పార్టీ తరఫున శాంతారామ్ మోరే, బీజేపీ అభ్యర్ధి డా. శాంతారమ్ పాటిల్, ఎమ్మెన్నెస్ అభ్యర్ధి దశరత్ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్ధి సచిన్ శింగడా, బహుజన్ వికాస్ ఆగాడి అభ్యర్ధి రాజేష్ దుమాడా, నేషనల్ కాంగ్రెస్ (ఎన్సీపీ) అభ్యర్ధి మహదేవ్ గాతల్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి తుకారమ్ మోరే, స్వతంత్ర అభ్యరుధలు సంతోష్ జాద వ్, అనంతా దళ్వీ, వినోద్ చౌదరీ, విష్ణు పడ్వీ, లక్ష్మణ్ వాడు తదితర్లు నామినేషన్లు దాఖలు చేశారు. 136-భివండీ తూర్పులో.. శివసేన-మనోజ్ కాటేకర్, బీజేపీ-మహేష్ చౌగులే, కాంగ్రెస్-సోహేహ్ (గుడ్డు) ఖాన్, ఎంఐఎం-జాకీ అబ్దుల్ షేక్, సమాజ్‌వాది-అబుదల్లా అన్సారీ, ఆర్పీ (సెక్యూలర్)-శీతల్ గాయిక్వాడ్, ఆర్పీఐ (ఎక్తావాది)-మహ్మద్ ఇష్క్ అష్ఫాక్, బహుజన్ సమాజ్ పార్టీ-జలాలుద్దీన్ అన్సారీ, స్వతంత్ర అభ్యర్ధులు హసాన్ నవీద్, రోహిణీ జాదవ్, కమలేష్ నాగు, ద్యానేష్వర్ భగత్, నురుద్దిన్ అన్సారీ నామినేషన్లు దాఖలు చేశారు. 137-భివండీ తూర్పు.. శివసేన-రుపేశ్ మాత్రే, బీజేపీ-సంతోష్ శెట్టి, కాంగ్రెస్-ఫాజిల్ అన్సారీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)-ఖాలీద్ (గుడ్డు) షేక్, సీపీఐ-విజయ్ కాంబ్లే, బహుజన్ వికాస్ ఆగాడీ-తేజస్ పాటిల్, పీస్ పార్టీ-హబిబూర్ రైమాన్ ఖాన్, అవామీ వికాస్ పార్టీ-ఇర్ఫాన్ మోమిన్, ఎంఐ ఎం-అక్రమ్ ఖాన్, సమాజ్‌వాది-ఫారాన్ ఆజ్మీ, ఆర్పీ-ఆసీఎక్బాల్ మోమిన్, బహుజన్ సమాజ్ పార్టీ-అల్లా ఉద్దీన్ అన్సారీ, స్వతం త్ర అభ్యర్ధులుగా అబ్దుల్ జామాల్ ఉద్దీన్, తాండవ్ ముదిలి యార్, నూరుద్దీన్ అన్సారీ, అఫ్సా మస్కే, దినేష్ పాటిల్, వసుదేవ్ చౌదరి, శివాజీ శెడగే, ప్రతాప్ వంగ, దశరథ పాటిల్, సందీప్ పాటిల్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. -
అభ్యర్థుల ఎంపికపై తలమునకలైన పార్టీలు
-
'నరేంద్ర మోడీ గాలిపైనే ఆధారపడవద్దు'
ముంబై: బీహార్ శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల నుంచి బిజెపి గుణపాఠం నేర్చుకోవాలని మిత్రపక్షం శివసేన హెచ్చరించింది. పనితీరు మెరుగుపరుచుకోవాలని సలహా కూడా ఇచ్చింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి-శివసేన కూటమి ‘మహాయుతి’ కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గాలిపైనే ఆధారపడటం మంచిది కాదని సామ్నా పత్రికలో సంపాదకీయం రాశారు. ‘బీహార్‌లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమికి ఆరు సీట్లు రాగా, బీజేపీకి నాలుగే వచ్చిన వాస్తవాన్ని మనం అంగీకరించాలి. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడా ఉంటుందని ప్రజలు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కేవలం మాటలవల్లే గెలవలేం’ అని వ్యాఖ్యానించింది. -
మంత్రిపై సిరా దాడి
సాక్షి ముంబై: అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం అహ్మదనగర్ జిల్లా సంగమ్‌నేర్‌కు వెళ్లిన రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కొందరు వ్యక్తులు సిరా (ఇంక్)చల్లారు. వీరిలో ఒకడైన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరా చల్లినవారందరూ శివసేన కార్యకర్తలేనని తెలిసింది. అయితే వీళ్లు మంత్రిపై ఎందుకు సిరా చల్లారనే విషయం స్పష్టంకాలేదు. సంగమ్నేర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు థోరట్ శనివారం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ధన్‌గార్ వర్గానికి చెందిన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసే థోరట్‌పై సిరా చల్లారు. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ధన్‌గార్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆందోళనకు దిగిన థోరట్ మద్దతుదారులు.. బాలాసాహెబ్ థోరట్‌పై సిరా చల్లారని తెలుసుకున్న ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. సంగమ్నేర్ తాలుకాలో అనేక రోడ్లపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు. మరోవైపు స్థానిక శివసేన కార్యాలయాలపై దాడులు జరిపారు. కార్యాలయాల్లోని అనేక వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో సంగమ్నేర్ తాలూకాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతంగా ఉండండి: థోరట్ సిరా చల్లిన ఘటనపై మంత్రి స్పందిస్తూ ఆందోళనకు దిగిన కార్యకర్తలంతా శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ఘటన అని, ఇంత పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. -
