Home Guards
-
కనీస మార్కులొస్తేనే హోంగార్డులకు ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ప్రాథమిక రాత పరీక్షలో కనీస మార్కులు రాని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ ఎం.రవిప్రకాశ్ హైకోర్టుకు నివేదించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారంటూ పలువురు హోంగార్డులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు చైర్మన్ రవిప్రకాశ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కులు ఉండవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలోనే నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల గురించి పిటిషనర్లందరికీ స్పష్టంగా తెలుసని, వాటికి అంగీకరించిన తరువాతే వారంతా ప్రాథమిక రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్‌ను తప్పుపడుతున్నారని తెలిపారు.నోటిఫికేషన్‌లోని పేరా–7లో పేర్కొన్న స్పెషల్ కేటగిరీలు హారిజాంటల్ రిజర్వేషన్ (హోంగార్డులు, ఎన్సీసీ, ప్రతిభావంతులైన క్రీడాకారులు, పోలీసు సిబ్బంది పిల్లలు, మరణించిన పోలీసుల పిల్లలు తదితరాలు) కిందకు వస్తాయన్నారు. ఈ హారిజాంటల్‡ రిజర్వేషన్ కిందకు వచ్చే పోస్టులను కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందేనని తెలిపారు.అలా చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయిరూల్ ఆఫ్ రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమవుతుందని రవిప్రకాశ్ వివరించారు. పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్‌కు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టవుతుందని, పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయసు మినహాయింపు కోరుతున్నారని పేర్కొన్నారు.అయితే, తమ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులను మాత్రం ఆమోదించడం లేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. స్పెషల్ కేటగిరీ కింద హోంగార్డుల్లో కూడా ఓసీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామన్నారు. కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసి సంబంధిత పిటిషన్లన్నీ కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. -
మా వేతనాల్లో కోత వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరయ్యే తమకు సొంత రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కోత విధించవద్దని హోంగార్డులు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎన్నికల డ్యూటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి అలవెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ విధుల్లో లేనందున తమ వేతనాల్లో కోత పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు విధుల కోసం తెలంగాణ నుంచి మూడు వేల మంది హోంగార్డులు వెళ్లనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్లేందు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు అక్కడ ఇచ్చే బిల్లులతోపాటు సొంత రాష్ట్రంలో రోజువారీ వేతనం రూ.921ని కటింగ్ లేకుండా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
హోంగార్డులపై ‘కారుణ్య’మేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి విధుల్లో అత్యంత కీలకమైన హోంగార్డులు.. అరకొర జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నెలలో ఒక్కో తేదీన వేతనాలు వస్తున్నాయని.. ఒక్కోసారి సగం నెల గడిచినా జీతాలు అందని పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. తమకు కనీస జీవన భద్రత లేదని, హోంగార్డు చనిపోతే కారుణ్య నియామకంగానీ, మరేదైనా తీరులోగాని వారి కుటుంబాలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన బాట పట్టాలనే యోచనతో ఉన్నామని అంటున్నారు. సీఎం హామీలు అమలు చేయాలంటూ..హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని హోంగార్డులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డుల వేతన సవరణతోపాటు సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారని చెప్తున్నారు. ఇక తాజాగా శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి.. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలు అందులో చదువుతారని పలుమార్లు పేర్కొన్నారు. అయితే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ జీవోలో మాత్రం హోంగార్డుల ప్రస్తావన లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి విధుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసే తమకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు ఆశతో ఎదురుచూశామని, కానీ అలాంటి హామీ ఏదీ రాలేదని వాపోతున్నారు. యూనిఫాం అలవెన్స్, స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ సహా పలు కీలక హామీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచీ పెండింగ్‌లో ఉన్నాయని... కాంగ్రెస్ ప్రభు త్వంలోనైనా అవి పరిష్కారం అవుతాయన్న ఆశతో ఉన్నామని చెప్తున్నారు. కదలని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ ఫైల్.. హోంగార్డులను సైతం లాస్ట్ పేగ్రేడ్ కింద తీసుకుని, వారిని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ (ఎస్పీఏ)గా మార్చాలని 2017లో ప్రతిపాదన సిద్ధం చేశారు. రిక్రూట్మెంట్లో లోటుపాట్లను సరిదిద్ది, వారిని పర్మినెంట్ చేసి దీన్ని అమలు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పలు కారణాలతో ఇది పెండింగ్‌లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13వేల మంది జనరల్ డ్యూటీ హోంగార్డులు, మరో 2,500 మంది వరకు ఓడీ (అదర్ డిపార్ట్మెంట్) హోంగార్డులు పనిచేస్తున్నారు. -
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మాజీ హోం గార్డులు..
-
సారూ.. ఉద్యోగం ఇప్పించండి
గోదావరిఖని: సమస్యలు పరిష్కరించాలని గొంతెత్తినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తనను విధుల నుంచి తొలగించిందని, జీవనోపాధి లేకుండా రోడ్డున పడేసిందని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమై.. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ అనేకమార్లు ప్రదక్షిణలు చేసినా, నాయకులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈమేరకు శనివారం సీఎం నిర్వహించే ప్రజాదర్బార్‌కు వెళ్లారు. అక్కడ తన గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగ భధ్రత కోసం ఆందోళన.. సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో 2016లో హోంగార్డులు ధర్నా చేశారు. గోదావరిఖనికి చెందిన హోంగార్డు మామిడి పద్మ ఆందోళనల్లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. పర్యవసనంగా ఆమె తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమెకు తన ముగ్గురు పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది. భర్త వదిలేయడంతో ఏ పనిచేసుకోవాలో తెలియక, తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని సీపీ, డీజీపీ, హోంమంత్రిని వేడుకున్నారు. హోంగార్డు పద్మ 2009లో వేములవాడలో తొలిపోస్టింగ్, రెండేళ్లు పనిచేసిన తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్ఫర్ అయ్యారు. జీతాలు పెంచి ప్రతినెలా చెల్లించాలనే డిమాండ్‌తో ఏడేళ్ల క్రితం వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రి వద్ద హోంగార్డులు ధర్నా చేశారు. ఇందులో పాల్గొన్నందుకు పద్మ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈమెపై అనేక కేసులు బనాయించడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈరోజు తన గోడును కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సమస్య పరిష్కరించి ఉద్యోగం ఇప్పించాలని ఆమె వేడుకున్నారు. -
హోంగార్డులు.. ఎన్ని పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్‌గానే జరుగుతోంది. ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్–క్వార్టర్స్ లేదా అడ్మిన్ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్ అక్కడ అప్రూవ్ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్ ఆఫీస్‌కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది. గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్‌గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్‌తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ సర్వర్ కమాండెంట్ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు. కేవలం పర్మిషన్లు, ఆన్డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్‌గా, నేరుగా పంపితే సరిపోతుంది. ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు. -
హోంగార్డులను స్టేషన్లోనే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు పోలీస్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. హోంగార్డులంతా డ్యూటీలోనే ఉండాలని, డ్యూటీ అయిపోయిన వారిని కూడా పోలీస్ స్టేషన్లకే పరిమితం చేయాలని హుకుం జారీ చేసినట్టు ఓ ఆడియో వైరల్ అయ్యింది. రవీందర్ మృతికి నిరసనగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయినట్టు తెలిసింది. ఆదేశాలు మీరితే విధుల నుంచి బహిష్కరణకు గురవుతారని ఓ దశలో బెదిరింపు ధోరణిలో హెచ్చరించినట్టు తెలిసింది. ’రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు’ ‘విధుల్లో ఉండే హోంగార్డులు, డ్రైవర్లు, ఆఫీసర్ల దగ్గర పనిచేసే వాళ్లయినా, డే డ్యూటీ చేసేవాళ్లు, ఇంకే డ్యూటీలో ఉండేవాళ్లయినా సరే ప్రతి ఒక్కరూ ఈ రోజు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. స్టేషన్ వదిలి బయటికి వెళ్లకూడదు. డ్యూటీ అయిపోయిన వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచండి..రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు. ఎవరెవరైతే ఆబ్సెంట్‌లో ఉన్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టండి. పది నిమిషాల తర్వాత మళ్లీ నాకు చెప్పండి. ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్లను మిస్కండక్ట్ కింద తీసుకోబడుతుంది. వాళ్ల ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్. అందరికీ పేరు పేరున ఫోన్ చేసి తెలపండి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ...’అని ఓ పోలీస్ అధికారి సెట్లో ఆదేశాలిస్తున్న ఆడియో ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లపై బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నా...హోంగార్డులు అంతర్గతంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుట్రతోనే డీఎంకే వ్యాఖ్యలు: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాజకీయకుట్రలో భాగంగా, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి, మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార డీఎంకే గందరగోళం సృష్టిస్తోందని బీజేపీ నేత తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాలిన్‌తో పాటు కేంద్రమాజీమంత్రి ఎం.రాజాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...తాను యజ్ఞయాగాలకు కేరాఫ్ అని చెప్పుకునే సీఎం కేసీఆర్, ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డులకు అధికారుల వార్నింగ్
-
హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించండి
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించి.. ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరిగా పరిగణించలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన హోంగార్డులు చింతా గోపీ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.శీనాకుమార్ వాదనలు వినిపిస్తూ.. సాధారణ అభ్యర్థులకు నిర్ధేశించినట్లు హోంగార్డులకు కూడా కటాఫ్ మార్కులు నిర్ణయించడం తగదని.. ఇది గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. మొత్తం పోస్టుల్లో హోంగార్డులకు ప్రత్యేకంగా 15 శాతం కోటా ఉందని చెప్పారు. 2016 నాటి జీవో 97 ప్రకారం స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రత్యేక కేటగిరికి వర్తించని తెలిపారు. సాధారణ అభ్యర్థుల్లాగా ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో పిటిషనర్లు దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోవాల్సి వచ్చిందని శీనాకుమార్ వివరించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలని ఆదేశించారు. కటాఫ్‌తో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేశారు. కౌంటర్లు దాఖలుకు గడువిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
నకిలీ హోంగార్డుల కుంభకోణం: అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోలీసు శాఖను కుదిపేస్తున్న నకిలీ హోంగార్డుల కుంభకోణంలో వన్‌టౌన్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఆర్. మణిగండన్, టి.యువరాజ్, బీఆర్ కిరణ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు హోంగార్డులు, ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిని మీడియా ఎదుట హాజరుపరిచే అవకాశముంది. 87 మంది నిరుద్యోగులను దొడ్డిదారిన పోలీసు శాఖలోకి చొప్పించిన బాగోతం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి కుట్రలో భాగమైన జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ పొందేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక నకిలీ హోంగార్డుల వ్యవహారంలో అవకతవకలను గుర్తించిన చిత్తూరు ఏఆర్ ఆర్ఐ మురళీధర్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో వన్‌టౌన్ సీఐ నరసింహరాజు ఐపీసీ 420, 419, 409, 468, 471 రెడ్‌విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆ 87 మందికీ తొలగింపు ఉత్తర్వులు మరోవైపు.. పోస్టులు పొందిన 87 మందినీ డీఐజీ ఆదివారం విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు వీళ్లను తొలగించకపోతే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంగార్డు కోటా చూపించి వీరంతా ఉద్యోగాల్లో చేరిపోయే ప్రమాదాన్ని పసిగట్టి ఈ నిర్ణయం హుటాహుటిన తీసుకున్నారు. ఈ 87 మందిలో 28 మంది టీటీడీలో, చిత్తూరు, తిరుపతి అగ్నిమాపక శాఖలో 22 మంది, కాణిపాకం ఆలయంలో 15 మంది, చిత్తూరు, తిరుపతి రవాణాశాఖలో 10 మంది, లా అండ్ ఆర్డర్లో ఐదుగురు, చిత్తూరు జిల్లా జైల్లో ముగ్గురు, తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్, చిత్తూరు స్త్రీ–శిశు సంక్షేమశాఖలో ఒకొక్కరు, ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఒకరితోపాటు సర్వీసు నుంచి తొలగించిన మరొకరు ఉన్నారు. మరోవైపు ఈ కుట్రపై చిత్తూరు ఎస్పీ వై. రిషాంత్‌రెడ్డి స్పందిస్తూ లోతుగా దర్యాప్తు జరుగుతుందని, బాధ్యులందరిపైనా చర్యలుంటాయని స్పష్టంచేశారు. -
AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..
సాక్షి, అమరావతి: హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్), ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ – ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. హోంగార్డులకు ముఖ్యమంత్రి వరం హోంగార్డులకు ప్రయోజనం కలిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపునకు నోచుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోంగార్డుల జీతాలు పెంచింది. అప్పటివరకు నెలకు రూ.18 వేలు మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని రూ.21,300కి పెంచుతూ 2019 అక్టోబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వారికి మరింత మేలు చేకూరుస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. అంతకంటే ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి వరంగా మారనుంది. చదవండి: ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. -
హోంగార్డుల వేతన వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలలో పదిహేను రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు అందకపోవడం ఆ కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలోకి లోనవుతున్నాయి. రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూళ్లు ప్రారంభంకావడంతో పుస్తకాలు, యూనిఫామ్‌ల ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని యూనిట్లు, జిల్లాల్లో హోంగార్డులదీ ఇదే పరిస్థితి. ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. రాష్ట్రవ్యాప్తంగా 16460 మంది హోంగార్డులు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి కొద్ది రోజుల క్రితమే వేతనాలు పెంచింది. ప్రతి నెలా రూ.26వేల చొప్పున చెల్లిస్తోంది. అయితే హైదరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న వారికి ఈ నెల 4నే వేతనాలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో ఇప్పటివరకు వేతనాలు అందలేదు. నెలలో 15వ తేదీ సమీపించినా జీతాలు రాకపోవడంతో అప్పులు చేస్తున్నట్టు హోంగార్డులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి వేతనాలు అందాయని, తమకు ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకారణంగా రూ.10వేల కోత... ఎలాంటి కారణం చెప్పకుండానే ఏప్రిల్ నెల వేతనంలో రూ.10వేల కోత విధించినట్టు తెలిసింది. కరోనా సమయంలో కూడా వేతనాలు చెల్లించిన పోలీస్ శాఖ ఇప్పుడు ఏ కారణంతో రూ.10వేల కోత విధించిందో తెలియడం లేదని, మే నెల జీతమైనా సమయానికి వస్తుందిలే అనుకుంటే అదీ ఇంకా అందలేదని వారు వాపోతున్నారు. ఈ నెలలో కూడా కోత పెడితే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అంటున్నారు. అసోసియేషన్లు ఎక్కడున్నాయి... తమ సంక్షేమం కోసం ఏర్పడిన అసోసియేషన్లు ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదని హోంగార్డులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, ఇప్పుడు రెండు మూడు సంఘాలుగా విడిపోవడంతో అసలు అసోసియేషన్లు ఉన్నాయా, లేవా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
మెరుగుపడింది జీతాలే... జీవితాలు కాదా!?
పోలీసు శాఖనుండి మొదలుకొని గిడ్డంగుల్లో, జెన్కో, ఫైర్, ఆర్టీవో, ట్రాఫిక్, జైళ్ళు ఇలా ప్రతీశాఖలో విస్తరించి పనిచేస్తున్న ఏకైక సంస్థ హోంగార్డ్స్. 1946 డిసెంబర్ ఆరున బొంబాయి ప్రావెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ శాఖల్లో అదనపు సహయార్థం స్వచ్చంద సంస్థగా దీన్ని స్థాపించారు. తర్వాత 1962లో భారత్–చైనా యుద్ధ సమయంలో వీరిని పునర్వ్యవస్థీకరించారు. ఈ పరంపరలోనే వీరి సేవలు గమనించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాలం టరీ ప్రక్రియ కింద నియామకాలు చేపట్టాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరి జీతాల్లో మార్పులు వచ్చాయి గానీ జీవితాలు మరింత చీకట్లోకి నెట్టివేయబడ్డాయనే చెప్పుకొని తీరాలి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ హోంగార్డుల జీతం రూ. 600 నుండి 710 రూపాయలకు పెంచగా తెలంగాణలో నెలకు 12 వేల నుండి 20 వేల రూపాయలకు పెంచడమే కాకుండా ప్రతీ ఏడాదీ రూ. 1,000 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదెంతో ఆహ్వానించదగిన విషయం. కానీ, ఈ నిర్ణయంతోపాటు అంతకుముందున్న కారుణ్య నియామకాలను తొలగించడం పిడుగులాంటి వార్తనే. ఉద్యోగి సర్వీస్ కాలంలో మరణిస్తే, వైద్య కారణాలవలన ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉద్యోగికి ఏర్పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియమకాలను అమలు పరిచే అవకాశాన్ని హోంగార్డులకు తొలగించారు. దీనితో తెలంగాణలో పనిచేస్తున్న సుమారు 17,490 మంది హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అయితే ఈ కారుణ్య నియామకాలను ఆంధ్రప్రదేశ్‌లో హోం గార్డ్స్‌కు అమలు పర్చడమనేది హర్షించదగిన విషయం. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి 2019 తర్వాత హోంగార్డ్స్ జీతాలు పెంపుదల సందర్భంలో డబుల్ బెడ్రూం ఇంటి కలను సాకారం చేస్తానని చెప్పిన వాగ్దానం నేటికీ అలాగే ఉండిపోయింది. పోలీసులకు వర్తించే ఎటువంటి అలవెన్స్ వీరికి వర్తించవు. అనారోగ్యంతో బాధపడే క్షణాల్లో కూడ ఆరోగ్య భద్రత స్కీం వీరికి వర్తించకపోవడం, విధినిర్వహణలో చనిపోయినపుడు పోలీసులకు వర్తించే ఎక్స్‌గ్రేషియా హోంగార్డ్స్కు లేకపోవడం, పోలీసు శాఖలో కానిస్టేబుల్ వంటి ఉద్యోగులతో పోటీపడి విధినిర్వహణ చేస్తున్నప్పటికీ వీరికి అదనపు అలవెన్స్ లేకపోవడం, పైగా ఏధైనా పండుగ పబ్బానికి సెలవులు పెట్టుకునే సీఎల్(క్యాజువల్ లివ్) వెసులుబాటు లేకపోవడం, రోగమొస్తే మెడికల్ లీవ్ అవకాశం లేకపోవడం, హోంగార్డ్స్ ఏరోజు పనిచేస్తే ఆరోజుకే కూలీ చెల్లించే ధోరణిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుశాఖ అంటేనే డిసిప్లిన్ పేరుమీదుగా దర్జాగా సాగే వెట్టిచాకిరికి ప్రతిరూపంగా ఉంటుంది. హోంగార్డ్స్ ఉద్యోగ భద్రత లేని బానిసల్లాగే కుక్కిన పేనులాగా అధికారుల చేతిలో హింసపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఉన్నతాధికారుల ఆఫీసుల్లో, క్యాంపు కార్యాలయాల్లో, చివరికి వీరి ఇళ్ళలో పాకీ పనులకు, చివరకు సొంతపనులకు కూడ హోంగార్డులను వినియోగించే అధికారులు ఉండటం విచారకరం. ఇకపోతే మహిళ హోంగార్డ్స్ పరిస్థితి మరింత దారుణం. మహిళా హోంగార్డుల పట్ల మాతృత్వ విషయంలో కూడ వివక్ష చూపుతున్నారు. ప్రసూతి సెలవులు మహిళా పోలీసులకు జీతంతో కూడిన ఆరుమాసాల సెలవులైతే మహిళా హోంగార్డులకు మాత్రం మూడునెలల బాలింతగానే విధులకు హజరు కావాల్సిన దుస్థితి ఉన్నది. పైగా డెలివరీ సమయంలో ఎటువంటి భృతీ లభించే పరిస్థితి కూడ లేదు. ఇదికాక లైంగిక వేధింపులు షరామాములుగానే ఉంటాయనేది కాదనలేని విషయం!? ఇటీవల ఎస్ఐ స్థాయి మహిళా అధికారి ఉదంతమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక హోంగార్డులకు మెరుగుపడింది జీతాలే తప్ప జీవితాలు కావనేది చాలా స్పష్టంగా కన్పిస్తున్న యధార్థం. ముఖ్యంగా కారుణ్య నియమకాల విషయంలో కాఠిన్యంతో కాకుండా కరుణతో, మానవీయ కోణంలో తెలంగాణ ప్రభుత్వం యోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. అలాగే హోంగార్డుల వెట్టిచాకిరీని తొలగించి, ఇతర ఉద్యోగులకు మల్లే వీరికీ కనీస హక్కులను కల్పించడంపై మన ప్రభుత్వాలు యోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. వరకుమార్ గుండెపంగు వ్యాసకర్త కథా రచయిత ‘ మొబైల్ : 99485 41711 -
హోంగార్డులవి సివిల్ పోస్టులే
సాక్షి, అమరావతి: హోంగార్డుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హోంగార్డులు నిర్వర్తించే విధులు ‘సివిల్ పోస్టు’ కిందకే వస్తాయని, అందువల్ల వారిని ఎలా పడితే అలా సర్వీసు నుంచి తొలగించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని అధికరణ 311(2) ప్రకారం తగిన విచారణ జరపకుండా హోంగార్డులను శిక్షించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేగాక హోంగార్డుల చేరిక, వారు అందించే సేవలు స్వచ్ఛందం(వాలంటరీ) అంటూ ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. ఎవరు పడితే వారు హోంగార్డుగా చేరడానికి కుదరదని, ప్రభుత్వం కొన్ని అర్హతలను, ప్రమాణాలను నిర్దేశించి, అర్హులను మాత్రమే హోంగార్డులుగా ఎంపిక చేస్తుందని, అందువల్ల వారి సేవలను స్వచ్ఛందమని చెప్పజాలమని తెలిపింది. అలాగే హోంగార్డులకు ఏపీ పోలీస్ మాన్యువల్ చాప్టర్ 52 వర్తించదని స్పష్టం చేసింది. ఏపీ హోంగార్డుల చట్ట నిబంధనలే వర్తిస్తాయంది. పలు కేసుల్లో నిందితులుగా ఉండి నిర్దోషులుగా బయటకు వచ్చిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇది వారి జీవించే హక్కును హరించడమే అవుతుందని స్పష్టం చేసింది. హోంగార్డులను సర్వీసు నుంచి తొలగించే అధికారం కమాండెంట్‌కే ఉంటుంది తప్ప, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఉండదని తెలిపింది. వివిధ కారణాలతో పలువురు హోంగార్డులను సర్వీసు నుంచి తొలగిస్తూ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు జారీ చేసిన వేర్వేరు ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. హోంగార్డుల చట్టం, దాని నిబంధనలను అనుసరించి తగిన ఉత్తర్వులు జారీ చేసే స్వేచ్ఛను ఆయా కమాండెంట్లకు ఇచ్చింది. హోంగార్డులుగా తొలగించిన పిటిషనర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పలు ఆరోపణలతో తమను సర్వీసు నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు సవాలు చేస్తూ పలువురు హోంగార్డులు 2019, 20, 21 సంవత్సరాల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇటీవల ఉమ్మడి తీర్పు వెలువరించారు. ‘‘మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత మద్రాసు హోంగార్డుల చట్టాన్ని మనం అన్వయింప చేసుకున్నాం. అందువల్ల హోంగార్డుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలు తదితరాలన్నీ కూడా 1948లో తీసుకొచ్చిన ఏపీ హోంగార్డుల చట్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలేవీ హోంగార్డులకు వర్తించవని చెబుతోంది. ఏపీ పోలీస్ మాన్యువల్‌లోని చాప్టర్ 52 ప్రకారం హోంగార్డులు నడుచుకోవాల్సి ఉంటుందని వాదిస్తోంది. వాస్తవానికి హోంగార్డులు పోలీసుల నియంత్రణలో పనిచేస్తున్నప్పటికీ, వాళ్లు పోలీసు విభాగంలో భాగం కాదు. హోంగార్డులది ప్రత్యేక వ్యవస్థ. వారి ఎంపికకు ప్రత్యేక అర్హతలు, నిబంధనలున్నాయి. ఏపీ హోంగార్డుల చట్టాన్ని అనుసరించి పోలీసు మాన్యువల్ నిబంధనలను రూపొందించలేదు. అందువల్ల హోంగార్డులకు పోలీసు మాన్యువల్ వర్తించదు’ అని తన తీర్పులో పేర్కొన్నారు. -
హోంగార్డులు నిస్వార్థ సేవకులు
సాక్షి, అమరావతి: హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. 58వ హోం గార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా దృక్పథంతో హోం గార్డులు నిర్వహించిన విధులు, వారు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. హోంగార్డుల సంక్షేమం, వారి పిల్లల విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం అనేక పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రోజువారీ భత్యం రూ.710కి పెంచామన్నారు. 15 వేల హోం గార్డు కుటుంబాలను యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేశామన్నారు. ఆకస్మిక మరణం సంభవిస్తే రూ.30 లక్షలకు ఇన్సూరెన్స్ చేశామని, భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచుతామని చెప్పారు. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఈ ఏడాది రూ.5 లక్షల నుండి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. మహిళా హోం గార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నామన్నారు. హోం గార్డుల ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. హోంగార్డులు అంకితభావంతో, మంచి సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని డీజీపీ ఆకాంక్షించారు. హోంగార్డుల కుటుంబాల్లో జగన్ వెలుగులు నింపారు హోంగార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.గోవిందు వేతనాలు పెంచి హోంగార్డుల కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారని హోం గార్డ్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.గోవిందు పేర్కొన్నారు. 58వ హోం గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయనతో పాటు సంఘం నాయకులు డి.బాబురావు, బి.చిరంజీవి, కోటేశ్వరరావు, ఎం.శ్రీనివాసులు హోం మంత్రి సుచరితను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హోం గార్డుల సమస్యలపై వినతి పత్రాన్ని హోం మంత్రికి అందజేశారు. హోంగార్డులకు రోజుకి రూ.600 నుండి రూ.710కి వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
వారికి ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహం
సాక్షి, విజయవాడ : హోంగార్డుల సామాజిక, ఆర్ధిక స్థితి అనేక రెట్లు పెంచడంతో పాటు ఎన్నడూ లేని విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. వేతనాల పెంపు, ప్రమాద భీమా వర్తింపుతో హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. రాష్ట్రానికి హోంగార్డులు అద్భుతమైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. ఆదివారం 58వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు రూ.18 వేల నుంచి రూ. 21,300 పొందుతున్నారు. 15000 హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి ఏదైనా ఆకస్మిక మరణం సంభవిస్తే, హోంగార్డు కుటుంబానికి 60 లక్షల భీమా చెల్లించబడుతుంది. వ్యక్తిగత ప్రమాద భీమా పాలసీని ఈ ఏడాది 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. హోంగార్డుల సరైన ఆరోగ్య సంరక్షణ కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు మంది హోంగార్డులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి. మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాము. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క హోంగార్డుకు ఈహెచ్ఎస్/ఆరోగ్యశ్రీ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “అందరికీ హౌసింగ్” పథకం కింద ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి ఇళ్లను కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. -
హోం గార్డ్స్.. ఫుల్ జోష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే హోంగార్డులకు వేతనాల పెంపు, బీమా వర్తింపు వంటి కీలక వరాలను అమల్లోకి తేవడంతో వారిలో జోష్ పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 12 వేల మంది హోంగార్డులు ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం వారి నియామకాలు మరింత పెరిగి మన రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 16,650 మంది ఉన్నారు. పోలీస్ శాఖతోపాటు అగ్నిమాపక శాఖ, జైళ్లు, ఆలయాలు, ఎఫ్‌సీఐ, దూరదర్శన్, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తదితర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోను హోంగార్డులు సేవలందిస్తున్నారు. వేతనాల పెంపు కోసం వారు ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ వచ్చారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలు జిల్లాల్లో కలిసిన హోంగార్డ్స్ ప్రతినిధులు వేతనాల పెంపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాను అధికారం చేపట్టిన వెంటనే వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ తొలి మంత్రివర్గ సమావేశంలోనే హోంగార్డుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి వేతనం రూ.21,300కు పెరిగింది. ఏదైనా ప్రమాదంలో హోంగార్డు మరణిస్తే రూ.30 లక్షలు బీమా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తీవ్రవాదులు, మావోయిస్టుల దాడుల్లో మృతి చెందితే రూ.40 లక్షలు బీమా వర్తించేలా నిర్ణయం తీసుకుంది. 1962 డిసెంబర్ 6 నుండి రాష్ట్రాల పరిధిలోకి.. దేశ వ్యాప్తంగా 1947 నుంచి హోంగార్డ్స్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 1962 డిసెంబర్ 6న హోంగార్డ్స్ వ్యవస్థను రాష్ట్రాల పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి డిసెంబర్ 6వ తేదీన హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి మా వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. ప్రస్తుతం ఇస్తున్న నెలకు రెండు సెలవులను ఏడాది మొత్తానికి కలిపి 24 సెలవులను ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించాలి. కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తాం. పోలీస్ రిక్రూట్మెంట్లో హోంగార్డుల రిజర్వేషన్ పెంచాలని కోరతాం. – ఎస్.గోవిందు, అధ్యక్షుడు, ఏపీ హోంగార్డుల సంక్షేమ సంఘం హోంమంత్రిని కలుస్తాం వేతనాల పెంపు, బీమా వర్తింపు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో హోంగార్డుల వెతలు తీరుతాయనే నమ్మకం ఉంది. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా హోంమంత్రి మేకతోటి సుచరితను ఆదివారం కలిసి విజ్ఞప్తి చేస్తాం. – దస్తగిరి బాబు,ప్రధాన కార్యదర్శి, ఏపీ హోంగార్డుల సంక్షేమ సంఘం -
వేతనాల్లో శాతాల వారీ కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పూర్తి వేతనాన్ని శాతాల వారీగా వాయిదా వేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నం. 27లో పేర్కొన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చికి సంబంధించి ఏప్రిల్‌లో రావాల్సిన పూర్తి వేతనంలో కోత విధించనున్నారు. ఈ కోత వాయిదా మాత్రమేనని, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేతన వ్యత్యాసాన్ని వాయిదా రూపంలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు ఈ పాటికే ఈ కుబేర్‌లో సమర్పించి ఉంటే ఈ వ్యత్యాసాన్ని ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా వర్తింపజేయాలని, ఇప్పటివరకు సమర్పించని బిల్లులను జీవోలో పేర్కొన్న వ్యత్యాసాన్ని వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనంలో 10% వేతనాన్ని వాయిదా వేయాలని, హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు/హెల్పర్లు, వీఆర్ఏలు, విద్యావాలంటీర్లు తదితరులకిచ్చే గౌరవ వేతనానికీ ఈ వాయిదా వర్తిస్తుందన్నారు. నాలుగో తరగతి పెన్షనర్లకు 10%, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లో 50%, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల పింఛన్లో 60% వాయిదా వేయాలన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన బిల్లులు, చెక్కులను వెనక్కు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వ్యత్యాసాన్ని వర్తింపజేసి వేతనాన్ని వాయిదా వేయాలని, ఆ మేరకు మళ్లీ బిల్లులు, చెక్కులు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
హోంగార్డులకు స్థలయోగం
ఇన్నాళ్లకు వారి వెతలు తీరాయి. వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వారి గురించి పట్టించుకునే పాలకులు లభించారు. అచ్చంగా పోలీసు విధులే నిర్వర్తిస్తున్నా ఎలాంటి సౌకర్యాలకు నోచుకోక... అరకొర వేతనాలే లభిస్తున్నా కష్టాలకు వెరవక... ఇబ్బందులు ఎదురవుతున్నా... వాటిని మునిపంటినే దాచుకుని విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వారికీ స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేనా... వాటిపై ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం పూల్‌బాగ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఎన్నో సేవలు అందిస్తున్న హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. అందుకోసం ఇటీవల జీఓ 77ను విడుదల చేసింది. దీని ప్రకారం హోంగార్డుల సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. ఇప్పటికే ఈ జీఓ ప్రకారం జిల్లాకేంద్రంలోని విజయనగరం నియోజకవర్గం పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. ఇంకా మండలాల వారీగా ఆయా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. చాలా మండలాల్లో తహసీల్దార్లు దీనిపై దృష్టి సారించకపోవటంపై ఆయా మండలాల పరిధిలోగల హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి న్యాయం చేసేందుకు ముందుకు వస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చిన అవకాశాలు చేతికి అందకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. తహసీల్దార్లకు ఆదేశాలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం కలక్టర్ హరిజవహర్‌లాల్, గృహ నిర్మాణశాఖాధికారులకు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. కొన్ని చోట్ల అసలు ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా హోంగార్డులకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరితో పాటు పట్టాలు అందజేయనున్నారు. వీరికి ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన స్కీం ద్వారా గృహ నిర్మాణానికి రూ.1.50లక్షలు అందజేయనున్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా పలు సందర్భాల్లో హోంగార్డుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలను విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి హోంగార్డులకు కూడా ఇళ్ల స్థలాల పంపిణీ, ఆ తరువాత ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసేందుకు జీఓ నంబర్.77ను విడుదల చేశారు. సీఎంకు రుణపడి ఉంటాం... హోంగార్డుల సమస్యలపై చాలా సార్లు చాలా ముఖ్యమంత్రులకు వినతులు అందజేశాం. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మా సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు, మాకు గూడు కలి్పంచేందుకు ఇప్పుడు జీఓ నెం.77 విడుదల చేశారు. హోంగార్డులందరికీ గృహనిర్మాణంకోసం, ఇళ్ల స్థలాలు అందజేస్తున్నారు. ఆయన సేవలు మరువలేనివి. – పడగల బంగార్రాజు, జిల్లా అధ్యక్షుడు, హోంగార్డులసంక్షేమ సంఘం. విజయనగరం. బీమా పెంచారు. గతంలో కంటే ఇప్పుడు బీమా మొత్తం చాలా ఎక్కువ పెంచారు. హోంగార్డులు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.30లక్షలు బీమా సదుపాయం కల్పించారు. దీనివల్ల కొంత భరోసా లభించింది. హోంగార్డుల విషయంలో ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. – ఎస్.గోపాల్, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యుడు, పార్వతీపురం. జీతాలు పెంచారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హోంగార్డుల జీతాలు పెంచారు. వాటితో పాటు బీమా పెంచారు. ఇప్పుడు నివాసం కోసం ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – ఎస్.రవి, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యులు,విజయనగరం. -
