సాక్షి, ముంబై: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా ముంబై రద్దయింది. బీజేపీ–శివసేన పొత్తుపై ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడనుందనే నేపథ్యంలో ఆయన గురువారం ముంబైలో పర్యటించాల్సి ఉంది. అయితే అమిత్ షా పర్యటన అనూహ్యంగా వాయిదా పడింది. దీనిపై భారతీయ జనతా పార్టీ నిన్న రాత్రి ఓ ప్రకటన చేసింది. అయితే ఆయన పర్యటన ఎప్పుడు ఉంటదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 21న జరగనున్నాయి. బీజేపీ–శివసేన కాషాయ కూటమి పొత్తుపై గత కొద్ది రోజులుగా ఇరు పారీ్టల నాయకులు తమకు తోచిన విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పొత్తు కుదురుతుందా..? వికటిస్తుందా..? అనే దానిపై ఇరుపారీ్టల నాయకులు సందిగ్ధంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రద్దుతో పొత్తుపై అధికారికంగా ప్రకటన మరికాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ చీఫ్ అమిత్ షా
ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నా..
ప్రతిపక్షాలు, గిట్టని పార్టీ నాయకులు ఇలా ఎవరేమనుకున్న బీజేపీ–శివసేన మధ్య కచి్చతంగా పొత్తు కుదురుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం విలేకరుల సమావేశంలో స్పష్టమైన సంకేతాలిచ్చారు. పొత్తుపై తను కూడా ఆందోళన చెందుతున్నానని అన్నారు. దీంతో పొత్తు, సీట్ల పంపకం అంశాన్ని ఎక్కువ రోజులు నాన్చకుండా సాధ్యమైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫడ్నవీస్ చెప్పారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్-శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే
రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగింది. కాని పొత్తుపై ఇంతవరకు ఒక స్పష్టత రాకపోవడంతో ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఫడ్నవీస్ పొత్తు, సీట్ల పంపకంపై వివరాలు వెల్లడిస్తుండవచ్చని విలేకరులు భావించారు. కాని వారి అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులపై వివరాలు వెల్లడించి విలేకరుల సమావేశాన్ని ముగించారు. ఇరు పారీ్టల మధ్య పొత్తుపై మీరెంత ఆందోళన చెందుతున్నారో... నేను కూడా అంతే ఆందోళన చెందుతున్నానని అన్నారు. కానీ, సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment