వేతనం పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ బీహార్ రాష్ట్ర వ్యప్తంగా 70 వేల మంది హోమ్ గార్డులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు.
పాట్నా: వేతనం పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ బీహార్ రాష్ట్ర వ్యప్తంగా 70 వేల మంది హోమ్ గార్డులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అరకొరగా ఇస్తోన్న జీతాలు పెంచాలని, సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే డిమాండ్లతో సమ్మెచేస్తోన్ననట్లు హోమ్ గార్డ్స్ వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ఠాకూర్ మీడియాకు చెప్పారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించామని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మే 20 నుంచి సమ్మెను ఉదృతం చేస్తామని, జైల్ భరో ఆందోళనను నిర్వహిస్తామని హెచ్చరించారు. హోమ్ గార్డుల సమ్మెతో బీహార్ లో శాంతిభద్రతల పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.