‘మహా’ ధీమా
లోక్‌సభ ఫలితాల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలపైనా కన్నేసిన కాషాయ దళం సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాలిచ్చిన ఉత్సాహంతో శాసనసభ ఎన్నికలపై మహాకూటమి దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికలు ముంబైతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగా, మరోవైపు శివసేనకు ఎనలేని ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చాయి. నగరంలో బీజేపీ బలం అంతంతమాత్రంగానే ఉండేది. ఏనాడూ ఆధిక్యతను సాధించలేదు. అయితే ఈసారి మాత్రం నరేంద్ర మోడీ ప్రభంజనం నగరంలో బీజేపీ, శివసేనలకు వరంగా మారింది. ఈ కారణంగానే ముంబైలోని ఆరింటికి ఆరు స్థానాలను శివసేన, బీజేపీలు కైవసం చేసుకోగలిగాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండడంతో శాసనసభ ఎన్నికల్లోనూ దూసుకుపోతామనే ధీమా మహాకూటమిలో వ్యక్తమవుతోంది. 1995లో శివసేన-బీజేపీల కాషాయ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిన రామమందిరం ఆందోళన, బాబ్రీ మసీదు కూల్చివేత పరిణామాలు ఈ కూటమికి వరంగా మారాయి. అయితే రాష్ట్రంలో 1999 నుంచి గత 15 ఏళ్లుగా కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి అధికారంలో ఉంది. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ బీజేపీ, శివసేనలు ఆశించినమేర రాణించలేకపోయాయి. శివసేన, బీజేపీలలో అంతర్గత విభేదాలు, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తదితరాల కారణంగానే ఈ కూటమి రాణించలేకపోయిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సారి మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతప్తిని నరేంద్ర మోడీ ప్రభావంతో ఓట్లరూపంలోకి మారింది. దీంతో ఊహించనివిధంగా కాంగ్రెస్, ఎన్సీపీలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ మహాకూటమి అధికారంలో రావడం తథ్యమని పేర్కొంటున్నారు. సీఎం పదవి కోసం బీజేపీ, శివసేనలో పోటాపోటీ..? వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికనే విషయంలో బీజేపీ, శివసేనల మధ్య పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1995 శాసనసభ ఎన్నికల్లో శివసేన అత్యధికంగా స్థానాలను గెలుచుకోవడంతో ముఖ్యమంత్రి పదవి శివసేనకు దక్కింది. అయితే గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ రాకపోయినప్పటికీ బీజేపీకే అత్యధికంగా స్థానాలు దక్కాయి. దీంతో 2009 నుంచి ప్రతిపక్ష నేత పదవి బీజేపీకి దక్కింది. ఈనేపథ్యంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుని ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీలు దీనిపై ఆసక్తికనబరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వీరిరువురూ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో వీరికి కేంద్ర మంత్రిమండలిలో పదవి దక్కే అవకాశముంది. -
సంపాదకీయంతో సమస్యలు
సాక్షి, ముంబై: గుజరాతీయులకు వ్యతిరేకంగా సామ్నా పత్రికలో సంపాదకీయం రాసిన శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావుత్‌కు చిక్కులు తప్పేలా లేవు. సామ్నాలో ఆయనకు అధికారాలు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలోని గుజరాత్ ప్రజలపై రావుతే రాసిన సంపాదకీయంపై ఉద్ధవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయమై అధికారికంగా వివరాలు అందకపోయినా, ప్రస్తుత పరిస్థితులను బట్టి రావుత్ అధికారాలను తగ్గించడం ఖాయమని భావిస్తున్నారు. శివసేన అధికార పత్రిక సామ్నా వర్కింగ్ ఎడిటర్‌గా సంజయ్ రావుత్ విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే. గుజరాతీ ప్రజలను విమర్శిస్తూ ఈ నెల ఒకటిన ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సంపాదకీయంతో ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధం లేదని, ఆ సమయంలో ఆయన భార్యతో యూరప్ పర్యటనలో ఉన్నారని సేన వర్గాలు వివరణ ఇచ్చాయి. సంపాదకీయంలో ఏం రాసినా, అది శివసేన అధికార వైఖరేనని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలు, ఇతర విషయాలన్నీ సామ్నా ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు తెలియజేసేవారు. అయితే గుజరాతీలపై రాసిన సంపాదకీయంపై తీవ్ర విమర్శలు రావడంతో ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు. వివాదాస్పద సంపాదకీయంతో శివసేన పార్టీ అధిష్టానానికి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు. సామ్నా.. శివసేన అధికారిక పత్రిక కాదని, ఇటీవలి సంపాదకీయంలో పార్టీ ప్రమేయం లేదన్నారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ముంబైలోని గుజరాతీలు మోడీ ర్యాలీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని సామ్నా విమర్శించడం తెలిసిందే. దీనిపై గత రెండు రోజులుగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే స్పందించారు. ముంబైలోని గుజరాతీలు, మరాఠీల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలూ లేవని, పార్టీ నాయకులందరిలోనూ ఇదే అభిప్రాయముందని ఉద్ధవ్ స్వయంగా చెప్పారు. గుజరాతీలు బాల్‌ఠాక్రేతో సన్నిహితంగా మెలిగేవారని, అవసరమైనప్పుడు పరస్పర సహాయసహకారాలు అందించుకునేవారని అన్నారు. భుజ్‌లో భూకంపం వచ్చినప్పుడు కూడా శివసేన గుజరాత్లో సహాయ సహకారాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాతీలను పార్టీ ముంబైకర్లుగానే భావిస్తుందని ఠాక్రే అన్నారు. ప్రస్తుత పరిణామాలతో సేన కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఈ వివాదానికి కారణమైన సంజయ్ రావుత్‌కు సామ్నాపై ఉన్న అధికారాలను కొంత తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సామ్నా పత్రిక విధుల్లో కొన్నింటిని చేపట్టాలని శివసేన నాయకులు సుభాష్ దేశాయి, లీలాధర్ డాకేను కూడా ఆదేశించినట్టు సమాచారం. రావుత్‌కు అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే పార్టీ రహస్యాలు ప్రత్యర్థులకు తెలిసిపోతున్నాయని కొందరు ఉద్ధవ్ ఠాక్రేకు చెప్పినట్టు తెలిసింది. దీంతో గత కొన్ని రోజులుగా ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా గుజరాతీయులపై రాసిన సంపాదకీయంతో మరింత అసంతృప్తికి గురైన ఉద్ధవ్ ఠాక్రే వెంటనే సుభాష్ దేశాయి, లీలాధర్ డాకే కు పత్రికలో కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిసింది. రెండు రోజుల క్రితమే వారు బాధ్యతలు స్వీకరించినట్టు సమాచారం. -
‘మహాకూటమిగానే పోటీ’
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మహాకూటమిగానే పోటీ చేయనున్నాయి. కలిసి కట్టుగానే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే తెలిపారు. బీఎంసీ నిర్మించిన ట్రామా కేర్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మా కూటమి కలిసి పోటీచేయదని అనేక మంది అనుకుంటున్నారని, అయితే అవన్నీ వట్టివేనని, ఐక్యంగానే సత్తా చాటుతామని అన్నారు. ఏటీఎం (అథవలే, ఠాక్రే, ముండే) ఎప్పటికీ బ్రేక్ కాదని, కలిసి కట్టుగానే ఉంటామని బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా పోరాటం సీట్లు, పదవులు, ప్రతిష్ట కోసం కాదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని నొక్కి చెప్పారు. అయితే బాల్‌ఠాక్రే పేరు పెట్టిన ట్రామా కేర్ని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముండే, అథవలే సమక్షంలో ప్రారంభించారు. అయితే వారం క్రితం జరిగిన దసరా ర్యాలీలో అవమానానికి గురైన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషి రాసిన లేఖపై స్పందించేందుకు ఉద్ధవ్ నిరాకరించారు. తాను కావాలనుకున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతానని తెలిపారు.