ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది. | Rasi Phalalu: Daily Horoscope On 19-04-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

Published Sat, Apr 19 2025 5:28 AM | Last Updated on Sat, Apr 19 2025 8:27 AM

Rasi Phalalu: Daily Horoscope On 19-04-2025 In Telugu

    గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.షష్ఠి ప.1.57 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: మూల ఉ.6.33 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: సా.4.34 నుండి 6.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.14 నుండి 7.25 వరకు, అమృతఘడియలు: రా.2.35 నుండి 4.15 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.46, సూర్యాస్తమయం: 6.12.

మేషం: వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మిథునం: శుభకార్యాల ప్రస్తావన. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఆశాజనకంగా ఉంటుంది.

కర్కాటకం: యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కుటుంబంలో కొత్త సమస్యలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు  వేస్తారు.

వృశ్చికం: కుటుంబంలో కొత్త సమస్యలు బంధువుల తాకిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

మీనం: శుభవార్తలు వింటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement