ఊరించి ఉసూరుమనిపించారు! | Home Garders disappointment arrival announcement of salary hikes | Sakshi
Sakshi News home page

ఊరించి ఉసూరుమనిపించారు!

Published Sat, Jun 3 2017 12:42 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

Home Garders disappointment arrival announcement of salary hikes

జీతాల పెంపు ప్రకటన రాక హోంగార్డుల నిరాశ
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తమ జీతభత్యాల పెంపును ప్రకటిస్తుందని ఆశించిన హోంగార్డులకు నిరాశే ఎదురైంది. దాదాపు ఏడాది నుంచి జీతభత్యాల పెంపు కోసం ఉద్యమిస్తున్న హోంగార్డులు.. దీనిపై రాష్ట్రావతరణ వేడుకల వేళ సీఎం కేసీఆర్‌ నుంచి ప్రకటన వస్తుందని భావించారు. పలువురు ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధికారులు సైతం ఈ రోజున సీఎం ప్రకటన చేస్తారని పదే పదే చెబుతూ వచ్చారు.

కానీ శుక్రవారం సీఎం ప్రసంగంలో హోంగార్డుల జీతభత్యాల పెంపు, ఇతర సంక్షేమ ప్రకటనలేవీ రాలేదు. దీంతో హోంగార్డులు తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. అయితే హోం గార్డుల జీతభత్యాల పెంపుపై కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement