అధికారులకు హోంగార్డుల వినతి
మహారాష్ట్ర ఎన్నికల బందోబస్తుకు వెళ్లే 3,000 మంది హోంగార్డుల వేతనంలో కోత
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరయ్యే తమకు సొంత రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కోత విధించవద్దని హోంగార్డులు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎన్నికల డ్యూటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి అలవెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ విధుల్లో లేనందున తమ వేతనాల్లో కోత పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు విధుల కోసం తెలంగాణ నుంచి మూడు వేల మంది హోంగార్డులు వెళ్లనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్లేందు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు అక్కడ ఇచ్చే బిల్లులతోపాటు సొంత రాష్ట్రంలో రోజువారీ వేతనం రూ.921ని కటింగ్ లేకుండా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment