Maharashtra Assembly Election
-
ఉదయాన్నే బూత్‌లకు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ చిత్రాలు ఇవిగో
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేడు (బుధవారం) జరుగుతున్నాయి. జార్ఖండ్‌లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ‘నేటి పోటింగ్లో సరి కొత్త రికార్డును సృష్టించాలని’ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా ప్రధాని మోదీ ఒక సందేశం ఇచ్చారు. ‘ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ, యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. झारखंड में आज लोकतंत्र के महापर्व का दूसरा और आखिरी चरण है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे इसमें बढ़-चढ़कर भागीदारी करें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट डालने जा रहे अपने सभी युवा साथियों का मैं विशेष अभिनंदन करता हूं। आपका एक-एक मत राज्य की ताकत है।— Narendra Modi (@narendramodi) November 20, 2024మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
అవున్సార్! ఇక్కడ అన్ని పార్టీల వారికి పదవులున్నాయి కానీ మనకే లేవ్!
-
Maharashtra: అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో అనిల్ దేశ్‌ముఖ్‌కు తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనను నాగ్‌పూర్ పోలీసులు ధృవీకరించారు. నాగ్‌పూర్‌లోని కటోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరఫున అనిల్ ప్రచారానికి వెళ్లారు. కటోల్ జలల్ఖేడా రోడ్డులో తన కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని ఎన్సీపీ- ఎస్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. గాయపడిన అనిల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) హర్ష్ పొద్దార్ ఈ ఘటనను ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్‌పై ఉన్నారు. 2021లో అవినీతి ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నవంబర్ 2021లో అనిల్ అరెస్టయ్యారు. డిసెంబర్ 2022లో బెయిల్‌పై విడుదలయ్యారు.#BREAKING 🚨 | Former Home Minister Anil Deshmukh was injured in a stone-pelting attack on Katol-Jalalkheda Road after a rally. His vehicle was damaged, and he received emergency treatment.#AnilDeshmukh #AttackonAnilDeshmukh #Katoljalalkhedaroad #attack pic.twitter.com/5WxQrMxGU0— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 18, 2024Credits: Lokmat Times Nagpur288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్‌తో కూడిన ఎన్సీపీల మహాయుతి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షమైన శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తోంది.ఇది కూడా చదవండి: మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్ -
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
Maharashtra: బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత నవనీత్ రాణా ఎన్నికల ప్రచార సభలో ఆమెపై దాడి జరిగింది. ఖల్లార్ గ్రామంలో జరిగిన ఎన్నికల సభలో నవనీత్ రాణా పాల్గొన్నారు.ఆమె వేదికపై ప్రసంగం ముగించి కిందకు రాగానే కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆమె ఖల్లార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయకుంటే హిందువులంతా తరలివచ్చి నిరసన తెలపాలని ఆమె కోరారు.ఈ ఘటన అనంతర నవనీత్ రాణా మీడియాతో మాట్లాడుతూ.. ఖల్లార్లో ప్రచార సభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారు. తాను ప్రసంగం ముగించుకుని, కిందకు వచ్చాక వారు ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారు. తనను దూషించారు. కొందరు తనపై ఉమ్మివేశారని నవనీత్ రాణా తెలిపారు. వెంటనే అప్రమత్తమైన తన అంగరక్షకులు తనను కాపాడి బయటకు తీసుకువచ్చారన్నారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం -
ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యాయి. జల్గావ్లోని ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్రాలలో మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పచోరాలో రోడ్ షో నిర్వహిస్తుండగా గోవిందా ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఇతర నేతలు గోవిందాను ఆస్పత్రికి తరలించారు.మహాయుతిలోని శివసేన (షిండే వర్గం) నేత గోవిందా పచోరాలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యం పాలవడంతో మధ్యలోనే ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ రోడ్ షోలో గోవిందా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల గోవిందా కాలికి గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత గోవింద తొలుత వీల్ చైర్ లో కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనను చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.నవంబర్ 20న మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు. నవంబర్ 18తో ఎన్నికల ప్రచారం ముగియకముందే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చాటాయి. ఈ క్రమంలో గోవిందా శివసేన, మహాయుతిల ప్రచారానికి వెళ్లారు. గోవిందా పాల్గొన్న రోడ్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ -
మా వేతనాల్లో కోత వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరయ్యే తమకు సొంత రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కోత విధించవద్దని హోంగార్డులు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎన్నికల డ్యూటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి అలవెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ విధుల్లో లేనందున తమ వేతనాల్లో కోత పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు విధుల కోసం తెలంగాణ నుంచి మూడు వేల మంది హోంగార్డులు వెళ్లనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్లేందు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు అక్కడ ఇచ్చే బిల్లులతోపాటు సొంత రాష్ట్రంలో రోజువారీ వేతనం రూ.921ని కటింగ్ లేకుండా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో.. కుటుంబ కథాచిత్రం!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సకుటుంబ, సపరివార కథా చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఠాక్రేల నుంచి పవార్ల దాకా అనేక కాకలు తీరిన రాజకీయ కుటుంబాల నుంచి బోలెడంత మంది ఎన్నికల బరిలో నిలిచారు. బాబాయ్, కొడుకులు, తండ్రీ కూతుళ్లు, మామ, అల్లుళ్లు, చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు! పవార్ వర్సెస్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం పవార్ వర్సెస్ పవార్‌గా ఉంది. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తన పెదనాన్న, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో ఆయన పోటీ పడుతుండటం విశేషం. ఇక్కడ ఏకంగా ఏడుసార్లు నెగ్గిన చరిత్ర అజిత్‌ది. ఆయన తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర. శరద్ పవార్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ ఇది రెండోసారి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ భార్య సునేత్రను శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఓడించారు.భార్యాభర్తల సవాల్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ అసెంబ్లీ స్థానం ఏకంగా భార్యాభర్తల నడుమ ఆసక్తికర పోరుకు వేదికైంది. శివసేన అభ్యర్థి సంజనా జాదవ్‌పై ఆమె భర్త హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. హర్షవర్ధన్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రైభాన్ జాదవ్ కుమారుడు. ఇక సంజన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే కుమా ర్తె. హర్షవర్ధన్ 2009లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తరఫున కన్నడ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో శివసేన టికెట్‌పై మరోసారి విజయం సాధించారు. మరాఠా కోటా ఉద్యమంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ 2018లో రాజీనామా చేశారు. భార్యాభర్తలిద్దరూ 2019లో విడిపోయినా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇదే విషయాన్ని హర్షవర్ధన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. సంజన మాత్రం తాను వివాహితురాలినేనని పేర్కొన్నారు. ఎందరో వారసులు... శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాంద్రా ఈస్ట్‌లో ఆదిత్య మేనమామ వరుణ్ సర్దేశాయ్ వాండ్రేతో దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ (ఎన్సీపీ) తలపడుతున్నారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముంబైలోని మాహిం నుంచి పోటీ చేస్తున్నారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ వాండ్రే, ఆయన సోదరుడు వినోద్ షెలార్; మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్, ధీరజ్; శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ మేనల్లుడు ప్రజక్త్ తాన్పురే, ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, ఆయన సోదరుడి కుమారుడు సమీర్ తదితరులు కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు. మోహన్‌రావు హంబర్డే కాంగ్రెస్ నుంచి, ఆయన సోదరుడు సంతుక్రావ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. గణేశ్ నాయక్ బీజేపీ తరఫున, ఆయన చిన్న కుమారుడు సందీప్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్‌కుమార్ గవిట్ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు అసెంబ్లీ బరిలో ఉన్నారు. విజయ్‌కుమార్ బీజేపీ నుంచి, సోదరుడు రాజేంద్ర గవిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా మరో సోదరుడు భరత్, కుమార్తె హీనా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు! బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితేశ్, నీలేశ్ కూడా అసెంబ్లీ బరిలో దిగారు.తండ్రీ కూతుళ్ల పోటీ గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం తండ్రీకూతుళ్ల పోటీకి వేదికగా నిలిచింది! ఎన్సీపీకి చెందిన మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రం హల్గేకర్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబరీశ్ రావు ఆత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. లోహా–కంధర్ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్ పాటిల్ చిక్లీకర్ తన బావమరిది శ్యాంసుందర్ షిండేతో తలపడుతున్నారు. షిండే గతంలో చిఖలీకర్ మద్దతుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం విశేషం! సిం«ద్ఖేడ్ రాజా నియోజకవర్గంలో ఎన్సీపీ (ఎస్పీ)కి అభ్యర్థి రాజేంద్ర షింగ్నే తన మేనకోడలు గాయత్రి షింగ్నేపై పోటీ చేస్తున్నారు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాసిక్‌లోని చాంద్వాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాహుల్ అహెర్ తన సోదరుడు కేదా అహెర్పై బరిలోకి దిగారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ
నాందేడ్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఈ కోవలోకే వస్తుంది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలోని వాగ్దారి గ్రామం. ఈ గ్రామంలో 300 జనాభా ఉంది. భూ రెవెన్యూ మ్యాప్‌లో ఈ గ్రామం పేరు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఈ గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు.తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు తొలిసారిగా తమ గ్రామంలో ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ఓటర్లు సమీపంలోని పోలింగ్ కేంద్రమైన జలధారకు వెళ్లేవారు. వీరు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టేది. అయితే అడవి గుండా వెళ్లాల్సిన రావడంతో క్రూర మృగాల భయం వారిని వెంటాడేది. తాజాగాకిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ గ్రామంలోని 190 మంది ఓటర్లు స్థానికంగానే ఓటు వేయనున్నారు. గ్రామానికి పోలింగ్ బూత్ రావడంతో త్వరలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ ప్రాంతంలోని చారిత్రక సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని భూమికి కొలతలు నిర్వహించి, పూణేలోని అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో గ్రామస్తులకు భూమి యాజమాన్యపు రుజువు లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గ్రామస్తుల్లో కొత్త ఆశను నింపింది. ఎన్నికల్లో తమ గళం వినిపించాలని, అప్పుడే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీరుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని.. -
మహా ఎన్నికలు.. ఏ మేనిఫెస్టోలో ఏముంది?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడి వాగ్దాలను గుప్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) మహాయతిని ఢీకొట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. అటు ఎంవీఏ కూటమి ఇటు మహాయతి (బీజేపీ, షిండే సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) రెండూ మహిళలు, రైతులు, వృద్దులను ఆకట్టుకునేందుకు పోటీలు పడుతూ పలు పథకాలను ప్రకటించాయి.కొత్తగా ఉచిత బస్సు ప్రయాణంశివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్‌ల కూటమి ఎంవిఎ ‘లోక్సేవేచి పంచసూత్రి’ కింద పలు వాగ్దానాలను ప్రకటించింది. ఇందులో నెలకు మూడు వేల రూపాయల డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు చెల్లించే రైతులకు అదనంగా రూ.50 వేలు మాఫీ చేస్తామని ఎంవీఏ కూటమి హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల వరకూ ప్రయోజనం చేకూరుస్తామని, పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు.పథకాల మొత్తాల పెంపుఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గత కొంతకాలంగా నగదు పథకాలను అందిస్తోంది. ఒకప్పుడు ఉచిత పథకాలను విమర్శిస్తూ, దేశ అభివృద్ధికి ఇది ప్రమాదకరమని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు బీజేపీ తరపున పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహాయుతి తన లడ్కీ బహిన్ పథకపు మొత్తాన్ని 1,500 నుండి రూ.2,100కి పెంచింది. ఈ పథకం కింద మహిళలు, వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే విద్యార్థులకు నెలకు రూ. 10,000 సహాయం, రైతులకు రూ.15,000 ఆర్థిక సహాన్ని ప్రకటించింది. గతంలో ఇది రూ.12,000గా ఉంది.మహిళలు.. లఖ్పతి దీదీలుమహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని అధికార మహాయతి కూటమి హామీ ఇచ్చింది. 2027 నాటికి 50 లక్షల మంది మహిళలను 'లఖ్పతి దీదీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొంది. దీంతో పాటు రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.1000 కోట్లు అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక మహావికాస్ అఘాడి (ఎంవీఏ) విషయానికొస్తే మహిళల కోసం మహాలక్ష్మి యోజనను ప్రారంభిస్తామని, దీని కింద మహిళలకు నెలకు రూ. 3000 ఆర్థిక సహాయం అందజేస్తామని హామీనిచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీనిచ్చింది.రైతులకు రుణాలు.. విద్యార్థులకు స్కాలర్షిప్లుమహారాష్ట్రలోని రైతులకు రూ.15 వేల వరకు రుణమాఫీ చేస్తామని మహాయుతి హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయోత్పత్తులపై కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై 20 శాతం రాయితీ కల్పిస్తామని అధికార కూటమి హామీ ఇచ్చింది. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని పేర్కొంది. ఇదే విషయంలో సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రతిపక్ష కూటమి హామీ ఇచ్చింది. 10 లక్షల మంది విద్యార్థులకు రూ.10,000 స్కాలర్షిప్ ఇస్తామని మహాయుతి హామీనిచ్చింది. అలాగే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక ఎంవీఏ విషయానికొస్తే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.4000 స్కాలర్షిప్ను ప్రకటించింది.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపురాష్ట్రంలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార కూటమి వివేకానంద యూత్ హెల్త్ కార్డ్‌ను అందజేస్తామని, యువతకు వార్షిక ఆరోగ్య పరీక్షలను సులభతరం చేస్తామని పేర్కొంది. సీనియర్ సిటిజన్ల కోసం ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ పాలసీని ప్రారంభించనున్నట్లు మహాయుతి తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ఎంవీఏ హామీ ఇచ్చింది. ఉచితంగా మందులు అందజేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.21,500 నుంచి రూ.82,100కు పెంచుతామని మహాయుతి చెప్పగా, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అంశాన్ని ఎంవీఏ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని మహాయుతి తెలిపింది. ఎంవిఎ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో కుల గణనను నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా తొలగిస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి.ఇది కూడా చదవండి: ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు -
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ దుష్ప్రచారం
సాక్షి ముంబై: ప్రధాని మోదీతోపాటు మహారాష్ట్రలో ని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపడుతున్న రేవంత్.. ఇందులో భాగంగా శనివారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతోపాటు మహారాష్ట్రలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోనంత వరకు తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే తాను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలు విషయంపై నిజాలు చెప్పేందుకు వచ్చినట్లు రేవంత్ చెప్పారు. అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే..దేశంలోకెల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోవడం వల్లే మహారాష్ట్రలో రైతులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచి్చన 25 రోజుల్లోనే 22.22 లక్షల మంది రైతులకు రూ. 17,869 కోట్ల రుణమాఫీ, 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 50 లక్షల మంది పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు రేవంత్ వివరించారు. 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించారుమహారాష్ట్రకు రావల్సిన 17 మెగా ప్రాజెక్టులు ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని రేవంత్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని.. అంబేడ్కర్ సహా దేశ ప్రగతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర జన్నించిందని గుర్తుచేశారు. ప్రజలను మోసగించిన బీజేపీ కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అమీన్ పటేల్‌ను గెలిపించండి... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ముంబై ముంబాదేవి నియోజకవర్గంలో తెలంగాణవాసులు ఎక్కువగా ఉండే కమాటిపురాలో రోడ్ షో నిర్వహించారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముంబాదేవిలో మూడుసార్లు గెలిచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌ను గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణవాసులకు అండగా ఉంటామన్నారు. -
మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా పై ఈసీ వేటు
-
రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్రాను బరిలో దింపుతున్న ఏక్నాథ్ షిండే
-
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్) – కాంగ్రెస్‌ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
ఎన్సీపీ నేత దారుణ హత్య
ముంబయి:త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఎన్సీపీ నేత హత్య కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత సచిన్ కుర్మీన్ను దుండగులు పొడిచి చంపారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయధంతో సచిన్ కుర్మిన్ను హత్య చేశారని పోలీసులు తెలిపారు.ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో శుక్రవారం(అక్టోబర్4) అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదీ చదవండి: అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్ -
బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్ పాటిల్ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్ భావిస్తున్నారు.కాగా అక్టోబరు 7న ఇందాపూర్‌లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్ ఇందాపూర్ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ను బీజేపీలో చేరారు.అయితే ప్రస్తుతం ఇందాపూర్ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
మహారాష్ట్ర: హస్తం పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్
ముంబై: త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది.మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా ఎన్సీపీ,శివసేన(ఉద్ధవ్)పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుంది. పొత్తులో కాంగ్రెస్‌కు సుమారు 100 నుంచి 110 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి.ఈ సీట్లలో టికెట్ల కోసం ఇప్పటికే 1800కుపైగా దరఖాస్తులు వచ్చాయని నేతలు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.20వేల రుసుము నిర్ణయించారు.ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకముందే ఇన్ని దరఖాస్తులు వచ్చాయంటే తేదీలు ప్రకటించాక వీటి సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్అఘాడీ కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రభావంతోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించనుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనా ఫలితంగానే పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొందని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.ఇదీ చదవండి: హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్ -
Maharashtra Polls: నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గెలిస్తే.. తాను సీఎం కావాలనే ఆశతో ఉన్నట్లు అజిత్ పవార్ పేర్కొన్నారు.పుణెలోని దగ్దుషేత్ హల్దవాయ్ గణపతి ఆలయంలో మంగళవారం అజిత్ పవార్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘ప్రతిఒక్కరు తమ నాయకుడిని సీఎంగా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సీఎం కావాలనుకుంటే.. వారు మెజార్టీ సంఖ్యకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరవు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయంక, కోరికలు ఉంటాయి. కానీ అందరూ వారు కోరుకున్నది పొందలేరు. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాలి’ అని ఈ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) పోటీ చేస్తుందని పేర్కొన్నారు.‘మా కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి చర్చించుకొని తదుపరి సీఎంను ఎంచుకుంటాం’ అని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ శిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో పవార్ స్పందించడం గమనార్హం. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
Maharashtra: సీట్ల పంపకాలు పూర్తి.. 140 స్థానాల్లో బీజేపీ పోటీ?
ముంబై: లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రకు వరుసగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ హడావిడీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్నాయిఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే.. అధికార, విపక్షాలు తమ ఫోకస్ పెంచాయి. తాజాగా మహయుతి ప్రభుత్వంలోని పార్టీల మధ్య (బీజేపీ, శివసనే,ఎన్సీపీ) సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ కోరినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు అధికార కూటమిలో సీట్ల పంపకాల చర్చ అప్పుడే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.అయితే ప్రభుత్వానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకొని సత్తా చాటాయి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్చంద్ర), శివసేన(ఉద్దవ్). లోక్‌సభ ఎన్నికల జోష్‌నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమి తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఎన్డీయే కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. కాగా గత 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అఖండ విజయం సాధించింది.అయితే సీఎం పదవిపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొంతకాలానికే ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. -
అందుకే మహారాష్ట్రకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు: సీఈసీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు అనంతరం మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్‌తోపాటు, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఆ రెండు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌కు సైతం అసెంబ్లీ ఎన్నికల తేదీలను నేడు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి వీటి షెడ్యూల్ గురించి సీఈసీ రాజీవ్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని మాత్రం రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా అవసరాల దష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక.. మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్డేట్ చేయడంలో ఆలస్యం అయ్యిందని, ఇది ఎన్నికల నిర్వహణకు కీలకమైనదిగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పితృ పక్షం, దీపావళి, గణేష్ చతుర్థి వంటి ముఖ్యమైన పండుగుల, కార్యక్రమాలు జరగాల్సి ఉందని, ఇవన్నీ కారణాలతో ఎన్నికలను వాయిదా వేయవలసి వచ్చిందన్నారు.చివరిసారి హర్యానాకు, మహారాష్ట్రకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు జమ్ముకి ఎన్నికలు లేవు. కానీ ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి(జమ్మూ కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ). ఎన్నికలకు సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.రాష్ట్రాల శాసనసభ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకు ఎన్నికలను షెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలకు అవసరమైన అన్ని సన్నాహాలు సమర్థవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తాం’ అని చెప్పారు. -
Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) గెలుపు ఆరంభం మాత్రమేనని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ విజయయాత్ర రాష్ట్రంలో మరికొద్ది నెల ల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసా గుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 సీట్లకు గాను ఎంవీఏ పార్టీలు 30 సీట్లను గెల్చుకో వడం తెల్సిందే. ఉద్ధవ్ శనివారం ఎన్సీపీ (ఎస్పీ)చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అజేయమనే అపోహ ఎంత బూటకమైనదో లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు రుజువు చేశారని ఉద్ధవ్ అన్నారు. ఎన్డీఏ సర్కారుగా మారిన మోదీ సర్కారు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. -
వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!
తీర్పు స్పష్టంగానే వచ్చింది. కానీ పార్టీలే మాట తప్పాయి. ఇక్కడ ఏ పార్టీ మాట తప్పిందంటే... చెప్పటం కష్టం. మహారాష్ట్రలో బీజేపీ– శివసేన కూటమికి జనం అధికారమిచ్చినా... రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని ముందు చెప్పి, తరవాత మాట తప్పుతున్నందుకే తాము బీజేపీతో కలవటం లేదని శివసేన చెబుతోంది. తాము అలాంటి హామీనే ఇవ్వలేదని, శివసేనే మాట మారుస్తోందని బీజేపీ చెబుతోంది. అందుకే... ఇద్దరి పొత్తూ పెటాకులైంది. బీజేపీకి సింగిల్‌గా బలం చాలదు కనక... గవర్నరు పిలిచినా... చేతులెత్తేసింది. శివసేనను పిలిచినా అదే కథ. కాకపోతే ఈ పార్టీ కొంచెం సమయం కావాలంది. దానికి నిరాకరిస్తూ మరో పార్టీ ఎన్సీపీని కూడా పిలిచారు గవర్నరు. అంతలోనే ఈ గొడవ తేలదంటూ ఈ వారం మొదట్లో గవర్నరు రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేశారు. కేంద్రం ఓకే చేసేసింది. ఇది అన్యాయమంటూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. 288 సీట్ల మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలున్నాయి. బీజేపీగానీ, శివసేనగానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. అందుకే సేన కూడా మొండిపట్టు పడుతోంది. ప్రాంతీయ శక్తుల ఎదుగుదలకు అవకాశమున్న మహారాష్ట్రలో ముందుముందు బలోపేతం కావాలంటే అధికార పీఠం తన చేతిలో ఉండాలన్నది సేన మనోగతం. అందుకే మునుపటిలా బీజేపీకే ఐదేళ్లూ అవకాశం ఇవ్వకుండా తనకూ రెండున్నరేళ్లు సీఎం పీఠం కావాలంది. ఇదే ప్రతిపాదనతో ఎన్సీపీ– కాంగ్రెస్‌లతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్సీపీ ఓకే అంటున్నా... కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీకి దూరం చేయాలంటే సేనకు మద్దతివ్వక తప్పదు. అందుకే ముగ్గురూ కలిసి ఓ అవగాహనకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ కూడా సై అనే ప్రకటించింది. కాంగ్రెస్ ఎలాగూ శివసేనతో కలవదని, సేన తమ చెంతకే వస్తుందని ధీమాగా ఉన్న బీజేపీకి ఇది షాకే. అందుకే వేగంగా పావులు కదిపింది. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాబట్టి ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నరును శనివారం కోరింది. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఏమో!! ఏం జరుగుతుందో... గవర్నరు ఏం చేస్తారో చూడాల్సిందే!!. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమ’ని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. -
సావంత్ వర్సెస్ మహాడేశ్వర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థులు సవాల్‌గా మారారు. తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజక వర్గంలో శివసేన ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ నియోజకవర్గంలో ఒకరు శివసేన అభ్యర్థి కాగా మరొకరు శివసేన తిరుగుబాటు అభ్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఇద్దరు బలమైన అభ్యర్తులే కావడంతో పోరు రసవత్తరంగా మారింది. దీంతో ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రకాశ్ సావంత్‌దే ఆధిపత్యం.. 2004లో జరిగిన ఎన్నికల్లో తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజక వర్గాన్ని శివసేన చేజిక్కించుకుంది. శివసేన టికెట్‌పై పోటీచేసిన ప్రకాశ్ సావంత్‌కు 45,651 ఓట్లు రాగా ప్రత్యర్థిగా కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగిన జనార్ధన్ చాందుర్కర్కు 38,239 ఓట్లు, ఎమ్మెన్నెస్ అభ్యర్థి శిల్పా పోద్దార్‌కు 19,109 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రకాశ్ సావంత్ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. అయితే 2015లో ప్రకాశ్ సావంత్ ఆకస్మిక మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నికలో శివసేన తరఫున ప్రకాశ్ భార్య తృప్తి సావంత్ పోటీ చేయగా 52,711 ఓట్లు, కాంగ్రెస్ తరఫున నారాయణ్ రాణే పోటీ చేయగా 33,703 ఓట్లు, ఎంఐఎం తరఫున రహెబర్ సిరాజ్ ఖాన్ పోటీ చేయగా 15,050 ఓట్లు వచ్చాయి. కాగా ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించినప్పటికీ ఈ నెల 21వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృప్తి