హోంగార్డుల అక్రమ వసూళ్ల వ్యవహారం
కర్నూలు, డోన్: పట్టణానికి చెందిన ఇద్దరు హోంగార్డులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీడియోలు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో హల్చల్ చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లు, లారీ, వ్యాన్ డ్రైవర్లను బెదిరించి వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం పట్టణంలో పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కొందరు సరుకుల అన్లోడ్ చేస్తున్న వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు చేయడం రివాజుగా మారిందంటున్నారు. వీరి చేష్టల వల్ల పెద్ద వాహనాలు రోడ్లకు అడ్డంగా నిలిపి సిమెంట్, నిత్యావసర వస్తువులు, ఐరన్లను అన్లోడ్ చేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని డ్రైవర్లపై ఆరోపణలున్నాయి. అయితే ఈ వీడియోల హల్‌చల్‌ను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంతృప్తికరమైన రీతిలో ప్రభుత్వం వేతనాలు పెంచినా ఇలా లంచాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
హోంగార్డుల సంక్షేమంలో మనమే బెస్ట్
సాక్షి, అమరావతి: హోంగార్డ్‌ల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 6న నిర్వహించే హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ప్రభుత్వం హోంగార్డులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతోపాటు పోలీసులతో సమానంగా యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షలకు ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు వివరించారు. హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
ఏపీలో 8మంది అడిషనల్ ఎస్పీలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఏపీ పోలీసుశాఖకు చెందిన ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా టీవీ నాగరాజు, ఏసీబీ ఎస్పీగా జె.భాస్కర్‌రావు, విజయవాడ ఇంటలిజెన్స్ ఎస్పీగా కె. బాల వెంకటేశ్వరరావులను నియమించింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె. సూర్యచంద్రరావును పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2018 జూన్ 18 నుంచి 2019 జూలై 16వ తేదీ వరకే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు నష్ట పరిహారం విడుదల చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 13 జిల్లాల్లో 63 మంది హోంగార్డు కుటుంబాలకు రూ. 3కోట్ల 15 లక్షల పరిహారం అందించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఆ రూమర్స్ నమ్మొద్దు: సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో మరోసారి హోంగార్డుల ఎంపిక ప్రక్రియ జరుగనుందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం వదంతులేనని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం స్పష్టం చేశారు. ఇలాంటివి నమ్మవద్దని, మోసగాళ్ల వలలో పడి మోసపోవద్దని కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన శుక్రవారం ట్విటర్లోనూ ట్వీట్ చేశారు. Someone is spreading rumour that Homeguard selection will take place. It is a false news. Please don't get cheated by anyone. There is no selection for Home Guard anywhere in Telangana. Anjani Kumar IPS, Commissioner Hyderabad. — Anjani Kumar, IPS (@CPHydCity) November 22, 2019 -
కొత్త వెలుగులు
సాక్షి, అమరావతి: వీక్లీ ఆఫ్ ఇవ్వడంతో పోలీసుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసినట్టుగానే వేతనాల పెంపుతో హోంగార్డుల జీవితాల్లోనూ కొత్త వెలుగులు ఉదయించాయి. వేతనాల పెంపుతోపాటు అనేక ప్రయోజనాలు కూడా కల్పించడంతో దుర్భర పరిస్థితుల నుంచి ధైర్యంగా విధులు నిర్వర్తించగలుగుతున్నామంటూ హోంగార్డులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులతో సమానంగా కష్టపడుతూ చాలీచాలని జీతాలతో తాము విధులు నిర్వర్తించామని.. ఇప్పుడు తమ కష్టాలు తీరుతున్నాయని చెబుతున్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం జూన్ 10న నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే హోంగార్డులకు వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కి పెంచింది. దీంతో వారి నెల జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరిగింది. పెంచిన వేతనాన్ని అక్టోబర్ 1 నుంచి వర్తింపచేయాలని ఉత్తర్వులిచ్చింది. వేతన పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 16,616 మందికి మేలు కలుగుతుంది. వేతనం పెంపుతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఇప్పటివరకు పోలీసులకు మాత్రమే అమలవుతున్న బీమాను హోంగార్డులకు వర్తింపజేస్తూ తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు అకాల మరణం చెందితే రూ.30 లక్షలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోతే మరో రూ.10 లక్షలు కలిపి రూ.40 లక్షలు ఇవ్వనుంది. ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు పరిహారం అందిస్తుంది. హోంగార్డు చనిపోతే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.10 వేలకు పెంచింది. అంతేకాకుండా వారి ఆరోగ్య సంరక్షణ కోసం అతి త్వరలోనే హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయనుంది. నిబంధనల ప్రకారం.. అర్హత ఉన్న హోంగార్డులకు గృహనిర్మాణ పథకంలో ఇళ్లు కేటాయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. జీవితంలో మరిచిపోలేం – ఎస్.గోవిందు, హోంగారŠుడ్స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హోంగార్డుల వేతనాలు పెంచి సీఎం వైఎస్ జగన్ మా మనసు గెలుచుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మేలును మా జీవితంలో మరిచిపోలేం. ప్రతినెలా ఒకటినే జీతం అందుతోంది అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వేతనాలు పెంచడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రతి నెలా ఒకటినే మాకు జీతం అందుతోంది. దీంతో కుటుంబ సమస్యలు తీరుతున్నాయి. - సీహెచ్.శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ పీఆర్వో, హోంగార్డు అసోసియేషన్ గుంటూరు రూరల్ సీఎంను జీవితాంతం గుర్తుంచుకుంటాం కాళ్లరిగేలా తిరిగినా చంద్రబాబు మమ్మల్ని ఆదుకోలేదు. చివరకు పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిశాం. ‘అన్నా మన ప్రభుత్వం వచ్చాక మీ వేతనాలు పెంచుతాం’ అని ఆయన మాకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మాట నిలబెట్టుకుని మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయనను మా జీవితాంతం గుర్తుంచుకుంటాం. – రూప్‌కుమార్, హోంగార్డు, చిత్తూరు -
విధి నిర్వహణలో వివక్ష చూపొద్దు
మన రాష్ట్ర భద్రత కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. అలాంటి అమరవీరులకు సగర్వంగా సెల్యూట్ చేస్తున్నా.. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు అందరి కష్టం నాకు తెలుసు. ఎండ, వాన, రాత్రి, పగలు అని చూడకుండా వారానికి ఒక్కరోజు కూడా సెలవు లేకుండా కష్టపడుతున్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) ప్రకటించాం. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : చట్టం ఏ కొందరికో చుట్టం కాకూడదని, విధి నిర్వహణలో వివక్ష చూపొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పిలుపునిచ్చారు. మెరుగైన పోలీస్ సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలంటే అందరికీ సమన్యాయం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర స్థాయి పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ఎవరికైనా ఒకే రూలు, ఒకే చట్టం అయినప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయని ప్రతి పోలీస్ సోదరుడికి, పోలీస్ అక్కచెల్లెమ్మలకు గుర్తు చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. అమర వీరులందరికీ సెల్యూట్.. ‘‘పోలీస్ అమర వీరుల కుటుంబాలకు, పోలీస్ శాఖలోని సిబ్బంది, అధికారులు, ఉద్యోగులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ రోజు పోలీస్ అమర వీరులను గుర్తు చేసుకునే రోజు. 1959లో చైనా సరిహద్దులో ఎస్ఐ కరణ్ సింగ్ నేతృత్వంలో గస్తీ నిర్వహిస్తున్న 20 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిపై వందల సంఖ్యలో చైనా సైనికులు విరుచుకుపడ్డారు. వీరున్నది 20 మందే అయినా వీరోచితంగా ఎదురు దాడి చేశారు. ఈ దాడిలో పది మంది పోలీసులు వీర మరణం పొందారు. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ దేశమంతా పోలీసుల అమర వీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఇటువంటి ఘటనలు మన రాష్ట్రంలో కూడా అనేకం వున్నాయి. మన రాష్ట్ర భద్రత కోసం అనేక సందర్భాల్లో ఎందరో ప్రాణాలు అర్పించారు. అలాంటి అమర వీరులకు ఇక్కడి నుంచి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు మన దేశ సార్వ¿ౌమాధికారానికి చిహ్నం. దానిని కాపాడే వారే పోలీసులు. అందుకే పోలీస్ స్టేషన్‌ను మనం రక్షకభట నిలయం అని పిలుస్తున్నాం. ప్రజల హృదయాల్లో నిలవాలి మెరుగైన పోలీసు సేవలు అందించాలన్నా, ప్రజల హృదయాల్లో నిలవాలన్నా శాంతిభధ్రతల విషయంలో పోలీసులు రాజీ పడకూడదు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదని నా మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పాను. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులకు రక్షణ కల్పించడంలో ఏమరుపాటు వద్దని చెప్పాను. పౌరుల భద్రత విషయంలో రాజీ పడవద్దని ఆదేశించాను. బడుగు, బలహీన వర్గాలు, పేదవారి మీద హింస జరుగుతుంటే.. కారకులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని చెప్పాను. న్యాయం, ధర్మం ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి. చట్టం ఏ కొందరికో చుట్టం కానప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయి. న్యాయం కోసం వచి్చన పేదలు, బలహీనవర్గాల వారు కూడా వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళితేనే పోలీసులు ప్రజల మన్ననలు, గౌరవాన్ని పొందగలుగుతారు. పోలీసులు వారానికి ఒక రోజు వారి రోజువారీ బాధ్యతలను పక్కన పెట్టి కుటుంబంతో గడిపితే.. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అందుకే వారంతపు సెలవు ప్రకటిస్తూ మార్పునకు శ్రీకారం చుట్టాం. తద్వారా మెరుగైన పోలీస్ వ్యవస్థ వస్తుందనే విశ్వాసం నాకుంది. పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద అంజలి ఘటిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళిలోనూ సీఎం నిబద్ధత.. పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళి అర్పించడంలో చూపిన నిబద్ధత అందరి ప్రశంసలందుకుంది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీనియర్ ఐపీఎస్‌లు వెంట రాగా సీఎం వైఎస్ జగన్.. చెప్పులు పక్కన వదిలి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివిధ వర్గాల ప్రముఖులు, అధికారులు సీఎం చర్యను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారైనా మినహాయింపు వుండకూడదు. అందరికీ ఒకే రూల్ వర్తింప చేయాలి. అప్పుడే పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుంది. రాష్ట్రంలో లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తనపై నిజాయితీగా యుద్ధం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఆ దిశగా మీరు ముందడుగు వేయండి. మీకు అండగా నేనుంటాను. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు న్యాయం దేశంలోనే మొట్టమొదటిసారిగా హోంగార్డు, పోలీసుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంగార్డ్‌ల జీతాలు మెరుగు పరిచాం. ఇంతకు ముందు రూ.18,000 ఇస్తున్న వేతనాన్ని రూ.21,300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. విధి నిర్వహణలో హోంగార్డ్ మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను మా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా విధి నిర్వహణలో చనిపోతే.. హోంగార్డ్‌లకు, పోలీసులకు రూ.30 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీని మన ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోతే మరో రూ.10 లక్షల కవరేజీ అదనంగా వస్తుంది. దేశంలో మొదటిసారిగా ఏపీలోనే ఈ ఇన్సూరెన్స్ కవరేజీని పోలీస్ సిబ్బంది పదవీ విరమణ తర్వాత కూడా వర్తించేలా నిబంధనలు తీసుకొచ్చిన హోం మంత్రి, డీజీపీలకు నా అభినందనలు. హోంగార్డ్, కానిస్టేబుల్, ప్రతి అధికారికి ఒక్కటే చెబుతున్నా.. విధి నిర్వహణలో మీరు మంచి పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేయండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా వుంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. అంతకు ముందు ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. -
హోంగార్డులకు రూ.40 లక్షల బీమా
సాక్షి, అమరావతి: హోంగార్డులకు బీమా సౌకర్యం కల్పించేందుకు యాక్సిస్ బ్యాంక్ ముందుకు రావడం చాలా సంతోషకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 15వేల మంది హోంగార్డులు, 72వేల మంది పోలీసులకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రమాదంలో మరణించిన హోంగార్డులకు రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. పూర్తిగా అంగ వైకల్యం కలిగితే రూ.30 లక్షలు బీమా వర్తిస్తుందని చెప్పారు. పోలీసుల ఆరోగ్య భద్రతలో హోంగార్డులను కూడా భాగస్వాములను చేసేందుకు ఆలోచన చేస్తామని డీజీపీ తెలిపారు. -
హోంగార్డుల జీతాలు పెంపు
-
హోంగార్డుల జీతాలు పెంపు
సాక్షి, అమరావతి : హోంగార్డుల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక హోంగార్డుల వేతనాలు పెంచుతామని వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై జూన్ 10వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హోంగార్డుల వేతనం పెంపు నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తూ ప్రస్తుతం ఉన్న రోజువారీ వేతనం రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోంగార్డుల నెలసరి జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరుగుతుంది. పెంచిన వేతనం ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 16,616 మంది హోంగార్డులకు మేలు కలుగుతుంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.గోవిందు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మేలును ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. -
లాటరీ ఎంపిక ద్వారా హోంగార్డుల బదిలీ
సాక్షి, ఆదిలాబాద్ : లాటరీ ద్వారా ఎంపిక చేసి 209 మంది హోంగార్డులతో పాటు 38 మంది మహిళ హోంగార్డులను సైతం బదిలీలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్విరామదంగా లాటరీ పద్ధతిన హోంగార్డుల బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా హోంగార్డులకు కౌన్సెలింగ్ నిర్వహించి, అందరి ఆమోదం ప్రకారమే లాటరీ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పడ్డాక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హోంగార్డులు దీర్ఘకాలంగా ఇతర జిల్లాలో పనిచేస్తున్నారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని బదిలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా నిర్మల్ జిల్లా 29+1, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 41+1, ఆదిలాబాద్ జిల్లా 61+36 హోంగార్డులను బదిలీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 38 మంది మహిళ హోంగార్డులు ఉన్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో స్థానికంగా ఉన్న హోంగార్డులే పని చేస్తున్నారని, అక్కడ బదిలీ సమస్య లేదన్నారు. లాటరీ ద్వారా బదిలీ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. రోజువారీ విధులకు ఆటంకాలు కలగకుండా తుది ఉత్తర్వులు వెలువడిన అనంతరం కొంత మంది రిలీవ్ కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీఎస్ రవి కుమార్, శిక్షణ కేంద్రం డీఎస్పీ ఎల్సి నాయక్, ఆదిలాబాద్ ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజా ఉద్దీన్, పోలీస్ కార్యాలయం అధికారులు సందీప్, జగదీష్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ఆర్ఐలు ఓ.సుధాకర్‌రావు, వి.వామనమూర్తి, కె.ఇంద్రవర్ధన్, సిబ్బంది విఠల్, మదన్, భారత్ తదితరులు పాల్గొన్నారు. -
క్రమ శిక్షణ అంటే ఇదేనా..!
సాక్షి, గుంటూరు: క్రమ శిక్షణకు మారు పేరుగా చెప్పుకునే పోలీస్‌శాఖలో కొందరి కారణంగా ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. మద్యం తాగితే గుట్టు చప్పుడు కాకుండా ఉండాల్సిన కొందరు పోలీసులు, హోంగార్డులు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి దాడులకు యత్నించడం, ఘర్షణలకు పాల్పడటం లాంటి సంఘటనలు కారణంగా పోలీసులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. గడిచిన రెండు నెలల్లో జిల్లాలోని గుంటూరు, వినుకొండ, నరసరావుపేట పట్టణాల్లో చోటు చేసుకున్న సంఘటనలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాజధాని జిల్లాలోనే పోలీసులు క్రమశిక్షణ పాటించక పోవడంపై ఎస్పీలు పీహెచ్డీ రామకృష్ణ, ఆర్ జయలక్ష్మిలు సీరియస్‌గా పరిగణిస్తూ సస్పెండ్లు చేస్తున్నా కొందరి తీరులో మాత్రం మార్పు రాక పోవడం విచారకరం. సస్పెండ్లు కొనసాగిందిలా... రెండు నెలల వ్యవధిలో బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహించిన కానిస్టేబుళ్లను వరుసగా ఎస్పీలు సస్పెండ్ చేస్తూ వచ్చారు. గుంటూరులో గాడ్జిల్లా గ్లాసులు రోడ్డు పక్కన విక్రయించే చిరు వ్యాపారి వద్దకు ఓ కానిస్టేబుల్ మద్యం తాగి వెళ్లి డబ్బు ఇవ్వకుండా గాడ్జిల్లా గ్లాసు సెల్‌ఫోన్‌కు వేయాలంటూ దుర్బాషలాడిన సంఘటనపై అర్బన్ ఎస్పీ విచారణ చేపట్టి అతనిని సస్పెండ్ చేశారు. ఇటీవల మరో కానిస్టేబుల్ పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో మద్యం తాగి విధులకు హాజరైన కానిస్టేబుల్‌ను గుర్తించి విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. నరసరావుపేటలో అర్ధరాత్రి దాటాక కూడా బార్లో మద్యం తాగేందుకు అనుమతించాలంటూ బారు యజమానిపై దాడికి యత్నించిన సంఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం వినుకొండలో ఓ ప్రయివేటు ఫంక్షన్‌కు హాజరైన కానిస్టేబుళ్లు, హోంగార్డులు మద్యం సేవిస్తూ ఘర్షణకు పాల్పడటం ఆపై సీఐకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోక పోగా సీఐ చిన్నమల్లయ్య తనను దుర్బాషలాడారంటూ హోంగార్డు స్వేచ్చా కుమార్ డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఎస్పీ జయలక్ష్మి నరసరావుపేట డీఎస్పీని ఆదేశించారు. పోలీస్‌బాస్‌లు గస్తీలపై దృష్టి సారించాలి... రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న గస్తీలపై పోలీస్‌బాస్‌లు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పోలీస్‌శాఖలోని ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు బాధ్యతలను కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అప్పగించి వెళుతుండటంతో వారు కూడా రికార్డుల్లో సంతకాలకు పరిమితం కావడంతో రాత్రి తనిఖీల్లో కొందరు కానిస్టేబుళ్లు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటేనే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
హోంగార్డుల జీవితాలతో చెలగాటం
సాక్షి, అమరావతి: చాలీచాలని వేతనాలతో విధి నిర్వహణ చేస్తున్న హోంగార్డుల జీ(వి)తాలతో చెలగాటం ఆడుతున్నారు. మండుటెండల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి అలవెన్సు(డీఏ)లోను కోత పెట్టారు. జీతాలకు అలవెన్సులకు ముడిపెట్టి డీజీపీ కార్యాలయం ఇచ్చిన సర్క్యులర్‌పై హోంగార్డులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం 65 రోజులు పనిచేసిన తమకు కేవలం 15 రోజులకే డీఏ ఇచ్చారంటూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 12 వేల మంది హోంగార్డులు వాపోతున్నారు. అదే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమకు డీఏ రూ.9 వేలు ఇవ్వగా ఈసారి రూ.4,500లతో సరిపెట్టడం దారుణమని మండిపడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో చంద్రబాబు సర్కారు ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రవేశపెట్టిన పలు పథకాలకు ఖజానా ఖాళీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేసి ఎన్నికల పథకాలకు నిధులు మళ్లించారు. పోలీసు శాఖలో అధికారుల అలవెన్సులు, బిల్లులు మంజూరు కాలేదు. హోంగార్డులకు అయితే మూడు నుంచి నాలుగు నెలల జీతాలు ఇవ్వకుండా నిలిపివేశారు. ఎన్నికల అనంతరం వారికి జీతాలు చెల్లించారు. హోంగార్డుల వేతనాల అవసరాలపై డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్ కొత్త మెలికతో కోతపెట్టారు... డీజీపీ కార్యాలయం నుంచి ఇచ్చిన సర్క్యులర్‌లో పెట్టిన కొత్త మెలికతో అలవెన్సుల్లో కోతపెట్టినట్టు హోంగార్డులు వాపోతున్నారు. వాస్తవానికి పోలీస్‌శాఖ నుంచి హోంగార్డుల వేతనం, ఎన్నికల ఫండ్స్ నుంచి డీఏ ఇవ్వాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా అలవెన్సును అరకొరగా ఇవ్వడంతోపాటు వేతనాన్ని కూడా ఎన్నికల ఫండ్స్ నుంచే ఇవ్వడం గమనార్హం. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రోజుకు జీతం రూ.600, అలవెన్సు రూ.300 కలిపి మొత్తం రూ.900 చొప్పున మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఈ లెక్కన 15 రోజులకు వేతనం రూ.9 వేలు, అలవెన్సు రూ.4,500 ఇవ్వాలి. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మాత్రం 15 రోజులకు అలవెన్సు ఇవ్వకుండానే రోజుకు రూ.600 చొప్పున కేటాయించారు. ఈ లెక్కన ఏప్రిల్ నెలకు మొత్తం రూ.22,500తోపాటు మే 20 నుంచి 24 వరకు జీతం రూ.600 చొప్పున మొత్తం రూ.3వేలు ఎన్నికల ఫండ్స్ ఇచ్చేలా సర్క్యులర్ ఇవ్వడం పట్ల హోంగార్డులు తప్పుబడుతున్నారు. కానిస్టేబుల్స్ తరహాలో అలవెన్సు ఇవ్వాలి వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర్నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు దాదాపు 65 రోజుల పాటు విధులు నిర్వహించే తమకు డీఏ చెల్లించాల్సి ఉందని హోంగార్డులు చెబుతున్నారు. ఈ లెక్కన అలవెన్సు ఒక్కటే 19,500 రావాల్సి ఉందని చెబుతున్నారు. కానీ 15 రోజులకే అలవెన్సు ఇచ్చారని ఆవేదన చెందుతున్నారు. అదే తమతోపాటు విధులు నిర్వహించిన కానిస్టేబుల్స్‌కు మాత్రం 65 రోజులకు చెల్లిస్తున్నారని ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయమై డీజీపీని కలిసేందుకు హోంగార్డులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానిస్టేబుల్స్‌తో సమానంగానైనా తమకు ఎన్నికల అలవెన్సులు ఇప్పించాలని కోరునున్నట్టు వారు చెబుతున్నారు. -
ఖాకీ వనంలో హోం
ఒంగోలు: ఖాకీ దుస్తులు ధరించి శాంతిభద్రతల విషయంలో పహారా కాసే హోంగార్డుల జీవితాలకు విలువ లేకుండా పోతోంది. దుమ్ము, ధూళి, వర్షంలెక్క చేయక విధలు నిర్వర్తిస్తున్నా కుటుంబానికి కడుపునిండా భోజనం కూడా పెట్టలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రేపు హోంగార్డుల దినోత్సవంసందర్భంగా ‘సాక్షి’ కథనం. హోంగార్డు వ్యవస్థ 1946లో బాంబే ప్రావిన్స్‌లో ప్రారంభమైంది. పౌరులకు అత్యవసర సమయాల్లో, మత ఘర్షణల సమయంలో భద్రతా అధికారులతోపాటు శాంతి భద్రతలను కాపాడటంలో వీరు విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలోనే కనీసం మూడు సంవత్సరాలపాటు హోంగార్డు విధులు నిర్వహించేందుకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు ఇందులో పాల్గొనేవారు. డాక్టర్లు, లాయర్లు వంటివారు సైతం ఉండేవారు. అయితే స్వాతంత్య్రానంతరం భారత్–చైనా యుద్ధ సమయంలో హోంగార్డుల వ్యవస్థకు యూనిఫాం సర్వీసు ఆధ్వర్యంలో ఉంచారు. ఈ క్రమంలోనే పోలీసుశాఖ తన అవసరాలకు అనుగుణంగా హోంగార్డులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం 9 రకాల విభాగాల్లో హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు, ఆర్టీసీ, రవాణాశాఖ, అగ్నిమాపక శాఖ వంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రాత్రి బీట్ సేవలు కూడా అందిస్తున్నారు. పోరాట ఫలాలు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి హోంగార్డుల వేతనాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రోజువారి వేతనం రూ. 600గా ఉంది. గతంలో పనిచేసిన రోజుకు మాత్రమే వేతనం లభించేది. శెలవు పెడితే వేతనం రానట్లే. అయితే పోరాటాల అనంతరం పోలీసు అధికారుల సహకారంతో ఎట్టకేలకు నెలకు వేతనంతో కూడిన రెండు సెలవులు పొందుతున్నారు. జిల్లాలో అయితే ఎస్పీ సత్య యేసుబాబు మరో రెండు సెలవులను ఇస్తుండడం గమనార్హం. మహిళా హోంగార్డులకు 3 నెలల మెటర్నటీ లీవులు ఇస్తున్నారు. అంతే కాకుండా గతంలో హోంగార్డు వద్ద నుంచి ప్రతి నెలా రూ. 20 కటింగ్ చేస్తుండేవారు. దానిని ఇటీవల రూ. 50 చేసి ఎవరైనా హోంగార్డు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేలు ప్రకటించారు. హోంగార్డులు ఎవరైనా వివాహం చేసుకుంటే వారికి రూ. 5వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డుల రిక్రూట్మెంట్ కూడా దాదాపు పోలీసు రిక్రూట్‌మెంట్‌ను పోలి ఉంటోంది. అందువల్ల యుక్త వయస్సులో ఉండి పోలీసుశాఖ పట్ల భక్తి, ప్రజలకు సేవలు అందించాలనే తపన ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో హోంగార్డుల వివరాలు: జిల్లాలో మొత్తం 817 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 733 మంది పురుషులు కాగా 84 మంది మహిళలు. వీరిలో జనరల్ విభాగంలో 731 మంది విధులు నిర్వహిస్తుండగా 86 మంది వివిధ యూనిఫాం విభాగాల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సీఐ ఇలా ర్యాంకులు ఉన్నట్లే హోంగార్డులకు ర్యాంకులున్నాయి. హోంగార్డు, అసిస్టెంట్ సెక్షన్ కమాండర్, సెక్షన్ కమాండర్, ప్లటూన్ కమాండర్, కంపెనీ కమాండర్ వంటివి ఉన్నాయి. ఎస్పీగా సత్యయేసుబాబు వచ్చిన తరువాత జిల్లాలో హోంగార్డులు కొంతవరకు ఆనందంగా ఉన్నారనే చెప్పవచ్చు. కారుణ్య నియామకాల విషయంలో జాప్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టడం, పోలీసు పెట్రోలు బంకుల్లో హోంగార్డులను పెట్రోలు బాయిస్‌గా విధులు నిర్వహించకుండా చర్యలు చేపట్టడం, చీరాల, కందుకూరు, మార్కాపురం తదితర డివిజన్ల నుంచి టర్న్ డ్యూటీల పేరిట ఒంగోలులో డ్యూటీల హాజరుకావాలనే నిబంధననుంచి మినహాయింపు ఇవ్వడం వంటి చర్యల ద్వారా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అంతే కాకుండా హోంగార్డుల కోసం ప్రత్యేకంగా జిల్లా సహకార సంఘాన్ని కూడా రిజిస్టర్ చేయించారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. చనిపోతే దిక్కెవరు? ప్రస్తుతం హోంగార్డులు కోరుతున్నది ఉద్యోగ భద్రత. బేసిక్‌తో కూడిన జీతం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ సీనియర్లకు జీతం పెరిగితే వారు కూడా సమాజంలో కాస్త గౌరవంగా మెలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హోంగార్డులకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తాత్కాలికంగా డ్యూటీలు వేసిన సమయంలో టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. దీనివల్ల వారు తమకు లభించే వేతనంలోనే అదనపు ఖర్చులను భరించాల్సి వస్తోంది. అలా కాకుండా టీఏ, డీఏలు ఇవ్వాలని కోరుతున్నారు. కుటుంబానికి కనీసం రూ. 5లక్షల వైద్యసాయం, ఏదైనా ప్రమాద వశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలనే విజ్ఞప్తులు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో జిల్లాలోని హోంగార్డులు అందరు కలిసి ఒకరోజు వేతనాన్ని సహచరుల కుటుంబాలకు అండగా ఇస్తూ వస్తున్నాయి. ఏళ్ల తరబడి పనిచేసి రిటైరైన వారికి ప్రభుత్వం నుంచి పైసా అదనపు సాయం కూడా లేకపోతుండటంతో ఒక్కసారిగా విధులనుంచి బయటకు వచ్చిన ఆర్థిక భారానికి గురికావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం రోజు ఎటువంటి ప్రకటనలను ప్రభుత్వం వెలువరిస్తుందా అని హోంగార్డులు అందరు ఆతృతగా చూస్తున్నారు. -
‘బదిలీ అడిగితే కోరిక తీర్చమన్నారు’
సూరత్ : కోరుకున్న చోటుకి బదిలీ చేయమంటే ఉన్నతాధికారులు కోరికలు తీర్చమంటున్నారని గుజరాత్ మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 మంది మహిళా హోం గార్డులు శుక్రవారం ఇద్దరు ఉన్నతాధికారులపై సూరత్ పోలీస్ కమిషనర్ సతీష్ శర్మకు ఫిర్యాదు చేశారు. కొద్దీ రోజులుగా పై అధికారులు తమను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని నాలుగు పేజీలతో కూడిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ అధికారులు బదిలీ చేయాలంటే డబ్బులివ్వాలని, లేకపోతే వారి కోరిక తీర్చాలంటున్నారని ఆరోపించారు. ఓ అధికారైతే యూనిఫామ్ సరిచేసుకోవాలని తాకరని చోట చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదును డీసీపీకి పంపించామని, జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ ప్రారంభించిందని నగర కమిషనర్ సతీష్ శర్మ మీడియాకు తెలిపారు. హోమ్‌గార్డులు పోలీస్ శాఖలోకి రారని, దీంతో పోలీసులు అంతర్గత కమిటీ కాకుండా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతుందన్నారు. అలాగే ఈ ఫిర్యాదును హోంమంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా పంపించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే ఆ శాఖ మహిళా ఉద్యోగులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. -
ఏపీ హోంగార్డులు వద్దు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్ల కోసం ఏపీ మినహా మిగిలిన ఐదు పొరుగు రాష్ట్రాల నుంచి 25 వేల మంది హోం గార్డులను రప్పిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. తెలుగు మాట్లాడే ఏపీ హోంగార్డులను నియమిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో సర్వేలు జరుపుతూ ఇటీవల పట్టుబడ్డ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి 5 వేల మంది చొప్పున ఎన్నికల బందోబస్తుకు పంపాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు సీఈవో వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్ జోక్యంపై ఆ రాష్ట్ర డీజీపీ నుంచి వివరణ కోరినా ఇంకా అందలేదన్నారు. డీజీపీ వివరణ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. అభ్యర్థుల వ్యయంపై పక్కా లెక్కలు అభ్యర్థుల ఎన్నికల వ్యయం గరిష్టంగా రూ.28 లక్షలకు లోబడి ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏ ఒక్కరూ కూడా రూ.28 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపలేదని రజత్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు వ్యయాన్ని తగ్గించి చూపుతున్నారని, డమ్మీ అభ్యర్థులతో పోటీ చేయించి తమ ఎన్నికల వ్యయంలో కొంత భాగాన్ని వారి ఖాతాల్లోకి వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డమ్మీ అభ్యర్థుల పేరుతో వాహనాలు, ఇతర వనరుల వినియోగానికి అనుమతులు పొంది ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎన్నికల అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు తమ పరిశీలనకు వచ్చిందన్నారు. అభ్యర్థుల ఖర్చులకు పక్కా ఆడిటింగ్ జరుగుతుందని, ప్రతి పనికి ప్రామాణిక ధరలతో వ్యయాన్ని లెక్కించి వారి ఖర్చుల ఖాతాలో జమ చేస్తామన్నారు. జాతీయ పార్టీలకు 40 మంది, ప్రాంతీయ పార్టీలకు 20 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతిస్తామన్నారు. వీరి ప్రచార ఖర్చు మొత్తాన్ని సదరు రాష్ట్ర పార్టీ కమిటీ ఖాతాలోకి వెళ్తుందని, అభ్యర్థి చేసే ప్రచార ఖర్చు మాత్రం అభ్యర్థి ఖాతాలోకి వస్తుందన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి 53 మంది సాధారణ పరిశీలకులు, 68 మంది అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిశీలకులు, 10 మంది పోలీస్ పరిశీలకులు రానున్నారని రజత్‌కుమార్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి అత్యవసర వైద్య సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఎయిర్ అంబులెన్స్‌ల సంఖ్యపై అధ్యయనం జరుపుతున్నామన్నారు. గత ఎన్నికల్లో ఒక ఎయిర్ అంబులెన్స్‌ను ఖమ్మం జిల్లాలో వినియోగించినట్లు చెప్పారు. శాంతిభద్రతలు బాగు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయని రజత్‌కుమార్ తెలిపారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కంటే శాంతిభద్రతలు తెలంగాణలో బాగున్నాయన్నారు. ఇప్పటికే నేర చరిత్ర గల వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని బైండోవర్ చేస్తున్నామని వివరించారు. నాన్‌బెయిలబుల్ వారంట్లున్న వారిని కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఓటర్లలో మనోధైర్యం నింపేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్‌లను నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి 307 కంపెనీల బలగాలను కోరగా, 250 కంపెనీల బలగాలను మోహరించేందుకు అనుమతి లభించిందన్నారు. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన 70 వేల మంది బలగాలతో పాటు, అదనంగా 25 వేల మంది హోంగార్డులతో పోలింగ్ రోజు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.26.73 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో తెలిపారు. 10,600 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని, దీని విలువ రూ.35 లక్షల వరకు ఉంటుందన్నారు. -
వీధిన పడ్డ హోంగార్డులు!
సాక్షి, హైదరాబాద్: జీతమొస్తే కానీ నెలగడవని కుటుంబాలు వారివి. అలాంటి వారు 8 నెలలుగా జీతభత్యాల్లేక రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చింది. కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయాల్సి రావడమే వారి పాలిట శాపమైంది. రాష్ట్ర విభజన సమయం (2014)లో 40 మంది హోంగార్డులను ఏపీ సీఐడీ కార్యాలయానికి పంపిస్తూ ఉమ్మడి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణకు చెందిన హోంగార్డులు ఏపీలో కొన్నాళ్ల పాటు పనిచేయాల్సి వచ్చింది. తాము తెలంగాణ వాళ్లమని, తమను అక్కడికే పంపాలని కోరగా.. కొన్నాళ్ల పాటు పనిచేయాలని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో దాదాపు మూడున్నరేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. ఏపీలోని అమరావతి సీఐడీ కార్యాలయంలో పనిచేసిన వీరిని ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణకు పంపిస్తూ ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని సైబరాబాద్‌లోని హోంగార్డుల కమాండెంట్‌కు అటాచ్ చేశారు. అయితే రిపోర్ట్ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోకపోవడంతో 40 మంది హోంగార్డులు ఆందోళనలో పడ్డారు. హోంమంత్రితోపాటు డీజీపీ, ఇతర అధికారులను కలసినా లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. తమకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆరా తీస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ రాలేదని.. ప్రస్తుతం ఖాళీలు కూడా లేవని చెప్పడంతో హోంగార్డులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇంకా ఎన్నాళ్లు అధికారుల చుట్టూ తిరగాలని వారు ఆవేదన చెందుతున్నారు. కుటుంబాల్లో దైన్యం.. 8 నెలలుగా ఈ 40 మంది హోంగార్డులకు జీతాలు అందకపోవడంతో ఆ కుటుంబాలన్ని దీనస్థితికి చేరు కున్నాయి. అప్పులు చేసి కుటుంబాల్ని పోషిం చుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఓ వైపు ఆర్థిక సమస్యలకు తోడు మరోవైపు మానసిక ఒత్తిడికిలోనై కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే రంగారెడ్డి జిల్లా పాలమాకులకు చెందిన హోంగార్డు శ్రీశైలం తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం మృతి చెందాడు. రెండు నెలల క్రితమే అతడి పెద్ద కూతురు డెంగ్యూ బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో మృత్యువాత పడింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీశైలం అనారోగ్యంతో మరణించాడు. దీంతో సోమవారం హోంగార్డులంతా ఆయన అంత్యక్రియలు నిర్వహిం చారు. తమలో ఇంకెంత మంది ఇలా బలి అవ్వాలో అంటూ వారు కన్నీరుమున్నీరయ్యారు. చనిపోయిన హోంగార్డు కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. హోంగార్డు మృతి వార్త తెలుసుకున్న సైబరాబాద్ రిజర్వ్ పోలీసులు రూ.10 వేలు సాయం అందించారు. తమకు వెంటనే బడ్జెట్ మంజూరు చేసి విధుల్లోకి తీసుకోవాలని 40 మంది హోంగార్డులు డిమాండ్ చేశారు. 8 నెలల జీతాలు విడుదల చేస్తే అప్పులు తీర్చుకొని కుటుంబాలను పోషించుకుంటామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీస్ శాఖ ఇప్పటికైనా తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
హోంగార్డ్స్ వేతనం పెంపు
నెల్లూరు : రెండేళ్ల సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించాయి. హోంగార్డ్స్ దినసరి వేతనా న్ని రూ.400 నుంచి రూ.600కు పెంచుతూ రా ష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 77ను సోమవారం రాత్రి విడుదల చేసింది. పెంచిన వేతనాలు జూలై ఒకటినుంచి అమలులోకి రానున్నాయి. జిల్లాలో 841 మంది హోంగార్డులుండగా వీరిలో సాధారణ విధుల్లో 590 మంది, డిప్యూటేషన్ విధుల్లో 296 మంది ఉన్నారు. వీరికి 2016 మార్చి 29వ తేదీన దినసరి వేతనం రూ.400కు పెంచుతూ ప్రభుత్వం జీఓ నంబర్ 37ను జారీచేసింది. అయితే పెరిగిన అవసరాలకు అనుగుణంగా తమ వేతనాన్ని పెంచాని హోంగార్డ్స్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హోంగార్డ్స్ దినసరి వేతనాన్ని ఇప్పటికే రెండు పర్యాయాలు పెంచుతూ జీఓలు జారీచేసింది. దీంతో మన రాష్ట్రంలోనూ వేతనాలను పెంచాలని హోంగార్డ్స్ ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో జీఓ జారీ అయింది. మహిళా హోంగార్డ్స్కు ప్రసూతి సెలవులు మూడునెలలు పెంపు, నెలకు రెండురోజుల సెలవులు, అకాల మరణం చెందితే అంత్యక్రియల ఖర్చులు రూ.1,000 నుంచి రూ.10 వేలకు పెంపు, ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు వైద్యసాయం, విధి నిర్వహణలో (ప్రమాదవశాత్తు, సాధారణ) మృతిచెందితే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా), ప్రభుత్వ గృహనిర్మాణ పథకంలో లబ్ధికల్పిస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నాయకులు మస్తాన్, ఎం.ప్రసాద్, కాయల్ భాస్కర్లు హర్షం తెలిపారు. -
హోంగార్డులకు తీపి కబురు
సుప్రీం కోర్టు ఆదేశాలతో హోంగార్డులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై శ్రీకాకుళం జిల్లాకు అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. హోంగార్డులకు వేతనాల పెంపు నిర్ణయంతో జిల్లాలో 765 మందికి ప్రయోజనం కలగనుంది. వీరిలో 78 మంది మహిళా హోంగార్డులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డులకు వాస్తవానికి రోజువారి కనీస వేతనం రూ. 679 ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 400 మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. తాజా నిర్ణయంతో రోజువారీ వేతనం మరో రూ. 200 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ. 600 వేతనాన్ని ఇక నుంచి తీసుకోనున్నారు. వేతనం పెంపుదలతో పాటు హోంగార్డులకు మూడునెలల పాటు మెటర్నిటీ సెలవులు, నెలలో రెండురోజుల వేతనంతో కూడిన సెలవులు, ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా రూ. 2.50 లక్షల మేర వైద్యసహాయం, సహజమరణానికి రూ. 5 లక్షలు, దహణ సంస్కారాలకు రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని హోంగార్డు ఆర్ఐ శ్రీనివాస్‌కుమార్, జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. మాపై బాధ్యత మరింత పెరిగింది వేతనాలు పెంచడం సంతోషం. మాపై బాధ్య త మరింత పెరిగింది. ఇప్పటికే తక్కువ వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం రోజుకు రూ. 400 వరకు వేతనం ఇస్తున్నారు. తాజా నిర్ణయంతో రూ. 600 తీసుకోనున్నాం. పెంచిన వేతనాలు త్వరగా అమలుజరిగేలా చర్యలు చేపట్టాలి. – గిరిపండా, హోంగార్డు డ్రైవర్, శ్రీకాకుళం -
ఖాకీలపై ఖద్దరు కక్ష
సాక్షి, గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది క్రికెట్ బెట్టింగ్‌లో సర్వం కోల్పోయి, అప్పుల పాలై ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలపై దృష్టి సారించారు. జిల్లాలో పలువురు బుకీలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంటి దొంగల పాత్రపై ఆధారాలు లభ్యమయ్యాయి. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, పలువురు ఎస్సైలకు క్రికెట్ బుకీలతో సంబంధాలున్నట్లు ఆధారాలు దొరికాయి. క్రికెట్ బుకీల స్టేట్‌మెంట్‌తోపాటు అధికారులకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చిన డ్రైవర్లు, గన్మెన్లు, హోంగార్డుల నుంచి లిఖితపూర్వక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. దీంతో ఇద్దరు ఎస్సైలు, ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించారు. క్రికెట్ బుకీలు తమ పేర్లు బయటపెట్టారని తెలుసుకున్న కొందరు అవినీతి పోలీసు అధికారులు తమపై వేటు పడకుండా రక్షించాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలను ఆశ్రయించారు. పోలీసులకు చిక్కిన క్రికెట్ బుకీల్లో పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. సత్తెనపల్లిలో దొరికిన బుకీల్లోనూ ‘అధికార’ నేతలుండడం గమనార్హం. బెట్టింగ్ మాఫియా జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల ఒత్తిడి మేరకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు విచారణను నిలిపివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారిని టీడీపీ నేతలు బదిలీ చేయించారు. ఆయన్ని వీఆర్‌లో ఉంచేలా చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీపై సైతం బదిలీ వేటు చేయించేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. -
ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్
సాక్షి, హైదరాబాద్ : గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలుపుతూ గురువారం ఉదయం ట్వీటర్లో ఓ సందేశం ఉంచారు. బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. నగరంలో మరింత మంది కానిస్టేబుల సీపీఆర్ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుంది అంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ వీడియోను కూడా మంత్రి పోస్టు చేశారు. బహుదూర్‌పుర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, నగర ట్రాఫిక్ డీసీపీ రఘనాథ్ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు. బుధవారం ఉదయం పురానాపూల్ మీదుగా జహనుమా వైపు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయాడు. ఇది గమనించిన చందన్‌సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు పరిగెత్తారు. ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్(కార్డియోపల్మనరి రెససిటేషన్) పద్ధతి ద్వారా ఛాతీపై మసాస్ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. Yesterday Homeguards K. Chandan & Inayathulla Khan of Bahadurpura PS saved the life of a person who had suddenly undergone a cardiac arrest at Puranapul Darwaja in Old City🙏🙏 Many Constables & Homeguards in Hyderabad have undergone CPR (cardio pulmonary resuscitation) training pic.twitter.com/k7D13RwqHL — KTR (@KTRTRS) 1 February 2018 -
పెరిగిన హోంగార్డుల వేతనం
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా వివిధ రకాల విధుల్ని నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వీరి రోజువారీ వేతనాన్ని పెంచుతూ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డులకు కానిస్టేబుళ్లకు ఉన్నట్లే అనేక సౌలభ్యాలు కల్పించారు. మొత్తంగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 14 విభాగాల్లో పనిచేస్తున్న 18,800 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు. గతేడాది డిసెంబర్ 13న ప్రగతి భవన్లో జరిగిన హోంగార్డుల సమావేశంలో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం విదితమే. వీటిని అమలులోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంగార్డులకు రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12 వేలు వేతనంగా లభిస్తోంది. ఇకపై రోజుకు రూ.675 చొప్పున నెలకు రూ.20,250 లభించనుంది. ప్రతి ఏడాదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి రూ.వెయ్యి చొప్పున ఈ వేతనం పెరగనుంది. ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రస్తుతం జీతానికి 30 శాతం అదనంగా పొల్యూషన్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇకపై ఆ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డులకూఈ అలవెన్స్ లభించనుంది. కానిస్టేబుళ్లకు ఇస్తున్నట్లు యూనిఫాం అలవెన్స్, ఇద్దరు పిల్లల వరకు మహిళా హోంగార్డులకు ఆరు నెలల మాతృత్వ సెలవు(మెటర్నిటీ లీవ్), పురుష హోంగార్డులకు 15 రోజుల పితృత్వ సెలవు(పెటర్నిటీ లీవ్) అమలులోకి తీసుకువచ్చారు. భారీ బందోబస్తు విధుల్లో పాల్గొన్నప్పుడు హోంగార్డులకూ కానిస్టేబుళ్ల మాదిరిగా డైట్ చార్జీలుగా పిలిచే బత్తా మంజూరు చేస్తారు. పోలీసు ఆస్పత్రుల్లో హోంగార్డులకూ అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో ఉండగా మరణించే హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే తక్షణం సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి హోంగార్డుకీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పోలీసుల మాదిరిగా హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాజీవ్ త్రివేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
హోంగార్డుల వెట్టి చాకిరి
-
హోంగార్డులకు ప్రవర్తనా నియమావళి!
సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాల కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్న హోంగార్డులకు సీఎం వరాల జల్లుతో ఉపశమనం లభించింది. అయితే హోంగార్డులకు సంబంధించి ఇప్పటివరకు ప్రవర్తనా నియమావళిగానీ, నిబంధనలు గానీ లేవు. వారు ఏదైనా తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేయడం, ఉద్యోగం నుంచి తొలగించడం వంటివి చేస్తున్నారు. వివరణ కోరడం, విచారణ, ఏవైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టడం వంటివేమీ లేవు. అలాగాకుండా పోలీసు శాఖకు ఉన్నట్టుగానే హోంగార్డులకు కూడా ప్రత్యేకమైన ప్రవర్తనా నియమావళి ఉండేలా.. నిబంధనలు రూపొందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ నిబంధనల ప్రకారమే వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా హోంగార్డులు ఏవైనా తప్పులు/పొరపాట్లు చేస్తే.. ఆ తప్పు స్థాయిని, వారి ఉద్దేశాన్ని గుర్తించి క్రమశిక్షణ చర్యలు చేపడతారు. వేతనాల్లో కోత, మెమో, చార్జి మెమో, మౌఖిక విచారణ, సస్పెన్షన్ తదితర క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు రూపొందించనున్నారు. వేతనానికి తగినట్లుగా డ్యూటీ చార్ట్ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్రంలో హోంగార్డులకు జీతాల పెంపు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. హోంగార్డులకు చాలా చోట్ల హాజరు నమోదు వంటివేమీ లేకుండా జీతాల చెల్లింపు, యూనియన్ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పోలీసు అధికారులు అటాచ్మెంట్ పేరుతో పెద్దగా ఉపయోగం లేని విభాగాల్లో డ్యూటీలు వేయడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టేలా హోంగార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. పోలీసుశాఖలోని ఏయే విభాగంలో ఎంత మంది హోంగార్డులు ఉండాలి, వారిలో ఆ విభాగానికి పనికి వచ్చేవారు ఎంతమంది, వారికున్న నైపుణ్యాలేమిటి, టెక్నాలజీ తెలిసి ఉంటే ఆ దిశగా శిక్షణ ఇచ్చి వినియోగించుకోవడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు ప్రతి హోంగార్డుకు సర్వీస్ రికార్డు సైతం ఉండేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నియామక విధానంలోనూ మార్పు ఇప్పటివరకు హోంగార్డుల నియామకానికి ప్రత్యేక నిబంధనలు, విధానాలేమీ లేవు. 2004 నుంచి పరుగు పందెం, ఎత్తు, బరువు, చూపు.. ఇలా పలు అంశాలను పరీక్షించి హోంగార్డులుగా నియమించారు. దానిని మరింత మెరుగుపర్చి కానిస్టేబుల్ నియామకాలకు తగినట్లుగా, హోంగార్డులు భవిష్యత్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా నియామక పద్ధతులు తీసుకురావాలని యోచిస్తున్నారు. వాస్తవానికి గత ఐదేళ్లుగా హోంగార్డుల నియామకం కూడా లేదు. ఇక ముందు హోంగార్డుల నియామకం కోసం.. కానిస్టేబుళ్లకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు, రాతపరీక్ష సైతం నిర్వహించాలని యోచిస్తున్నారు. -
హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్..!
చిత్తూరు అర్బన్: హోంగార్డు పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. చిత్తూరు పోలీసు జిల్లాలో ఖాళీగా ఉన్న 160 హోంగార్డు పోస్టు ల భర్తీకు ఎస్పీ రాజశేఖర్‌బాబు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రూ.25 డీడీని చిత్తూరు పోలీసు కార్యాలయంలో అం దజేసి డిసెంబరు ఒకటి నుంచి దరఖాస్తులను పొందచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబరు 12లోపు అభ్యర్థులు నేరుగా అందజేయాలన్నారు. కాగా ఈ నోటిఫికేషన్లో కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ (సీపీఓ)లను సైతం మెరిట్ మార్కులు ఇవ్వడం గమనార్హం. చిత్తూరు పోలీసు జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఎస్పీ పేర్కొన్నారు. ఎంపిక ఇలా.. ఇందులో జనరల్ పోస్టులకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. జనలర్ హోంగార్డు పోస్టులకు 150 సెం.మీ ఎత్తు, పురుషులు 160 సెం.మీ ఎత్తు ఉండాలని, వీరికి 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన పోస్టులకు ఆయా విభాగాల్లో నైపుణ్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సంప్రదించాలని ఎస్పీ కోరారు. -
రూ. 400 కంటే ఎక్కువ పెంచలేం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డుల జీతాలు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ. 300ల నుంచి రూ. 400లకు వేతనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు గుర్తు చేశారు. రూ. 100 వేతనం పెంచడం వల్ల హోం గార్డులకు ఎలాంటి లాభం ఉండదన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో జీతాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం రూ. 672లు చెల్లించాలని కోరారు. ఇదిలావుండగా అసెంబ్లీలో విష్ణుకుమార్‌రాజు ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంగతిని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున హోం గార్డుల వేతనాలను సుప్రీం తీర్పును అనుసరించి పెంచలేకపోతున్నామని హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. రూ. 100 కంటే ఎక్కువగా పెంచడం అసాధ్యమని అన్నారు. విధి నిర్వహణలో మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు హోం మంత్రి ఎన్.చిన్నరాజప్ప శాసనసభ వేదికగా చెప్పారు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో వీరికి 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుందన్నారు. -
ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం అందించడానికి వెళ్తున్న బీజేపీ ఫ్లోర్‌లీడర్ కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన అనంతరం హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం అందివ్వడానికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న పలువురు హోంగార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిర్బంధించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి రాజధానికి వస్తున్న 120 మంది హోంగార్డులను అదుపులోకి తీసుకొని డీఎస్పీ ఆఫీస్‌కు తరలించారు. -
ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?