సావంత్‌కు అభ్యర్థిత్వం ఇవ్వకుండా సిట్టింగ్ మేయర్ విశ్వనాథ్ మహాడేశ్వర్‌కు అభ్యర్థిం కట్టబెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన తృప్తి సావంత్ తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఆమె బరిలోకి దిగడంవల్ల విశ్వనాథ్‌కు విజయవకాశాలు కొంత సన్నగిల్లినట్లు వాతావరణం కనిపించింది. దీంతో నామినేషన్ ఉపసంహరించుకోవాలని చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇక్కడ శివసేన తరఫున విశ్వనాథ్ మహాడేశ్వర్, ఇండిపెండెంట్‌గా తృప్తి సావంత్, కాంగ్రెస్ తరఫున జిషాన్ సిద్ధికీ, ఎమ్మెన్నెస్ తరఫున అఖిల్ చిత్రే బరిలో నిలిచ్చారు. ఇక్కడ నలుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నట్లు తేలిపోయింది. అసలు పోటీ శివసేన అభ్యర్థి మహాడేశ్వర్, ఇండిపెండెంట్ అభ్యర్థి సావంత్ మధ్య జరగడం ఖాయంగా కనబడుతోంది. ఒకపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే మరోపక్క ముంబై మేయర్ బరిలో ఉండడంవల్ల పోటీ హోరాహోరీగా జరగనుంది. అంతేగాకుండా ఈ నియోజక వర్గం ఇటు శివసేనకు అటు ఇండిపెండెంట్ అభ్యర్థి తృప్తి సావంత్‌కు సవాలుగా మారింది. ఎలాగైన ఈ నియోజకవర్గంలో పట్టుసాధించాలని శివసేన దృడసంకల్పంతో ఉంది. మరోపక్క తన ఆదీనంలో ఉన్న ఈ నియోజక వర్గాన్ని ఎట్టి పరిస్ధితుల్లో చేజారిపోకుండా తృప్తి సావంత్ కూడా తన ప్రతిష్టను ఫణంగా పెట్టారు. దీంతో ఈ నియోజక వర్గంపై ఓటర్లతోపాటు సామాన్య ప్రజలకు కూడా మరింత ఆసక్తి నెలకొంది. ఇరువురు బలమైన అభ్యర్ధులు కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబెడతారనేది ఎన్నికల ఫలితాల్లో తేటతెల్లం కానుంది. (చదవండి: మహారాష్ట్రలో ఫడ్నవీయం) -
‘మహా’ పొత్తు కుదిరింది
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చామని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తారని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ సోమవారం ప్రకటించారు. తమ కూటమిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ సమాజ్ ప„ŠS, శివ సంగ్రామ్ సంఘటన్, రైతు క్రాంతి సేన కూడా ఉన్నాయని శివసేన నేత సుభాష్ దేశాయ్ చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని శివసేన నేత, ఉద్ధవ్ ఠాక్రే పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రకటించారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రేనే కావడం విశేషం. ముంబైలోని వర్లి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదిత్య వెల్లడించారు. వర్లి సేన బలంగా ఉన్న స్థానాల్లో ఒకటి. 1966లో బాల్ ఠాక్రే శివసేనను స్థాపించినప్పటి నుంచి ఆ కుటుంబసభ్యులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజ్యాంగ పదవులు పొందలేదు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే (బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడు) 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కానీ తరువాత మనసు మార్చుకున్నారు. ఎక్కువ స్థానాల్లో శివసేన గెలిస్తే ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారని సేన వర్గాలు చెబుతున్నాయి. ఒక శివసైనికుడిని సీఎం చేస్తానని తన తండ్రి దివంగత బాల్ ఠాక్రేకు హామీ ఇచ్చానని శనివారం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఫలితాల అనంతరం అదే సంవత్సరం డిసెంబర్లో బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరింది. ఎంఎన్ఎస్ పోటీ ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం. గెలుస్తాం’ అని ఆయన సోమవారం ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది ఆయన ప్రకటించలేదు. కానీ సుమారు 125 సీట్లలో ఎంఎన్ఎస్ పోటీ చేయొచ్చని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ముంబై, పుణె, నాసిక్, థానె, పాల్ఘార్.. తదితర పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ బరిలో నిలిచే అవకాశముంది. అయితే, ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్న ముంబైలోని వర్లి స్థానంలో ఎంఎన్ఎస్ అభ్యర్థిని నిలుపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.