► ఈ దసరాకైనా జీతాలు పెంచాలని హోంగార్డుల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పేరుకే గార్డు. కానీ, వారి జీవితానికి మాత్రం భద్రత లేదు. అరకొర జీతాలతో అస్తవ్యస్త జీవితాలు గడుపుతు న్నారు. ఇదీ హోంగార్డుల దుస్థితి. ఏడాదిన్నర కాలంగా జీతాల పెంపు, క్రమబద్ధీకరణపై వీరు ఆశలు పెంచుకున్నారు. కానీ, క్రమబద్ధీకరణ సాధ్యం కాదని న్యాయశాఖ స్పష్టం చేసింది. దీంతో జీతాల పెంపుపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతూ వచ్చారు. దసరా పండుగ సమీపిస్తోందని, ఇప్పుడైనా తమ పరిస్థితిని అర్థం చేసుకొని జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని హోంగార్డులు కోరుతున్నారు. జీతాల పెంపు ప్రతిపాదన... రాష్ట్రంలో 19 వేల మంది హోంగార్డులు పోలీస్ శాఖలోని 14 ప్రధాన విభాగాల్లో పనిచేస్తున్నారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండుసార్లు ప్రభుత్వం రూ.3 వేల చొప్పున జీతాలు పెంచి ప్రస్తుతం రూ.12 వేల చొప్పున అందిస్తోంది. పెరుగుతున్న ధరలు, నగర జీవనం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని హోంగార్డులకు జీతాలు పెంచాలని సీఎం కేసీఆర్ అనేక సార్లు ప్రకటించారు. డీజీపీ కార్యాలయం రెండుసార్లు ప్రతి పాదనలు పంపింది. కానిస్టేబుల్‌తో సమానంగా జీతభత్యాలు అందించడం తోపాటు ఆరోగ్య భద్రత, బస్‌పాస్, మెటర్నిటీ సెలవు వంటి సౌకర్యాలపై ప్రతిపాదనలు రూపొందించింది. ఇంకా వీటిపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో హోంగార్డుల్లో ఆందోళన నెలకొంది. ప్రతిపాదిత స్కేల్.. కానిస్టేబుల్ స్కేల్ హోంగార్డుల స్కేల్ బేసిక్ రూ.16,400 బేసిక్ రూ.13,000 డీఏ రూ.3,008 డీఏ రూ. 2,384 హెచ్ఆర్ఏ రూ.4,920 హెచ్ఆర్ఏ రూ.3,900 సీసీఏ రూ.700 సీసీఏ రూ.600 మొత్తం: రూ.25,028 రూ.19,884 -
హోంగార్డులకు రూ.10 వేలు ఇప్పించండి
♦ హోం మంత్రి, డీజీపీకి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: గణేష్ బందోబస్తులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు టీఏ, డీఏల కింద ఒక్కో హోంగార్డుకు రూ.10వేలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. భార్య పిల్లలను వదిలేసి, ఆరోగ్యం దెబ్బతింటున్నా కానిస్టేబుళ్లలో సరిసమానంగా బందోబస్తులో నిమగ్నమైన హోంగార్డులకు ప్రత్యేకంగా టీఏ, డీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదివారం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు డీజీపీ అనురాగ్ శర్మను శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. హోంగార్డు జీవితాల్లో వెలుగునింపేలా మానవతా ధృక్పథంతో టీఏ, డీఏ మంజూరుచేయాలని కోరినట్టు శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
హోంగార్డులపై కర్కశత్వం.. కలకలం
మయూర్ భంజ్ : యూనిఫాం ధరించలేదన్న కారణంతో నలుగురు హోంగార్డులపై ఓ పోలీసు అధికారి కర్కశంగా వ్యవహరించారు. రథ యాత్రలో విధులు నిర్వహిస్తున్న సమయంలో యూనిఫాం సరిగా ధరించలేదని నలుగురు హోంగార్డులను రిజర్వు ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ సేతీ చేతులుపైకి పెట్టమని, మోకాళ్లపై పోలీస్ స్టేషన్ ఎదుటే కూర్చోపెట్టారు. వీరిలో ఓ మహిళా హోంగార్డు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో బరిపాడాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై హోంగార్డ్ డీజీ బినయా బెహెరా అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి మయూర్ భంజ్ ఎస్పీ, హోంగార్డ్ కమాండెంట్ల నుంచి రిపోర్టులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒడిశాలో మొత్తం 17,675 మంది హోంగార్డులున్నారు. 8 గంటలు విధులు నిర్వహిస్తే వీరికి రోజుకు రూ.220 ఇస్తారు. గత ఏడాది సందీప్ హాతి(45) అనే హోంగార్డు సీఎం నవీన్ పట్నాయక్ ఇంటి ఎదుటే నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడనే కారణంతో అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. పోలీసులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల 'చలవ'తోనే వీరి జీవితం ఆధారపడి ఉంటోంది. -
ఊరించి ఉసూరుమనిపించారు!
జీతాల పెంపు ప్రకటన రాక హోంగార్డుల నిరాశ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తమ జీతభత్యాల పెంపును ప్రకటిస్తుందని ఆశించిన హోంగార్డులకు నిరాశే ఎదురైంది. దాదాపు ఏడాది నుంచి జీతభత్యాల పెంపు కోసం ఉద్యమిస్తున్న హోంగార్డులు.. దీనిపై రాష్ట్రావతరణ వేడుకల వేళ సీఎం కేసీఆర్ నుంచి ప్రకటన వస్తుందని భావించారు. పలువురు ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధికారులు సైతం ఈ రోజున సీఎం ప్రకటన చేస్తారని పదే పదే చెబుతూ వచ్చారు. కానీ శుక్రవారం సీఎం ప్రసంగంలో హోంగార్డుల జీతభత్యాల పెంపు, ఇతర సంక్షేమ ప్రకటనలేవీ రాలేదు. దీంతో హోంగార్డులు తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. అయితే హోం గార్డుల జీతభత్యాల పెంపుపై కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
హోంగార్డుల జీవితాల్లో వెలుగు
♦ సీఎం ప్రకటనతో 19వేల కుటుంబాల్లో సంతోషం ♦ రెగ్యులర్ ఉద్యోగాలిస్తామన్న ముఖ్యమంత్రి ♦ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఏళ్లపాటుగా చాలీచాలని జీతాలతో కష్టాలు పడుతున్న హోంగార్డుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి ప్రకటన సంతోషం నింపింది. హోంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తామని సోమవారం అసెంబ్లీలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో కొన్ని నెలల నుంచి జరుగుతున్న హోంగార్డుల పోరాటం ఫలించినట్టు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 19వేల మంది హోంగార్డులు పోలీస్ శాఖలోని 14 విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేయడంతోపాటు జీతభత్యాల పెంపు విషయంలోనూ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే పోలీస్ శాఖ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. బేసిక్ రూ.13 వేలు, డీఏ రూ.2384, హెచ్ఆర్ఏ రూ.3900, సీసీఏ 600, మొత్తంగా రూ.19,884 జీతం వచ్చేలా చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్ శర్మ జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఉన్న 19201 మంది హోంగార్డులను స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ రెండుసార్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న దానికంటే మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి హోంగార్డుల జీతం రూ.6వేలు ఉండగా, ప్రస్తుతం రూ.12వేల జీతభత్యాలను అందుకుంటున్నారు. ప్రసూతి సెలవులు, ఆరోగ్య భద్రత... హోంగార్డులను రెగ్యులర్ చేసేందుకు ఎదురవుతున్న న్యాయ సమస్యలపై ప్రభుత్వం కసరత్తుచేస్తోం దని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీస్ శాఖలో జరిగే నియామకాల్లో హోంగార్డులకు 5శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. ఈ రిజర్వేషన్‌ను మరో 5శాతం పెంచాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా మహిళలకు జీతభత్యాలతో కూడిన ప్రసూతి సెలవులు, హోంగార్డులందరికీ ఆరోగ్య భద్రత స్కీం అమలుచేసేందుకు కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’
-
‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం హోం గార్డుల సమస్యలపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా హోం గార్డుల జీతాలు పెంచాలని ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ , కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయం పై స్పందించిన హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచినట్టు తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హోంగార్డుల విషయంలో రాధ్దాంతం చేస్తున్నారన్నారు. -
చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
-
చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
-
చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
► సమస్యలు పరిష్కరించాలని హోంగార్డుల ధర్నా ► సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం ► అడ్డుకున్న పోలీసులు.. రెండుసార్లు లాఠీచార్జి ► ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఓ హోంగార్డు ► పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ► హోంగార్డులపై ఐదు కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం హోంగార్డులు చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది హోంగార్డులు సచివాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీ సులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట, వాగ్వా దం జరిగాయి. హోంగార్డులను చెదరగొట్టేం దుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై ఆగ్రహించిన హోంగార్డులు సచివాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఓ హోంగార్డు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో దా దాపు 4గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కొందరు హోంగార్డులను అదుపులోకి తీసుకుని, మరోసారి లాఠీ చార్జి చేసి ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. ఐదు రోజులుగా ఆందోళనలు తమ సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 2003లోపు హోంగార్డుగా ఐదేళ్లు పనిచేసిన వారిని రెగ్యులర్ చేయాలని, 2004 నుంచి హోంగార్డులుగా పనిచేస్తున్న వారికి కానిస్టేబుల్ స్థాయిలో బేసిక్ వేతనాన్ని వర్తింపచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆందోళనలో భాగంగా గురువారం కూడా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. వందలాది మంది హోంగార్డులు ఈ ధర్నాలో పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. చర్చలకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి పిలుపురావడంతో.. హోంగార్డుల ప్రతినిధులు, బీసీ మహిళా సమాఖ్య నాయకురాలు శారదాగౌడ్ తదితరులు సచివాలయానికి వెళ్లారు. అయితే సాయంత్రం వరకు కూడా సీఎస్ నుంచి డిమాండ్లపై సానుకూలత రాకపోవడం, సీఎంతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పడంతో హోంగార్డులు ఆగ్రహించారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సచివాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించుకుని ‘చలో సెక్రటేరియట్’ చేపట్టారు. అయితే ఇందిరాపార్కు వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తమై మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్‌గార్డెన్ వద్ద బారికేడ్లు, తాళ్లతో హోంగార్డులను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద సంఖ్యలో ఉన్న హోంగార్డులు పోలీసులను, బారికేడ్లను తోసుకుని సచివాలయం వైపు వెళ్లారు. సచివాలయం వద్ద లాఠీచార్జి హోంగార్డుల చలో సెక్రటేరియట్ విషయం తెలుసుకున్న పోలీసులు సచివాలయం వద్ద భారీగా మోహరించారు. ర్యాలీగా అక్కడికి చేరుకున్న హోంగార్డులు సచివాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీ సులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగాయి. హోంగార్డులను నిరోధించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన హోంగార్డులు దాదాపు నాలుగు గంటల పాటు సచివాలయం రోడ్డు వద్ద బైఠాయించారు. సెంట్రల్ జోన్ డీసీపీ హోంగార్డులను సముదాయించి, ఆందోళన విరమింప చేయడానికి ప్రయత్నించారు. కానీ వారు వెనక్కి తగ్గలేదు. రాత్రి 8 గంటల సమయంలో ఓ హోంగార్డు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే పలువురు హోంగార్డులను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి లాఠీచార్జి చేసి మిగతా వారిని చెదరగొట్టారు. స్తంభించిన ట్రాఫిక్ హైదరాబాద్ నగరంలోని కూడళ్ల వద్ద విధులు నిర్వహించే హోంగార్డులు ఆందోళన బాట పట్టడం, సచివాలయం వద్ద బైఠాయింపుతో ట్రాఫిక్ స్తంభించింది. గురువారం ఉదయం నుంచి కూడా లక్డీకాపూల్, తెలుగుతల్లి చౌరస్తా, అసెంబ్లీ చౌరస్తాలన్నీ ట్రాఫిక్‌జామ్‌లతో దర్శనమిచ్చాయి. హోంగార్డుల ధర్నాకు తోడు మింట్‌కాంపౌండ్‌లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా, జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంపై బీజేపీ నాయకుల ధర్నాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. పలు చోట్ల రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా గంటకుపైగా సమయం పట్టింది. ఐదు కేసులు నమోదు హోంగార్డుల ఆందోళన పరిణామాలపై అంబర్పేట్, గాంధీనగర్, సైఫాబాద్, చిలకలగూడ, మారేడ్‌పల్లి పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు హోంగార్డ్స్ కమాండెంట్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్, ఇతర ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ ఫోర్సెస్ చట్టం, పోలీస్ చట్టం, ఐపీసీలోని 143, 145, 146 (రెడ్‌విత్ 147), 149, 188, 186, 153, 341 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా గుమిగూడడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకోవడం తదితర ఆరోపణలను చేర్చారు. మా బాధలు తీర్చండి సీఎస్‌కు హోంగార్డుల అసోసియేషన్ విజ్ఞప్తి హోంగార్డుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు హోంగార్డుల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. నెలకు మూడు రోజుల సెలవులు, మహిళా హోంగార్డులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఆరోగ్య భద్రత, విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డుల కుటుంబానికి ఆర్థిక సాయం వంటి అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు పాకాల రాజేశ్, చంద్రశేఖర్, రవీంద్రనాయక్, రవి తేజ, స్వాతి, రాజు విలేకరులతో మాట్లాడారు. కానిస్టేబుళ్లతో సమానంగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్న తమను నేటికీ తాత్కాలిక ఉద్యోగులుగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఇంకా ఆర్డర్లీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ హోంగార్డులను ఇంటిపనులకు కూడా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటినీ భరిస్తూ పనిచేసినా.. అధికారులకు కోపమొస్తే అకారణంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తమకు గుర్తింపు కార్డు కూడా లేని దుస్థితి ఉందని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ తమను ‘మీరు హోంగార్డులు కాదు.. మినీ పోలీసులు’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమిళనాడులో హోంగార్డుల పరిస్థితి మెరుగ్గా ఉందని, అటువంటి విధానాన్ని అనుసరించాలని సీఎస్ దృష్టికి తెచ్చామన్నారు. తమ విజ్ఞప్తిపట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని.. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారని తెలిపారు. దీపావళిలోగా ముఖ్యమంత్రి నుంచి తమకు తీపి కబురు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం: డీజీపీ హోంగార్డులు తమ ఆందోళన విరమించి విధుల్లో చేరాలని డీజీపీ అనురాగ్‌శర్మ కోరారు. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోంగార్డుల సమస్యలు, ఇబ్బందులు తమ దృష్టిలో ఉన్నాయని.. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని ప్రకటించారు. దేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని.. రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యూనిఫాం సర్వీసుల్లో ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఆందోళనలు, ఉద్యమాలు చేయడం సరికాదని.. వెంటనే ఆందోళన విరమించాలని సూచించారు. -
హోంగార్డులు ఆందోళన విరమించాలి: డీజీపీ
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పట్టిన హోంగార్డులు వెంటనే విధుల్లో చేరాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సూచించారు. హోంగార్డుల సమస్యలను పోలీసు శాఖ అర్థం చేసుకుంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. యూనిఫామ్ ఉద్యోగాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఆందోళనల బాట పట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. హోంగార్డులు ప్రస్థావించిన సమస్యలను చీఫ్ సెక్రెటరీ, సీనియర్ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హోంగార్డుల కోసం దేశంలోనే అత్యధిక వేతనం ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా డీజీపీ గుర్తుచేశారు. ఆందోళనలు ముగించి విధుల్లో చేరకపోతే చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వచ్చిన హోంగార్డులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోంగార్డులను అడ్డుకున్నారు. ఓ హోంగార్డు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగ భద్రతపై సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు. -
హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
-
ఆటో ఢీకొని ముగ్గురు హోంగార్డులకు తీవ్ర గాయాలు
లక్కిరెడ్డిపల్లె: ఏఎస్పీ సమావేశానికి హాజరయ్యేందుకు మోటారుసైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు హోంగార్డులను ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ముగ్గురు హోంగార్డులు విరూపాక్ష, సహాదేవ, చిన్న రెడ్డెయ్య(చిన్ని) పులివెందులలో జరిగే ఏఎస్పీ మీటింగ్‌లో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. లక్కిరెడ్డిపల్లె సమీపంలోని దొర్రి చెరువు మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. వెనుకాల కారులో అదే మీటింగ్‌కు వెళ్తున్న మరి కొంత మంది సిబ్బంది గమనించి 108కు సమాచారం అందజేశారు. బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేకువజామున వేళ కావడంతో ఆటో డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు గాయపడిన హోంగార్డులు తెలిపారు. పులివెందులలో ఏఎస్పీ సమావేశం జరిగిన ప్రతి సారి తెల్లవారే సరికి అక్కడికి చేరుకోవాలంటే.. ఆ సమయంలో ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. సంఘటన స్థలానికి లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ రాజా ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీజీపీని కలిసిన ప్రొ కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో టీ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం ఆధ్వర్యంలో సభ్యుల బృందం శుక్రవారం డీజీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలుపై డీజీపీతో ఆయన చర్చించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీజీపీకి కోదండరాం విజ్ఞప్తి చేశారు. అలాగే చాలా కాలంగా కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా డీజీపీని కోదండరాం కోరారు. -
'వెట్టి'పై డీజీపీ కార్యాలయంలో విచారణ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎస్పీపై వెట్టిచాకిరి వ్యవహారానికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. డీఐజీ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు మంగళవారం 18మంది హోంగార్డులు హాజరయ్యారు. కాగా రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. -
హోంగార్డులకు పదోన్నతులు కల్పించాలి
సీనియార్టీ ప్రాతిపదికన హోంగార్డులకు పదోన్నతులు కల్పించాలని ఏపీ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.గోవిందు అన్నారు. పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ హాలులో ఏపీ రాష్ట్ర సంక్షేమ సంఘం హోంగార్డుల గుంటూరు రూరల్ జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గోవిందు మాట్లాడుతూ హోంగార్డులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు బస్‌పాస్ సౌకర్యం కల్పించాలన్నారు. వైద్యసేవలు పొందేందుకు నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రధాన సమస్యలన్నింటిపై చర్చించారు. ఈ సమస్యలను పోలీసు డిపార్టుమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి ఐక్యంగా కృషి చేద్దామన్నారు. వెల్ఫేర్ ట్రస్టు, ఆర్టీసీ బస్‌పాస్, నగదు రహిత హెల్త్‌కార్డులు, సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులపై ఏకగ్రీవంగా తీర్మానించారు. -
పోలీసుల అదుపులో ముగ్గురు హోంగార్డులు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ముగ్గురు హోంగార్డులను మంగళవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జీఆర్పీ స్టేషన్‌కి తరలించారు. రైల్వే ప్రయాణికులను బెదిరిస్తూ... వసూళ్లకు పాల్పడుతున్నారని సదరు హోంగార్డులనుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఆ క్రమంలో ప్రయాణికుల ఆరోపణలు వాస్తవమని తెలింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురు హోంగార్డులను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నిస్తున్నారు. -
ఐపీఎస్ మరణిస్తే రూ.కోటి
♦ నక్సల్స్ దాడుల్లో మృతి చెందిన పోలీసులకు పరిహారం పెంపు ♦ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: నక్సలైట్ల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచారు. మరణించిన వారికి, గాయపడిన వారికి, శాశ్వత వైకల్యానికి గురైన వారికి వేర్వేరుగా పరిహారాలు ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ జాబితాలో లేని హోంగార్డుల కుటుంబాలకు సైతం పరిహారాన్ని వర్తింపజేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2014 జూన్ 2 నుంచి పరిహారం పెంపు అమలవుతుందని ప్రకటించింది. పరిహారాన్ని మంజూరు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. బాధిత కుటుంబాల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిహారం పెంపు విషయంలో నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కె.తారకరామారావు ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. పోలీసు అధికారులతో పాటు ఇతర విభాగాల్లోని ఉద్యోగులకు హోదాలను బట్టి గతంలో ఉన్న పరిహారం.. పెరిగిన పరిహారానికి సంబంధించిన వివరాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్పీ స్థాయి, ఐపీఎస్ అధికారులు చనిపోతే ప్రస్తుతం రూ.30 లక్షల పరిహారం అమల్లో ఉంది. దీన్ని రూ.కోటికి పెంచారు. శాశ్వత వైకల్యానికి గురైతే రూ.50 లక్షలు, తీవ్రంగా గాయపడితే 6 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. సీఐలు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సమాన హోదా ఉన్నటువంటి ఇతర శాఖల్లోని అధికారులు మరణిస్తే రూ.50 లక్షలు, శాశ్వత వైకల్యం పొందితే రూ.30 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.5 లక్షలు చెల్లిస్తారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐలు, సమాన హోదా ఉన్న ఇతర విభాగాల్లోని ఉద్యోగులు చనిపోతే రూ.45 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. శాశ్వత వైకల్యానికి గురైతే రూ.25 లక్షలు, గాయపడితే రూ.5 లక్షలు అందిస్తారు. పోలీస్ కానిస్టేబుళ్లకు సంబంధించిన పరిహారం పెంపుపై ప్రభుత్వం గత ఏప్రిల్‌లోనే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కానిస్టేబుళ్లు చనిపోతే రూ.40 లక్షల పరిహారం అమల్లో ఉంది. ఇది యథాతథంగా కొనసాగనుంది. శాశ్వత వైకల్యానికి గురైనా, తీవ్రంగా గాయపడినా హెడ్ కానిస్టేబుళ్ల స్థాయికిచ్చే పరిహారం వర్తిస్తుందని ఈ జీవోలో స్పష్టం చేసింది. హోంగార్డులు చనిపోతే రూ.30 లక్షలు, వైకల్యానికి గురైతే రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షలు అందిస్తారు. తీవ్రవాద దాడుల్లో సాధారణ పౌరులు చనిపోతే సంబంధిత కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లిస్తారు. వైకల్యానికి గురైతే రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షల పరిహారం ఇస్తారు. -
ఐపీఎస్ మరణిస్తే రూ.కోటి
-
పోలీసు అధికారుల సంఘం హర్షం
సాక్షి, హైదరాబాద్: పోలీసులు, హోంగార్డులకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్సింగ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో పోలీసులకు 10 శాతం కేటాయిస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు మూల వేతనంలో 30శాతం అలవెన్సు, పోలీస్ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చే ఇంటి స్థలం ఉచిత రిజిస్ట్రేషన్, యూనిఫారాల అలవెన్సు రూ.7,500కు పెంచడం వల్ల పోలీసుల్లో నూతన ఉత్తేజం నింపిందని పేర్కొన్నారు. -
హోంగార్డులకు కేసీఆర్ వరాలు హర్షనీయం: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బె డ్రూం ఇళ్లలో హోంగార్డులు, కానిస్టేబుళ్లకు 10 శాతం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో హోంగార్డులు నిర్లక్ష్యానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో మాట్లాడుతూ.. రాష్ట్ర హోంగార్డుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర హోంగార్డుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి కుమారస్వామి ఉన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
గుంటూరు క్రైం : నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం రూరల్ జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లలో 5 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఎస్పీ మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూ వచ్చిన సిబ్బందిని ప్రస్తుతం వారు విధులు నిర్వహిస్తున్న సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు బదిలీ చేస్తున్నామన్నారు. మూడు ఆప్షన్ల విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీల వారీగా బదిలీ చేసి పోస్టింగ్‌లు వేశామని స్పష్టం చేశారు. ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు వున్నా తెలియజేస్తే పరిశీలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం169 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశామన్నారు. సొంత సర్కిల్‌కు కాకుండా, కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేశామని చెప్పారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, అధికారుల అనుమతితో పరిష్కరిస్తే పోలీస్‌శాఖపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు చందు పూర్ణచంద్రరావు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. హోంగార్డులకు చెక్కుల పంపిణీ గుంటూరు క్రైం : పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలం హోంగార్డులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఇద్దరు హోంగార్డులకు జిల్లాలోని హోంగార్డులందరూ కలసి తమ రెండు రోజుల జీతం మొత్తం రూ.4,59 లక్షల నగదు చెక్కులను శుక్రవారం ఎస్పీ నారాయణ నాయక్ చేతుల మీదుగా అందజేశారు. తెనాలికి చెందిన సీహెచ్,సాంబశివరావు, ఎస్.కృష్ణ ప్రసాద్ 1979లో హోంగార్డులుగా విధుల్లో చేరారు. తెనాలి పోలీస్ సర్కిల్ పరిధిలోని విధు లు నిర్వహించి గత ఏడాది ఆగస్టు 1వ తేదీన పదవీ విరమణ పొందారు. సాంబ శివరావుకు రూ.2,31లక్షలు, కృష్ణప్రసాద్‌కు రూ. 2,28లక్షలు చొప్పు న నగదు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్లు ధామస్‌రెడ్డి,సంకురయ్య,ఎస్ఐ నిషార్‌బాషా, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సమ్మెలో 70 వేల మంది హోంగార్డులు
పాట్నా: వేతనం పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ బీహార్ రాష్ట్ర వ్యప్తంగా 70 వేల మంది హోమ్ గార్డులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అరకొరగా ఇస్తోన్న జీతాలు పెంచాలని, సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే డిమాండ్లతో సమ్మెచేస్తోన్ననట్లు హోమ్ గార్డ్స్ వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ఠాకూర్ మీడియాకు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించామని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మే 20 నుంచి సమ్మెను ఉదృతం చేస్తామని, జైల్ భరో ఆందోళనను నిర్వహిస్తామని హెచ్చరించారు. హోమ్ గార్డుల సమ్మెతో బీహార్ లో శాంతిభద్రతల పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. -
కుక్కలకు 8 వేలు.. వీళ్లకు 12 వేలా ?
హైదరాబాద్: హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వారిని కానిస్టేబుళ్లుగా గుర్తించాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్క్ వద్ద శనివారం ఆయన నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసు కుక్కలకు నెలకు 8వేలు ఖర్చు చేసే ప్రభుత్వం హోంగార్డులకు మాత్రం నెలకు 12 వేలు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. శ్రమ దోపిడీ, వెట్టిచాకిరీ నుంచి హోంగార్డులకు విముక్తి కల్పించాలని కిషన్‌రెడ్డి కోరారు. -
డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు కేసీఆర్ కానుక
హైదరాబాద్ : మేడే సందర్భంగా డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బొనాంజా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పిస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన మేడే వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా డ్రైవర్లున్నారని, వారందరికీ ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. హోంగార్డులు, జర్నలిస్ట్‌లకు సర్కారే ప్రమాదబీమా కల్పిస్తుందని కేసీఆర్ చెప్పారు. మేడే సందర్భంగా కార్మికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆటోలపై పన్ను రద్దు చేశామని, బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. పరిశ్రమలు కార్మికుల శ్రమదోపిడీ చేయకూడదని, వారి సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. అలాగే తెలంగాణలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండవని కేసీఆర్ తెలిపారు. తర్వలో పారిశ్రామిక విధానాన్ని అమలు చేయబోతున్నామని, వేలాది పరిశ్రమలు తెలంగాణకు రాబోతున్నాయన్నారు. యువతలో స్కిల్ డెవలప్ కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. ప్రయివేట్ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. -
డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు కేసీఆర్ కానుక
-
హోంగార్డులకు శుభవార్త
రోజు వారి వేతనం రూ.300 నుంచి రూ.400కు పెంపు ఏడాదికి రెండు జతల యూనిఫాం..పెరిగిన పరేడ్ అలవెన్స్ హైదరాబాద్: పోలీసు విభాగంలో స్వచ్ఛంద సేవలందిస్తున్న హోంగార్డులకు తీపి కబురు ఇది. హోంగార్డుల ఒక రోజు వేతనాన్ని(డైలీ డ్యూటీ అలవెన్స్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ప్రస్తుతం ఏడాదికి ఒక జత యూనిఫాం మాత్రమే మంజూరు చేస్తుండగా, ఇకపై రెండు జతలు ఇవ్వనుంది. పరేడ్ అలవెన్స్ కింద ప్రస్తుతం నెలకు రూ.24 చెల్లిస్తుండగా..ఇకపై రూ.100 చెల్లించనుంది. ఈ మేరకు హోంగార్డుల జీతభత్యాలను పెంచుతూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేషం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న 16, 460 మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. రోజుకు రూ.300 చొప్పున ప్రస్తుతం నెలకు రూ.9 వేల వరకు వస్తున్న వీరి జీతం ఇక నుంచి రూ.12 వేల వరకు పెరగనుంది. అయితే, ఈ పెంపు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ఈ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. -
హోంగార్డు అభ్యర్థులు ఆందోళన చెందొద్దు
కాకినాడ: హోంగార్డు అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అభ్యర్థుల దరఖాస్తులు పెరగటం వల్లే ఇంటర్వ్యూ తేదీలను వాయిదా వేసినట్లు ఆయన శనివారమిక్కడ తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. కాగా విజయవాడలో శని,ఆదివారాల్లో జరగాల్సిన సీఐడీ హోంగార్డు ఇంటర్వ్యూలు చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో అభ్యర్థులు ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. -
బెజవాడలో హోంగార్డ్ అభ్యర్థుల ఆందోళన
విజయవాడ : విజయవాడలో సీఐడీ హోంగార్డ్ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. దాంతో అభ్యర్థులు ఇందిరా స్టేడియం వద్ద శనివారం ఉదయం రాస్తారోకోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బందర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 32 పోస్టుల కోసం సుమారు 3500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూ వాయిదాపై తమకు ఎలాంటి సమాచారం లేదని, చివరి నిమిషంలో వాయిదా వేయటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ డౌన్ డౌన్ ...అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ లావణ్య లక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని, అభ్యర్థులకు నచ్చచెప్పారు. 32 పోస్టుల కోసం సుమారు 25వేల అప్లికేషన్లు వచ్చాయని, అయితే వాటిని ఇంకా వెరిఫై చేసే ప్రక్రియ పూర్తి కానందున ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని డిసెంబర్ 24న అన్ని దినపత్రికల్లో ప్రకటన ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. అయితే అభ్యర్థులకు సమాచారం అందటంలో లోపం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆమె వివరణ ఇచ్చారు. ఇంటర్వ్యూలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలోనే వెల్లడిస్తామనివ లావణ్య లక్ష్మి తెలిపారు. దాంతో చేసేది లేక అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. -
హోంగార్డుల వేతనం రూ.12 వేలకు పెంపు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల వేతనాన్ని రూ. 9 వేల నుంచి 12 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారిని కేసీఆర్ అభినందించారు. దీనిలో భాగంగా హోంగార్డుల డిమాండ్ ల పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేశారు. పెంచిన హోంగార్డు జీతాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు వారికి మెడికల్ ఇన్సూరెన్స్, ఏడాదికి రెండు డ్రెస్ లు, జంట నగరాల పరిధిలో బస్ పాస్ లు ఇవ్వనున్నారు. -
హోంగార్డులను మినీ కానిస్టేబుళ్లుగా గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: తమను మినీ కానిస్టేబుళ్లుగా గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్ర హోంగార్డులు విజ్ఞప్తి చేశారు. చాలీ చాలని జీతంతో పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా పనిచేస్తున్న తమ జీవితాలు దుర్భరంగా సాగుతున్నాయని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.9 వేల వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని వారు కోరారు. -
ఉద్యోగాలు ఇప్పించండి సారూ...!
మహబూబ్‌నగర్ క్రైం: పోలీసు శాఖలో ఏడేళ్లుగా విధులు నిర్వహించిన 11మంది హోంగార్డులను ఆధికారులు ఏకపక్ష ంగా ఉద్యోగాలనుంచి తొలగించారని మీరైనా మాకు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధిత హోంగార్డులు సోమవారం జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న 13 మంది హోంగార్డులను 2013లో వివిధ కారణాలతో అప్పటి జిల్లా ఆధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. దీంతో బాధితులు కోర్టును అశ్రయించడంతో వెంటనే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని 03-12-2013న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు కోర్టు ఆర్డర్ కాపీతో అప్పటి జిల్లా ఆధికారులు. హోంగార్డు విభాగం ఆధికారులను కలిశారు. అరుుతే ఆధికారులు వారిని విధుల్లోకి తీసుకోకుండా కోర్టుకు ఎలా వెళతారని వారిపైనే మండిపడ్డారు. కాగా వారిలో రాజకీయ నేతల ఒత్తిడి మేరకు ఇద్దరిని మాత్రం విధుల్లోకి తీసుకున్నారు. మిగతా వారిని మాత్రం మిమ్మల్ని ఉద్యోగాలనుంచి తొలగిం చాం..మరోసారి హోంగార్డుల సెలక్ష న్స్ జరిగితే మీకే మొదటి ప్రాధాన్యమని చెప్పి వెనక్కి పంపారు.దీంతో బాది తులు అప్పటి జిల్లా ఎస్పీ డి.నాగేంద్రకుమార్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటామన్నా సంబందిత ఆధికారులు వారికి ఆవకాశం కల్పించలేదు. ఈ నేపథ్యంలో వారు రాష్ట్ర మంత్రి హరిష్‌రావును కలిసి తమ సమస్యలను విన్నవిం చడంతో అయన వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించినా ఆధికారులు పట్టించుకోలేదు. దీనికి తోడు మంత్రి వద్దకు వెళ్లినందుకు వారిని మరింత భయందోళనకు గురి చేశారు. దీంతో బాధితులు సమాచార హక్కు చట్టం ద్వారా తమ ఉద్యోగాల జాబితా ఇవ్వాలని కోరగా హోంగార్డు విభాగానికి చెందిన ఆర్ఐ వారితో బలవంతంగా సంతకం చేయిం చుకుని ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో బాదితులు సోమవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విశ్వప్రసాద్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చారు. అరుుతే కొందరు అధికారులు వారిని జిల్లా ఎస్పీతో కలవకుండా బుజ్జగించి వారం తర్వాత వస్తే సారుతో చెప్పి మీకు న్యాయం చేస్తామని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సంవత్సర కాలంగా ఎస్పీ కార్యాలయం చుట్టు తిరుగుతున్నామని ...ఒక్కసారైనా ఎస్పీని కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు ఆవకాశం కల్పించాలని..కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని బాధితుల్లో ఒకరైన తిరుపతయ్య వేడుకున్నాడు. -
హోంగార్డులకు ఊరట!
* సిబ్బంది తగ్గింపు ప్రక్రియకు బ్రేక్ * విభజన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హోంగార్డులకు కాస్త ఊరట లభించింది. వీరి సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనిపై కొత్తగా ఏర్పడే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండవని చెబుతున్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలోని వివిధ శాఖల్లో ప్రస్తుతం దాదాపు 27 వేల మంది హోంగార్డులుగా పని చేస్తున్నారు. మరికొందరు డెప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో ఉన్నారు. అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న ఈ చిరుద్యోగులు సుదీర్ఘకాలం పొరాడి వేతన పెంపును సాధించుకున్నారు. ఈ మేరకు జనవరిలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ సందర్భంగా సర్కారు పెట్టిన మెలిక హోంగార్డులను కలవరపెడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వీరి సంఖ్యను 20 వేలకు కుదించాలని అందులో నిర్దేశించింది. దీనిపై అప్పట్లోనే విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు.. సంఖ్యను కుదించడం ఆచరణ సాధ్యంకాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతనం విషయంలో కానిస్టేబుళ్ల కంటే చాలా తక్కువ తీసుకుంటున్నా.. వారితో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులను తగ్గిస్తే సమస్యలు రావచ్చని, తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుందని గట్టిగా వాదించారు. దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాలని, సానుకూల స్పందన రాకుంటే అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పుడు విభజన ప్రక్రియ పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వాయిదా పడినట్లేనని డీజీపీ కార్యాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల హోంశాఖలే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరోపక్క ఉద్యోగుల విభజనకు సంబంధించి జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డుల విషయంలో ఎలాంటి సమస్య లేదు. డీజీపీ, సీఐడీ వంటి ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న ఇతర ప్రాంతాల వారిని మాత్రం బదిలీ చేయాల్సి ఉంటుందని తొలుత భావించారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారం కింది స్థాయి ఉద్యోగుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా విభాగాల అధిపతులకు ఉంటుంది. దీంతో సిబ్బంది విభజనతో ఏర్పడే కొరతను దృష్టిలో పెట్టుకుని హోంగార్డులను యథాస్థానాల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హోంగార్డుల తొలగింపు ప్రక్రియ ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. -
ఆమెకు తప్పని హింస
హహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో చట్టాన్ని(43/2005) తీసుకొచ్చింది. జిల్లాలో ఈ చట్టం 2006 నుంచి అమలైంది. ఈ మేరకు గృహహింస నిరోధక చట్టం సెల్(డీవీసీ)ని జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ(ఐసీడీఎస్) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇందులో ప్రొటెక్టివ్ ఆఫీసర్‌గా ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, లీగల్ కౌన్సిలర్‌గా న్యాయవాది జి. విజయలక్ష్మి, సోషల్ కౌన్సిలర్‌గా నర్మదతో పాటు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. గృహహింసకు గురై న్యాయం కోసం కొంతమంది నేరుగా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుండగా మరికొందరు పోలీస్‌స్టేషన్‌కు వెళితే పరువు పోతుందన్న భయంతో ఐసీడీఎస్ నిర్వహించే డీవీసీకి వస్తున్నారు. 2006 నుంచి ఇప్పటి దాకా డీవీసీకి 872 గృహహింస కేసులు వచ్చాయి. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించగా 222 కేసులు రాజీకుదుర్చుకున్నాయి. 96 మంది తమ కేసులను ఉపసంహరించుకున్నారు. 402 కేసులు కోర్టుకు వెళ్లగా అందులో 270 పరిష్కారమయ్యాయి. 132 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెళ్లైన 50 ఏళ్లకు విడాకులు కావాలని పట్టుబట్టే వారితోపాటు వివాహమై మూడు నెలలు కాకముందే తాము విడిపోతామంటూ డీవీసీకి వస్తున్న వారూ ఉన్నారు. వీరే గాక వరకట్నం, రెండో వివాహం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, అనుమానాలతో డీవీసీకి ఆశ్రయిస్తున్న వారు అధికంగా ఉన్నారు. అయితే అత్యధిక కేసుల్లో పోలీస్స్టేషన్లలోనే పంచాయితీ జరిపి ఇరువర్గాలను రాజీ చేసి పంపిస్తున్నారు. అక్కడ పంచాయితీ తెగకపోతేనే డీవీసీని ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ చూసినా వేధింపులే.. ఆదోని పట్టణంలో వన్, టూ, త్రీ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వన్‌టౌన్‌లో మహిళా ఫిర్యాదులు 24 కాగా అందులో 19 గృహ హింస చట్టం కింద నమోదయ్యాయి. టూ టౌన్లో 22 ఫిర్యాదుల్లో 14 గృహహింస కేసులు, త్రీటౌన్‌లో 13 మహిళా ఫిర్యాదులు రాగా అందులో 9 498-ఏ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో కోర్టుకు వెళ్లకుండా పోలీసులు, పెద్ద మనుషుల సమక్షంలో విడాకు పత్రాలు రాసుకున్న సంఘటనలు అత్యధికంగానే ఉన్నాయి. నంద్యాలలో రాము, అరుణ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించారు. కాని కొద్దినెలల తర్వాత, అరుణ ఎలాంటి కట్నం తేలేదని, తమ సామాజిక వర్గం కాదని వివాదం రేపడంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అరుణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, వరకట్నం వేధింపుల చట్టం 498ఏ కేసు పెడతామని పోలీసులు చెప్పారు. దంపతులను, వారి కుటుంబ సభ్యులను పిలిపించి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించడంతో విభేదాలు తొలిగిపోయి మళ్లీ ఒక్కటయ్యారు. అదనపు కట్నం కోసం భర్త సంజీవరాయుడు, అత్త లక్ష్మమ్మ, మామ లక్ష్మన్న వేధిస్తున్నారని ఆలూరు మండలం మొలగవళ్లి గ్రామానికి చెందిన సావిత్రమ్మ గతేడాది ఆగస్టు 9వ తేదీన ఆలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తూతూ మంత్రంగా కేసును నమోదు చేసుకుని, సావిత్రమ్మను వేధిస్తున్న భర్త, మామ, అత్తలను రిమాండ్‌కు పంపారు. అదేవిధంగా మొలగవళ్లి గ్రామానికి చెందిన గీతకు సంతానం లేదంటూ భర్త భీమప్ప వేధించేవాడు. దీంతో గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అప్పట్లో ఆ కేసును కూడా ఆలూరు పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు మృతిచెందిన తర్వాత భర్త భీమప్ప, ఆయన కుటుంబ సభ్యులను రాజీ చేసి కేసు లేకుండా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జొహరాపురం గ్రామానికి చెందిన సాలియాబేగం తన భర్త ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇలియాస్‌పై వేధింపుల కేసు నమోదు చేసింది. పోలీసులు ఆ కేసులో నిర్లక్ష్యం వహించారు. చివరకు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. తప్పని పరిస్థితుల్లో ఆస్పరి పోలీసులు గతేడాది సాలియాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తను అరెస్ట్ చేశారు. క్రిష్ణగిరి మండలంలో ఫ్యాక్షనిస్టులే శాసనకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మండలంలో 36 గ్రామాలు ఉండగా 26 గ్రామాలలో ఫ్యాక్షన్ ఉంది. వర్గ నాయకులు జోక్యంతో చట్టాలు నీరు గారుతున్నాయి. పత్తికొండలో పోలీసుల రికార్డుల ఆధారంగా 28 వేధింపుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 కేసులు కోర్టు ద్వారా పరిష్కారం అయ్యాయి. గ్రామ పెద్దల సమక్షంలో మరికొందరు రాజీ పడ్డారు. మరో 10 కేసులు రికార్డులలోనే నడుస్తున్నాయి. ఇక్కడ పోలీస్సుల కంటే ముందుగా కుల సంఘాలు, దళారులు, నా యకులు ప్రత్యక్షం అవుతున్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన వారే నిర్లక్ష్యం చేయడంతో మహిళలు కష్టాల నుంచి గట్టెకలేక పోతున్నారు. -
ముఖ్యమంత్రితో సబితా ఇంద్రారెడ్డి సమావేశం
హైదరాబాద్ : మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. హోంగార్డుల రోజువారి వేతనాన్ని రూ.200 నుంచి రూ.300లకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు సబిత చెప్పారు. హోంగార్డుల వేతనం పెంపుదలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే . దీంతో హోంగార్డుల వేతనం నెలకు రూ. 6 వేల నుండి రూ. 9 వేలకు పెరగనుంది. అయితే ఈ పెంపు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుందని తెలుస్తోంది. -
రక్తమోడిన రోడ్లు
నాసిక్: రాష్ర్టంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 54 మంది గాయపడ్డారు. నాసిక్‌లోని చంద్వాడ్ తాలూకా సమీపంలో ముంబై-అగ్రా జాతీయ రహదారిపై ట్యాంకర్‌ను బుధవారం రాత్రి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 46 మంది హోంగార్డులు గాయపడ్డారు. వచ్చే వారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహించేందుకు వీరంతా ఓ ప్రైవేట్ బస్సులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చంద్వాడ్‌లోని గ్రామీణ ఆస్పత్రిలో చేర్పించామని వివరించారు. అలాగే పుణేలో మద్యం సేవించిన ఓ వ్యక్తి నడిపిన కారు అదుపుతప్పింది. రద్దీగా ఉండే జంగ్లీ మహారాజ్ రోడ్డు పక్కనున్న దుకాణాలు, పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పార్క్ చేసిన ఆటోలు, జ్యూస్ స్టాల్‌పైకి కారును తీసుకెళ్లిన మహేశ్ సర్దేశాయ్ సిటీ ట్రాన్స్‌పోర్టు బస్సు టెర్మినస్ సమీపంలోని ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడని చెప్పారు. ఈ అలజడితో ఒక్కసారిగా స్థానికులు రోడ్ల వెంట పరుగులు తీశారన్నారు. కొందరు మహేశ్‌ను పట్టుకొని చితకబాది తమకు అప్పగించారని తెలిపారు. బ్రెత్ అనలైజర్ టెస్టు ద్వారా మహేశ్ మద్యం సేవించాడని నిర్ధారణ అయ్యిందన్నారు. కాగా, 2012లో ఆర్టీసీ డ్రైవర్ సంతోష్ మానే నిర్లక్ష్య డ్రైవింగ్‌తో స్వర్గేట్లో తొమ్మిది మరణించిన సంగతి తెలిసిందే. -
లక్నోలో హోంగార్డుల పై లాఠీఛార్జ్
-
హోం గార్డులను చితకబాదిన యూపీ పోలీసులు
-
హోం గార్డులను చితకబాదిన యూపీ పోలీసులు
మనోడైనా.. పక్కనవాడైనా ఒకటే న్యాయం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. జీతాలు పెంచాల్సిందిగా ఎప్పటినుంచో కోరుతున్న అక్కడి హోంగార్డులు.. తమ న్యాయమైన డిమాండును నెరవేర్చాలని కోరుతూ సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, తమకు ఏదో ఒక స్పష్టమైన హామీ వస్తే తప్ప కదిలేదని లేదని హోం గార్డులు వాదించగా, పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. ప్రతిరోజూ విధి నిర్వహణలో తమతో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ నామమాత్రపు జీతాలకే పనిచేస్తున్న హోం గార్డుల పట్ల కనీస కనికరం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు లాఠీలతో బాదారు. అప్పటికీ వాళ్లు అక్కడి నుంచి కదలకపోవడంతో బాష్పవాయువు కూడా ప్రయోగించారు. సోమవారం పోలీసు అమరవీరుల దినోత్సవం. పోలీసులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ వారి సేవలను శ్లాఘించిన రోజు. సరిగ్గా ఇదే రోజు పోలీసులు తమకు తమ్ముళ్ల లాంటి హోం గార్డుల మీద విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేయడం పలు విమర్శలకు తావిచ్చింది. -
ఇంటి దొంగలు పట్టుబడ్డారిలా...
వేములవాడ, న్యూస్‌లైన్ : రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన నాంపెల్లి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి సన్నిధిలో హోంగార్డులు చేసిన నిర్వాకం తాలూకూ సీసీ కెమెరా వీడియో టేపులను ఆలయ అధికారులు పోలీసులకు శుక్రవారం అందించారు. పక్కా పథకం ప్రకారమే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. నాంపెల్లి ఆలయం లో హుండీలో డబ్బులు బుధవారం రాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆలయానికి కాపలా ఉండే హోంగార్డులే ఈ చోరీ కేసులో నిందితులు కాగా, వారు పథకం ప్రకారమే ఈ చోరికి పాల్పడ్డారు. తొలుత ఆలయ ఆవరణలో కి చేరుకున్న ఇద్దరు హోంగార్డులు వారి స్నేహితుడు కలిసి ఆలయ ప్రాంతమంతా పరిశీలించారు. అనంతరం వారి వద్దనున్న రెండో తాళం చెవితో గుడి తలుపులు తెరిచి లోనికి ప్రవేశించారు. సీసీ కెమెరా దిశ మార్చే ప్రయత్నం చేశారు. కెమెరాలు చిత్రీకరించడం మానేశాయ ని భావించి హుండీని బోర్లించి సొమ్ము గుమ్మరించారు. కిందపడ్డ సొమ్మంతా అక్కడే ఆరేసి ఉన్న పూజారి పంచెలో మూటకట్టుకున్నారు. ఏ అనుమానమూ రాకుండా హుండీలను యథాస్థానంలో ఉంచి, తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. గురువారం ఆలయానికి వచ్చిన పూజారి హుండీ సీల్ తొలగించి ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడం విచారణలో హోంగార్డుల నిర్వాకం బయటపడిన విషయం తెలిసిందే. పరారీలో హోంగార్డులు నిందితులైన హోంగార్డులు లకావత్ శ్రీనివా స్, ఈ.రాజూనాయక్ పరారీలో ఉన్నారని పోలీసు లు వెల్లడించారు. మరో నిందితుడు రవి మాత్రం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. గతంలో గుట్టపై జరిగిన దొంగతనాలతో వీరికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. సదరు హోం గార్డులు పట్టుబడితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశముందని భావిస్తున్నారు. -
వేతనం పెంచారు.. అమలు పరిచారు..
సాక్షి, హైదరాబాద్: ఇద్దరూ ఒకే శాఖలో ఒకే రకమైన పనిచేస్తారు. కానీ ఒకరికి ఎక్కువ వేతనం.. మరొకరికి తక్కువ! వారు పోలీస్‌శాఖలో పనిచేసే కానిస్టేబుళ్లు.. హోంగార్డులు. పోలీసు కానిస్టేబుళ్ల తరహాలోనే హోంగార్డులు కూడా శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతారు. అయితే పోలీసు కానిస్టేబుళ్లకు నెలకు రూ. 15,000 వరకు జీతంగా వస్తోంది. హోంగార్డులకు మాత్రం రోజుకు రూ. 200 చొప్పున నెలకు ఆరు వేల రూపాయలు మాత్రమే వేతనంగా వస్తుంది. హోంగార్డుల శ్రమను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2009లో రోజుకు 120 రూపాయలుగా ఉన్న వేతనాన్ని రూ. 200కు పెంచారు. అయితే పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని వేతనాలను పెంచాల్సిందిగా రెండేళ్లుగా హోంగార్డులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చివరికి గతేడాది నవంబర్‌లో హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి రోజువారీ వేతనాన్ని రూ. 200 నుంచి రూ. 300కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనం త్వరలోనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కానీ ఆ ప్రకటన ఇప్పటి వరకు వాస్తవ రూపం దాల్చలేదు. ప్రకటన చేసి తొమ్మిది నెలలు కావస్తున్నా హోంగార్డుల వేతనాల పెంపు ఫైలు ఆర్థికశాఖ చుట్టూనే తిరుగుతోంది. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ అధికారులు ఫైలును తమ చుట్టూ తిప్పుకుంటున్నారని హోంగార్డుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. హోంగార్డుల వేతనాన్ని రోజుకు 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచాలని నిర్ణయించిన హోంశాఖ గత నవంబర్‌లో సంబంధిత ఫైలును ఆర్థికశాఖకు పంపించింది. అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు (ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు) పెంచిన వేతనాలకు సరిపడా బడ్జెట్‌ను అదనంగా కేటాయించాలని కూడా ఆ ఫైలులో ఆర్థికశాఖను కోరింది. అయితే అదనపు నిధులు ఇవ్వటం సాధ్యం కాదని, వేతనాల పెంపును కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తింపచేసేలా ప్రతిపాదనలు పంపాలని ఆర్థికశాఖ ఫైలును తిప్పిపంపింది. చేసేదేమీ లేక హోంశాఖ సంబంధిత ఫైలును కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖను కోరింది. అయినప్పటికీ ఆర్థికశాఖ కొత్త బడ్జెట్ ప్రతిపాదనల్లో హోంగార్డుల వేతనాల పెంపును పరిగణనలోకి తీసుకోలేదు. హోంశాఖ పట్టువీడకుండా హోంగార్డుల వేతనాల పెంపు ఫైలును ఇటీవల మళ్లీ ఆర్థికశాఖకు పంపింది. దీన్ని పరిశీలించిన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మరో కొర్రీ వేశారు. హోంగార్డులుగా నియామకానికి అర్హతలు ఏమిటీ, వారి విధులేమిటీ వంటి వివరాలను తెలియజేయాలంటూ ఫైలును తిప్పిపంపారు. ఆర్థికశాఖ తీరుపట్ల హోంగార్డులతో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు వంద రూపాయలు పెంచటానికి తొమ్మిది నెలలుగా ఆర్థికశాఖ ఏదో రూపంలో అడ్డుతగులుతుండటం విచిత్రంగా ఉందని, కనీసం మానవత్వం లేకుండా ఆర్థికశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ 36 వేల మంది హోంగార్డుల కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లుందని హోంశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.